సంపాదకీయం

మత‘రక్షణ’ మంచిదేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముస్లింలకు పనె్నండు శాతం ‘ఆరక్షణల’ను కల్పించడానికి కృతనిశ్చయంతో ఉన్నట్టు తెలంగాణ ప్రభుత్వం వారు పదే పదే ప్రకటించడం విచిత్రమైన వ్యవహారం. మత ప్రాతిపదికపైన ‘రిజర్వేషన్’-ఆరక్షణ-లను కల్పించడం భారత రాజ్యాంగ విరుద్ధం. ఈ నిబంధనను, ఈ రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరించి గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇస్లాం మతస్థులకు ప్రభుత్వ ఉద్యోగాలలోను, విద్యా సంస్థలలోను రిజర్వేషన్‌లు కల్పించింది. ఈ మతపరమైన ఆరక్షణలు రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టు మూడుసార్లు స్పష్టం చేసింది. దేశంలోని వివిధ ఉన్నత న్యాయస్థానాలు 1952 నుంచి మతపరమైన రిజర్వేషన్లు చెల్లవని అనేకసార్లు స్పష్టం చేశాయి. ఇస్లాం మతస్థులకు రిజర్వేషన్లను కల్పిస్తామని పదే పదే చెప్పడం ద్వారా తెలంగాణ ప్రభుత్వం బుద్ధిపూర్వకంగా రాజ్యాంగ స్ఫూర్తిని ధిక్కరిస్తోంది. ఇది మొదటి వైపరీత్యం. ఉన్నత న్యాయస్థానాలు, సర్వోన్నత న్యాయస్థానం ‘రాజ్యాంగ’ సందేహాలకు స్పష్టీకరణలను ఇవ్వడం వ్యవస్థీకృతమైన సంప్రదాయం. భారత రాజ్యాంగమే న్యాయ వ్యవస్థకు ఈప్రత్యేక అధికారాన్ని కల్పించింది. కేంద్ర ప్రభుత్వం, దేశాధినేత రాష్టప్రతి రాజ్యాంగ సందేహాల నివృత్తి కోసం సర్వోన్నత న్యాయస్థానం-సుప్రీంకోర్ట్- సలహాలను పొందడానికి రాజ్యాంగంలోని 143వ అధికరణం వీలు కల్పిస్తోంది. న్యాయవ్యవస్థ తీర్పులను మన్నించడం, పాటించడం ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల విధి. ఇది కేవలం నైతిక బాధ్యత కాదు, రాజ్యాంగం నిర్దేశిస్తున్న బాధ్యత! ఇస్లాం మతస్థులకు రిజర్వేషన్లను కల్పిస్తామని పదే పదే ప్రకటించడం న్యాయవ్యవస్థను బుద్ధిపూర్వకంగా వెక్కిరించడం. ఇది రెండవ వైపరీత్యం. మూడవ వైపరీత్యం కూడా ఉంది. ఉ మ్మడి ఆంధ్రప్రదేశ్ ప్ర భుత్వం కల్పించిన నాలుగు శాతం మత ఆరక్షణల వ్యవహారం ప్రస్తుతం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. అందువల్ల ఈ తీ ర్పు వెలువడకముందే మరోసారి మత రిజర్వేషన్లను కల్పించడం న్యాయ ధిక్కారం. తెలంగాణ ప్రభుత్వం సర్వోన్నత న్యాయ నిర్ణయం వెలువడే వరకు వేచి ఉండాలి! ప్రభుత్వానికి ఈ సంగతి తెలుసు. అయినప్పటికీ తెలియనట్టు అభినయించడం విచిత్రమైన వ్యవహారం. శాసనసభలో భారతీయ జనతాపార్టీవారు ప్రభుత్వానికి ఈ సర్వోన్నత న్యాయ నిర్ణయ ప్రక్రియను గురించి గుర్తు చేయవలసి వచ్చింది! సుప్రీంకోర్టులో సమస్య అపరిష్కృతంగా ఉన్నప్పటికీ శాసనసభ కొత్తగా మతరిజర్వేషన్లను కల్పిస్తూ చట్టం చేయవచ్చునని తెలంగాణ ప్రభుత్వం భావిస్తుండడం నాలుగవ వైపరీత్యం. సుప్రీంకోర్టులో అపరిష్కృతంగా ఉన్న అంశాలపై శాసనసభల్లో, పార్లమెంటులో చట్టాలు చేస్తూంటే ఇంక న్యాయస్థానాలెందుకు? న్యాయప్రక్రియ ఎందుకు? మత రిజర్వేషన్లను వ్యతిరేకించడం భాజపా వారి రాజ్యాంగ విజ్ఞతకు, ప్రజాస్వామ్య విచక్షణకు, సర్వమత సమభావ నిబద్ధతకు నిదర్శనం. మిగిలిన రాజకీయ పక్షాలు సైతం వాస్తవ భూమికపై నిలబడి ఆలోచించడం సర్వజన సంక్షేమానికి, ప్రగతికి దోహదం చేయగలదు.
