సంపాదకీయం

సాహితీ విశ్వంభరుడు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఆత్మలను పలికించేదే అసలైన భాష, ఆ విలువలు కనరానప్పుడు అది కంఠశోష..’ అన్నది ఆచార్య సి.నారాయణరెడ్డి 1980వ దశకంలో ఆవిష్కరించిన జీవన వేదం, మానవ జీవన పరామార్థం! సినారె నోట దశాబ్దుల తరబడి ఈ ‘్భష’ నర్తించింది, తెలుగు వారి హృదయాలను నర్తింపచేసింది. ఆయన ‘్భష’ అశేష ప్రజల ఆత్మలను పలకరించింది, ప లకరిస్తోంది, అనంతంగా పలికిస్తూ ఉంటుంది! భాషా వాజ్మయ సరస్వతీ మాత ‘ఆత్మ’ తో ఆచార్య నారాయణరెడ్డి సాధించిన ‘స్వభావ’ అద్వైత స్థితికి శాశ్వత సజీవ స్వరూపం ఆయన సృష్టించిన సాహిత్యం! శ్రోతల, పాఠకుల, వీక్షకుల, రసజ్ఞుల, సాధారణ ప్రజల ఆత్మలను- ఆయన సృష్టించిన అక్షరాలు పలికించడం మాత్రమే కాదు వెలిగించాయి, నిత్య నూతన తరుణారుణ కిరణాలతో పులకింప చేసాయి. అక్షయ భావాలతో పండిస్తున్నాయి! ఆత్మలు సనాతనమైనవి అంటే శాశ్వతమైనవి.. ఈ సనాతన సంస్కృతి శ్రమజీవన పథ ప్రస్థానం నిరంతరం స్వేదం ఒలికించిన సాహితీ కర్మయోగి సినారె. ఆయన చిలికించిన శ్రమ జీవన వర్ష జలం మధుర సుధాసాహితీ స్రవంతిగా మారి తెలుగువారి ఆత్మలను హర్షంతో పండించింది.. సాహితీ పర్జన్యుడు నారాయణరెడ్డి ఆంధ్రుల చరిత్రలో మరో సనాతనుడు! వేములవాడ సమీపంలో ని హనుమాజీపేటలో 1931 జూలై 29న జన్మించిన సినారె సాగించిన సుదీర్ఘ జీవనయానం సోమవారం మలుపు తిరిగింది. అందువల్ల ఆయన భౌతిక స్వరూపం కనుమరుగైంది. విశాల విశ్వం వైపు సాగుతున్న ఆ యన ఆత్మీయ తత్త్వం మా త్రం కనుమరుగు కాదు, ఈ తత్త్వం ఆత్మలను పలికించిన తత్త్వం, అజరామరమైన సాహిత్య త త్త్వం, ఆంధ్ర వాజ్మయ ప్రపంచంలో నిత్య సత్యం!
వేములవాడ శివుడు ఋతంభరుడు.. నారాయణుడు విశ్వంభరుడు, ఈ పరిభాష సంప్రదాయ రూఢ్యము! ‘విశ్వంభరః కైటభజిత్ విదుః శ్రీవత్స లాంఛనః’ అన్నది ‘అమరకోశ’ ప్రసిద్ధమైన విష్ణుదేవుని పేర్లు, నారాయణుని పేరు విశ్వంభరుడు.. అభినవ ‘నారాయణుడు’ సాహితీలోకపు విశ్వంభరుడు. వేములవాడలో ప్రభవించిన ‘నవ్వని పువ్వు’ సాహితీ విశ్వగగన వేదిక అంతటా పరిమళించింది! నవజాత శిశువు నవ్వదు, ఏడుస్తుంది! ఈ రోదనం ఆ తరువాత జీవన నాదం. సాఫల్య హాసం. ఒక చిత్ర గీతంలో సినారె స్వయంగా చెప్పినట్టు ‘ఝలం ఝులిత మణినూపుర లలిత పద..’ విన్యాసం...! అందుకే సినారె తొలి సాహితీ పుత్రిక నవ్వలేదు! ఆ తరువాత వేన వేల సినారె సుమబాలలు ఋతంభరుని వలె సాహితీ ప్రపంచమంతటా పరిమళ నృత్యాలు చేసాయి, విశ్వంభరుని వలె వాజ్మయ విశ్వమంతటా విస్తరించాయి! నారాయణరెడ్డి సాహితీ విశ్వంభరుడు, అందువల్లనే ‘జ్ఞానపీఠ’మెక్కగలిగిన ‘దుహిత’ను, ‘విశ్వంభర’ను సృష్టించగలిగాడు.. ‘ఎక్కడున్నాము నిరుడెక్కడున్నాము? రచ్చకెక్కిన పచ్చి రాజకీయాలలో...! ఎక్కడున్నాము ఇప్పుడెక్కడున్నాము? రొదలేని విప్లవం రూపొందు నేలలో...!’ అని 1970వ దశకంలో సినారె నినదించాడు! ‘పచ్చి’ రాజకీయాలు కాక ప్రజాస్వామ్య రాజకీయాలు కావాలన్నది ఆయన చెప్పిన పాఠం! ఈ పాఠం చెప్పిన ఆచార్యుని సభ్యత్వంతో రాజ్యసభకు వినూతన వైశిష్ట్యం లభించడం మన రాజ్యాంగ చరిత్రలో భాగం! బిరుదులు, పురస్కారాలు, సమ్మానాలు, పదవులు సినారెను వరించి తమ గరిమను, ఘనతను పెంపొందించుకొనడం తెలుగుల వెలుగుల బాటలో చెరగని శుభదృశ్యాలు, తరగని విభవ స్మృతులు...
