సంపాదకీయం

స్వదేశంలో శరణార్థులు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జమ్మూ కశ్మీర్‌లో ముస్లింల ‘జన బాహుళ్యాన్ని’- మెజారిటీని- నిలబెట్టడం కోసం రక్తపాతం సృష్టించడానికి సైతం వెనుకంజ వేయబోమని ‘జమ్మూ కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్’- జెకెఎల్‌ఎఫ్- అన్న దేశ విద్రోహ బీభత్స సంస్థకు చెందిన యాసిన్ మాలిక్ హెచ్చరించడం ‘సర్వమత సమభావ వ్యవస్థ’ స్ఫూర్తికి విఘాతకరం. ఏడు దశాబ్దులుగా ‘పాకిస్తాన్ తొత్తులైన’ జిహాదీలు ఈ సర్వమత సమభావ స్ఫూర్తికి విఘాతం కలిగిస్తున్నారు. అందువల్ల యాసిన్ మాలిక్ వంటివాడు ఇలా ప్రకటించడం ఆశ్చర్యం కాదు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి 1947లో తరిమివేతకు గురైన శరణార్థులకు జమ్మూ కశ్మీర్ ‘నివాస’ అధికారాన్ని కల్పించడం వల్ల ఈ రాష్ట్రంలోని ‘ముస్లిం జన బాహుళ్య’ స్వభావానికి భంగం కలుగుతుందని విచ్ఛిన్నకారులు భావిస్తుండడమే విస్మయకరం. జమ్మూ కశ్మీర్ జనాభా ప్రస్తుతం దాదాపు కోటి ఇరవై ఐదు లక్షలు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి తరిమివేతకు గురైన హిందువుల సంఖ్య 1947లో దాదాపు కోటి ఇరవై లక్షలు. ఇలా తరిమివేతకు గురైన వారిలో కేవలం మూడు లక్షల మంది జమ్మూ ప్రాంతంలో ని వాసం ఏర్పరచుకున్నారు. వీరి సంఖ్య ఇప్పుడు ఎంతన్నది ఖచ్చితంగా తెలియదు. దాదాపు నా లుగు లక్షల మంది హిం దువులకు ‘నివాసపు గు ర్తింపు’ పత్రాలను ఇచ్చినంత మా త్రాన జమ్మూ కశ్మీర్ ‘ముస్లిం మెజారిటీ’ దెబ్బతిని పోతుందా? దెబ్బతిని పోతుందని యాసిన్ మా లిక్ లాంటి దేశద్రోహులు అంటున్నారు. ఈ నివాసపు గుర్తింపు పత్రాలు ఇచ్చినంత మాత్రాన హిందూ శరణార్థులు జమ్మూ కశ్మీర్ ‘పౌరులు’గా మారిపోవడం లేదట! జమ్మూ కశ్మీర్ ప్రభుత్వ ప్రతినిధి, విద్యామంత్రి నరుూమ్ అక్తర్ గురువారం ఈ సంగతిని ఆధికారికంగా ప్రకటించాడు! ఇదే సంగతిని ప్రధానమంత్రి కార్యాలయంలోని సహాయ మంత్రి జితేంద్ర సింగ్ కూడ శుక్రవారం ధ్రువీకరించాడు! ఇది పౌరసత్వానికి సంబంధించిన వ్యవహారం కాదని జితేంద్ర సింగ్ స్పష్టీకరించాడు. డెబ్బయి ఏళ్ళుగా పౌరసత్వ అధికారం కాని, జమ్మూ కశ్మీర్ శాశ్వత నివాసపు హోదా గాని లేని ఈ శరణార్థులు అత్యంత దుర్భరమైన, అవమానకరమైన దారిద్య్రగ్రస్తులై జీవచ్ఛవాల వలె జమ్మూ ప్రాంతంలో పడి ఉన్నారు. అందువల్ల వారు ఉద్యోగాలు, ఉపాధి పొందడానికి వీలుగా మాత్రమే ఈ ‘డొమిసిలీ’- నివాస ధ్రువీకరణ- గుర్తింపుపత్రాలను వారికి ఇస్తున్నట్టు కేంద్ర ప్రభుత్వం, జమ్మూ కశ్మీర్ ప్రభుత్వం ఇలా స్పష్టీకరణలను ఇచ్చాయి! అందువల్ల పాకిస్తాన్ నుంచి తరిమివేతకు గురైన ఈ అఖండ భారత పౌరులకు డెబ్బయి ఏళ్ల తరువాత ఇప్పుడు కూడ శాశ్వత పౌరసత్వం లభించలేదన్న మాట!
