సంపాదకీయం

సైనిక చర్యలకు సంకెళ్లు?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాయుధ దేశద్రోహ ఉగ్రవాదులతో సమరం సాగించే భద్రతాదళాల చర్యలను న్యాయ సమీక్ష నుంచి మినహాయించాలన్న కేంద్ర ప్రభుత్వ భావం దేశ ప్రజల మనోభీష్టం. ఉగ్రవాదులతో తలపడుతున్న సైనికులు అనుబంధ సాయుధ దళాలు తమ ప్రాణాలను ఒడ్డి ప్రజలకు భద్రత కల్పిస్తున్నారు, సరిహద్దులకు రక్షణ కల్పిస్తున్నారు. బుధవారం కేంద్ర ప్రభుత్వం సర్వోన్నత న్యాయస్థానంలో వినిపించిన వాదానికి నిరాకరింపజాలని ఈ నిజం ప్రాతిపదిక! ఉగ్రవాదుల ప్రతిఘటనకు సంబంధించి సైనికులపై నేరారోపణను నమోదు చేయాలన్నది గత జూలైలో సర్వోన్నత న్యాయస్థానం చెప్పిన తీర్పు! ‘సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం’ వర్తిస్తున్న కల్లోల ప్రాంతాలలో ఇలాంటి ‘నేరారోపణ పత్రం’-్ఫస్ట్ ఇన్‌ఫర్‌మేషన్ రిపోర్ట్-ఎఫ్‌ఐఆర్- దాఖలు చేయవలసిన అవసరం లేదన్నది దశాబ్దుల నిబంధన! అత్యంత శక్తివంతమైన ఆధునికమైన మారణాయుధాలను ఉపయోగిస్తున్న విద్రోహులు, బీభత్స కారులు సైనికులను పోలీసులను అనుబంధ సాయుధ బలగాలను హత్య చేస్తున్నారు, సాధారణ పౌరులను నిరాయుధులను సైతం హతమార్చుతున్నారు. ఇలాంటి ఆతతాయి మూకలను ఢీకొంటున్న మన భద్రతా బలగాల వారు బలి అవుతున్నారు, ఆతతాయిలనూ హతం చేస్తున్నారు. సైనికులను చంపుతున్న విద్రోహులు చల్లగా జారుకుంటున్నారు. కానీ సైనికుల ఎదురు కాల్పులలో విద్రోహులు హతం అయినప్పుడల్లా ఈ ఘటనల గురించి ‘ఎఫ్‌ఐఆర్’లను నమోదు చేయాలన్నది సుప్రీంకోర్టు చెప్పిన తీర్పు. సాయుధ దళాల ప్రత్యేక అధికారాల చట్టం-ఆర్మ్‌డ్ ఫోర్సెస్ స్పెషల్ పవర్స్ యాక్ట్-ఏఎఫ్‌ఎస్‌పిఏ -అమలులో ఉన్న క ల్లోల ప్రాంతాలలో సై తం ఉగ్రవాదులు హతమైన ఘటనలకు సం బంధించి ‘ఎఫ్‌ఐఆర్’ లను నమోదు చేసి విచారించాలన్నది సర్వోన్నత న్యాయస్థానం గత జూలైలో చెప్పిన తీర్పు. ఉగ్రవాదులను మట్టుపెట్టే నెపంతో సైనికులు, భద్రతా దళాల వారు నిరపరాధులను హతమారుస్తున్నారన్న ప్రచారం ఏళ్ల తరబడి సాగుతుండడం సుప్రీంకోర్టు నిర్ణయానికి నేపథ్యం! ఇలా ప్రచారం చేస్తున్న వారిలో అత్యధికులకు దేశద్రోహులకు, బీభత్సకారులకు మిత్రులు, పాకిస్తాన్ సమర్ధకులు, చైనా వారి తాబేదారులు! దేశ ప్రజలను నిరంతర నిర్నిద్రులై కాపాడుతున్న సైనికులకు సరిహద్దుల సంరక్షకులకు నిరపరాధులను హత్య చేయవలసిన అవసరం ఏమిటి? అన్న తార్కికమైన ప్రశ్నకు సమాధానం లేదు. ఏమయినప్పటికీ సర్వోన్నత న్యాయనిర్ణయం శిరోధార్యం. అందువల్లనే కేంద్ర ప్రభుత్వం శిరసా వహించింది..
కశ్మీర్‌లోను-మణిపూర్ తదితర ఈశాన్య ప్రాంతాలలోను భద్రతా దళాలకు ప్రత్యేక అధికారాలు కల్పించడం వల్లనే వారు సమర్ధవంతంగా ‘టెర్రిరిస్టులను‘ ఎదుర్కోగలుగుతున్నారు. ఈశాన్య ప్రాంతంలోని టెర్రరిస్టులలో పాకిస్తాన్ సమర్ధక జిహాదీలు ఉన్నారు, చైనా ఉసిగొల్పుతున్న మావోయిస్టులు ఉన్నారు, అక్రమంగా మతం మార్పిడులను కొనసాగిస్తున్న ఐరోపా సమర్ధక ముఠాల వారూ ఉన్నారు. ఇలాంటి ఉగ్రవాదుల లక్ష్యం ఈశాన్య ప్రాంతాన్ని మన దేశం నుండి విడగొట్టడం. ఈ బీభత్సకారులు నిజానికి చైనా, పాకిస్తాన్ ప్రభుత్వాల ప్రచ్ఛన్న సైనికులు, ఐరోపాలోని మతం మార్పిడి ముఠాల దళారీలు! అందువల్ల మన సైనికులను సాయుధ దళాలను మాటువేసి మట్టుపెట్టడమే ఈ విదేశాలకు ఊడిగం చేస్తున్న కిరాయి హంతకుల కలాపం. ఇలాంటి వారితో నిజానికి మన భద్రతా దళాలవారు నిరంతరం యుద్ధం చేస్తున్నారు. యుద్ధంలో శత్రుసైనికులను హతమార్చిన సమరవీరులకు వ్యతిరేకంగా ‘ఎఫ్‌ఐఆర్’ను దాఖలు చేస్తారా? ఇదే తర్కం. సాయుధ దళాల ప్రత్యేక అధికారుల చట్టం అమలులో ఉన్న కల్లోలిత ప్రాంతాలకు వర్తిస్తోంది! బుధవారం కేంద్ర ప్రభుత్వం తరఫున సర్వోన్నత న్యాయస్థానంలో వాదం వినిపించిన ‘అటార్నీ జనరల్’ ముకుల్ రోహత్‌గీ మాటలలోని సారాంశం ఇదే!
