సంపాదకీయం

అక్రమ ‘అతిథులు’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలలో దొంగతనాలకు గురైన అనేక దేవీ దేవతామూర్తుల విగ్రహాల ఆచూకీ తెలియడం లేదట! ఉభయ రాష్ట్రాల్లోనూ విగ్రహాల దొం గతనాలు నిరంతరం కొనసాగుతున్నప్పటికీ అనేక దొంగతనాల గురించి ఫిర్యాదులు అందడం లేదని పోలీసులే చెబుతున్నారట! విగ్రహాలను దొంగిలించి విదేశాలకు తరలిస్తున్న ముఠాలలో మన దేశంలోకి చొరబడి అక్రమంగా నివసిస్తున్న విదేశీయులు ఎక్కువమంది. ఇలాంటి అక్రమ ప్రవేశకులు వివిధ రకాల నేరాలను కొనసాగిస్తున్నారు! దుకాణాలలో చొరబడి నగలను దొంగిలించడం మొదలుకుని అడవులలోకి చొరబడి అటవీ ఉత్పత్తులను కొల్లగొట్టడం వరకు రకరకాల నేరాలను ఈ విదేశీయులు కొనసాగిస్తున్నారు! మాదకద్రవ్యాలను విమానాలకెత్తించుకుని ధైర్యంగా తీసుకునివస్తున్న విదేశీయులు శంషాబాద్-హైదరాబాద్- అంతర్జాతీయ విమానాశ్రయంలో దొరికిపోతున్నారు. పోలీసుల చేతులకు చిక్కని వారు, ‘నిఘా’ వీక్షణాలను తప్పించుకంటున్నవారు ఎందరో మరి! ఆఫ్రికాలోని నైజీరియాకు చెందిన నేరస్థులు ఇలా ‘మాదకం’ ముఠాలలో అత్యధికులు. గోవాలో, హైదరాబాద్‌లో, బెంగళూరులో, దిల్లీలో ఈ నైజీరియా నేరస్థులు పట్టుబడుతునే ఉన్నారు. కోటి రూపాయల ‘కొకేయిన్’ మాదకాన్ని మోసుకుని పోతుండిన ఒక నైజీరియా దేశస్థుడిని ఇటీవల సికిందరాబాద్ రైలు స్టేషన్‌లో పట్టుకున్నారు. దిల్లీ నుంచి రాజధాని ఎక్స్‌ప్రెస్ రైలులో బెంగళూరుకి వెడుతుండిన ఇతగాడు ‘మాదక నియంత్రణ మండలి’-నార్కోటిక్స్ కం ట్రోల్ బోర్డు-ఎన్‌సిబి- అధికారులకు ప ట్టుబడ్డాడు. ఆఫ్రికాలోని నైజీరియా తదితర దేశాల వారు మాత్రమే కాదు, దక్షిణ అమెరికాలోని ‘పెరూ’ వంటి దేశాలకు చెందిన నేరస్థుల ముఠాలు కూడ మన దేశంలో వివిధ రకాల నేరాలకు పాల్పడుతున్నట్టు ఇప్పుడు వెల్లడయింది! గత ఏప్రిల్‌లో హైదరాబాద్‌లో ఒక వ్యా పారస్థుని కారునుంచి కోటిన్నర రూపాయల విలువైన బంగారాన్ని గుర్తుతెలియని దుండగులు దోచుకున్నారు. వారి ‘గుర్తు’ ఇటీవల పోలీసులకు తెలిసిందట! ‘పెరూ‘కు చెందిన ముగ్గురు దుండగులు ఈ వ్యాపారస్థుని దృష్టిని మళ్లించి అతని కారులోనుంచి బంగారం సంచీని తస్కరించుకొనిపోయారట! ‘పెరూ’ ముఠాలలో ఒక మహిళా నేరస్థురాలు కూడా ఉండడం పోలీసులు కనిపెట్టిన రహస్యం! ఈ ‘పెరూ’ ముఠావారు ‘నైజీరియా’ ముఠాతో కలిసి పనిచేయడం నేర విస్తృతికి నిదర్శనం.
