సంపాదకీయం

ఇది ‘అమరనాథుని’పై దాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మరోసారి విస్మయ చకితులం కావడం మినహా మన దేశ ప్రజలు చేయగలిగింది ఏమీ లేదు! అమరనాథ యాత్రికులకు భద్రత కల్పించవలసిన నిఘా వ్యవస్థ కూడా ఏమీ చేయలేనప్పుడు సామాన్య ప్రజలు మాత్రం ఏమి చేయగలరు? అమరనాథుని సందర్శించి తిరిగి వస్తుండిన తీర్థ యాత్రికులలో ఆరుగురు బీభత్స మృత్యువు పాలుకావడం, మరో పదునాలుగు మంది గాయపడడం నిఘా రాహిత్యానికి మరో నిదర్శనం. దుర్ఘటన సంభవించిన తరువాత సంతాపం ప్రకటించడం, మృతుల కుటుంబాలకు, క్షతగాత్రులకు నష్టపరిహారాలు చెల్లించడం, బీభత్స రాక్షస కృత్యం జరిపిన జిహాదీలను నిందించడం, బస్సును దుండగులు చుట్టుముట్టి కాల్పులు జరిపిన తరువాత అమిత వేగంగా నడుపుకుంటూ వెళ్లి ఇతర ప్రయాణీకుల ప్రాణాలను కాపాడిన మినీ బస్సు డ్రైవర్‌ను అభినందించడం, హత్యాకాండ సాగించిన జిహాదీ ఉగ్రవాదులు పిరికిపందలని అభివర్ణించడం- ఈ ప్రహసనం వల్ల విషాద మరణం పాలైనవారు బ్రతికిరారు. అందువల్ల బీభత్సకారులు దాడి చేసి హత్యలు చేసిన తరువాత విచారం వెలిబుచ్చడం వల్ల ప్రయోజనం లేదు. దాడిని ఎందుకని నిరోధించలేకపోయామన్నది నిగ్గుతేలవలసిన అంశం. ఎందుకంటే అమరనాథ యాత్రికులపై దాడులు జరగడం ఇది మొదటిసారి కాదు. జమ్మూ కశ్మీర్‌ను దేశం నుంచి విడగొట్టడానికి పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వ వ్యవస్థ కొనసాగిస్తున్న కుట్రలో, పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న జిహాదీ ము ష్కరులు అమలు జరుపుతున్న కుట్రలో అమరనాథుని పట్ల వ్యతరేకత భాగం. మంచుమల మ ధ్య నెలకొని ఉన్న సహజ గుహాలయంలో అనాదిగా అవతరిస్తున్న, అదృశ్యవౌతున్న సనాతన హిమలింగం అమరనాథుడు. ఇలా ‘అదృశ్యం కావడం, అవతరించడం’ అన్న సృష్టిస్థిత వ్యవస్థకు ప్రాకృతిక ప్రతీక అమరనాథ లింగం. భరతమాతకు జమ్మూ కశ్మీర్ ‘తల’.. ఈ శిరస్సునకు ధవళతమయ పటం హిమాలయం. ఈ మకుటంలో మణి వంటిది అమరనాథ దివ్యధామం. భారతీయ సంస్కృతికి ప్రతీక అమరనాథ సందర్శన యాత్ర.. భారతీయ సమగ్రతకు పతాక! అందువల్లనే జమ్మూ కశ్మీర్‌లోని పాకిస్తాన్ తొత్తులు యాత్రను మాత్రమే కాదు, అమరనాథ గుహాలయం ఉనికిని సైతం వ్యతిరేకిస్తున్నాయి. అందువల్ల యాత్రికులపై దాడులు జరపడానికి ‘జిహాదీ’ తోడేళ్లు నిరంతరం పొంచి ఉండడం ఆశ్చర్యం కాదు... దాడిని మనం నిరోధించ లేకపోవడం దిగ్భ్రాంతికి కారణం!