తరతరాలుగా సమాజ నిర్లక్ష్యానికి, ఉపేక్షకు బలైపోయిన అనుసూచిత కులాల-షెడ్యూల్డ్ కాస్ట్స్-వారికి, అనుసూచిత సముదాయాల-షెడ్యూల్డ్ ట్రయిబ్స్-వారికి ఆరక్షణలు కల్పించాలని రాజ్యాంగ నిర్మాతలు భావించారు. రాజ్యాంగంలో నిర్దేశించారు. ఈ దళితులు సమష్టి సముదాయంగా ఆర్థికంగా సామాజికంగా వెనుకబడి ఉండడం ఇందుకు ప్రాతిపదిక! ఇలాంటి దళితులకు, వెనుకబడిన కులాల వారికి కల్పించవలసిన భద్రతలను ఇస్లాం మతస్థులకు కల్పించడం సామాజిక, చారిత్రక వాస్తవాలకు విరుద్ధమైన అంశం! ఈ దేశంలో పుట్టిపెరిగిన మతాలు అనేకం ఉన్నాయి. విదేశాల నుంచి వ్యాపించిన మతాలు కూడ ఉన్నాయి. ఈ మతాలలో ఏ ఒక్కటి కూడ సమష్టిగా వెనుకబడినతనానికి గురి కాలేదు. ఏ మతం వారు కూడ సమష్టి సముదాయంగా వెనుకబడినవారు కాదు. ప్రతి మతంలోను ప్రతి కులంలోను ధనవంతులు మధ్యతరగతి వారు నిరుపేదలు ఉండడం సహజం! కానీ ఏఒక్క మతం కూడ ఒక సమష్టి జన సముదాయంగా వెనుకబడి ఉండడం లేదు. విదేశాల నుంచి వ్యాపించిన క్రైస్తవ, ఇస్లాం వంటి మతాలు మరింత చైతన్యానికి, చొచ్చుకొనిపోయే ఆధిపత్య స్వభావానికి ప్రతీకలు. ఇలా చొచ్చుకొనిపోయే సమష్టి స్వభావం ఉండడం వల్లనే ఇస్లాం మతం, క్రైస్తవ మతం మన దేశం సహా వివిధ దేశాలకు విస్తరించాయి. చొచ్చుకుని పోయే స్వభావం కలిగిన ఇస్లాం వెనుకబడినతనానికి చిహ్నం కాజాలదు!
