సంపాదకీయం

మళ్లీ గిల్లిన చైనా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అరుణాచల్ ప్రదేశ్‌లోకి చైనీయ మూకలు చొరబడడం చైనా సాగిస్తున్న భౌతిక, వ్యూహాత్మక దురాక్రమణ చరిత్రలో సరికొత్త ఘట్టం. యాబయి ఐదు ఏళ్ల క్రితం చైనా మనదేశంలోకి చొరబడి లడక్‌లోను, ఇతర ప్రాంతాలలోను దాదాపు యాబయి చదరపు కిలోమీటర్ల భూభాగాన్ని దురాక్రమించింది! ఆ దురాక్రమణ ముగిసిన తరువాత ఉభయ దేశాల మధ్య - టిబెట్ పొడవునా - ఏర్పడి ఉన్న వాస్తవ అధీన రేఖ - లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ -ను చైనా పదేపదే ఉల్లంఘించడం నడుస్తున్న వైపరీత్యం. ‘‘సరిహద్దు వివాదం పరిష్కారం’’ పేరుతో ఉభయ దేశాల మధ్య ఇరవై ఏడేళ్లకు పైగా నడుస్తున్న చర్చలకు ఈ ‘చొరబాట్లు’ నిరంతర నేపథ్యం. గత నెల ఇరవై రెండవ తేదీన కొత్త ఢిల్లీలో జరిగిన ‘ఇరవయ్యవ విడత’ సరిహద్దు చర్చలు ముగిసిన ఐదు రోజులలోనే చైనా మూకలు అరుణాచల్‌లో చొరబడ్డాయి. పదేపదే కవ్వింపు చర్యలకు పాల్పడడం ద్వారా మన సరిహద్దు ప్రాంతంలో ఉద్రిక్త స్థితిని కొనసాగించడం దశాబ్దులుగా అమలు జరుగుతున్న చైనా దురాక్రమణ వ్యూహం! కొత్తకొత్త చొరబాట్లకు పాల్పడడం ద్వారా ఇదివరకే దురాక్రమించిన మన భూభాగాలను శాశ్వతంగా తమ అధీనంలో ఉంచుకోవాలన్నది చైనా వారి దీర్ఘకాలపు పన్నాగం. లడక్ నుంచి అరుణాచల్ వరకూ మనకు టిబెట్‌కు మధ్య సహస్రాబ్దులుగా సరిహద్దు ఏర్పడి ఉంది. 1959లో స్వతంత్ర టిబెట్‌ను చైనా సంపూర్ణంగా ‘దిగమింగడం’తో ‘్భరత్-టిబెట్’ సరిహద్దు భారత చైనా సరిహద్దుగా మారింది! మూడేళ్లు తిరగకముందే చైనా మన దేశంలోని ప్రాంతాన్ని దురాక్రమించింది! చైనాకు మనకు మధ్య గత రెండువేల ఏళ్లుగా వివాదాలు లేవని, యుద్ధాలు జరగలేదని జరిగిన ప్రచారంలో డొల్లతనం 1962లో తేటతెల్లమైంది. చైనాకు మనకు మధ్య 1959కి పూర్వం యుద్ధాలు జరుగకపోవడానికి కారణం మనకూ చైనాకు మధ్య సుదీర్ఘమైన సరిహద్దు లేకపోవడం మాత్రమే! స్వతంత్ర టిబెట్‌లో మాత్రమే మన దేశానికి సుదీర్ఘమైన సరిహద్దు ఉండేది! 1959కి పూర్వం శతాబ్దులపాటు చైనా టిబెట్‌ను ఆక్రమించడానికి విఫలయత్నం చేసింది! టిబెట్‌కు 1947వ 1959వ సంవత్సరాల మధ్య మన ప్రభుత్వం అండగా నిలబడి ఉండినట్టయితే చైనా టిబెట్‌ను ఆక్రమించి ఉండగలిగేది కాదు! టిబెట్ స్వతంత్ర దేశంగా కొనసాగి ఉండినట్టయితే చైనాకు మనదేశానికీ మధ్య సరిహద్దు లేదు, వివాదం లేదు! అరుణాచల్‌లోకి కాని, కశ్మీర్‌లోకి ఉత్తర భాగం - గిల్గిత్ బాల్టిస్థాన్ -లోకి కాని, లడక్‌లోకికాని, సిక్కింలోకి కాని చైనా చొరబడే ప్రశ్న లేదు! సువిశాలమైన స్వతంత్ర టిబెట్ దాటి చైనా రాగలిగి ఉండేది కాదు...
