సంపాదకీయం

ఇది మరో ‘లాంఛనం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అంతర్జాతీయ ‘కృత్రిమ’ మైత్రిని ద్వైపాక్షిక వె రుధ్యాలు దిగమింగుతున్నాయన్న వాస్తవానికి జర్మనీలోని హాంబర్గ్‌లో జరిగిన ప్రముఖ దేశాల ప్రభుత్వాధినేతల సమావేశం మరోసారి అద్దం పట్టింది! చైనా ‘దళాలు’ భూటాన్‌లోకి, సిక్కింలోకి చొరబడి ఉండడం శుక్ర, శనివారాల్లో జరిగిన ప్ర ముఖ దేశాల-గ్రూప్ ట్వెంటీ-జి20-శిఖర సభకు సమాంతర పరిణామం! చైనాకు దక్షిణంగాను వియత్నాంకు తూర్పుగాను ఫిలిప్పీన్స్‌కు పశ్చిమంగాను ఇండోనేసియాకు ఉత్తరంగాను ఉన్న సముద్ర ప్రాంతంలో ఉద్రిక్తతలు తీవ్రతరం కావడం ‘జి-20’ సమావేశం జరుగుతున్న సమయంలో సంభవించిన మరో సమాంతర పరిణామం! అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అమలులోకి తెచ్చిన సంకుచిత- ప్రొటక్షనిస్ట్-జాతీయ ఆర్థిక వాణిజ్య విధానాలు ‘ప్రముఖ దేశాల’ సహకార స్ఫూర్తిని మాత్రమే కాక ‘ప్రపంచీకరణ’ రూపొందించ దలచిన ‘పుడమిపల్లె’ అవతరణకు విఘాతకరంగా మారడం హాంబర్గ్ సమావేశాన్ని ఆవహించిన మరో వైరుధ్యం. అందువల్ల ‘వాణిజ్య అవగాహన పత్రాన్ని’ రూపొందించడానికి వీలుగా డొనాల్డ్ ట్రంప్‌ను ఒప్పించడానికి మిగిలిన ‘ప్రముఖ’ ప్రభుత్వాధినేతలకు తలప్రాణం తోకకు వచ్చిందన్నది నిర్వాహకులు చెప్పిన మాట! ‘పర్యావరణ పరిరక్షణ’కై పారిస్‌లో కుదిరిన ఒప్పందాన్ని ఇటీవల అమెరికా రద్దు చేసుకోవడం హాంబర్గ్ సమావేశంలో ధ్వనించిన ప్రధానమైన వికృత శ్రుతి.. అమెరికాను పక్కనపెట్టి ‘పర్యావరణ పరిరక్షణ కార్యాచరణ ప త్రాన్ని’ రూపొందించడం అనివార్యమైం ది. ‘ప్రముఖ దేశాల కూటమి’ చరిత్రలో ఇ లా అమెరికా అంగీకారం లేని ‘కార్యాచరణ పత్రం’ రూపొందడం బహుశా ఇదే మొదటిసారి. సదస్సు లో శుక్రవారం ప్రసంగించిన మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ బీభత్సకాండను నిర్మూలించడానికి సమష్టి సమరం జరపవలసిన అవసరం గురించి వివరించాడు. బీభత్సకాండను ప్రతిఘటించడానికి వీలుగా పదకొండు అంశాల ‘కార్యాచరణ పథకాన్ని’-యాక్షన్ అజెండా-ను ఆయన సదస్సుకు సమర్పించాడు కూడ. కానీ ఇతర ప్రభుత్వాల అధినేతలు ఈ బీభత్సకాండ నిర్మూలనకు ప్రాధాన్యం ఇవ్వడం లేదన్నది వారు సదస్సులో చేసిన ప్రసంగాల వల్ల స్పష్టమైంది.
పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న లష్కరే తయ్యబా, జాయిష్ ఏ మొహమ్మద్ వంటి జిహాదీ ముఠాలు, ‘ఇరాక్ సిరియా ఇస్లాం మతరా జ్యం’-ఐసిస్-వంటి అతి ప్రమాదకరమైన ఉగ్రవాద సంస్థలని నరేంద్రమోదీ సదస్సులో చెప్పాడు. ఆఫ్ఘనిస్థాన్‌లో ‘అల్ ఖాయిదా’, ఆఫ్రికాలో బీభత్సకాండను సృష్టిస్తున్న ‘బోకో హరామ్’ వలె ‘లష్కర్ ఎ తయ్యబా’-ఎల్‌ఇటి- ‘జాయిష్ ఏ మొహమ్మద్’-జెఇఎమ్-కూడ అంతర్జాతీయ సమాజానికి శత్రువులని మోదీ వివరించాడు! కానీ ‘సదస్సు’ జారీ చేసిన కార్యాచరణ పత్రంలో ప్రధానంగా ఐసిస్‌ను మాత్రమే పేర్కొనడం చైనా ప్రభుత్వం నడిపిన ‘నాటకం’ కావచ్చు! ‘తయ్యబా’, ‘జాయిష్’ ము ఠాలు మన దేశానికి వ్యతిరేకంగా బీభత్సకాండను సాగిస్తున్న ఉగ్రవాద సంస్థలు! ఈ తండాల చర్యలకు ప్రాధాన్యం తగ్గించడం ద్వారా చైనా ఇలా మరో మారు పాకిస్తాన్ కొమ్ము కాచింది, జి-20 దేశాల నిరసనకు గురి కాకుండా నిరోధించగలిగింది! ‘జాయిష్ ఎ మొహమ్మద్’ ముఠాలోని మొదటి ఉగ్రవాది మసూద్ అఝార్ అనే వాడిని ఐక్యరాజ్యసమితి నిషిద్ధ వ్యక్తుల జాబితాలో చేర్చకుండా అడ్డుపడుతున్న చైనా ప్రముఖ దేశాల సదస్సులో కూడ తన షడ్యంత్రాన్ని సమర్ధవంతంగా అమలు జరిపింది. ఈ ప్రముఖ దేశాల కూటమిలో ‘బ్రిక్స్’ దేశాలు సభ్య దేశాలు. బ్రఝిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణ ఆఫ్రికా ‘బ్రిక్స్’ దేశాలు! ‘బ్రిక్స్’ దేశాల ప్రభుత్వ అధినేతలతో జరిపిన చర్చలలో కూడ మోదీ ప్రధానంగా పాకిస్తాన్ ప్రేరిత బీభత్సకాండను ప్రస్తావించాడు! చైనాకు సభ్యత్వం ఉన్న ఏ అంతర్జాతీయ సమాఖ్య కూడ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని పేరుపెట్టి నిరసించకపోవచ్చు! జి-20 సదస్సు ఇందుకు మరో ఉదాహరణ మాత్రమే!
