సంపాదకీయం

కులభూషణ్ వ్యథ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి చెందిన కులభూషణ్ జాదవ్ అన్న విశ్రాంత నౌకాదళ అధికారికి పాకిస్తాన్‌లోని సె నిక ‘న్యాయస్థానం’ మరణ దండన విధించడం దౌత్య బీభత్సకాండకు సరికొత్త నిదర్శనం! పాకిస్తాన్ ‘ప్రభుత్వాలు’ చేస్తున్న అసత్య ప్రచారానికి ఇది పరాకాష్ఠ. పాకిస్తాన్‌లోని పౌర ప్రభుత్వం, సైనిక ప్రభుత్వం రెండూ సమాంతరంగా అబద్ధాల కోట కట్టడం జాదవ్ అపహరణకు, హత్యా ప్రయత్నానికి ప్రాతిపదిక. ఇరాన్ నుండి జాదవ్‌ను అపహరించుకొనిపోయిన పాకిస్తానీ ముష్కరులు ఆయన తమ దేశంలో చొరబడి పట్టుబడ్డాడని చెప్పడం అబద్ధాలకు ఆరంభం. అబద్ధాల పుట్ట పగిలి విష కీటకాల వలె అసత్యాలు వికృత విన్యాసాలు చేస్తున్నాయి.. దౌత్య దౌర్జన్యకాండకు పాల్పడుతున్న ఆతతాయి దేశం-రోగ్ స్టేట్- పాకిస్తాన్.. ఆతతాయి దేశాల ప్రభుత్వాలను అదుపు చేయడంలో ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ సంస్థలు విఫలం అవుతుండడం పాకిస్తాన్ మరింత బరితెగించి పోతుండడానికి కారణం. నిరపరాధి అయిన సర్వజిత్ సింగ్‌ను పాకిస్తాన్ సైనిక ప్రభుత్వం జైలులోనే హత్య చేయించింది. ఈ భయంకర స్మృతి భారతీయుల మనోఫలకాలపై నుండి చెరిగిపోకముందే ఇప్పుడు జాదవ్‌ను హత్య చేయనున్నట్టు సైనిక ప్రభుత్వం మన దేశాన్ని బెదిరిస్తోంది! ప్రతి నాగరిక దేశంలోను ప్రభుత్వానికి సైనిక దళం ఒక అంగం మాత్రమే. సైనిక దళం ప్రభుత్వం పట్ల విధేయతతో ప్రవర్తిస్తుం ది. కానీ, పాకిస్తాన్ భయంకరమైన అనాగరిక అరాజక దేశం! అందువల్ల పౌర ప్ర భుత్వమే సైనిక దళానికి ఒక విభాగంగా మారి ఉంది. నిజానికి సైనికులదే అ క్కడి ప్రభుత్వం. ఈ సైనిక ప్రభుత్వం అ నుమతించిన పరిధి లో మాత్రమే పాకిస్తాన్ పౌర ప్రభుత్వం పని చేయాలి. అందువల్ల పాకిస్తాన్‌లో రెండు ప్రభుత్వాలున్నాయి. సైనిక ప్రభుత్వం సర్వోన్నతమైనది, ఈ సైనిక ప్రభుత్వం అదుపాజ్ఞల్లో పనిచేస్తున్న, పరిపాలిస్తున్నట్టు నటిస్తున్న పౌర ప్రభుత్వం రెండవది. పాకిస్తాన్‌లో సుప్రీం కోర్టు, న్యాయవ్యవస్థ కూడా సైనిక అధికారానికి తల ఒగ్గి పనిచేస్తుండడం ‘రోగ్ స్టేట్’ స్వభావానికి అనుగుణమైన వాస్తవం. పాకిస్తాన్ సైనిక దళాధిపతులు మన దేశం పట్ల ఆగ్రహంతో ఉన్నారు. మన సైనికులు గత సెప్టెంబర్‌లో జమ్మూ కశ్మీర్‌లోని ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ఎల్‌ఓసి- ను దాటివెళ్లి ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్- జరిపిన నాటి నుంచి పాకిస్తానీ సైనిక నియంతలు ‘కోరలు నూరడం’ మరింత తీవ్రతరం అయింది.
