సంపాదకీయం

‘ప్రవాస‘ విషాదం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వివిధ విదేశాలలో నివసిస్తున్న భారతీయులు ఆయా దేశాలలోని ప్రభుత్వ దమనకాండకు ప్రభుత్వేతర దౌర్జన్యకాండకు గురి అవుతుండడం, బలి అవుతుండడం కొనసాగుతున్న వైపరీత్యం. పశ్చిమాసియాలోని ‘బహ్రయిన్’ అన్న చిన్న దేశంలో కూడ భారతీయులు అవమానాలకు, అత్యాచారాలకు, హత్యకాండకు, నిర్బంధానికి గురి అవుతుండడం సరికొత్త సమాచారం. ‘సమాచారం’ సరికొత్తగా ఇప్పుడు బయటికి పొక్కింది. కానీ ఆ ‘ఇస్లాం మత రాజ్య వ్యవస్థ’ ఉన్న బహ్రయిన్ దేశంలో భారతీయులు దశాబ్దుల తరబడి అవమానాలకు గురి అవుతూనే ఉన్నారు. ఇటీవలి కాలంలో భారతీయ కార్మికులకు ‘యజమానులు’ నెలల తరబడి జీతాలు ఇవ్వడం లేదు. జీతాలను ఇప్పించాలని కోరుతూ బహ్రయిన్ రాజధాని ‘మనామా’లో వారు ఆదివారం నిరసన ప్రదర్శన జరిపారట! ప్రదర్శకులపై పోలీసులు జరిపిన బీభత్సకాండ ఫలితంగా ఒక భారతీయ కార్మికుడు బలైపోయాడు. మన దేశంలోని విదేశీయులపై ‘ఈగ’ వాలితే చాలు.. ఆయా విదేశాల ప్రభుత్వాలు ‘రోకళ్ల’ను ప్రయోగించి ఆర్భాటం చేస్తున్నాయి. ఆఫ్రికా, పశ్చిమ ఆసియా, చైనా తదితర దేశాల వారు మన దేశంలో ఘోరమైన నేరాలను చేసి ఎలాంటి శిక్షలకు గురి కాకుండా తప్పించుకొని స్వదేశాలకు వెళ్లిపోతున్నారు. మన ప్రభుత్వం వెళ్లనిస్తోంది. ఆయా విదేశీయ నేరస్థులను అరెస్టు చేసిన సందర్భాలలో ఆ విదేశీయ ప్రభుత్వాల రాయబారులు దౌత్యవేత్తలు గొడవ చేస్తున్నారు, ఆయా దేశాలలోని మన రాయబారులను దౌత్య వేత్తలను పిలిచి పరుష పదజాలంతో బెదిరిస్తున్నారు. ఈ దౌత్య దౌర్జన్యం ముందు మన ప్రభుత్వం మోకరిల్లిపోతోంది! అమెరికా, చైనా వంటి పెద్ద దేశాల నేరస్థులు మన దేశంనుంచి తప్పించుకుని పోతున్నారు. సౌదీ అరేబియా, ఇటలీ వంటి సంపన్నదేశాల నేరస్థులు సైతం ‘దౌత్య రక్షణ’లను అడ్డుపెట్టుకుని మన న్యాయస్థానాలలో నిలబడకుండా హుందాగా తమ దేశాలకు వెళ్లిపోతున్నారు. ఆఫ్రికా దేశాల వంటి వెనుకబడిన దేశాల ప్రభుత్వాలు సైతం మన ప్రభుత్వాన్ని వెక్కిరిస్తున్నాయి. మనదేశంలోకి అక్రమంగా చొరబడిన నైజీరియావారిని నిర్బంధించిన సందర్భాలలోను, మాదక ద్రవ్యాన్ని, ఎఱ్ఱ చందనాన్ని, పులుల చర్మాలను అవయవాలను దొంగరవాణా చేస్తున్న ముఠాలను పట్టుకున్న సమయంలోను ఆయా విదేశీయ ప్రభుత్వాలు తక్షణం రంగంలోకి దిగిపోతున్నాయి... ‘మా పౌరులు నిర్దోషులు...వారిని సగౌరవంగా మా దేశానికి పంపండి!’ అన్నది ప్రతి సందర్భంలోను విదేశీయ ప్రభుత్వాల నినాదం. చైనా అమెరికా రష్యా బ్రిటన్ సౌదీ అరేబియా ఫ్రాన్స్ జర్మనీ వంటి దేశాలు ఇలా విదేశీయ దౌత్య దౌర్జన్యానికి లొంగడం లేదు! మన ప్రభుత్వం దశాబ్దుల తరబడి లొంగిపోతోంది. కానీ విదేశాలలోని భారతీయులు ఎలాంటి నేరాలకు పాల్పడకపోయినప్పటికీ, ఘోరమైన అన్యాయాలకు గురి అవుతున్నారు. ఆయా విదేశీయ ప్రభుత్వాలను నిలదీయడంలోను, ప్రవాస భారతీయులకు న్యాయం కల్పించడంలోను మన ప్రభుత్వం అత్యధిక సందర్భాలలో కృతకృత్యం కాలేకపోతోంది. ఇదీ తేడా! ఏళ్ల తరబడి ఇదే వైపరీత్యం కొనసాగుతోంది..
