సంపాదకీయం

కృపాల్ విషాదాంతం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావంలో మార్పు వస్తుందన్న భ్రమ మరోసారి తొలగిపోయింది. మన ప్రభుత్వం ఈ భ్రమకు పదేపదే గురి అవుతుండడం నడచిపోతున్న విచిత్ర ప్రహసనం..మన ప్రభుత్వం విశ్వసించడం, పాకిస్తాన్ ప్రభుత్వం ఈ భ్రమకు పదేపదే గురి అవుతుండడం నడచిపోతున్న విచిత్ర ప్రహసనం. మన ప్రభుత్వం విశ్వసించడం, పాకిస్తాన్ ప్రభుత్వం వంచించడం పునరావృత్తమవుతున్న ఘటనాక్రమం. ఇరవైనాలుగేళ్లపాటు పాకిస్తాన్ నిర్బంధంలో చిత్రహింసలకు గురైన కృపాల్ సింగ్ అనే భారతీయుడు లాహోర్ జైలులో మరణించడం ఈ పునరావృత్తికి సరికొత్త నిదర్శనం. మన సైనిక దళాలలో ఎనిమిదేళ్లు పనిచేసే సేవా నివృత్తుడైన కృపాల్ సింగ్‌ను 1992లో పాకిస్తాన్ సైనికులు అపహరించుకొని పోయారు. ఆ తరువాత ఆయనపై అక్రమ అభియోగాలను బనాయించి నిర్బంధించారు. అభియోగాలు నిజమని ధ్రువపడినాయి. వాటిని లాహోర్ హైకోర్టు తోసిపుచ్చింది. అబద్ధపు అభియోగాలను సైతం తమ న్యాయస్థానాలలో నిజమని పాకిస్తాన్ ప్రభుత్వం ఋజువు చేయగలదు. గతంలో సర్వజిత్ సింగ్ అనే మరో భారతీయుణ్ణి అపహరించిన పాకిస్థాన్ సైనికులు అతన్ని టెర్రరిస్టుగా ముద్రవేశారు. ఏళ్ల తరబడి జైళ్లలో మగ్గిన సర్వజిత్ సింగ్‌ను కిరాయి హంతకులు జైలులోనే హత్య చేశారు. ప్రస్తుతం కుల భూషణ్ యాదవ్ అనే మరో భారతీయుడు నెలరోజులకు పైగా పాకిస్తాన్‌లో అక్రమ నిర్బంధంలో ఉన్నాడు. యాదవ్ మన నౌకాదళంలో పనిచేసే సేవా నివృత్తుడయ్యా డు. యాదవ్‌కు వ్యతిరేకంగా కూడ గూఢచర్యం అభియోగం నమోదైంది. ఈ నెల 11వ తేదీన లాహోర్‌లోని కోట జైలులో కృపాల్ సింగ్ మృతదేహం కనిపించింది. సర్వజిత్ సింగ్‌ను బహిరంగంగా దాడి చేసి చంపిన పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు ఇప్పుడు వ్యూహం మార్చారు. తడిగుడ్డతో చల్లగా గొంతు కోసినట్టు కృపాల్ సింగ్‌ను గుట్టు చప్పుడు కాకుండా మట్టు పెట్టారు..మన ప్రభుత్వం ఈ ఘోర కిరాతకం పట్ల వ్యక్తం చేయదగిన స్థాయిలో నిరసన వ్యక్తం చేయకపోవడం పాకిస్తాన్ ముందు మోకరిల్లుతున్న విధానానికి మరో నిదర్శనం. ప్రభుత్వం సంజాయిషీ అడిగిందట. యాబయి ఏళ్ల కృపాల్ సింగ్ సహజంగానే మరణించాడని పాకిస్తాన్ ప్రభుత్వం సమాధానం చెప్పిందట. యాబయి ఏళ్లకే సహజ మరణం ఏమిటన్న ప్రశ్నకు సమాధానంగా ఆయనకు గుండెపోటు వచ్చి ఉండవచ్చునని పాకిస్తాన్ ప్రభుత్వం తేల్చివేసింది.
కృపాల్ సింగ్‌ను పాకిస్తాన్ ప్రభుత్వం ఇలా చిత్రహింసలు పెడుతుండిన సమయంలో మన ప్రభుత్వం ఆయనను విడిపించడానికి చేసిన ప్రయత్నం ‘సున్న’ అని ఇప్పుడు ధ్రువపడింది. మాజీ ప్రధాని మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం అనుసరించిన మెతక విధానానికి పూర్తి విరుద్ధమైన నిర్ణయాత్మక వైఖరిని ప్రస్తుత నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వం అవలంబిస్తోందని ప్రచారం జరిగింది. కానీ మన్‌మోహనీయ పథంలోనే మోదీ విధానం కూడ నడుస్తోందని కృపాల్ సింగ్ విషాదాంతం వల్ల ధ్రువపడింది. కృపాల్ సింగ్ గురి అవుతుండిన పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత బీభత్సకాండ పరాకాష్ఠకు చేరిన సమయంలో మన ప్రభుత్వం పాకిస్తాన్ ప్రభుత్వ సంయుక్త పరిశోధనా బృందానికి ఇక్కడ స్వాగతం పలికింది. ఇలా పాకిస్తానీ సంయుక్త పరిశోధక బృందం- జాయింట్ ఇనె్వస్టిగేషన్ టీమ్-జిట్- పఠాన్‌కోటలోని మన వైమానిక కేంద్రం ప్రాంగణంలో ప్రవేశించడానికి అనుమతి ఇవ్వడం ద్వారా మన ప్రభుత్వం తీవ్రమైన విధాన వైపరీత్యానికి ఒడిగట్టింది. పఠాన్‌కోటపై దాడి చేయించిన పాకిస్తాన్ ప్రభుత్వానికి చెందిన పరిశోధకులు దర్యాప్తు జరపడం హంతకుడు నేరం గురించి విచారించడంతో సమానం. ఇలా వ్రతం చెడిన మన ప్రభుత్వానికి ఫలితం మాత్రం దక్కలేదు. పఠాన్ కోట దాడులకు రూపకల్పన చేసిన జాయిష్‌యే మొహమ్మద్ ముఠాలోని మొదటి హంతకుడు అఝార్ మహ్మద్ నిర్దోషి అని పాకిస్తాన్ తేల్చివేసింది. పఠాన్‌కోటపై దాడి చేసిన హంతకులకు సంబంధించి మన ప్రభుత్వం అందజేసిన సాక్ష్యాధారాలను కూడ పాకిస్తాన్ ‘జిట్’ నిరాకరిస్తుండడం మన ప్రభుత్వం గుణపాఠం నేర్వదగిన విపరిణామం. మసూద్ అఝర్‌ను అరెస్టుచేసి మనదేశానికి తరలించాలని ఇప్పుడు మన ప్రభుత్వం అంతర్జాతీయ నేర పరిశోధనా సంస్థ, ఇంటర్‌పోల్‌ను కోరింది!
