సంపాదకీయం

మాటతప్పిన ‘మాయ’మ్మ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బ్రిటన్ ప్రధాన మంత్రి థెరీసా మాయ్ మాటను నిలబెట్టుకోలేకపోవడం గురువారం నాడు పా ర్లమెంట్ ‘సామాన్యుల సభ’కు జరిగిన ఎన్నికలలో సంభవించిన ప్రధాన పరిణామం. ప్రస్తుతం తమ కన్సర్వేటివ్ పార్టీకి ‘సామాన్యుల ప్రతినిధుల సభ’- హౌస్ ఆఫ్ కామన్స్-లో ఉన్న సభ్యులలో ఆరుమంది తగ్గిపోయినట్లయితే తాము పరాజయం పాలుకావడం ఖాయమని థెరీసా మాయ్ ప్రచారం సందర్భంగా ప్రకటించింది. ‘ఈ ఎన్నికలలో నేను- కన్సర్వేటివ్ పార్టీ - కేవలం ఆరు స్థానాలు కోల్పోయినట్లయితే నా ప్రభుత్వం మెజారిటీని కోల్పోతుంది. జెరీమీ కార్బిన్ కొద్దిరోజులలో ఐరోపా దేశాల అధ్యక్షులతోనూ ప్రధానమంత్రుల తోనూ సమావేశాలు, చర్చలు జరిపే పరిస్థితి దాపురిస్తుంది..’ అని గురువారం పోలింగ్ ఆరంభం కావడానికి ముందు థెరీసా మాయ్ ప్రకటించింది. జెరీమీ కార్బిన్ ప్రధాన ప్రతిపక్షం ‘లేబర్ పార్టీ’ నాయకుడు. థెరీసా పార్టీ మెజారిటీని కోల్పోయినట్లయితే కార్బిన్ నాయకత్వంలోని లేబర్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. కార్బిన్ ప్రధాని అవుతాడు. ప్రధాని హోదాలో కార్బిన్ ఐరోపా ప్రభుత్వాధినేతల సరసన కూర్చుంటాడు. ఇదీ గురువారం నాడు పోలింగ్‌కు ముందు ‘మాయమ్మ’ చేసిన మహాప్రకటనలోని ‘్ధ్వని’! శుక్రవారం సూర్యుడు ఉదయించక పూర్వమే బ్రిటన్ ప్రధాని భవిష్యవాణి నిజమైంది! అధికార కన్సర్వేటివ్ పార్టీ ‘కామన్స్ సభ’లో మెజారిటీని సాధించలేకపోయిం ది. త్రిశంకు స భ -హంగ్ హౌస్- ఏ ర్పడింది. అందువల్ల చిల్లర మల్లర పార్టీల మద్దతుతో లేబర్ పార్టీ నాయకులు జె రీమీ కార్బిన్ ప్రధానమంత్రి కావడానికి ‘మాయ్’ అవకాశం ఇవ్వాలి. అలాంటి సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కార్బిన్ అంగీకరిస్తాడా? అంగీకరించడా? అన్నది వేరే విషయం. కానీ ‘సభ’లో మెజారిటీ కోల్పోయిన థెరీసా మాయ్ ప్రధాని పదవిని వదలుకోవడానికి సిద్ధంగా లేదు. మళ్లీ ప్రధాని పదవిని స్వీకరించడానికి ముస్తాబైపోయింది. శుక్రవారం ఉదయం బ్రిటన్ మహారాణిని కలిసి ప్రభుత్వం ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఆరువందల యాబై స్థానాలున్న ‘కామన్స్ సభ’లో కన్సర్వేటివ్ పార్టీకి మూడవందల పద్దెనిమిది స్థానాలు లభించాయి. మెజారిటీ స్థానాల కంటే ఎనిమిది తక్కువ.
మెజారిటీ స్థానాలు తమ పార్టీకి రాకపోయినట్టయితే తాను మళ్లీ ప్రధానమంత్రి పదవిని చేపట్టబోనని ధ్వనింపచేసిన మాయ్ ఇలా మాటతప్పింది. ‘మెజారిటీ పార్టీ’గా ఉండిన అధికార పార్టీ మెజారిటీని కోల్పోవడం నిజానికి ఓటమి. అందువల్ల గురువారం నాడు జరిగిన ఎన్నికలలో కన్సర్వేటివ్ పార్టీ ఓడిపోయింది. లేబర్‌పార్టీకి మెజారిటీ రాకపోవడం వల్ల మాయ్ తన ఓటమిని గెలుపుగా మార్చుకుంటోంది. 2015 మే నెలలో జరిగిన ‘కామన్స్ సభ’ ఎన్నికలలో కన్సర్వేటివ్ పార్టీకి మూడువందల ముప్పైఒక్క స్థానాలు లభించాయి. స్పష్టమైన మెజారిటీ కంటే ఐదు స్థానాలు ఎక్కువ. అందువల్లనే ఆరు స్థానాలు కోల్పోయినట్టయితే తాము ప్రతిపక్షంలో కూర్చొనడం ఖాయమని మాయ్ ప్రకటించింది. అప్పటి ప్రధాని డేవిడ్ కామెరాన్ నాయకత్వంలోని కన్సర్వేటివ్‌లు స్పష్టమైన మెజారిటీని సాధించడం ద్వారా బ్రిటన్‌లో సంకీర్ణ ప్రభుత్వాలకు భరతవాక్యం పలికారు. రెండేళ్ల తరువాత మళ్లీ సంకీర్ణ ప్రభుత్వాలకు, మైనారిటీ ప్రభుత్వాలకు తెరలేపిన ఘనతను గురువారం నాటి ఎన్నికల ద్వారా థెరీసా మాయ్ సాధించగలిగింది. 2015లో 232 స్థానాలు సాధించిన లేబర్ పార్టీ ఈ ఎన్నికలలో బలం పెంచుకుని 261 స్థానాల స్థాయికి చేరింది. కామన్స్ సభకు 2020లో జరగవలసి ఉండిన ఎన్నికలను ముందుగానే జరిపించడం ద్వారా మాయమ్మ సాధించిన నిర్వాకం ఇదీ...