మన ప్రభుత్వం తలపెట్టిన, అమలు జరుపుతున్న ఆర్థిక సంస్కరణలను ‘హాంబర్గ్ కార్యాచరణ పథకం’లో ప్రశంసించారు! అంతర్గత ప్రగతికి మాత్రమే కాక అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టం కావడానికి మన ఆర్థిక సంస్కరణలు దోహదం చేస్తున్నాయని ‘కార్యాచరణ పత్రం’లో మెచ్చుకున్నారు. కానీ ఇదే రీతిలో బీభత్స కలాపాల నిరోధానికి మన ప్రధాన మంత్రి చేసిన ప్రతిపాదనలను ‘కార్యాచరణ పత్రం’లో చేర్చకపోవడానికి కారణం చైనా ప్రచ్ఛన్న హస్తం! పాకిస్తాన్ ప్రత్యక్ష ఉగ్రవాది, చైనా ప్రచ్ఛన్న ఉగ్రవాది! ఒక దేశంలో నక్కి ఉన్న ఉగ్రవాదుల విమానాలను మిగిలిన జి20 ప్రభుత్వాలకు అందచేయాలన్నది మోదీ చేసిన ప్రతిపాదన! ఈ విషయమై ఎ లాంటి నిర్ణయం జ రగలేదు. ఒక దే శంలో బీభత్సకాండ జరిపి మరో దేశానికి పారిపోవడం ఉగ్రవాదుల వ్యూహం! అ లాంటి సందర్భాలలో ఆయా ఉగ్రవాదులను వారు నేరాలు చేసిన దేశాలకు తరలించడం -ఎక్స్‌ట్రడిషన్- వేగవంతం కావాలన్న మోదీ ప్రతిపాదనను కూడ ‘కార్యాచరణ పత్రం’లో ప్రస్తావించలేదు! జూన్‌లో జరిగిన ‘జి20’ ఆర్థిక చర్య నిర్వహణ బృందం-ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ఫోర్స్- ఎఫ్‌ఏటిఎఫ్- సమావేశంలో జరిగిన నిర్ణయాల పట్ల మాత్రం ‘సదస్సు’ హర్షం ప్రకటించింది! అయితే ఉగ్రవాద వ్యతిరేక నిర్ణయాలను అమలు జరపడం గురించి స్పష్టమైన ‘కార్యాచరణ’ను సదస్సులో అంగీకరించలేదు-బీభత్సకారులకు నిధులు అందకుండా నిరోధించడం ‘ఎఫ్‌ఏటిఎఫ్’ జూన్‌లో చేసిన ప్రధాన ప్రతిపాదన! టెర్రరిస్టులకు నిధులు అందకుండా నిరోధించాలని టర్కీలోని అంతల్యాలో రెండేళ్ల క్రితం జరిగిన జి-20 సమావేశంలో మోదీ విజ్ఞప్తి చేసాడు. ఈ రెండేళ్లలో ఈ విషయమైన జరిగిన ప్రగతి ఎంత?
అన్ని అంతర్జాతీయ సంస్థలలోను చైనా అక్రమ ఆధిపత్యం పెరుగుతుండడం నడుస్తున్న వైపరీత్యం. తమ దేశాల విషయంలో చైనా దుందుడుకుతనాన్ని నిరోధిస్తున్న ఐరోపా ప్రభుత్వాలు, అమెరికా ప్రభుత్వం మన దేశం పట్ల చైనా జరుపుతున్న దౌత్య దౌర్జన్యాన్ని పెద్దగా పట్టించుకోవడంలేదు! అంతర్జాతీయ ‘ప్రక్రియ’లో ఇది సహజం! ఈ అంతర్జాతీయ సమావేశం సందర్భంగా మన ప్రధాని చైనా అధ్యక్షుడు ఝుజింగ్‌పింగ్‌తో ద్వైపాక్షిక చర్చలు జరపడం ద్వారా ‘వ్రతం’ చెడినట్టయింది. ఫలితం..??