విదేశీయుల దండయాత్రల సమయంలోను, ఆ తరువాత జిహాదీల బీభత్స పాలన సమయంలోను శతాబ్దుల పాటు ఈ దేశంలోని అనాది మతాల వారు మాత్రమే అణగారిపోయారు. ఇస్లాం మతం వారు ఇలాంటి అణచివేతకు గురి కాలేదు. అనాదిగా మతాలకు అతీతంగా భాషలకు అతీతంగా మన దేశంలో జాతీయత వికసించింది. ఈ హైందవ జాతి లేదా భారత జాతి సర్వమతాల సమాహారమైంది, సర్వ భాషల సమష్టి రూపమైంది. హైందవ జాతి లేదా భారత జాతి సర్వమత సమభావ వ్యవస్థగా ఉండడం సహస్రాబ్దుల చరిత్ర. శైవం, వైష్ణవం, శాక్తం, సౌరం, గాణాపత్యం, స్కాందం, సనాతనం వంటి వేద మతాలు, బౌద్ధం, జైనం వంటి అవైదిక మ తాలు ఈ దేశంలో పుట్టిపెరిగాయి. ఆధునిక కా లంలో సిక్కుమతం, ఆర్య సమాజం వంటివి ప్రభవించాయి. ఈ మతాలవారందరూ సమానంగా ఈ జాతీయ జీవన స్రవంతిలో భాగమయ్యారు. ఖిల్జీలు, తుగ్లక్‌లు, మొఘలాయిలు, నిజాంలు, బ్రిటన్‌లు వంటి విదేశీయుల పాలనలో ఈ మతాలన్నీ సమానంగా అణచివేతకు గురి అయినాయి. విదేశాల నుంచి వచ్చిన ఇస్లాం, క్రైస్తవం కూడ ఈ అనాది జాతీయత సమాన భాగస్వాములు కావడం చారిత్రక పరిణామం! ఏ ఒక్క మతం వారు కూడ తాము ఈ జాతి నుంచి భిన్నమని భావించలేదు, ప్రత్యేక దేశాలను, జాతులను కోరలేదు. కానీ జిహాదీ ప్రవృత్తి నిండిన రాజకీయ వేత్తలు మాత్రం క్రీస్తుశకం ఇరవయ్యవ శతాబ్దిలో ఇస్లాం మతస్థులకు ప్రత్యేక దేశం కావాలని కోరారు. ఫలితంగా అఖండ భారతదేశం బద్దలైపోయింది, 1947లో ఇస్లాం మత ప్రాతిపదికపై పాకిస్తాన్ ఏర్పడింది! ఈ వికృత పరిణామ క్రమానికి ప్రాతిపదిక బ్రిటన్ సామ్రాజ్యవాదులు ఇస్లాం మతం వారికి మిగిలిన జాతీయుల కంటె భిన్నంగా మత ప్రాతిపదికపై ఆరక్షణలు కల్పించడం. జాతీయ శాసనసభలోను ప్రాంతీయ శాసనసభలలోను ఇలా మత ఆరక్షణలను కల్పించిన ‘కమ్యూనల్ అవార్డ్’ ఇస్లాం మతస్థులలో విచ్ఛిన్న భావజాలాన్ని పెంపొందించింది, ఇస్లాం మతాన్ని జాతీయ ప్రధాన స్రవంతి నుంచి వేరు చేసింది. ఫలితం దేశ విభజన..!
ఈ చారిత్రక విఘటన నుండి మనం గుణపాఠాలు నేర్చుకోవాలి. కానీ రాజకీయ వేత్తలు అనాలోచితంగా కొందరు, అనభిజ్ఞతతో కొందరు, వోట్ల సీట్ల ప్రలోభంతో కొందరు గత రెండు దశాబ్దులుగా మత రిజర్వేషన్లను మళ్లీ ప్రచారం చేస్తున్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పించడం ‘మత ప్రాతిపదికపై కాద’న్న విచిత్రమైన వాదాన్ని తెలంగాణ ప్రభుత్వం వినిపిస్తోంది. ఇది మత ప్రాతిపదికన కాకపోతే మరి ప్రాతిపదిక ఏమిటి? ఇదే ప్రాతిపదికన తమకు కూడ రిజర్వేషన్లను కల్పించాలని శైవ, వైష్ణవ, శాక్త, సిక్కు, బౌద్ధ జైన మతాలు కోరితే ఏమవుతుంది? తెలంగాణ ప్రభుత్వం ఏమంటుంది? ఏం చేస్తుంది??