అందువల్ల గత జూలై ఎనిమిదవ తేదీన చెప్పిన తీర్పును సవరించాలన్నది కేంద్ర ప్రభుత్వం చేసిన వాదం. ఇలా ‘ప్రతి ఎదురుకాల్పుల ఘటన’ తరువాత భద్రతను కాపాడిన సైనికులకు వ్యతిరేకంగా ‘ఎఫ్‌ఐఆర్’ దాఖలు చేయాలన్న ఆదేశాన్ని రద్దు చేయాలని కేంద్రం కోరింది. ప్రత్యేక అధికారాల చట్టం అమలులో ఉన్న ప్రాంతాలలో ఈ మినహాయింపు ఇవ్వాలని లేనట్టయితే భద్రతాదళాల చేతులు కట్టేసినట్టు కాగలదని కేంద్రం సర్వోన్నత న్యాయస్థానానికి నివేదించింది! ఇటీవల జమ్మూ కశ్మీర్‌లోని శ్రీనగర్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఎన్నికల పోలింగ్ సందర్భంగా కనీవినీ ఎరుగని రీతిలో పాకిస్తాన్ సమర్ధకులు జరిపిన బీభత్సకాండ ఈ ‘నివేదిక’కు తక్షణ నేపథ్యం. ఈ దౌర్జన్యకాండకు ఆరుగురు బలైపోయారు. ఆదివారం జరిగిన ఈ హింసాకాండలో నూట డెబ్బయి మందికి పైగా గాయపడ్డారు. ‘అనంతనాగ్’ నుంచి జరుగవలసి ఉన్న ఉప ఎన్నికను హింసాభయంతో ఎన్నికల కమిషన్ మే 25వ తేదీకి వాయిదా వేయడం బీభత్సకాండ తీవ్రతకు నిదర్శనం! హింసాభయంతో వోటర్లలో అ ధిక శాతం ‘పోలింగ్’ కేంద్రాలకు రాలేదు. ఫలితంగా శ్రీనగర్‌లో కే వలం ఏడు శాతం పో లింగ్ జరిగింది. నూటికి తొంబయి ముగ్గురు పౌరులు బీభత్సకారుల భయంతో ఇళ్లలోనే ఉం డిపోయారు! ఇలాంటి భయానక దౌర్జన్యకాండను అదుపు చేసే సమయంలో సైనికులు కాల్పులు జరపడం అనివార్యం. కాల్పులలో ‘టెర్రరిస్టులు’ హతమయినట్టయితే కాల్పులు జరిపిన సైనికులపై ఎఫ్‌ఐఆర్ దాఖలు చేయాలా? చేసినట్టయితే భద్రతా దళాల నైతిక స్థైర్యం నీరుకారిపోదా? అందువల్ల కల్లోలిత ప్రాంతాలలో భద్రతా చర్యలలో పాల్గొనే సైనికుల చర్యలను న్యాయ సమీక్షకు గురి చేయడం తగదు.. తగదన్నదే ప్రభుత్వం చేసిన వినతి!
సైనిక దళాలకు ప్రత్యేక అధికారాలు ఉండడం వల్ల బీభత్సకారుల నుండి ప్రజలకు రక్షణ ఏర్పడుతోంది! కానీ కశ్మీర్‌లోను, ఈశాన్య ప్రాంతంలోను సైనిక దళాల ఉనికిని సహించలేని వారు ‘ప్రత్యేక అధికారాల చట్టాన్ని’ రద్దు చేయాలని కోరుతున్నారు. ఇలా కోరుతున్న వారిని ప్రజలు నిరసిస్తున్నారు. అభిశంసిస్తున్నారు, ఎన్నికలలో నిరాకరిస్తున్నారు! ముక్కుకు తగిలించుకున్న గొట్టం ద్వారా భోంచేస్తూ అనేక ఏళ్లపాటు ‘నిరశన’ దీక్ష జరిపిన ఐరోమ్ షర్మిలా అనే సైనిక వ్యతిరేక ఉద్యమకారిణి ఇటీవల జరిగిన మణిపూర్ శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలు కావడం ఒక ఉదాహరణ మాత్రమే! సైనికులున్న చోట ప్రత్యేక అధికారాల చట్టం వర్తిస్తున్న చోట విద్రోహుల ఆటలు చెల్లడం లేదు!! వారి చర్యలపై న్యాయ సమీక్ష జరుగకపోవడమే దేశానికి హితం..