అయినప్పటికీ యాసిన్ మాలిక్ లాంటి ‘ఉగ్రవాదులు’ ఈ శరణార్థులకు నివాసపు ధ్రువీకరణ పత్రం కూడ ఇవ్వరాదంటున్నారు. దీనికి భారత మార్క్సిస్టు కమ్యూనిస్ట్ పార్టీ వంటి రాజకీయ పక్షాల వారు వంతపాడుతున్నారు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి వచ్చేసిన శరణార్థులకు ‘నివాస’పత్రాలను ప్రదానం చేయడం వల్ల ‘జమ్మూ కశ్మీర్ ప్రత్యేక ప్రతిపత్తికి భంగం జరిగిపోతుంద’ని మహమ్మద్ యూసఫ్ తరిగామీ అనే మార్క్సిస్టు నాయకుడు ప్రకటించాడట! జమ్మూ కశ్మీర్‌లో మార్క్సిస్టు పార్టీకి ఉనికే లేదు. కానీ ఈ ‘మహానాయకుని’ అభిప్రాయానికి మాధ్యమాలలో గొప్ప ప్రచారం లభించడం మరో వైపరీత్యం! పాకిస్తాన్ నుంచి లక్షలాది హిందువులు శరణార్థులై ‘అవశేష భారత్’లోకి రావడం దేశ విభజనతో ముడివడిన దయనీయ చారిత్రక సత్యం! 1947లో అఖండ భారత్ విభజన జరిగిన తరువాత పాకిస్తాన్ ఏర్పడింది. ఇలా పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో క్రీస్తుశకం ఏడవ శతాబ్ది నాటికి ఒక్క ముస్లిం కూడ లేడు, వందశాతం ప్రజలు అనాదిగా ఈ దేశంలో పుట్టిపెరిగిన హిందూ జాతీయులు, స్వజాతీయ మతాల వారు. కాని ఎనిమిదవ శతాబ్దిలో ఇప్పటి పాకిస్తాన్ ప్రాంతంలోకి విదేశాల నుంచి ఇస్లాం మతం ప్రవేశించింది. హిందూ మతాల వారిని జిహాదీలు బలవంతంగా శతాబ్దులుగా ఇస్లాంలోకి మార్చారు. అందువల్ల 1947 నాటి పాకిస్తాన్‌గా ఏర్పడిన ప్రాంతంలో ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యాకులయ్యారు. ఇస్లాం మతస్థుల సంఖ్య పెరగడం వల్ల ‘దేశ జనాభా నిష్పత్తి’- డెమొగ్రాఫిక్ క్యారక్టర్- మారిపోతుందని ఎవ్వరూ బాధపడలేదు. పాకిస్తాన్ భూభాగంలో వంద శాతం ఉండిన హిందువులు 1947 నాటికి ఇరవై నాలుగు శాతానికి దిగజారడం ‘డెమొగ్రాఫిక్ క్యారక్టర్’లో వచ్చిన ఘోరమైన మార్పు. ఫలితం- పాకిస్తాన్..!
