సంపాదకీయం

అంతర్గత విరోధులు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తోడేళ్లు దూకడం మానలేదు. ఈ ఉగ్రవాద జి హాదీ మృగాలను మన దేశంలోకి ఉసిగొల్పడం పాకిస్తాన్ ప్రభుత్వం మానడం లేదు. జమ్మూ కశ్మీర్‌లోని బందీపురా శివారులోని సంబల్ వద్ద కేంద్ర రిజర్వు పోలీసు దళం- సిఆర్‌పిఎఫ్- స్థావరంపై ఉగ్రవాదులు ఆదివారం దాడి చేయడం ఈ ‘తోడేళ్ల’ స్వభావానికి సరికొత్త ఉదాహరణ. మన భద్రతా దళాల వారు అప్రమత్తంగా ఉండడం వల్ల భయంకరమైన మరో బీభత్స ప్రమాదం తప్పిపోయింది. కానీ గత సెప్టెంబర్‌లో మన సైనిక దళాలు జమ్మూ కశ్మీర్‌లోని ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్- ను దాటి వెళ్లి పాకిస్తానీ బీభత్సకారుల స్థావరాలను ధ్వంసం చేసిన తరువాత కూడ ఉగ్రమృగాలు తోకలను ముడిచి పారిపోవడం లేదు. మన సైనికులు ‘అధీన రేఖ’- ఎల్‌ఓసి- ప్రాంతంలో ఈ ‘సాయుధ చికిత్స’- సర్జికల్ స్ట్రయిక్- జరిపిన తరువాత ఎనిమిది నెలలు గడిచిపోయాయి. అప్పటి నుంచి ఇప్పటి వరకూ పాకిస్తానీలు, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరితులు కశ్మీర్‌లో ఎక్కడో అక్కడ ప్రతిరోజూ హత్యాకాండకు పూనుకుంటూనే ఉన్నారు. ప్రచ్ఛన్న బీభత్సకారులైన పాకిస్తాన్ సైనికులు, ప్రత్యక్ష బీభత్సకారులైన జిహాదీలు నిరంతరం పైశాచిక కృత్యాలకు పాల్పడుతూనే ఉన్నారు. మన సైనికులను దొంగదెబ్బ తీసి చీకటిలో హత్యలు చేస్తున్న పాకిస్తాన్ ‘సరిహద్దు సాయుధులు’- రేంజర్‌లు- మృతదేహాలను ముక్కలుగా నరికి తమ పైశాచిక స్వభావాన్ని చాటుకున్నారు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వ జిహాదీ బీభత్సం- పాకిస్తాన్ స్టేట్ టెర్రరిజమ్-! సమాంతరంగా ప్రత్యక్ష ఉగ్రవాదులైన జిహాదీలు మన పోలీసుల స్థావరాలపై, అనుబంధ సైనికులపై, సైనిక శిబిరాలపై ఆత్మాహుతి దాడులను కొనసాగిస్తూనే ఉన్నారు. ఇది పాకిస్తాన్ ప్రభుత్వ ప్రే రిత బీభత్సకాండ- పా కిస్తాన్ స్టేట్ స్పా న్సర్డ్ టెర్రరిజమ్-! క శ్మీర్ లో య ప్రాంతంలో నిరంతరం రాళ్లు రువ్వుతున్న వారు, పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి డబ్బు దండుకొని భోంచేస్తున్న ‘హురియత్’ నాయకుల వంటివారు ఉభయ పద్ధతుల బీభత్సకారుల- ప్రచ్ఛన్న, ప్రత్యక్ష-కు రక్షణ కవచాలుగా ఏర్పడి ఉన్నారు. ఇదంతా ఆదివారం తెల్లవారు జామున ‘జిహాదీ’లు మరోసారి హత్యాకాండ జరపడానికి చేసిన విఫల యత్నానికి సుదీర్ఘ నేపథ్యం! గత సెప్టెంబర్ 18వ తేదీన ఊరీలోని సైనిక శిబిరంపై దాడి చేసిన రీతిలోనే- సంబల్ స్థావరంపై జిహాదీ తోడేళ్లు దూకాయి.. వ్యూహం మారలేదు!!
జమ్మూ కశ్మీర్‌లో పాకిస్తాన్ ప్రేరిత జిహాదీ ఉగ్రవాదులు పేట్రేగి పోతుండడం పట్ల నోరు మెదపని కొన్ని ప్రతిపక్షాలు మన సైనిక దళాలకు వ్యతిరేకంగా అసత్య ప్రచారం చేస్తున్నాయి. కశ్మీర్ లోయ ప్రాంతంలోని విచ్ఛిన్నవాదులకు పాకిస్తాన్ నుంచి నిధులు అందుతున్న సంగతిని పట్టించుకోని ఈ విపక్షాల నాయకులు సైనికులు ‘మానవ’ కవచం ఉపయోగించడం అమానుషమని వాపోతున్నారు. బాహ్య శత్రువులైన పాకిస్తానీ తొత్తులకు ఇలా వత్తాసు పలకడం దేశ వ్యతిరేక చర్య! కానీ వత్తాసు పలుకుతున్న ఈ అంతర్గత శత్రువులను కేంద్ర ప్రభుత్వం అదుపు చేయలేకపోతుండడం మన ప్రజాస్వామ్య వైచిత్రికి చిహ్నం. భావ వ్యక్తీకరణ పేరుతో సైనికులను అప్రతిష్ఠ పాలు చేయడానికి యత్నిస్తున్నవారు ఇలా దుర్బుద్ధి పూర్వకంగా దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో అప్రతిష్ఠ పాలు చేస్తున్నారు. శనివారం నాడు ‘జాతీయ నేర పరిశోధక సంస్థ’- నేషనల్ ఇన్విస్టిగేషన్ ఏజెన్సీ-ఎన్‌ఐఏ- కశ్మీర్‌లోను, హర్యానాలోను, దిల్లీలోను ఇరవై ఆరు చోట్ల దాడులు జరిపింది. బీభత్స జిహాదీ మూకలకు లభిస్తున్న అక్రమ ధనం గురించి ఆరా తీయడంలో భాగంగా జరిగిన ఈ దాడుల ఫలితంగా ఒకటిన్నర కోట్ల రూపాయల నగదు పట్టుబడిందట! ఎవరు ఇస్తున్నారు? ఎవరికి ఇస్తున్నారు? ఇలా అక్రమ నిధులను అందుకుంటున్న వారిని, అందజేస్తున్న వారిని నిరసిస్తూ ఈ ప్రతిపక్షాల వారు- ప్రధానంగా వామపక్షాల రాజకీయ వేత్తలు, మేధావులు ఎందుకు నోళ్లను మెదపడం లేదు. కానీ సైనిక దళాలను, కశ్మీర్‌లో భద్రతను పరిరక్షిస్తున్న వీరులను ఈ ప్రతిపక్షాల వారు నిరంతరం నిరసిస్తున్నారు.
