సంపాదకీయం

‘నకిలీ’లపై నియంత్రణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వేతర సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు బాధ్యతాయుతంగా పనిచేయడం అనివార్యమన్నది కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ‘నూతన నియమావళి’లోని ప్రధాన ఇతివృత్తం! బాధ్యతను విస్మరించే ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనడానికి ‘ని యమావళి’లో వీలు కల్పించారు. దీనివల్ల స్వచ్ఛంద సేవ పేరుతో ప్రభుత్వ నిధులను, ప్రజల విరాళాలను ‘్భంచేస్తున్న’ అక్రమ సంస్థల ‘ఆట’ కట్టుబడిపోగలదు. దేశంలో నమోదై ఉన్న స్వచ్ఛంద, ప్రభుత్వేతర సంస్థలలో అత్యధికం నకిలీ సంస్థలన్నది కేంద్ర నేర విచారణ మం డలి-సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సిబిఐ-వారు నిగ్గుతేల్చిన నిజం! అందువల్ల సర్వోన్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల ప్రాతిపదికగా కేంద్ర ప్రభుత్వం ఈ కొత్త నిబంధనలను రూపొందించిందట! ఈ ‘నిబంధనావళి’ ముసాయిదా పత్రాన్ని సర్వోన్నత న్యాయస్థానానికి కేంద్ర ప్రభుత్వం సమర్పించింది. దేశంలో ముప్పయి మూడు లక్షలకుపైగా స్వచ్ఛంద సంస్థలు-వాలంటరీ ఆర్గనైజేషన్స్-విఓస్-ప్రభుత్వేతర సేవా సంస్థలు -నాన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్-ఎన్‌జిఓస్-నడుస్తున్నాయట! కానీ ఈ సంస్థలలో కేవలం పది శాతం మాత్రమే తమ వార్షిక ఆదాయ వ్యయ పత్రాలను సంబంధిత అధికారులకు సమర్పిస్తున్నట్టు ‘సిబిఐ’వారు సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించారు. అందువల్ల స్వచ్ఛంద సంస్థల పనితీరును మెరుగు పరచడానికై కొత్త నియమావళిని రూపొందించవలసిన అనివార్యత ఏర్పడింది. ‘స్వచ్ఛంద సేవ’ అ న్న ముసుగు వేసుకు న్న అనేక సంస్థలు ప్ర చ్ఛన్న బీభత్స కలాపాలు సాగిస్తుండడం దశాబ్దుల వైపరీత్యం. ప్రభుత్వం నుండి ప్రజల నుండి డబ్బును దండుకొనడానికి ‘ఎ న్‌జివో’ను ప్రారంభించడం అతి సులభమైన మార్గమయిపోయిందన్నది బహిరంగ రహస్యం! దేశంలోని ఈ స్వచ్ఛంద సంస్థలకు, ప్రభుత్వేతర సేవా సంస్థలకు ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం నుంచి మాత్రమే వెయ్యి కోట్ల రూపాయల నిధులు లభిస్తున్నాయట! ప్రజల నుంచి కూడ వివిధ సంస్థలు వివిధ కార్యక్రమాల పేరుతో వేల కోట్ల రూపాయల విరాళాలను పోగు చేస్తున్నాయి. పది శాతం సంస్థలు మాత్రమే సరైన ఆదాయ వ్యయ వివరాలను బయటపెడుతున్నాయి, అంటే మిగిలిన తొంబయి శాతం సంస్థల వారు నిధులను దురుపయోగం చేస్తున్నారన్నది స్పష్టం. సమాజ అభ్యుదయం పేరుతో ‘స్వీయ’ అభ్యుదయం సాధిస్తున్న వంచకులు, సంఘ విద్రోహులు, దేశ విద్రోహులు ‘స్వచ్ఛందం’ పేరుతో చెలామణి అవుతున్నట్టు గత రెండున్నర ఏళ్లుగా ప్రభుత్వం పసికట్టగలిగింది...
ఇలా పసికట్టిన ఫలితంగానే ఈ ‘ఎన్‌జిఓ’లకు, ‘వి.ఓ’లకు వస్తున్న నిధులపై నియంత్రణ మొదలైంది. ఈ నియంత్రణ వల్ల అనేక ‘నకిలీ’ సంస్థలకు గొప్ప అసౌకర్యం ఏర్పడింది! విదేశాలలోని సంస్థలకు అనుబంధంగా పనిచేస్తున్న ‘ఎన్‌జివో’లకు మరీ ఎక్కువగా ఇబ్బంది కలిగిందట! విదేశీయ నిధులను స్వీకరిస్తున్న సంస్థలలో అత్యధికం మతం మార్పిడి కలాపాలను సాగిస్తున్నాయి. ఇలా మతం మార్పిడి చేస్తున్న ‘ఎవాంజిలికల్’ సంస్థలకు విదేశాల నుండి అత్యధికంగా నిధులు వస్తున్నాయన్నది బహిరంగ రహస్యం! ‘ఆయన’ అనే కేరళ కేంద్రంగా పనిచేస్తున్న ‘ఎవాంజలిస్ట్’ సంస్థకు 2015-16లో ఎనిమిది వందల ఇరవై ఆరు కోట్ల రూపాయల విదేశీయ విరాళాలు లభించాయట! ఈ ‘ఆయన’ ప్రధాన కార్యాలయం అమెరికాలోని టెక్సాస్ రాష్ట్రంలో ఉందట! ‘గోస్పెల్ ఫర్ ఆసియా’ పేరుతో నడిచిన ఈ సంస్థలో అనేక ఆర్థిక అక్రమాలు జరిగినట్టు వెల్లడైంది. ఫలితంగా ఈ సంస్థ తన పేరును మార్చుకుందట! భారీగా విదేశీయ విరాళాలను పొందుతున్న ‘ఎన్‌జిఓ’లలో ఇలాంటి ‘ఎవాంజలిస్టు’ సంస్థలదే అగ్రస్థానం...
