సంపాదకీయం

నత్తనడక దర్యాప్తు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అగస్టా వెస్ట్‌లాండ్ అవినీతి వ్యవహారంలో మన వైమానిక దళం మాజీ అధిపతి ఎస్‌పి త్యాగిని ‘కేంద్ర నేర పరిశోధక విభాగం’-సిబిఐ- వారు శుక్రవారం అరెస్టు చేయడం ఆశ్చర్యకరం కాదు. త్యాగి ఇన్నాళ్లు అరెస్టు కాకపోవడమే విస్మయకరం. ఎందుకంటె, ఈ అవినీతి ఉదంతం బట్టబయలయిపోయి నాలుగేళ్లయింది. లంచాలను గతికిన వారిలో త్యాగి, ఆయన సన్నిహిత బంధువులు ఉన్నట్టు అప్పటి నుంచి ఆరోపణలుఉన్నాయి. అయినప్పటికీ త్యాగి కి వ్యతిరేకంగా ప్రాథమిక సాక్ష్యాధారాలను సేకరించడానికి ఆయనను నిర్బంధించడానికి ఇన్ని సంవత్సరాలు పట్టడం నత్తల నడకతో పోటీపడుతున్న న్యాయ ప్రక్రియకు నిదర్శనం. త్యాగిని, అతని జ్ఞాతి సోదరుడిని, ఆయన న్యాయవాదిని ‘సిబిఐ’ నిర్బంధించడం మొత్తం అవినీతి కథలో ఒక ఘట్టం మాత్రమే! ఇటలీ సంస్థ, దాని అనుబంధ సంస్థ సిగ్నోరాగాంధీకి లంచాలిచ్చాయట. ఈ ‘సిగ్నోరాగాంధీ’ని ఇంతవరకు అరెస్టు చేయలేదు...... అవినీతి సొమ్మును మూటకట్టుకొనడానికి వీలుగా ప్రభుత్వ నిర్వాహక రాజకీయవేత్తలు పథకాలను రూపొందిస్తున్నారన్న వాస్తవానికి ‘అగస్టా’ గగన శకటాల - హెలికాప్టర్స్- కొనుగోలు వ్యవహారం మరో నిదర్శనం. ఈ అవినీతి కార్యక్రమాలలో ఉన్నతోన్నత ప్రభుత్వ అధికారులు, వాణిజ్యవేత్తలు, దళారీలు భాగస్వాములు అవుతుండడం దశాబ్దుల ప్రహసనం. ఇటలీకి చెందిన ‘అగస్టా వెస్ట్‌లాండ్’ సంస్థనుంచి ఈ గగన శకటాలు కొనకపోయి ఉండినప్పటికీ దేశానికి ప్రధానంగా రక్షణ రంగానికి కలిగే నష్టం లేదు. నష్టంలేదని, ఈ ‘గగన శకటాలు’ మనకు అవసరం లేదని 2014 జనవరిలో ఈ కొనుగోళ్లను రద్దుచేయడం ద్వారా ప్రభుత్వమే ధ్రువపరచింది. అంటే దాదాపు మూడేళ్లుగా ఈ ‘హెలికాప్టర్లు’ లేకపోయినప్పటికీ ప్రముఖుల, అత్యంత ప్రముఖుల పర్యటనలకు ఎలాంటి ఇబ్బంది కలుగలేదు. అందువ ల్ల దాదాపు మూడువేల ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ విలాసవంతమైన, సుఖకరమైన, అనవసరమైన హెలికాఫ్టర్లను కొనాలని 2010 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఎందుకని నిర్ధారించింది?? అగస్టా వెస్ట్‌లాండ్ ఇంటర్ నేషనల్ లిమిటెడ్- ఏ డబుల్‌యు ఐఎల్- అన్న సంస్థ బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తున్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థ. ఈ సంస్థవారు పనె్నండు గగన శకటాలను మన దేశానికి సరఫరా చేయడానికి అంగీకరించారు. ఈ ‘అగస్టా వెస్ట్‌లాండ్’ సంస్థ ఇటలీ కేంద్రంగా పనిచేస్తున్న ‘్ఫన్ మెకానికా’ అన్న సంస్థకు అనుబంధ సంస్థ. అందువల్ల లాభాలను ప్రధానంగా మెక్కేది ‘్ఫన్ మెకానికా’ సంస్థ మాత్రమే! 2013వరకు ఈ ‘అగస్టా’ వారు మూడు హెలికాప్టర్‌లను మాత్రమే సరఫరా చేశారు. ఈలోగా అవినీతి పుట్ట పగిలింది...