పదహారు నెలల క్రితం 2015 సెప్టెంబర్ నెలలో మన దేశంలోని ఒక సౌదీ అరేబియా దౌత్యవేత్త చేసిన ఘోరమైన నేరం బయటపడింది. కానీ వాడి పాపం మాత్రం బద్దలు కాలేదు. బద్దలు కాకుండా సౌదీ అరేబియా ప్రభుత్వం అడ్డుకుంది. ఆ దుర్మార్గుడిని మన ప్రభుత్వం నిర్బంధించలేకపోయింది, న్యాయస్థానం ఎదుట నిలబెట్టలేకపోయింది. ఫలితంగా యావజ్జీవ కారాగృహ నిర్బంధ శిక్షను అనుభవించవలసిన ఆ సౌదీ అరేబియా దౌత్య బీభత్సకారుడు నేరం బయటపడిన తరువాత వారం రోజులకే దర్జాగా విమానమెక్కి సెప్టెంబరు పదహారవ తేదీన తమ దేశానికి వెళ్లిపోయాడు. మన ప్రభుత్వం వెళ్లనిచ్చింది! మజీద్ హసన్ అనే ఈ దౌత్య దుర్మార్గుడు ఢిల్లీలో సౌదీ అరేబియా రాయబారి కార్యాలయంలో ఉద్యోగి. ఢిల్లీ శివారులోని తన నివాస గృహంలో ఈ దుండగుడు ఇద్దరు నేపాలీయ మహిళలను ఆరు నెలలపాటు నిర్బంధించి ఉంచాడు. సౌదీ అరేబియాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని నమ్మబలికి, తన ఇంటికి చేర్చి, బలవంతంగా ఆరు నెలలపాటు వెట్టి చాకిరీ చేయించాడు. అతగాడి భార్య కుటుంబ సభ్యులు వారిద్దరినీ పశువులకంటె హీనంగా చూశారు, చిత్ర వధలకు గురి చేశారు. సరైన తిండి పెట్టకుండా మాడ్చారు. మజీద్ ఆ ఇద్దరు మహిళలపై అనేకసార్లు లైంగిక అత్యాచారం జరిపాడు. ఆరు నెలలలో దాదాపు ఇరవై మంది ‘అతిథులు’ కూడ ఆ అభాగ్య నేపాలీ మహిళలిద్దరినీ లైంగిక బీభత్సకాండకు బలి చేసారు... ఈ పైశాచిక రాక్షస కాండనుంచి వారిద్దరు తప్పించుకోవడం ఒక అద్భుతం. కానీ మన ప్రభుత్వం మజీద్‌ను నిర్బంధించలేపోయింది. మన ప్రభుత్వమే సౌదీ అరేబియా ప్రభుత్వానికి దాసోహమన్నప్పుడు మానవ అధికార సంఘాలు ఏమి చేయగలవు?