తమకు పార్టీలోను, తమ పార్టీకి ‘సభ’లోను స్పష్టమైన మద్దతు ఉన్న సమయంలో 1990వ దశకంలో మార్గరెట్ థాచర్, గత ఏడాది డేవిడ్ కామెరాన్ ప్రధానమంత్రి పదవులకు రాజీనామా చేశారు. తద్వారా ఉత్తమ ప్రజాస్వామ్య సంప్రదాయాలను నిలబెట్టగలిగారు. ‘ఐరోపా సమాఖ్య’ నుంచి బ్రిటన్ వైదొలగరాదన్నది డేవిడ్ కామెరాన్ విధానం. కానీ గత ఏడాది జూన్ 23వ తేదీన జరిగిన అభిప్రాయ సేకరణ - రెఫరెండం-లో ఐరోపా సమాఖ్య నుంచి తమ దేశం వైదొలగాలని బ్రిటన్ ఓటర్లు తీర్పు చెప్పారు. యాభైఒకటిన్నర శాతం ఓటర్లు ‘సమాఖ్య’ నుంచి తమ దేశపు నిష్క్రమణను కోరగా, నలభై ఎనిమిదిన్నర శాతం తమ దేశం ‘సమాఖ్య’లోనే ఉండాలని వాంఛించారు. ఈ తీర్పు కేవలం ఐరోపా స భ్యత్వానికి మా త్రమే వ్యతిరేకం. కామెరాన్ ప్రధానమంత్రిత్వానికి వ్య తిరేకం కాదు. కా మెరాన్ ప్రధానమంత్రి పదవికి రా జీనామా చేయవలసిన పనిలేదు. అ యినప్పటికీ కామెరాన్ ప్రధానమంత్రి పదవికి రాజీనామా చేశాడు. అత్యున్నత ప్రజాస్వామ్యపు విలువలకు సజీవ విగ్రహంగా ఎదిగాడు. ఐరోపా సమాఖ్య నుంచి బ్రిటన్ వైదొలిగే ప్రక్రియకు ఆధ్వర్యం వహించడం చిత్తశుద్ధి రాహిత్యానికి ప్రతీక కాగలదని భావించిన ప్రజాస్వామ్య నిష్ఠాపరుడు కామెరాన్. ఆయన పదవీ పరిత్యాగం థెరీసా మాయ్‌కి కలసివచ్చిన అదృష్టం. కన్సర్వేటివ్ పార్టీ ఆమెను ప్రధాని పదవికి ఎంపిక చేసింది. గత జులైలో ఇలా ప్రధాని కాగలిగిన మాయ్ ‘ఊరికే ఉండక ఉరిపెట్టుకున్నట్టు’గా ఇప్పుడు అర్ధంతరంగా ఈ ఎన్నికలను జరిపించింది. తమ పార్టీలో సహచరురాలైన మాయ్‌కి ప్రభుత్వ నిర్వహణలో ఎలాంటి అసౌకర్యం కలగరాదని భావించిన కామెరాన్ పార్లమెంట్ సభ్యత్వానికి రాజీనామా చేసి రాజకీయాల నుంచి నిష్క్రమించాడు. 1812 తరువాత అతి పిన్నవయసులో బ్రిటన్ ప్రధాని అయిన కామెరాన్ 50 ఏళ్లకే రాజకీయ మహాభినిష్క్రమణ చేయడం చరిత్రలో అరుదైన పరిణామం. 2010లో ప్రధాని అయిన నాటికి ఆయన వయసు 43 ఏళ్లు.
ఐరోపా సమాఖ్య నుంచి తమ దేశం నిష్క్రమించే ప్రక్రియకు మరోసారి ‘జనాదేశం’ పొం దాలన్నది మాయ్ ఈ ఎన్నికలను జరిపించడానికి కారణం. ఇప్పుడు ఆ ‘జనామోదం’ లభించినట్లా? కాదా? అన్నది ఎప్పటికీ తేలదు.