అవినీతి పనుల ద్వారా ఆర్జించడమే ఈ కొనుగోళ్ల ప్రధాన లక్ష్యమని. ఈ మొత్తం ప్రహసనం ద్వారా స్పష్టమైంది. ఆర్జించినవారు రాజకీయవేత్తలు, అధికారులు, దళారీలు! అందువల్ల దుష్టత్రయానికి, విదేశీయ ఉత్పత్తిదారులకు మధ్య లంచాల పరిమాణం గురించి అవగాహన కుదిరేవరకు ఎలాంటి ఒప్పందం కూడ అమలు జరగదు! 1999లోనే ప్రముఖులు సురక్షితంగా పయనించడానికి అవసరమైన ఈ హెలికాప్టర్‌లను కొనాలని వైమానిక దళ ప్రధాన కార్యాలయం వారు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారట! కానీ 2010వరకు పదకొండు ఏళ్లపాటు చర్చల పేరుతో, వివిధ సంస్థల ఉత్పత్తులను పరిశీలించడం పేరుతో ఎందుకని జాప్యం జరిగింది? ఈ జాప్యం కారణంగా ధరలు పెరిగిపోవడం సహజ పరిణామం! కాని జాప్యం ఎందుకు జరుగుతోందంటే ఉత్పత్తిదారులు వివిధ- రాజకీయ, వాణిజ్య, అధికార వర్గాలకు చెల్లించవలసిన ‘లంచం’ ఎంతన్నది తేలకపోవడం. ‘దళారీ’లు తమ వాటాను కూడ పొందాలి మరి! ఈ పనె్నండు హెలికాప్టర్ల కొనుగోలు ధర అలా ముప్పయి ఎనిమిది వందల కోట్ల రూపాయలకు పెరిగింది. ఒక్కొక్క హెలికాప్టర్ ధర దాదాపు మూడువందల పదహారు కోట్లు. ఒక్కొక్క హెలికాప్టర్ ఉత్పత్తి ధర నూట ఇరవై ఐదు కోట్ల రూపాయలకు మించి ఉండదని 2013లో అవినీతి పుట్ట పగిలినప్పుడు ప్రచారమైంది. కానీ ఈ సంస్థ మనదేశంలోని ‘నిర్ణేతల’కు నాలుగు వందల యాబయి కోట్ల రూపాయల ద్వారా లంచాలను సమర్పించిందట! అందువల్ల ఇలా లంచాలను గతికినవారు, గతుకుతున్నవారు విదేశీయ ఉత్పత్తిదారులతో లాలూచీపడి ‘హెలికాప్టర్’ల ధరను పెంచేశారు. వివిధ విదేశీయ సరఫరాల ధరలు కూడ ఇలాగే పెంచుతున్నారు. ఇదంతా ‘ప్రపంచీకరణ’ వాణిజ్య విష వ్యూహంలో భాగం. అవినీతిని విస్తరింపచేయడం ‘ప్రపంచీకరణ’ స్వభావం...
