సంపాదకీయం

బీభత్స వైద్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాదులోని ఘరానా వైద్యశాలల నిర్వాహకులు పనికిరాని మందులను, కాలదోషం పట్టిన మందులను, వాడేసిన మందుల అవశేషాలను, పరికరాలను ఇతర రకాలైన చెత్తను కుప్పలు తెప్పలుగా బహిరంగ స్థలాలలో రాశులు పోసి వెడుతున్నారు! వ్యాధిగ్రస్తులను వివిధ ప్రక్రియల చికిత్సల పేరుతో, పరీక్షల పేరుతో దోచి పారేస్తున్న ఘరానా ప్రభుత్వేతర వాణిజ్య వైద్యశాలలవారు ఈ ‘చెత్త’ను పారవేయడంలో అగ్రస్థానంలో ఉన్నారట! ఈ ఔషధాల అవశేషాల-బయో మెడికల్ వేస్ట్-ను పారవేయడానికి ప్రభుత్వాలు, నియంత్రణ మండలులు నిర్దేశించిన నియమాలను ఈ కార్పొరేట్ వైద్యశాలల వారు నిర్భయంగా, నిర్లజ్జగా ఉల్లంఘిస్తుండడం ‘స్వచ్ఛ్భారత్’ పునర్ నిర్మాణ స్ఫూర్తికి విరుద్ధం! హిమాయత్‌నగర్, జూబిలీహిల్స్, కూకట్‌పల్లి, సికిందరాబాద్ వంటి భాగ్యనగరంలోని ప్రసిద్ధ ప్రాంతాలలోనే ఘరానా వైద్యశాలల వారు ఈ ‘మందుల చెత్త’ను ప్రజల ఆరోగ్యానికి, ప్రకృతి ఆరోగ్యానికి భంగకరమైన రీతిలో వెదజల్లుతున్నారట, విష రసాయన దుర్గంధాన్ని విస్తరింపచేస్తున్నారట! ఈ చెత్తకుప్పలు తెప్పలు తెప్పలుగా దర్శనిమిస్తుండడాన్ని తిలకించిన తెలంగాణ ప్రభుత్వ కాలుష్య నియంత్రణ మండలి అధికారులు విస్మయ చకితులైనట్టు ప్రచారవౌతోంది! ప్లాస్టిక్‌తో, రబ్బర్‌తో ఇతర రసాయన విష పదార్ధాలతో తయారైన తొడుగులు, సీసాలు, గొట్టాలు, సూదిమందునెక్కించే సిరంజీలు మాత్రమే కాక వైద్య పరిభాష తెలిసిన వారికి మాత్రమే బోధపడే అనేకానేక చిత్ర విచిత్ర పరికరాలను ఖాళీ స్థలాలలో నిబంధనలకు వ్యతిరేకంగా రాశులు పోసి జారుకుంటున్నారట ఈ ‘కార్పొరేట్’ వైద్యశాలలవారు. కుతుబుల్లాపూ ర్ ప్రాంతంలోని ఒక ఖాళీ స్థలంలో దాదాపు పదకొండు టన్నుల ఇలాంటి ‘బయో మెడికల్ వేస్ట్’ ‘దర్శన’ మిచ్చిందట.. దేశంలోని అ న్నిరంగాల వలెనే వైద్య రంగంలో కూడ రకరకాల ఊహకందిన, ఊహకందని అక్రమాలు జరిగిపోతున్నా యి. పెద్దగా చదువుకోని, చదువుకొనలేని మధ్యతరగతి నిరుపేద జనాలకు పర్యావరణ స్పృహ లేదన్నది జరుగుతున్న ప్రచారం. కానీ, ప్రాణాలకు కీలకమైన వైద్యశాలల్లోని వైద్యులకు, నిర్వాహకులకు పర్యావరణ పరిరక్షణ స్పృహ ఉన్నది కదా! ఎందుకని చెత్తను పారవేయవలసిన పద్ధతిలో పారేయడం లేదు? అలా పారవేయడానికి అయ్యే ఖర్చును కూడ మిగిలించుకుని అక్రమ సంపదను పెంపొందించుకోవాలా? ప్రపంచీకరణ మొదలైనప్పటి నుంచి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థల’ దోపిడీ కొనసాగుతోంది. ఈ వాణిజ్య వికృతి వైద్యరంగాన్ని భయంకర కలుషితం చేస్తోంది. అత్యధిక కార్పొరేట్ వైద్యశాలలు ఈ కాలుష్య కేంద్రాలు!