కానీ మసూద్ అఝార్ నిర్దోషి అని పాకిస్తాన్ ప్రభుత్వం ఇంటర్‌పోల్‌కు కూడ నివేదించనున్నాడట. చైనా ప్రభుత్వం మసూద్ వ్యవహారంలో పాకిస్తాన్‌ను బాహాటంగానే సమర్థిస్తోంది. మసూద్‌ను ఉగ్రవాదిగా ప్రకటించాలని కోరుతూ ఐక్యరాజ్య సమితిలో తీర్మానం ఆమోదించకుండా చైనా ప్రభు త్వం నిరోధించగలిగింది. ఈ విషయమై మన ప్రభుత్వం చైనా విధానాన్ని గట్టిగా నిరసించలేదు. టెర్రరిస్టులను పాకిస్తాన్ ఉసిగొల్పుతోంది. చైనా ఇలా ఉసిగొల్పడాన్ని సమర్థించింది. మసూద్ వ్యవహారాన్ని చైనాతో ఉన్నత స్థాయిలో మన ప్రభుత్వం చర్చించనున్నదట. కానీ 2008 డిసెంబర్‌లో మనం ఐక్యరాజ్య సమితిలో పెట్టిన తీర్మానాన్ని అప్పు డు చైనా వ్యతిరేకించలేదు. 2008 నవంబర్‌లో పాకిస్తానీ జిహాదీలు ముంబయిపై దాడి జరిపిన తరువాత మన ప్రభు త్వం ఆ తీర్మానాన్ని ప్రతిపాదించింది. దాడుల జరిగిన జమాత్ ఉద్ దావా ముఠాను నిషేధించాలని, ముఠాలోని మొదటి హంతకుడు హఫీజ్ సరుూద్‌ను నిర్బంధించి విచారించి శిక్షించాలని 2008 డిసెంబర్ నాటి తీర్మానంలో కోరారు. సమితి తీర్మానాన్ని ఆమోదించింది. 2008 నాటికీ ఇప్పటికీ మధ్య చైనా విధానంలో వచ్చిన స్పష్టమైన మార్పు ఇది. ఇప్పుడు బీభత్సకారులకు అనుకూలంగా చైనా బయటపడలేదు. ఇప్పుడు బయటపడింది. మన మెతక విధానం వల్ల మనకు లభించిన ప్రయోజనం ఇంతే...అప్పుడు సమితి తీర్మానాన్ని అమలు జరిపినట్టు పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించింది. కానీ అమలు జరుపలేదు. జమాత్‌ను నిషేధించలేదు. సరుూద్‌ను నిర్బంధించలేదు. ఈ వంచన బయట పెట్టిన మన ప్రభుత్వం సమితిలో మాత్రం ఈ వ్యహారాన్ని ప్రస్తావించలేదు. అందువల్ల పాకిస్తాన్ ఇప్పుడు మరింత ధైర్యం పుంజుకొంది. అఝార్ మసూద్ నిర్దోషి అని దబాయిస్తోంది. నిలకడ లేని మన దౌత్య నీతికి ఫలితమిదేనని మన ప్రభుత్వం ఇప్పుడైన ఎందుకు గుర్తించరాదు? పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థ-టెర్రర్ రిజీమ్-గా ఎందుకు ప్రకటించరాదు? సమితిలో ప్రకటింపజేయడానకి వివిధ దేశాల మద్దతును కూడగట్టే ప్రయత్నం ఎందుకని ప్రారంభించరాదు? పాకిస్తాన్ ప్రభుత్వ బీభత్స స్వభావానికి కృపాల్ సింగ్ హత్య మరో సాక్ష్యం మాత్రమే. 1992లో పాకిస్తాన్‌లోని పంజాబ్‌లో బాంబుళ్లు పేల్చాడన్న అభియోగంపై కృపాల్ సింగ్‌కు మొదటి న్యాయస్థానం మరణశిక్షను విధించింది. కానీ సింగ్ నిర్దోషి అని లాహోర్ న్యాయస్థానం నిర్ధారించింది. పంజాబ్ ప్రభుత్వం కాని పాకిస్తాన్ ప్రభుత్వం కాని లహోర్ తీర్పుపై అప్పీలు చేయలేదు. కృపాల్ సింగ్‌ను విడుదల చేయలేదు. ఎందుకు విడుదల చేయలేదని మన ప్రభుత్వం రెండు దశాబ్దుల పాటు నిలదీయలేదు...కృపాల్ సింగ్ విషాదాంతానికి ఇదీ నేపథ్యం...