వివిధ నేరాలకు పాల్పడుతున్న విదేశీయ ముఠాలు విచ్చలవిడిగా విహరిస్తుండడం గురించి తరచు ప్రచారం జరుగుతోంది. విదేశీయ నేరస్థులు పట్టుబడుతున్న వారిలో ఎంతమందిని న్యాయస్థానాలలో నిలబెట్టారు? ఎంతమందిని న్యాయస్థానాలు విచారించి శిక్షించాయి? అన్న వివరాలు మాత్రం జనానికి వెల్లడి కావడం లేదు! విదేశాల నుంచి ప్రవేశ అనుమతి పత్రాల-వీసాలను పొంది చొరబడుతున్నవారు గడువు ముగిసిన తరువాత మన దేశం నుండి వెళ్లిపోవడం లేదు! ఇక్కడనే తిష్ఠ వేసి వివిధ అక్రమ కలాపాలను సాగిస్తున్నారు. ఇలాంటి వారిలో ఎంతమంది పట్టుబడ్డారు? ఇంకెంతమంది పట్టుబడలేదు? అన్న వివరాలు వెల్లడి కాకపోవడం విచిత్రమైన వ్యవహారం. వందలాది విదేశీయులు ఎలాంటి ‘వీసా’ లేకుండానే మన దేశంలోకి చొరబడి ఉండడం మరింత ప్రమాదకరమైన వాస్తవం. సరైన ప్రవేశ పత్రాలు, ‘గుర్తింపు పత్రాలు’, తమ దేశాల ప్రయాణ పత్రాలు-పాస్‌పోర్టులు- లేకుండా మన దేశంలో ఉంటున్నవారు కూడా పట్టుబడుతునే ఉన్నారు. ఇలాంటి అక్రమ ప్రవేశకుల గురించి పోలీసులు అప్పుడప్పుడు వివరాలను వెల్లడిస్తున్నారు. కాని దేశం మొత్తం మీద ఇలాంటి విదేశీయ నేరస్థులు ఎంతమంది ఉన్నారన్నది దేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖవారు, విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు వెల్లడించదగిన వివరాలు. కానీ ఇలాంటి వివరాలను ఈ మంత్రిత్వ శాఖలవారు తమంత తాముగా ఆరు నెలలకొకసారి లేదా సంవత్సరానికోసారి వెల్లడిస్తున్న జాడలేదు. ప్రముఖంగా ప్రచారం కావడం లేదు! చట్టసభలలో సభ్యులు ప్రశ్నలు అడిగినప్పుడు ప్రభుత్వం వెల్లడిస్తూ ఉండవచ్చు. కానీ ఇలాంటి ప్రశ్నలను సభ్యులు అడుగుతున్నారా?
విస్తృత హైదరాబాద్ మహానగరం-గ్రేటర్ హైదరాబాద్-పరిధిలోనే దాదాపు రెండు వందల మంది విదేశీయులు అక్రమంగా నివసిస్తున్నట్టు విదేశీయుల నమోదుకు సంబంధించి ప్రాంతీయ కార్యాలయం-్ఫరిన్ రీజినల్ రిజిస్ట్రేషన్ ఆఫీస్-ఎఫ్‌ఆర్‌ఆర్‌ఓ-వారి గణాంకాల ద్వారా వెల్లడైందట! ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీన సికిందరాబాద్‌లో కోటి రూపాయల ‘కొకేయిన్’తో ఆ నైజీరియా వాసి పట్టుబడిన తరువాత ఈ వివరాలు ప్రచారం అయ్యాయి. ఇలా హైదరాబాద్‌లో అక్రమంగా నివసిస్తున్న రెండు వందల మంది విదేశీయులలో నలబయి మందికి పైగా నైజీరియా వారేనట! ఈ రెండు వందల మంది విదేశీయులు ‘చదువుకొనడం’ కోసం, ‘ఉద్యోగాలు చేయడం’ కోసం దీర్ఘకాల ప్రవేశ అనుమతి పత్రాల- వీసా లు-ను మన ప్రభు త్వం నుండి తీసుకోగలిగారు. కానీ ‘వీసా’ గడువు ముగిసిన తరువాత ఈ తథాకథిత -సోకాల్డ్-విద్యార్థులు, ఉద్యోగార్థులు, ‘వీసా’ కాల వ్యవధిని పొడిగించమని అభ్యర్థనను కూడ దాఖలు చేయలేదు. వీరంతా ఇక్కడే ఉండిపోయి వివిధ నేరాలను కొనసాగిస్తూ అక్రమ ధనాన్ని ఆర్జిస్తున్నారు. గత ఏడాది కాలంలో కేవలం నలుగురు ఆఫ్రికా నేరస్థులను మన పోలీసులు పట్టుకున్నారట, వారిని ఆఫ్రకాకు తరలించారట! మిగిలిన రెండు వందల మంది హైదరాబాద్‌లో ఏమి చేస్తున్నారు? వీరంతా తెలుగు రాష్ట్రాలకు, ఇతర ప్రాంతాలకు కూడ విస్తరించి పోయి ఉండవచ్చు.. వీరందరూ కేవలం విగ్రహాల దొంగతనం, బంగారం దొంగతనం, గంధపుకట్టెల దొంగతనం, పులిగోళ్ల దొంగతనం వంటి నేరాలను మాత్రమే చేస్తున్నారా? లేక వీరిలో జిహాదీ తదితర బీభత్స కారులు కూడ ఉన్నారా??
నేరస్థులను పట్టుకొనడానికి, నేరాలను నిర్మూలించడానికి ‘అంతర్జాతీయ సమష్టి కృషి’ జరగడం లేదు. కాని నేరస్థుల ముఠాలు మాత్రం అంతర్జాతీయ అనుసంధానాన్ని సాధించగలిగాయి! మన దేశంలోని పులులను చైనా భోంచేసింది, భోంచేస్తోంది. చైనాలోని సంప్రదాయ ఔషధాల తయారీకి పులుల గోళ్లు, శరీర అవయవాలు అవసరమట! ఎర్ర చందనం కలపను విదేశాలకు దొంగతనంగా తరలిస్తున్న ముఠాలలో కూడ చైనావారు ‘ప్రముఖులు’...