మరే ఇతర దేశంలోను లేని విచిత్ర స్థితి మన దేశంలో మాత్రమే నెలకొని ఉండడం అంతర్జాతీయ సమాజానికి బహుశా విస్మయాన్ని కలిగిస్తూ ఉండవచ్చు. ‘ఊరీ’పై పాకిస్తానీ తొత్తులు దాడి చేసి పదిహేనుగురు సైనికులను హత్య చేసిన తరువాత మన సైనికులు ‘అధీన రేఖ’ను దాటి వెళ్లి బీభత్సపు బట్టీలను పగులగొట్టారు. కానీ ఈ ‘సర్జికల్ స్ట్రయిక్’ గురించి వివిధ ప్రతిపక్షాలు ‘విశ్వసించని ధోరణి’ని, ‘వెక్కిరించే వైఖరి’ని ప్రదర్శించాయి. పాకిస్తాన్ ప్రభుత్వం తమ ‘యుద్ధ పటిమ’ను చాటడానికి ప్రతిరోజూ బోలెడన్ని అబద్ధాలను ప్రచారం చేస్తోంది. ఈ అబద్ధాలను పాకిస్తాన్‌లోని ప్రచార మాధ్యమాలు కాని, ప్రతిపక్షాలు కాని నిరసించడం లేదు. ‘అధీన రేఖ’ వద్ద తమతో తలపడిన ఐదుగురు భారతీయ సైనికులను శనివారం వధించినట్టు పాకిస్తానీ సైనికులు ప్రకటించారు. ఇది పచ్చి అబద్ధం. ఒక్క భా రతీయ సైనికుడు కూడ మరణించ లేదు. పాకిస్తాన్ సైనికులు అనేక గంటల పాటు కా ల్పులు జరిపారంతే. ఈ అబద్ధాన్ని పాకిస్తాన్‌లో ఎవరూ నిరాకరించలేదు, తాము ‘విశ్వసించడం లేద’ని ప్రకటించలేదు. పాకిస్తాన్‌లో జిహాదీ బీభత్స రాజ్యాంగ వ్యవస్థ నడుస్తోంది. అందువల్ల జిహాదీలను, సైనికుల వేషంలోని ప్రచ్ఛన్న జిహాదీలను ఎవ్వరూ వ్యతిరేకించరు. వ్యతిరేకించినట్టయితే మెడలపై తలకాయలు ఉండవు! ఇతరేతర ప్రజాస్వామ్య దేశాలలో కూడ సైనిక దళాల భద్రతా చర్యలను ప్రతిపక్షాలు విమర్శించడం లేదు. మన దేశంలో మాత్రం అత్యంత పారదర్శకంగా పనిచేస్తున్న, సరిహద్దులను కాపాడుతున్న సైనిక దళాలను విపక్షాల వారు ఎందుకని వ్యతిరేకిస్తున్నారు?
జమ్మూ కశ్మీర్‌లో జిహాదీ ఉగ్రవాదులు జరుపుతున్న పైశాచికకాండ గురించి పట్టించుకోనివారు సైనిక దళాలకున్న ప్రత్యేక అధికారాలను రద్దు చేయాలని కోరుతున్నారు. బందీపురా సైనిక స్థావరంపై దాడికి పాల్పడిన నలుగురు బీభత్సకారులూ ఎదురుకాల్పులలో హతులయ్యారు. ఇలా జిహాదీ ఉగ్రవాదులు హతులైనందుకు నిరసనగా సమీప ప్రాంతాల్లో ప్రదర్శనలు జరిపిన వారు సైనికులపై, పోలీసులపై యథావిధిగా రాళ్లు రువ్వారు. సైనికుల ‘అత్యాచారాల’ను నిరసిస్తున్న ప్రతిపక్షాల వారు ఈ రాళ్లు రువ్విన పాకిస్తానీ తొత్తులను తప్పుపట్టిన దాఖలా లేదు. సయ్యద్ అలీ షా జిలానీ అనే హురియత్ ముదురు ముఠా ముష్కరుడు పాకిస్తాన్ ప్రభుత్వం నుంచి లంచాలను తీసుకొంటున్నట్లు దాదాపు ధ్రువపడింది. సైనికులను నిరసిస్తున్న ప్రతిపక్ష నేతలు జిలానీకి గౌరవం ఘటిస్తున్నారు!