తెలుగు చలనచిత్ర ప్రపంచంలో ‘సినారె ఉ దయం’- తీయని తేనెల పువ్వుల వర్షం, నవరస మాధుర్య కవితా ప్రవాహం..’ ఎన్ని యుగాలైనా ఇది ఇగిరిపోని గంధం..’! ‘గులేబకావళి కథ’తో ఈ సుగంధాల జల్లు కథ మొదలైంది, తెలుగు సినిమా ప్రేక్షక హృదయాకాశంలో చెరగని హరివిల్లుగా మారింది! వేల వేల పాటలను రాసి పోసిన ‘సినారె’ చలనచిత్ర జగత్తును నిత్య వసంత ఋతువుగా మార్చాడు, ‘శరశ్చంద్ర చంద్రికా ధవళిమ’ను తీర్చాడు! కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ రచించిన ‘ఏకవీర’ నవల ఆధారంగా రూపొందిన చలనచిత్రానికి సినారె మాటలు వ్రాయడం అద్వితీయమైన సామ్యం! ‘జ్ఞానపీఠం’ ఇద్దరికీ సమానం! లలిత లలితమైన తెలుగు పదాలతోనే కాక సరస మధురమైన సంస్కృత పదజాలంతో కూడ పాటలను సమకూర్చిన పుంభావ సరస్వతి ‘సినారె’! పుస్తకాలకు పరిమితమైన అనేకానేక పదాలకు ప్రయోగ సాఫల్యాన్ని సిద్ధింపచేసిన రసధిషణా స్ఫూర్తి సినారె.. ‘పాటలాధర రాగ భావములు..’ కనగలిగిన సంస్కృత భాషా కోవిదుడు సినారె! శ్రీకృష్ణావతారం, శ్రీకృష్ణ పాండవీయం, శ్రీకృష్ణసత్య, అమరశిల్పి జక్కన్న, పూజాఫలం వంటి చిత్రాల ‘కలకాల’త్వానికి ప్రధాన కారణం సినారె కలం .. ‘నల్లని రాల’పైన కఠినత్వం తెలియనివారు లేరు! కానీ సినారె ఈ కఠిన పా షాణాల ‘లోన వెన్న కనిపించును’ అని కనిపెట్టాడు! ‘రవి కాంచని చోట కవి గాంచును..’ శిలాంతర్గతమైన ‘వెన్న’ను దర్శించిన కవి సినారె! కవిత్వం సినారెగా ఆకృతి దా ల్చింది, సాహిత్యం సినారెగా రూపం ధరించింది. ఇది తెలుగు సినిమా ఆత్మకథ.. ఈ ఆత్మను సినారె తన భాషతో పలికించాడు! ప్రేక్షకజనుల ‘ఆత్మ’లను పులకింపచేశాడు! ‘మనసే వీణగా, ఝుణఝణ మ్రోయగా, బతుకే పున్నమి’గా చలనచిత్ర యోషా జీవన చిత్రమిది.. సినారె నిలబెట్టిన సజీవ చిత్రమిది.
ఇతివృత్తం ప్రధానంగా మాత్రమే కాక కథనం ప్రధానంగా కూడ కావ్యాలను సమీక్షించాలని, విమర్శించాలని సినారె దాదాపు ఇరవై ఏళ్లకు పూర్వం ఒక సభలో స్వయంగా చెప్పాడు! ఇతివృత్తం భావం.. కథనం భాష! ‘ముక్తపద గ్రస్తము’ అన్న ‘అలంకారం’ భాషకు, భావానికి పరస్పరం అన్వయం.. ముక్తమయిన భావం మళ్లీ భాష ద్వారా లభిస్తోంది! సినారె రచన ఈ ‘అలంకారాని’కి కొత్త అర్థం! భావానికి జీవం భాష, సినారె భాష ఇలా అక్షయ భావానికి అక్షర రూపం! ‘వచ్చిండన్నా, వచ్చాడన్నా వరాల తెలుగు ఒకేటేనన్న’ అని ప్రబోధించిన తెలుగు వారి ఆత్మ ‘సినారె’ భాష ద్వారా నిరంతరం పలుకుతూ ఉంటుంది. ‘రాజమహేంద్ర వరం మహాభారతం, ఏకశిలానగరం మహాభాగవతం..’ ఇలా వెయ్యేళ్ల తెలుగు సాహిత్య స్రోతస్వినిని నడిపిస్తున్న సాంస్కృతిక భగీరథ పరంపరలోని మరో చరితార్థుడు సింగిరెడ్డి నారాయణరెడ్డి! తెలుగు భారతి ముద్దు బిడ్డడు.. భరతమాత వరాల బిడ్డడు..