కులభూషణ్ జాదవ్‌కు మరణశిక్షను విధించడం పాకిస్తాన్ సైనిక ప్రభుత్వ బీభత్సకాండలో మరో అంశం మాత్రమే! ఈ ‘మరణశిక్ష’ను పాకిస్తాన్ అమలు జరుపలేదు! అలా అమలు జరిపినట్టయితే ‘బీభత్స వ్యవస్థ’గా ఇదివరకే గుర్తింపు పొందిన పాకిస్తాన్ ప్రభుత్వం అంతర్జాతీయ అభిశంసనకు మరోసారి గురికాక తప్పదు. అభిశంసనకు గురైనంత మాత్రాన పాకిస్తానీ బీభత్స వ్యవస్థను తొలగించడానికి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి పూనుకోదు. ఎందుకంటే పూనుకోకుండా చైనా నిరోధించగలదు. అఝార్ మసూద్ అన్న ‘జాయిష్ ఏ మొహమ్మద్’ జిహాదీ ముఠావాడిని అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించకుండా చైనా ఇదివరకే నిరోధించింది. ఇదీ పాకిస్తాన్ ధైర్యం! అయినప్పటికీ కులభూషణ్ జాదవ్‌ను హత్యచేయడానికి పాకిస్తాన్ పూనుకోదు. అలా జరిగినట్టయితే మన దేశం మరోసారి ‘సాయుధ చికిత్స’కు పూనుకోగలదన్న భయం పాకిస్తాన్ సైనిక నియంతలకు నిలువెల్లా వ్యాపించి ఉంది. ఊహించని వేగంతో జాదవ్‌కు వ్యతిరేకంగా ‘విచారణ’ ముగించి ఆయనకు మరణశిక్షను విధించడం పాకిస్తానీ సైనిక నియంతల మరో ఎత్తుగడ కావచ్చు! మరణశిక్షను అమలుజరుపకుండా జాదవ్‌ను ఆజీవనం చెఱసాలలో ఉంచడానికి యత్నించవచ్చు. గతంలో అపహరించుకొని వెళ్లిన మన సర్వజిత్ సింగ్‌ను దాదాపు ఇరవై ఏళ్లు జైలులో ఉంచి ఆ తర్వాత హత్య చేశారు పాకిస్తానీ నియంతలు..
కులభూషణ్ జాదవ్‌ను విడిపించుకొని రావడానికి మాత్రమే ఇప్పుడు మన ప్రభుత్వం ప్రయత్నించాలి. చర్చల ద్వారా పాకిస్తాన్ ‘ప్రభుత్వాలు’ కులభూషణ్‌కు విముక్తిని కలిగించడం దాదాపు అసాధ్యం. ఎందుకంటే ఇదంతా పాకిస్తానీ సైనిక నియంతల వ్యూహంలో భాగం! ముంబయిలో భయంకర బీభత్సకాండను జరిపిన అజ్మల్ కసబ్‌ను సైతం మనం న్యాయ నిబంధనల మేరకు ప్రత్యేక న్యాయస్థానంలో బహిరంగంగా విచారించాము. కానీ పాకిస్తాన్ సైనిక పెత్తందార్లు నిరపరాధి అయిన కులభూషణ్‌ను అతి రహస్యంగా సైనిక న్యాయస్థానంలో వి చారించారు. ఆ యన తరఫున వా దించడానికి న్యా యవాది కూడా లే డు. న్యాయవాదిని నియమించడానికి, కులభూషణ్‌ను కలవడానికి పాకిస్తాన్‌లోని మన దౌత్య కా ర్యాలయం పదమూడుసార్లు య త్నించినప్పటికీ ‘సైనిక నియంతలు’ అనుమతి ఇవ్వలేదు. ఇరాన్‌లో వ్యాపారం చేసుకుంటున్న కులభూషణ్‌ను పాకిస్తానీ గూఢచారులు 2016 మార్చిలో అపహరించుకొని తమ దేశానికి తీసుకొనిపోయారు. ఆయన మన దేశపు గూఢచారి అని పాకిస్తాన్ ప్రభుత్వం అబద్ధం చెప్పింది. 1984లో గోపాల్‌దాస్ అనే భారతీయుడిని పంజాబ్ నుంచి అపహరించుకొనిపోయిన పాకిస్తాన్ సైనికులు ఇలాంటి ప్రచారమే చేశారు. 2011 వరకూ ఆయనను జైలులో ఉంచి ఆ తర్వాత విడుదల చేశారు. పాతికేళ్లపాటు గోపాల్‌దాస్ జీవితం నిర్బంధంలో నలిగిపోయింది!
ఇరాన్ నుంచి జాదవ్‌ను అపహరించిన వెంటనే మన ప్రభుత్వం ఈ అభియోగాన్ని అంతర్జాతీయ నేర విచారణ న్యాయస్థానంలో దాఖలు చేసి ఉండాలి. ఆలస్యమైనప్పటికీ ‘అపహరణ’ నేరంపై పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా మన ప్రభుత్వం ఇప్పుడైనా అంతర్జాతీయ న్యాయస్థానంలో అభియోగం దాఖలు చేయాలి. ఇజ్రాయల్ గతంలో అనేకసార్లు తమ పౌరులను శత్రుదేశాల నుంచి విడిపించుకొని పోగలిగింది. అలా మన ప్రభుత్వం చేయనపుడు- సాయుధ చికిత్సకు పూనుకొనడం రెండవ ప్రత్యామ్నాయం. పార్లమెంటు ఉభయ సభల్లో మంగళవారం వ్యక్తమైన అభిప్రాయాలకు అటువంటి ‘శస్తచ్రికిత్స’ ఫలశ్రుతి కాగలదు...