అమెరికాకు చెందిన ‘్ఫర్డ్ ఫౌండేషన్’ వారి నిధులను స్వీకరిస్తున్న సంస్థలు, వాటి అనుబంధ సంస్థలు మతం మార్పిడి కలాపాలకు మాత్రమే కాక దేశ వ్యతిరేక కలాపాలకు సైతం పాల్పడుతున్నట్టు వెల్లడైంది! మన ప్రభుత్వం ఇలాంటి సంస్థల కలాపాలపై దర్యాప్తులను జరిపించడం పట్ల విదేశాలలో కూడ నిరసనలు కొనసాగుతున్నాయి. ‘మానవాధికార’ పరిరక్షణకు పాటుపడుతున్నట్టు అభినయిస్తున్న అంతర్జాతీయ దళారీ సంస్థలు మనదేశంలోని ఈ నకిలీ ‘ఎన్‌జిఓ’ల స్వేచ్ఛా స్వాతంత్య్రాలకు భంగం కలుగుతున్నట్టు వాపోతున్నాయి! గుట్టు చప్పుడు కాకుండా చాప కింద విషం వలె విస్తరించిన తథాకథిత ‘స్వచ్ఛంద సంస్థల’ దుశ్చర్యలకు జకీర్ నాయక్ దురంతం పరాకాష్ఠ. ముంబయికి చెందిన జకీర్ నాయక్ అనే వ్యక్తి ఆరంభించిన ‘ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్’ అన్న సంస్థ విదేశాల నుంచి వందల కోట్ల రూపాయల నిధులను దండుకుంది! మన దేశంలోను, బంగ్లాదేశ్‌లో ను జిహాదీ బీభత్సకారులను పెంచి పో షించడానికి ఈ ని ధులు వినియోగమయ్యాయి. జకీర్ నా యక్ దేశం నుంచి ఉడాయించి సౌదీ అరేబియాలో నివసిస్తున్నాడు. ‘గ్రీన్‌పీస్‌‘ అన్న మరో ఎన్‌జిఓ కూడ దేశహితానికి తూట్లు పొడుస్తోందన్న ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో జరిగిన రెండు రైలు ప్రమాదాలు కాన్పూరులోని ఒక ‘ఎన్‌జిఓ’ కుట్ర ఫలితమేనన్న అనుమానాలు కొనసాగుతున్నాయి! లక్షలాది ‘ఎన్‌జిఓ’ల నకిలీతనాన్ని బయటపెట్టడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు ఆరంభించడం ప్రస్తుత ముసాయిదా నిబంధనావళి రూపొందడానికి నేపథ్యం! ఈ నిబంధనను రూపొందించాలని గత జనవరిలో సుప్రీం కోర్టు ఆదేశించింది కూడ.
సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్, న్యాయమూర్తి డివై చంద్రచూడ్ ఈ ముసాయిదా నియమావళిపై నిర్ణయం ప్రకటించవలసి ఉంది. ముసాయిదా నియమావళి ప్రకారం దేశంలోని అన్ని ‘ఎన్‌జిఓ’లు, ‘విఓ’లు కొత్తగా ‘నీతి ఆయోగ్’కు తమ దరఖాస్తులను పంపుకోవాలి. ప్రభుత్వం నుంచి తాము స్వీకరించే నిధులను నిర్ణీత కాలవ్యవధిలో నిర్దిష్ట కార్యక్రమానికి ఖర్చు చేస్తామన్న హామీపత్రాన్ని రాష్టప్రతికి సమర్పించవలసి ఉంటుంది! అలా చేయలేని సంస్థలు ప్రభుత్వం నుంచి పొందిన నిధులను పదిశాతం వడ్డీతో తిరిగి రాష్టప్రతికి చెల్లించవలసి ఉంటుంది. నిబంధనావళిని ఉల్లంఘించే ఎన్‌జిఓల నిర్వాహకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకొనడానికి వారిని విచారించి శిక్షించడానికి సైతం అవకాశం ఉంది. ‘నకిలీ’ల ఆటను కట్టించడానికి జరుగుతున్న కృషి అభినందనీయం..