మజీద్‌కు ‘దౌత్య రక్షణ’-డిప్లమాటిక్ ఇమ్యూనిటీ లేదు. ఎందుకంటే ఈ నేరం అతడి విధి నిర్వహణ సమయంలో జరుగలేదు. కానీ దౌత్య రక్షణ ఉందని సౌదీ అరేబియా వాదించింది. కానీ ఆ దేశంలో పనిచేస్తున్న భారతీయులకు ఎలాంటి రక్షణ లేదు. సౌదీ యజమానులు భారతీయ శ్రామికులను చిత్రహింసలపాలు చేస్తున్నారు. సౌదీ ప్రభుత్వ అధికారులు చూస్తూ ఊరుకున్నారు. వేలాదిమంది భారతీయ ఉద్యోగులకు సౌదీ యజమానులు నెలల తరబడి జీతాలు ఇవ్వకపోవడం ప్రధానమైన సమస్య. సౌదీ అరేబియాకు ఆనుకొని ఉన్న బహ్రయిన్, మాలాయెత్, ఐక్య అరబ్ సంస్థానాలు-యనైటెడ్ అరబ్ ఎమిరేట్స్-యుఏఇ వంటి దేశాలలోకూడ భారతీయ కార్మికులు ఇదే రీతిలో కడగండ్ల పాలవుతున్నారు. జీతాలు ఇవ్వకపోవడం ఈ బీభత్స కాండలో అత్యల్ప విషయం. ‘గృహ సహాయిక’లుగా పనిచేస్తున్న భారతీయ మహిళలకు తిండి పెట్టకపోవడం కొంచెం తీవ్రమైన సమస్య. చిత్రహింసల పాలు చేయడం వేరొక సమస్య. తమిళనాడుకు చెందిన ఒక మహిళను ఒక సౌదీ యజమానురాలు కొట్టి ఒకటవ అంతస్థునుండి కిందికి తోసింది. ఆమె చేయి విరిగి గాయపడింది. నెలల తరువాత మాత్రమే ఆమె మన దేశానికి తిరిగి రాగలిగింది. మన దేశంనుండి వెళ్లడానికి తిరిగి రావడానికి ప్రయాణ ఖర్చులు ఈ పర్షియా సింధుశాఖ దేశాల -గల్ఫ్- యజమానులు భరించాలి. అలా ఒప్పందం కుదుర్చుకుని మన దేశంనుండి ‘గృహ సహాయిక’లను ఇతర శ్రామికులను తరలించుకుని పోతున్నారు. కానీ హఠాత్తుగా ఉద్యోగాలనుంచి తొలగిస్తున్నారు. ఈ తొలగింపునకు గురైన వారికి మనదేశానికి తిరిగి రావడానికి ప్రయాణ ఖర్చులను ఇవ్వడం లేదు. ఆ యజమానులను ఆయా ప్రభుత్వాలు దండించడంలేదు. తమిళనాడు మహిళను కిందికి తోసిన యజమానురాలిపై మన దౌత్య కార్యాలయం ఫిర్యాదు చేసింది. దొంగతనం చేసి పారిపోతుండిన ఆ భారతీయ మహిళ తనంతట తానే పడిపోయిందన్నది వచ్చిన సమాధానం.
మృతదేహాలపై సైతం కరుణ చూపని బీభత్స ప్రభుత్వ విధానాలు ఈ పశ్చిమ ఆసియా దేశాలలో వ్యవస్థీకృతమై ఉన్నాయి. సౌదీ అరేబియాలోని వైద్యశాలలోని మృత్యుగృహాల- మార్చురీస్-లలో నూట యాబయిమంది భారతీయుల మృతదేహాలు పడి ఉన్నాయని గత డిసెంబర్‌లో వెల్లడైంది. వీరు సహజంగా మరణించినవారు, ఆత్మహత్యలు చేసుకున్న వారు హత్యకు గురైన వారు... వీరి మృతదేహాలను మనదేశానికి తరలించడానికి వీలుగా యజమానులు ఖర్చులు భరించాలి. భరించడం లేదు. మెదక్ జిల్లాకు చెందిన రవి అనే వ్యవసాయదారుడిని గత డిసెంబర్ 31న ఎవరో గుద్ది చంపేసారు. ఆయన మృతదేహం కూడ వీటిలో ఒకటి! మన ప్రభుత్వం ఏమి చేయగలదు?