ఈ కాలుష్యం కేవలం భౌతికమైనది కాదు, మానసికమైనది, స్వభావానికి సంబంధించినది! ‘వైద్యో నారాయం హరిః’ అన్న భారత జాతీయ సంస్కృతి. నందనాన్ని అడవి పందులవలె దోచుకుంటున్న ఈ కార్పొరేట్ వైద్య శాలలు స్వచ్ఛతను-బౌద్ధిక మానసిక సామాజిక స్వచ్ఛతను భగ్నం చేస్తున్న అవినీతి రోగ నిలయాలు! ప్రజల కోసం ప్రభుత్వాలు అనేక వైద్య సంక్షేమ పథకాలు అమలు జరుపుతున్నాయి. కానీ దేశమంతటా ప్రభుత్వేతర వైద్యశాలల వారు ప్రజాధనాన్ని కొల్లగొట్టడానికి మాత్రమే ఈ పథకాలు ఉపయోగపడుతున్నాయి. ప్రభుత్వం చికిత్స ఖర్చును భరిస్తున్న ప్రతి వ్యాధిగ్రస్తుడిని ప్రభుత్వేతర వైద్యశాలల వారు అనవసరమైన పరీక్షలకు, వైద్య ప్రక్రియలకు గురి చేస్తుండడం బహిరంగ రహస్యమైపోయింది! ఎందుకంటే ఈ పరీక్షలకు, ప్రక్రియలకు బోలెడంత ఖర్చు అవుతుంది. ఆ ఖర్చును ప్రభుత్వాలు భరిస్తాయన్న ధీమాతో వ్యాధిగ్రస్తులు నోరు మెదపడం లేదు! అవసరమైన చికిత్సలు జరిపినందుకు, మందులిచ్చినందుకు కూడ నిజంగా అయ్యే ఖర్చుకంటే అనేక రెట్లు ప్రభుత్వేతర వైద్యశాలల వారు వసూలు చేస్తున్నారు. ప్రభుత్వాలు వైద్య సంక్షేమ పథకాల కింద ఈ సొమ్మును చెల్లిస్తున్నాయి! ఈ దోపిడీకి ఇటీవల కాలంలో ప్రభుత్వాలు కొంతమేర అడ్డుకట్ట వేస్తున్నప్పటికీ ప్రభుత్వేతర వైద్యశాలల యాజమాన్యాలు కొత్త మార్గాలను అనే్వషిస్తునే ఉన్నాయి, ఆవిష్కరిస్తునే ఉన్నాయి!!