ఉగ్ర మృగాలను ఉసికొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం సుదీర్ఘ లక్ష్యం కశ్మీర్‌ను మన దేశం నుంచి ఖండించడం. పాకిస్తాన్‌కు బహిరంగ బీభత్స దళాలుగా పనిచేస్తున్న ‘హురియత్’ ముఠాలు, ప్రచ్ఛన్న బీభత్స దళాలుగా పనిచేస్తున్న ‘కశ్మీర్ లోయ’ ప్రాంతపు కొన్ని స్థానిక రాజకీయ వర్గాలు ఇదే లక్ష్యంతో పనిచేస్తున్నాయి. దేశంలోని మిగిలిన ప్రాంతాలతో జమ్మూ కశ్మీర్‌కు భౌగోళిక ఆర్థిక వాణిజ్య ధార్మిక సామాజిక సాంస్కృతిక సంబంధాలను తెగతెంపులు చేయాలన్నది ఈ పాకిస్తాన్ షడ్యంత్రంలో భాగం, పాకిస్తాన్ తొత్తుల పన్నాగంలో భాగం. అలా తెగతెంపులు జరిగినట్టయితే జమ్మూ కశ్మీర్‌ను భౌతికంగా, బౌద్ధికంగా దేశానికి, సంస్కృతికి దూరం చేయవచ్చునన్నది వికృత విష వ్యూహకర్తల విశ్వాసం. మిగిలిన దేశం నుంచి కశ్మీర్‌లోకి, కశ్మీర్‌లో నుంచి మిగిలిన దేశంలోకి ప్రజల రాకపోకలు నిరంతరం నిరాఘాటంగా జరుగుతున్నంత కాలం ఇది సాధ్యం కాదు. అందువల్ల దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి కశ్మీర్‌కు వస్తున్నవారిపై దాడులు చేశాయి. హత్య చేయాలి, వారిని భయ విభ్రాంతికి దిగ్భ్రాంతికి గురి చేయాలి. ‘కశ్మీర్‌కు వెళ్లడం మన ప్రాణాలకు ప్రమాదం’ అన్న భయాందోళనలకు గురి అయినట్టయితే ఇతర ప్రాంతాల వారు ‘వైష్ణవ దేవి’ యాత్రకు వెళ్లరు, అమరనాథ క్షేత్రానికి వెళ్లరు, సింధు నదీ సందర్శనకు పోరు, అమరనాథుని సన్నిధికి చేరరు, జమ్మూ కశ్మీర్ వైపు తొంగి చూడరు! ‘ఇలా దూరమైన కశ్మీర్‌ను ఖండించడం తేలిక’ అన్నది పాకిస్తాన్ తొత్తుల పన్నాగం. ఈ లక్ష్యం నెరవేరదు, కాని దేశాన్ని కబళించడానికై విద్రోహపు తోడేళ్లు పదే పదే దూకుతూనే ఉన్నాయి. ఈ తోడేళ్ల జాడను తెలిసికొనలేకపోవడం మన నిఘా వైఫల్యం..
హతులు గుజరాత్‌కు చెందిన తీర్థయాత్ర కుటుంబ బస్సులోని ప్రయాణీకులు. మొత్తం గుజరాత్ వారే. అది మినీ బస్సు. అందువల్ల దాదాపు అందరూ గాయపడినట్టే. ఈ బస్సు నిబంధనలకు వ్యతిరేకంగా ప్రయాణించిందట. జమ్మూ- శ్రీనగర్ జాతీయ రాజపథంలో రాత్రి పూట పౌర వాహనాలు ప్రయాణం చేయరాదన్నది నిబంధన. అమరనాథ్ నుంచి తిరిగి వచ్చిన యాత్రకులు ‘బల్‌తాళ’ అనే చోట ఈ బస్సునెక్కారట. అనంతనాగ్ జిల్లాలోని ‘బతెంగూ’ వద్ద జాతీయ రహదారిపై పయనిస్తున్న సమయంలో రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాం తంలో దుండగులు ఈ బస్సుపై దాడి చేశారు. ఈ బస్సు స్థానిక వాణిజ్య సంస్థలదా? లేక గుజరాత్ నుంచి యాత్రికులు బస్సును తీసుకొని వె ళ్లారా? రాత్రి ఏడుగంటల తరువాత ఈ జాతీయ రహదారిపై పౌర వాహనాలు పయనించరాదన్న నిబంధన గురించి వాహన చోదకునికి తెలియదా? అమాయకంగా రాత్రి ఏడు గంటల తరువాత నడపినప్పటికీ ఒకటిన్నర గంటలపాటు రహదారి భద్రతా దళాల వారు ఈ వాహనాన్ని ఎందుకని పసిగట్టలేక పోయారు? ఈ బస్సుపై దాడి చేయడానికి ముందు జిహాదీ ఉగ్రవాదులు రెండుచోట్ల ఇదే రహదారిపై భద్రతా దళాలపై దాడికి విఫల యత్నం చేశారట. అందువల్ల ‘చీకటి మూకల’ను గుర్తించడానికి భద్రతాదళాలు మరింత జాగరూకులై ఉండవలసింది. ఇది మొదటి వైపరీత్యం. యాత్రికులను ఎక్కించుకొని పయనించే ప్రతి బస్సు ‘అమరనాథ దేవాలయ నిర్వాహక మండలి’ వద్ద నమోదు కావాలన్నది మరో నిబంధన. ఈ బస్సు నమోదు కాలేదట. బస్సులో కాని బస్సువెంట కాని భద్రతా దళాలవారు లేరు. నమోదు కాని విషయం, భద్రత లేని విషయం డ్రైవర్‌కు తెలియదా? నమోదు కాని బస్సు యాత్రికులను ఎక్కించుకొని పయనించడానికి ఎవరు అనుమతి ఇచ్చారు?
యాత్రికులను హతమార్చిన ఉగ్రవాదుల పైశాచిక చర్య ‘కశ్మీర్ సంస్కృతి’కి వ్యతిరేకమని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకులు వాపోతున్నారు. ఇది విస్మయకరం. ఈ పైశాచిక కృత్యం భారత దేశంపై జరిగిన దాడి అని, భారతీయతకు వ్యతిరేకమని వీరెందుకు చెప్పడం లేదు? ఉన్నది ఒకటే భారతీయ సంస్కృతి!