సంపాదకీయం

విస్తరిస్తున్న విద్రోహం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం జిల్లా కూనేరు రైల్వేస్టేషన్ సమీపంలో ‘హీరాఖండ్’ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పి పడిపోవడానికి విద్రోహుల బీభత్స చర్య కారణమన్నది జరుగుతున్న ప్రచారం. ప్రమాదవశాత్తు రైలు బోగీలు పట్టాలు తప్పలేదన్నది ధ్రువపడినట్టయితే పెరుగుతున్న ఉగ్రవాద కలాపాలకు ఇది మరో ప్రతీక కాగలదు. పట్టాలు తప్పిన చోటికి రైలు రావడానికి ముందు అక్కడ మంటలు చెలరేగడాన్ని ఒక ఉద్యోగి గమనించాడట. ఈ మంటల సంగతిని రైల్వేస్టేషన్ అధికారులకు ఫిర్యాదు చేయబోతుండిన సమయంలోనే దూసుకుని వచ్చిన రైలు మంటలు చెలరేగిన స్థలంలో ప్రమాదానికి గురైందట! పట్టాలపై మంటలు చెలరేగడానికి కారణం ఉగ్ర చర్య కావచ్చు. ముప్పయి తొమ్మిది మంది ప్రయాణీకులు ప్రమాదానికి బలైపోవడం యాబయి మందికి పైగా గాయపడడం ఘటన తీవ్రతకు నిదర్శనం. పట్టాలలో పగుళ్లు ఏర్పడి ఉండడం కూడ బీభత్స కృత్యానికి మరో సంకేతం. ఇది కేవలం రైలు పట్టాల, ప్రయాణీకుల భద్రతకు సంబంధించిన వ్యవహారం కాదు, దేశ అంతర్గత భద్రతకు సంబంధించిన వ్యవహారం. గతంలోను, సమీప గతంలోను రైలు ప్రమాదాలను కల్పించిన జిహాదీ బీనత్సకారులు, మావోయిస్టు ఉగ్రవాదులు దేశమంతటా విశృంఖల విహారం చేస్తున్నారు. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట జిహాదీలు పట్టుబడుతున్నారు. ఎక్కడో ఒక చోట దాడి చేస్తున్నారు. మావోయిస్టులు సైతం విశ్రమించడం లేదు. 2014వ సంవత్సరం కంటే గత ఏడాది నక్సలైట్ల కార్యకలాపాలు సంబంధిత బీభత్స కాండ మరింతగా పెరిగాయన్నది అధికారిక నిర్ధారణ. ఆం ధ్ర-ఒరిస్సా సరిహద్దు ప్రాం తంలో మావోయిస్టుల క లాపాలు చురుకుగా సాగుతునే వున్నాయి. చత్తీస్‌గఢ్, ఒడిశా, ఉత్తరాంద్ర, ఝా ర్ఖండ్ ప్రాంతాలు మావోయిస్టుల ప్రస్తుత ప్రధాన బీభత్స ప్రాంగణమన్నది నిరాకరింపజాలని నిజం. చత్తీస్‌గఢ్‌లోని జగదల్పూర్ నుంచి భువనేశ్వర్‌కు వెడుతుండిన ‘హీరాఖండ్’ పట్టాలు తప్పడానికి ఉగ్రచర్య కారణం కావచ్చునన్న అనుమానం అతార్కికం కాజాలదు. ప్రమాదవశాత్తు రైలు పట్టాలు తప్పినా, బీభత్సకారుల దుశ్చర్యల వల్ల పట్టాలు తప్పినా పోయిన ప్రాణాలు తిరిగి రావు. మృతుల కుటుంబాల హృదయాలలో చెలరేగిన శోక దవాగ్ని జ్వాలలు చల్లారవు. ఇది కేవలం ప్రమాదం అయినట్టయితే అది రైల్వే భద్రతా వ్యవస్థలో నిహితమై వున్న నిర్లక్ష్యానికి నిదర్శనం. బీభత్స చర్య ఫలితం అయినట్టయితే దేశమంతటా విస్తరిస్తున్న భద్రతా రాహిత్యానికి నిదర్శనం. ఇదీ అంతరం. దేశప్రజల ప్రాణాల విస్తృత భద్రతతో ఇనుపదారుల భద్రత కూడ ముడివడి ఉంది.