ఇతర దేశాలను దురాక్రమించి ‘దిగమింగిన’ చరిత్ర చైనాది. అక్రమంగా భూభాగాలను కోల్పోయిన చరిత్ర మనది! మన జమ్ముకశ్మీర్‌కు ఉత్తరంగా విస్తరించి ఉన్న ప్రాచీన ‘హూణ’ దేశం క్రీస్తుశకం 1885 వరకూ చైనాలో భాగం కాలేదు. బౌద్ధజనబాహుళ్యం కలిగిన ‘హూణ’ దేశానికి, ‘హాణ’ చైనాకి మధ్య శతాబ్దుల పాటు యుద్ధాలు జరిగాయి. క్రీస్తుశకం ఎనిమిదవ శతాబ్ది తరువాత ‘జిహాదీ’లు చొరబడి బౌద్ధులను నిర్మూలించి ‘హూణ’ దేశాన్ని ఇస్లామీకరించారు. తుర్కీస్థాన్‌గా పేరు మార్చారు! పశ్చిమప్రాంతం ‘టర్క్‌మేనియా’ పేరుతో సోవియట్ రష్యాలో కలిసిపోవడం, 1991 తరువాత మళ్లీ స్వతంత్ర దేశం కావడం చరిత్ర.. తూర్పు ‘తుర్కిస్థాన్’ను 1885లో చైనా ఆక్రమించి ‘సింగియాంగ్’గా పేరు మార్చింది. ఈ ‘సింకియాంగ్’లేదా ‘జింఝియాంగ్’ 1885కి పూర్వంవలె స్వతంత్రంగా ఉండినట్టయితే కశ్మీర్ ఉత్తరభాగంలో మనకూ చైనాకూ సరిహద్దు లేదు! అందువల్ల మనదేశంలో మయన్మార్ కలిసి ఉండిన సమయంలో అతి కొద్దిమేర మాత్రమే మనకూ చైనాకు సరిహద్దు ఉండేది. 1937లో బ్రిటన్ సామ్రాజ్యవాదులు బర్మా - మయన్మార్ -ను మనదేశం నుండి విడగొట్టారు! 1948 నుంచి ‘గిల్గిత్ బాల్టీస్థాన్’ పాకిస్తాన్ దురాక్రమణలో ఉంది. అందువల్ల 1948 - 1959 మధ్య మనకూ చైనాకు సరిహద్దు లేదు! 1950 నుంచీ టిబెట్‌లోని దశలవారీగా చొచ్చుకువచ్చిన సమయంలోనే చైనా మన లడక్‌లోకి కూడా చొరబడింది!
ఇలా టిబెట్‌ను చైనాకు ధారాదత్తం చేయడం ద్వారా 1950వ దశకంనాటి మన ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ చైనా ‘కొరివి’ని చేజేతులా మన నెత్తిమీదికి తెచ్చాడు! టిబెట్ ఆక్రమించిన నాటి నుంచి చైనా అరుణాచల్ తనదని వాదిస్తోంది! 1914లో సిమ్లాలో కుదిరిన ఒప్పందం ప్రకారం టిబెట్‌కూ మనదేశానికీ - బ్రిటన్ దురాక్రమణలోని మనదేశానికి - మధ్య భూటాన్ నుంచి మయన్మార్ వరకు ఉన్న ప్రాంతంలో ‘సరిహద్దు’ ఏర్పడింది. ఈ సరిహద్దు ‘మెక్‌మోహన్ రేఖ’గా ప్రసిద్ధికెక్కింది. సిమ్లా చర్చలలో మన దేశానికి మెక్‌మోహన్ అన్న బ్రిటన్ అధికారి ప్రాతినిధ్యం వహించడం ఇందుకు కారణం. టిబెట్‌లో బ్రిటన్ అధీనంలోని భారతదేశపు దళాలను నెలకొల్పడం వల్ల చైనా దురాక్రమణ నుంచి టిబెట్‌కు రక్షణ ఏర్పడింది! 1947 ఆగస్టు పదిహేను తరువాత కూడా ఈ మన దళాలు పోస్ట్ఫాసులు, పర్యాటక కేంద్రాలు టిబెట్‌లో కొనసాగాయి. 1949లో చైనాలో కమ్యూనిస్టులు అధికారాన్ని హస్తగతం చేసుకున్న తరువాత, కమ్యూనిస్టు ప్రభుత్వం అభిమతం మేరకు మన ప్రధానమంత్రి జవహర్‌లాల్ నెహ్రూ - టిబెట్ ప్రభుత్వ అభీష్టానికి విరుద్ధంగా - మన సైనిక దళాలను టిబెట్ నుంచి శాశ్వతంగా వెనక్కి రప్పించాడు! ఫలితంగా టిబెట్‌ను దిగమింగడం చైనాకు సులభమైపోయింది! చైనా దళాలకు దొరకకుండా టిబెట్ అధినేత దలైలామా వేలాది అనుచరులతో కలసి రాజధాని లాసా నుండి 1959లో పారిపోయాడు, నడుచుకుంటూ వచ్చి మన అరుణాచల్‌లో ప్రవేశించాడు. హిమాచల్ ప్రదేశ్‌లోని ‘్ధర్మశాల’లో అప్పటి నుంచీ టిబెట్ ప్రవాస ప్రభుత్వం ఏర్పడి ఉంది! టిబెట్‌ను ఆక్రమించిన చైనా ‘‘మెక్‌మోహన్ రేఖ’’ తమకు అంగీకారం కాదని వాదిస్తోంది. ‘రేఖ’కు దక్షిణంగా ఉన్న అరుణాచల్ ప్రదేశ్‌లోకి పదేపదే చొరబడుతోంది...
గతనెల 27న అనేకమంది చైనా కిరాయి గూండాలు ‘ఎల్‌ఏసి’ని దాటి కిలోమీటర్ మేర మనదేశంలోకి చొచ్చుకొని వచ్చారు. రోడ్డు నిర్మంచడానికి పూనుకున్నారు. ఈ సంగతి పసిగట్టిన మన భద్రతా దళాలవారు అరుణాచల్ ప్రజలు ఆ చైనీయులను తరిమి ‘రేఖ’ అవతలకి దాటించారు! డోక్‌లా - డోక్‌లామ్ -లో భంగపడిన చైనా అరుణాచల్‌లోకి చొరబడడం ‘కవ్వింపు’ వ్యూహానికి సరికొత్త సాక్ష్యం..