సంపాదకీయం

ప్రచారానికి ప్రాతిపదిక?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జునాయిద్ అనే యువకుని హత్య దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్నట్టు ప్రచారం అవుతోంది! ఒకరు మరొకరిని లేదా కొందరు మరి కొందరిని హత్య చేయడం అమానుష ప్రవృత్తికి, పాశవిక చిత్తవృత్తికి నిదర్శనం. చంపడం క్రూరమృగాల లక్షణం. గత వారం ‘్ఢల్లీ-మధుర’ పాసెంజర్ రైలులో వెడుతుండిన జునాయిద్‌ను కొందరు దుండగులు కత్తితో పొడిచి చంపివేయడడం దారుణమైన ఘోరం. రైల్లోని బోగీలో కూర్చోడానికి సీట్లు లభించిన వారికి, లభించని వారికి మధ్య మొదలైన వివాదం హత్యకు దారి తీయడం దౌర్భాగ్యం. ఇలాంటి అసాంఘిక ఘటనలను అం దరూ నిరసించాలి! అందుకే ముందుగా కేంద్ర సమాచార ప్రసార మంత్రి ఎమ్.వెంకయ్యనాయుడు ఈ హత్యను నిరసించాడు. ‘ఇలాంటి ఘటనలు నిరసించదగినవి. ఇది పాశవికమైనది, బీభత్స పూరితమైనది. ఇది ఆమోద యోగ్యం కాదు! దీనితో సం బంధం ఉన్నవారిని గుర్తించి కఠిన చర్యలకు గురి చేయాలి..’ అన్నది వెంకయ్యనాయుడి ఆవేదన! ఈ ఆవేదనను ఆయన వ్యక్తం చేయడానికి ముందే పోలీసులు రంగంలోకి దిగి నలుగురిని ఆరెస్టు చేసారు. ఐదవ నిందితుని కోసం గాలింపు జరుగుతోంది! వల్లభ్‌గఢ్, మధుర స్టేషన్ల మధ్య ఈ హత్య జరిగింది. హతుడు వల్లభ్‌గఢ్ సమీపంలో ఖాంద్‌వాలీ గ్రామానికి చెందినవాడట! దేశమంతటా ప్రతిరోజు ఇలా వ్యక్తిగత విద్వేషాల వల్ల ఇతరేతర సమస్యల వల్ల వందలాది హత్యలు జరుగుతున్నాయి. లైంగిక బీభత్సకాండకు గురి చేశాక మహిళలను అంతమొందిస్తున్నారు. చిన్నపిల్లలను హత్య చేస్తున్నారు. ఆస్తి తగాదాలు, కుటుంబ క లహాలు హత్యలకు దారి తీస్తున్నాయి. భార్యను భర్త, భర్తను భార్య చం పేస్తున్న ఘటనలు కోకొల్లలు! ఈ హింసాకాండ మన జాతీయ జీవన స్వభావానికి అపవాదం, విరుద్ధం. మానవీయ సంస్కారాలు అడుగంటిపోయిన వారు ఇలాంటి వైయక్తిక, సామాజిక నేరాలకు పాల్పడుతున్నారు! మానవీయ సంస్కరాలను పెంపొందించడానికి దీర్ఘకాలం కృషి చేయడం ఒక్కటే సమస్యకు పరిష్కారం! మన చదువుల పద్ధతి మారాలి, మన జీవన పద్ధతిని ఆవహించిన విదేశీయ వికృతులు తొలగాలి! అ ప్పుడు మాత్రమే ఎదుటి వ్యక్తిని చంపడం ఘోరమని, పాపమని మానవులు గుర్తించగలరు.. అంతవరకు దేశమంతటా ఇలాంటి ఘటనలు తప్పవు.. కానీ దేశంలో జరుగుతున్న అనేక హత్యలకు లభించని విపరీత ప్రచారం ఈ హత్య విషయంలో ఎందుకని జరుగుతోంది? ఆవేశంతో ఆలోచనను మరిచిన ముష్కరులు జరిపిన హత్యకు ‘ఏదో పెద్ద కుట్ర’ అని ఎందుకు ప్రచారం చేస్తున్నారు? వ్యక్తిగత వైరుధ్యాలకు ‘మతం’ రంగును ఎందుకని పులుముతున్నారు? ఎందుకు దేశంలోని అనేక చోట్ల ధర్నాలు చేస్తున్నారు? ఈ ఘటనకు మాధ్యమాలలో ఎందుకింత ప్రచారం?