మావోయిస్టులు చెలరేగుతున్న ప్రాంతంలో రైలు పట్టాలు తప్పింది కాబట్టి ఇది వారి ఘాతుకచర్య కావలసిన పని లేదు. అనుమానం మావోయిస్టుల మీదికి మళ్లుతుందన్న ఆశతో పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ దుండగులు కూడ రంగప్రవేశం చేసి ఉండవచ్చు, ‘హీరాఖండ్’ రైలును పట్టాలు తప్పించి ఉండవచ్చు! ఊహించని చోట ఊహించని సమయంలో ఊహించని రీతిలో గోడ దూకడం తోడేలు స్వభావం. పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీ మూకలు మన దేశమంతటా ఇలా ఊహించని బీభత్స కృత్యాలకు పాల్పడుతున్నారు. ‘హీరాఖండ్’ దుర్ఘటనలో సైతం ఈ జిహాదీ ముఠాల హస్తం ఉండవచ్చు! ఉత్తరప్రదేశ్‌లో ఇటీవల జరిగిన రెండు రైలు ప్రమాదాలు నిజానికి ప్రమాదాలు కావన్న అనుమానాలను భద్రతా దళాలవారు ఇప్పుడు వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదాలను పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ నిర్వహించి ఉండవచ్చునన్నది ప్రచారమవుతున్న సందేహం. మన జాతీయ నేర పరిశోధన సంస్థ-ఎన్‌ఐఎ ఆ రెండు ప్రమాదాలను గురించి ఇప్పుడు దర్యాప్తు చేస్తోంది. ‘హీరాఖండ్’ ప్రమాదాన్ని గురించి కూడా ఈ సంస్థ దర్యాప్తు చేసే అవకాశం ఉంది. పాకిస్తానీ ఐఎస్‌ఐ-‘ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్’ పేరుకు మాత్రమే గూఢచర్య సంస్థ. ఈ సంస్థ ప్రధాన కలాపం మనదేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండ జరపడం. ఐఎస్‌ఐ మన దేశంలోని జిహాదీలను ఉసిగొల్పింది. దశాబ్దుల తరబడి పాకిస్తాన్ నుంచి , పాకిస్తాన్ దురాక్రమణలో ఉన్న కశ్మీర్ ప్రాంతం నుంచి జిహాదీలు మన దేశంలోకి చొరబడుతున్నారు. ఈ జిహాదీలు వివిధ ముఠాల పేర్లతో చెలామణి అవుతున్నప్పటికీ ఇవన్నీ ఒక విస్తృత బీభత్స వ్యవస్థలోని వివిధ విభాగాలు మాత్రమే.