కానీ నాలుగు లక్షల హిందువులు జమ్మూ కశ్మీర్ పౌరులయినంత మాత్రాన ఆ ప్రాంతపు ముస్లిం జనాధిక్యతకు తీరని భంగం ఏర్పడిపోయిందట! యాసీన్ మాలిక్ అంటున్నాడు, భారత కమ్యూనిస్టుపార్టీ వారు అంటున్నారు! అంటే జమ్మూ కశ్మీర్ ప్రాంతం ‘కల్పాంతం’ వరకు ముస్లిం మెజారిటీ భూ భాగంగా మాత్రమే ఉం డాలట! మరి ఇదే తర్కాన్ని విస్తరించి కనీ సం ఖండిత భారతదేశమైనా ‘హిందూ మెజారిటీ’గా ఉండాలని ఎవరైనా కోరవచ్చు! కాని అలా మొత్తం దేశం ‘జనాభా నిష్పత్తి’- డెమొగ్రాఫిక్ క్యారక్టర్- మారకూడదని ఎవరైనా అంటే వారు మతోన్మాదులుగా ముద్రపడుతున్నారు. ‘అఖండ భారత్’ జనాభా నిష్పత్తి మారిపోయింది, అవశేష భారత్ జనాభా నిష్పత్తి మారిపోతోంది.. కానీ జమ్మూ కశ్మీర్ నిష్పత్తి మాత్రం మారిపోరాదట! నిజమైన సర్వమత సమభావ వ్యవస్థను సమర్ధించే వారు ఏమంటారు? జమ్ము కశ్మీర్‌లో సైతం ముస్లిం మెజారిటీ ఎప్పుడు ఏర్పడింది?? ఒకప్పుడు వంద శాతం హిందువులుండిన జమ్మూ కశ్మీర్‌లో సైతం శతాబ్దుల పాటు ‘డెమొగ్రాఫిక్ క్యారక్టర్’ మారినందువల్లనే అది ముస్లిం జన బాహుళ్య ప్రాంతమైంది! అంటే హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్నచోట ‘జనాభా నిష్పత్తి’ మారవచ్చునట, ముస్లింలు అధికంగా ఉన్నచోట మాత్రం ‘జనాభా నిష్పత్తి’ మారరాదట! ఇదేం తర్కం? ఇదేం న్యాయం? యాసీన్ మాలిక్ లాంటి ‘జిహాదీలు’ కుతర్కాన్ని వినిపించవచ్చు! మార్క్సిస్టు పార్టీ వారు కూడానా..? ఈ దేశ ప్రజలు గమనించాలి! జమ్మూ కశ్మీర్ అనాదిగా ఈ దేశంలో భాగం! సర్వమత సమభావ వ్యవస్థ దేశమంతటా అనాదిగా ఉంది! విదేశాల నుంచి వ్యాపించిన ఇస్లాం, క్రైస్తవ మతాల వారు అందువల్లనే ఈ దేశంలో పుట్టిపెరిగిన మతాలతో సమానంగా, హాయిగా, సుఖంగా, గర్వంగా ఈ దేశంలో జీవిస్తున్నారు. సర్వమత సమభావం భారతీయ స్వభావం!
ఈ స్వభావం కశ్మీర్‌లో మాత్రం ఉండరాదట! డెబ్బయి ఏళ్లుగా కశ్మీర్‌లో జీవిస్తున్న- పాకిస్తాన్ నుంచి నిర్వాసితులైన- హిందువులకు ఆ రాష్ట్రంలో సమాన హక్కులు ఉండరాదట! ఇది కశ్మీర్ సమస్య కాదు, భారతీయుల సమస్య. మానవత్వం, సమానత్వం నిండిన హృదయాల సమస్య! ఈ పాకిస్తాన్ నిర్వాసిత హిందువులు డెబ్బయి ఏళ్లుగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు పొందారు, లోక్‌సభ ఎన్నికలలో వోట్లు వేశారు. కానీ వారు జమ్మూ కశ్మీర్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హులు కాలేదు. కశ్మీర్ శాసనసభ ఎన్నికల్లో వోటువేయడానికి అర్హులు కాలేదు, పాకిస్తాన్ నిర్వాసితులకు దేశమంతటా సమానమైన ప్రతిపత్తి లభించింది, కశ్మీర్‌లో మాత్రం లభించరాదట! ఎంతకాలం ఈ దుర్మార్గం..?