‘ప్రపంచీకరణ’కు పూర్వం మన దేశంలో రక్షణోత్పత్తుల కొనుగోళ్ళలోను ఇతర విదేశీయ ఉత్పత్తుల కొనుగోళ్లలోను అవినీతి పుట్టలు పగిలాయి. కానీ అతిపెద్ద రక్షణోత్పత్తుల అవినీతికి ఆలవాలమైన ‘బోఫోర్స్ హోవిట్జర్’’ కొనుగోళ్లలో సైతం లంచాల ‘విలువ’ కేవలం నలబయి రెండు కోట్ల రూపాయలు, ముప్పయి ఎనిమిది కోట్ల రూపాయలన్నది మరో ప్రచారం. కానీ ‘ప్రపంచీకరణ’ మొదలైన తరువాత ‘అవినీతి’ పరిమాణం క్రమంగా వేల కోట్లను దాటిపోయింది. ద్రవ్యోల్బణం ప్రభావం మాత్రమే అయితే ఇలా వంద రెట్లుగా, వేయి రెట్లుగా అవినీతి పెరగడానికి వీలులేదు! ‘ప్రపంచీకరణ’వల్ల ఏర్పడిన ‘అవకాశాల’వల్ల రాజకీయులు, అధికారులు, వణిజులు, దళారీలు దుష్టచతుష్టయంగా ఏర్పడిపోవడం ప్రధాన కారణం! రక్షణ ఉత్పత్తుల కొనుగోళ్లలో మాత్రమే కాదు, విదేశాలనుంచి దిగుమతి అవుతున్న ఇతర వస్తువుల విషయంలో మాత్రమే కాదు సర్వసమగ్ర ఆర్థిక వాణిజ్య వ్యవసాయ విద్యావ్యవస్థల న్నీ అవినీతిమయం కావడం ‘గ్లోబలైజేషన్’ ఫలితం! ‘విదేశీయ ప్రత్యక్ష నిధులు’- ఎఫ్‌డిఐ- పథకాలు, ‘ప్రత్యేక ఆర్థిక మండలాలు’- సెజ్ లు-, ‘జాతీయ రాజపథాల’ - నేషనల్ హైవేస్- విస్తరణ, విదేశాలతో వైజ్ఞానిక, సాంకేతిక పరిజ్ఞాన అనుసంధానాలు- ఇలాంటివన్నీ దేశ ప్రజల సంక్షే మం ప్రగతి ప్రాతిపదికగా జరగడం లేదు, అక్రమ వాణిజ్యవేత్తల నుంచి రాజకీయవాదులకు, అధికారులకు ఎంత ముడుతుందన్నది ఈ కలాపాలన్నింటికీ ప్రధాన ప్రాతిపదిక! ఈ ‘ముడుపులు’- శాతం లేదా పర్సెంటేజ్- రూపంలో కింది నుంచి పై వరకూ లేదా పైనుంచి కింది వరకూ సరఫరా అవుతుండడం ప్రపంచీకరణ! దూరవాణి రెండవ శ్రేణి తరంగాల అవినీతి విలువ, బొగ్గు కేటాయింపుల అవినీతి పరిమాణం లక్షా డెబ్బయి ఐదువేల కోట్ల స్థాయికి పెరగడం ప్రపంచీకరణ వాణిజ్య నీతికి పరాకాష్ఠ...
అగస్టా గగన శకటాల కొనుగోలుకు సంబంధించి అమ్మకందారులు ఇచ్చిన లంచంలో నాలుగువందల యాబయి కోట్ల రూపాయలలో త్యాగి, ఆయన బంధువుల వాటా కొం చెమే! మిగిలిన వాటాదారులు ఎవరు?? అది కూడ ఇటలీ, న్యాయస్థానాలు, దర్యాప్తు సంస్థలు నిర్ధారించవలసిందేనా? ఎందుకంటె ఈ మొత్తం అవినీతి బహిర్గతం కావడం మన ప్రభుత్వం- 2013లో ప్రయోజకత్వం కాదు, మన దర్యాప్తు సంస్థల ఘనత కాదు. తమ దేశానికి చెందిన ‘్ఫన్‌మెక్కానికా’ సంస్థవారు వివిధ దేశాలలో జరిపిన అవినీతి కలాపాల గురించి దర్యాప్తుచేసిన ఇటలీ దర్యాప్తు బృందాలు, న్యాయ మండలులు ఈ అవినీతిని కూడ ధ్రువీకరించాయి. అప్పుడు కాని ‘అగస్టా’ అవినీతి మన దేశంలో ప్రచారం కా లేదు. ‘సిగ్నోరా’గాంధీకి ‘అగస్టా’ లంచమిచ్చినట్టు గత ఏప్రి ల్ ఇటలీలోని ఒక న్యాయస్థానం ధ్రువీకరించింది. ఈ ‘సిగ్నో రా గాంధీ’ ఎవరన్నది కనిపెట్టలేకపోవడం మన ‘దర్యాప్తు’ పనితీరుకు నిదర్శనం క్రిస్టియన్ మిషిన్ అన్న అగస్టా సంస్థ ‘‘లోపలివాడు’’ అన్నీ బయటపెడతానని ఇప్పుడు అంటున్నాడట. ఏమి బయటపెడతాడో వేచి చూడవలసిందే!!