ఇలాంటి వ్యక్తిగత సమస్యలను, సమష్టి సమాజానికి సంబంధం లేని ఘటనలను జాతీయ మహా సమస్యలుగా చిత్రీకరించి దేశానికి అప్రతిష్ఠ తెస్తున్నవారు నిజమైన జాతీయ సమస్యలను, సమాజ సమష్టి హితానికి సంబంధించిన అంశాలను మాత్రం పెద్దగా పట్టించుకొనకపోవడం ఆందోళన కరమైన పరిణామం! జమ్ము- కశ్మీర్ వసంత రాజధాని శ్రీనగర్‌లోని జామియా మసీద్ ప్రాంగణం వెలుపల మహమ్మద్ అయూబ్ పండిత్ అనే పోలీసు డిప్యూటీ సూపరింటెండెంట్‌ను ‘్భక్తుల’ వేషంలోని ‘జిహాదీ’లు గత ఇరవై మూడవ తేదీన కొట్టి చంపేశారు! రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా మసీదులలో ప్రత్యేక ప్రార్ధనలు జరుపడానికి వచ్చిన భక్తాదులలో కలసిపోయిన జిహదీ దుండగులు మసీదు ప్రాంగణంలో ప్రశాంత స్థితిని కాపాడడానికై విధులను నిర్వహించిన ఈ పోలీసు అధికారిని హత్య చేశారు. ఈ పోలీసు అధికారి పట్ల ‘జిహాదీ’ దుండగులకు వ్యక్తిగత వైరం లేదు! భారత్‌ను బలహీనపరచడం, బద్దలు కొట్టడం పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ బీభత్సకారుల ఏకైక లక్ష్యం! అందువల్ల మహమ్మద్ ఆయూబ్ పండిత్ అనే ఈ పోలీసు అధికారిని జిహాదీలు హత్య చేయడం దేశ వ్యతిరేక బీభత్స చర్య! సైనికులు, పోలీసులు ప్రభుత్వానికి, రాజ్యాంగానికి, దేశానికి ప్రతీకలు! పోలీస్ స్టేషన్లపై దాడి చేయడం ద్వారా, పోలీసులను సైనికులను హత్య చేయడం ద్వారా పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు భారత దేశంపై కసి తీర్చుకుంటున్నారు! ఈ వాస్తవాన్ని, ఇలాంటి ఘటనలను దేశ ప్రజలకు వివరించడానికి ప్రచారం జరగాలి! జరగవలసిన స్థాయిలో జరగడం లేదు! ఎందుకని..?
హురియత్ కాన్ఫరెన్స్‌లోని రెండు ముఠాలు కూడ పోలీసు అధికారిని జిహాదీ ముష్కరులు మసీదు ప్రాంగణ సమీపంలోనే హత్య చేయడం గురించి నోరు మెదపకపోవడం ఆశ్చర్యకరం కాదు. ఎందుకంటే ఈ ముఠాలు రెండూ బాహాటంగా పాకిస్తాన్‌ను సమర్ధిస్తున్నాయి. హురియత్‌లోని ‘మెతక’ ముఠాలోని ‘ముందరి మనిషి’ మిర్వాయిజ్ ఉమర్ ఫరూక్ జమ్ము- కశ్మీర్‌లోని ఇస్లాం మత ప్రధానుడు. మీర్వాయిజ్ ఉ మర్ ఫరూక్ మసీదులో ప్రత్యేక ప్రార్ధనలు నిర్వహిస్తుండిన సమయంలోనే ‘్భక్తాదుల’లలో కొందరు బయట ఈ హ త్యను చేశారు! ఈ హ త్యను చేసిన అభియోగంపై ప్రభుత్వం ఐదు మందిని నిర్బంధించింది! హురియత్‌లోని ‘ము దురు’ ముఠాలోని ముందరి మనిషి సయ్యద్ జీలానీ కూడ పోలీసు అధికారి హత్యను నిరసించడం లేదు. పోలీసుల, సైనికుల ఎదురు కాల్పుల్లో పాకిస్తాన్ తొత్తులైన ఉగ్రవాదులు హతులైనప్పుడల్లా ఈ రెండు ముఠాలవారు, యాసీన్ మాలిక్ అనే వాడు నడిపిస్తున్న ‘జమ్ము కశ్మీర్ లిబరేషన్ ఫ్రంట్’-జెకెఎల్‌ఎఫ్-విద్రోహపు తండావారు భూమి, ఆకాశం బద్దలయ్యేలా దురాగ్రహ జ్వాలలను సృష్టిస్తున్నారు. అనేక రోజులపాటు బంద్‌లు జరిపి జన జీవనాన్ని స్తంభింపచేస్తున్నారు! మహమ్మద్ అయూబ్ పండిత్ హత్యపట్ల ఈ ‘ముఠాలు’ నోరు మెదపకపోవడం వారి దేశద్రోహ స్వభావానికి అనుగుణం.. కానీ ఈ ముగ్గురు ముష్కరుల-్ఫరూక్, జీలానీ, మాలిక్-్భయంకర దేశద్రోహ పైశాచిక ప్రవృత్తిని నిరసిస్తూ దేశమంతటా ప్రదర్శనలు జరిగిన దాఖలా లేదు...
అనేకమంది జాతీయ ప్రతిపక్ష నాయకులు జ మ్ము-కశ్మీర్‌కు వెళ్లినప్పుడల్లా హురియత్ ‘ముదురు’ ముఠా ముష్కరుడు సయ్యద్ జీలానీని ‘దర్శించి’ గౌరవం ఘటించి వస్తున్నారు. ఇలా ఈ జిహాదీ బీభత్సకారుడికి సమ్మానాలు చేస్తున్న ప్రతిపక్షాల రాజకీయ వేత్తలకు వ్యతిరేకంగా కూడ నిరసనలు, ప్రదర్శనలు జరగడం లేదు. ఈ జిలానీకి పాకిస్తాన్ నుంచి భారీగా డబ్బు సంచులు అందాయన్నది ధ్రువపడిన తరువాత కూడ జాతీయ ప్రతిపక్షాలు అతగాడిని తప్పుపట్టడం లేదు! సమష్టి జాతీయ హితం వీరికి పట్టిందా??