ఇలా మందుల చెత్తను బహిరంగ స్థలాలలో రాశులు పోయడంలో పండ్ల చికిత్సకులు-డెంటిస్టులు-ముందంజలో ఉన్నారట! పళ్ల వైద్యులు ప్రధానంగా పండ్లు కట్టడం లేదు, పండ్లు రాలగొడుతున్నారన్నది కేవలం పాత సామెత కాదు, కొత్త నిజం కూడ! ఒక పన్ను ఊడినవారు పండ్ల డాక్టరు దగ్గరికి వెడితే ‘మిగిలిన పళ్లనీ ఊడగొట్టేయాలి, అవి ఆరు నెలల కంటే ఎక్కువ కాలం ఉండవు’ అని సలహాలిస్తున్నారట! కానీ మిగిలిన పండ్లు ఆరేండ్లు గడిచినా ఊడవు! కానీ అన్ని పండ్లనూ ఊడగొడితే తప్ప కృత్రిమ దంతాలు అమర్చి డబ్బు గుంజడానికి డాక్టర్లకు వీలుండదు మరి! సమాజాన్ని రోగ విముక్తం చేయడానికి యత్నించవలసిన వైద్యులు ‘హరివంటి వారు, నారాయణుని’ వంటివారు, దేవుని వంటివారు. కాని ప్రస్తుతం వైద్యులు విబుధ దైత్యులుగా మారి వికృత రూపాన్ని ప్రదర్శిస్తుండడం జాతీయ సంస్కారాలకు చెదలు పట్టిందనడానికి నిదర్శనం! గుండెజబ్బుల చికిత్సకు ఉపకరించే పరికరాలను, మందులను అనేక ఏళ్ల తరబడి భయంకరమైన ధరలకు విక్రయించిన వాణిజ్య వైద్యశాలల నిర్వాహకులు, ఘ రానా వైద్యులు వ్యాధిగ్రస్తులను ఇబ్బడి ముబ్బడిగా దోచేశారు. ఈ హృదయ వైద్య పరికరాల ధరలను, మందుల ధరలను కేంద్ర ప్రభుత్వం గత జూన్‌లో నియంత్రించింది, గరిష్ఠ ధరలను నిర్ధారించింది. కానీ అధిక ధరలకు ఇనే్నళ్లుగా అమ్మి ప్రజల సొమ్మును తొడేళ్ల వలె బొక్కేసిన కార్పొరేట్ వైద్య నిర్వాహకులకు శిక్ష ఏమిటి? వైద్యశాస్త్రం బుద్ధిని పెంచింది, నైతిక విద్యలు నేర్పడం వల్ల హృదయం పెరుగుతుంది, మానవుల పట్ల, ప్రాణుల పట్ల కారుణ్యం పెరుగుతుంది. నైతిక విద్యలను మన పాఠశాలలలో మప్పడం మానేసి దశాబ్దులు గడిచిపోయాయి. ఈ ‘మానేసిన’ దానికి లభిస్తున్న విష ఫలితం ‘చదువుకున్న రాక్షసులు’. వైద్య రంగంలోనే కాదు, అన్ని రంగాలలోను వీరు పెత్తనం చెలాయిస్తున్నారు! మనసులలో చెత్త నిండిన వారు మందుల చెత్తను బజార్లలోను, బహిరంగ స్థలాలలోను పారపోయడంలో ఆశ్చర్యం ఏముంది?
మోకాళ్ల నొప్పులకు చికిత్స చేయడంలో ఉపకరించే పరికరాలను సైతం కార్పొరేట్ వైద్యశాలల వారు వైద్యులు, దళారీలు కుమ్మక్కైపోయి అధిక ధరలకు అమ్మేస్తున్నారట! సరికొత్తగా బయటపడిన వైద్య వైపరీత్యం ఇది. విదేశాల నుండి దిగుమతి అవుతున్న ఈ కృత్రిమమైన మోకాలి చిప్పల-నీ కాప్స్, నీ ఇంప్లాంట్స్-ను తమకు లభించిన ధరలకంటే నాలుగు రెట్ల ధరలకు సైతం అమ్మగలుగుతున్న ఘరానా వైద్యశాలలు దేశమంతటా పరిఢవిల్లుతున్నాయట! ఇలా వందలాది కోట్ల రూపాయలను అక్రమంగా సంపాదిస్తున్న కార్పొరేట్ వైద్యశాలలు కేవలం వేల రూపాయలు ఖర్చుపెట్టి ‘మందుల చెత్త’ను నిరపాయకరంగా మార్చడానికి పూనుకోవడం లేదు. అందువల్ల ఎక్కడంటే అక్కడ చెత్తను పారవేస్తూ ప్రజల ప్రాణాలకు ముప్పు తెచ్చే కాలుష్యాన్ని పెంచుతున్నారు!!