వివిధ జిహాదీ ముఠాలను మాత్రమే కాక మనదేశానికి వ్యతిరేకంగా పనిచేస్తున్న అన్నిరకాల బీభత్స ముఠాలను ఐఎస్‌ఐ పరస్పరం అనుసంధానం చేస్తోంది. తమిళ ఈలం లిబరేషన్ టైగర్స్-ఎల్‌టిటిఇ, మావోయిస్టులు, ఖలిస్తాన్ లిబరేషన్ విద్రోహులు, ఈశాన్యంలో మతం మార్పిడి మాధ్యమంగా విచ్ఛిన్న కలాపాలను సాగిస్తున్న విద్రోహుల ముఠాలు- ఇలాంటి జిహాదీయేతర బీభత్స తండాలన్నింటినీ ఐఎస్‌ఐ అనుసంధానం చేసింది. అఫ్ఘనిస్తాన్‌లోని తాలిబన్లు, హక్కాని ముఠాల వారు సోమాలియా తీరంలోని ఓడ దొంగలు, బంగ్లాదేశ్‌లోని హుజి తీవ్రవాదులు, మన దేశంలోని సిమి, ఇండియన్ ముజాహిదీన్ ముఠావారు, బర్మాలోని రోహింగియా తీవ్రవాదులు ఇలా అనేక ముఠాలను ఐఎస్‌ఐ ఒక బీభత్స సూత్రంతో అనుసంధానం చేసింది. వేరు వేరు పేర్లతో చెలామణి అవుతున్న ము ఠాలు కేవలం పాత్రధారులు, సూత్రధారి ఐఎస్‌ఐ. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రెం డు రైలు ప్రమాదాలకు కారణం ఐఎస్‌ఐ అన్న అనుమానాన్ని మన పరిశోధక సంస్థల వారు, నిఘా నిర్వాహకులు వ్యక్తం చేస్తున్నారు. మన దేశంలో ఒక బీభత్స ఘటన జరిగిన వెంటనే అది జాయిష్‌ఎ మొహమ్మద్ ముఠా అని ప్రచారమవుతుంది లేదా ఇండియన్ ముజాహిదీన్ ముష్కరుల దురాగతం అని ప్రచారం కావచ్చు! ఆ తరువాత పరిశోధనలో హంతకులు లష్కర్ ఏ తయ్యబా తండాకు చెందినవారని నిర్ధారణ జరుగుతుంది. ఈ ముఠాలన్నీ గందరగోళం సృష్టించడానికి వివిధ పేర్లతో చెలామణి అవుతున్న ఒకే వ్యవస్థలో భాగం. ఆ వ్యవస్థ ఐఎస్‌ఐ. గత కొనే్నళ్లుగా జిహాదీ ముఠాలను చైనా ప్రభుత్వం నిర్లజ్జగా, బాహాటంగా సమర్ధిస్తోంది. మన దేశంలో జరుగుతున్న ప్రతి బీభత్స ఘటన కూడ పాకిస్తాన్, చైనాల ఉమ్మడి దురాగతం. బీభత్సకాండ నిర్వహిస్తున్నది మావోయిస్టులైనా జిహాదీలైనా నిర్వహింపచేస్తున్నది మాత్రం పాకిస్తాన్- చైనాల కూటమి...
రైళ్లు పడిపోవడంలో విద్రోహుల పాత్ర దశాబ్దికి పైగా కొనసాగుతోంది. 2003 జులై రెండవ తేదీన వరంగల్లు సమీపంలోని ఒక వంతెనపై నుండి గోలకొండ ఎక్స్‌ప్రెస్ రైలు పడిపోయింది. ఈ ప్రమాదానికి పద్దెనిమిది మంది బలయ్యారు. అది ప్రమాదం కాదని, విద్రోహ చర్య ఫలితమని ఆ తరువాత ఆధికారికంగా ప్రచారమైంది. నాలుగు రోజుల తరువాత పాకాల-బళ్లారి రైలు పట్టాలు తప్పింది. అది ప్రమాదం కాదని విద్రోహ చర్య అని అప్పటి రైల్వే శాఖ సహాయమంత్రి బండారు దత్తాత్రేయ ఆ తరువాత ప్రకటించాడు! బెంగాల్‌లోను, ఒడిశాలోను, ఇతర ప్రాంతాలలోను విద్రోహకాండ ఫలితంగా రైళ్లు పడిపోయిన ఘటనలు కోకొల్లలు. గత డిసెంబర్‌లో ఉత్తరప్రదేశ్‌లో సేలం-అజ్మీర్ రైలు పడిపోయింది. యాబయిమంది గాయపడ్డారు. నవంబర్‌లో ఇండోర్-పాట్నా రైలు పడిపోవడంతో నూట యాబయి మంది మృతులయ్యారు. ఈ రెండూ విద్రోహ ఘటనలట!