సంపాదకీయం

విషం పూసిన ‘కత్తి’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బౌద్ధిక బీభత్సకారులకు చట్టం ప్రకారం తగిన శాస్తి జరుగకపోవడం నడుస్తున్న చరిత్ర. కత్తి మహేశ్ అనే వాడిని పోలీసులు హైదరాబాద్ నుంచి బహిష్కరించడం ఇందుకు సరికొత్త నిదర్శనం. కారాగృహంలో నిలబడి కటకటాలను లెక్కపెట్టవలసిన ఈ బౌద్ధిక బీభత్సకారుడిని తెలంగాణ సరిహద్దులను దాటించి ఆంధ్రప్రదేశ్‌లో వదలిపెడతారట. త్రేతాయుగంనాటి రఘురాముడు జాతీయ మహాపురుషుడు, ఆదర్శ పాలకుడు, రఘురాముని నిందించడం జాతి వ్యతిరేక చర్య, దేశద్రోహం. కానీ ఈ దేశద్రోహపు, జాతి వ్యతిరేక చర్యలకు ‘‘్భవ వ్యక్తీకరణ స్వేచ్ఛ’’ అన్న ముసుగును తొడిగిన ముష్కరులు దశాబ్దుల తరబడి తమ దుశ్చర్యలను కొనసాగించడం ప్రజాస్వామ్య వైపరీత్యం. రఘురాముడు భరతమాత వరాల బిడ్డడు, వజ్రాల తనయుడు. ‘‘కులం పవిత్రం జననీ కృతార్థా వసుంధరా పుణ్యవతీ చతేన....’’ అన్నట్టుగా రఘురాముడు పుట్టి పెరగడంవల్ల రఘుకులం- రఘువంశం- పవిత్రవంతమైంది, ఆ మహనీయుని కన్నతల్లి కౌసల్య కృతార్థురాలైంది. ఆ వరాల బిడ్డకు జన్మనిచ్చిన మాతృభూమి- భరతభూమి- మరింత పుణ్యాన్ని సముపార్జించుకొంది. తరతరాల భరతజాతికి రఘురాముడు ఆరాధ్యుడయ్యాడు. రఘురాముని అవమానిస్తున్న దూషిస్తున్న వారి అసలు లక్ష్యం భరతమాతను కించపరచడం, భారతీయ సంస్కృతిని భగ్నం చేయడం. భరతమాత బిడ్డలు ఏళ్లతరబడి దశాబ్దుల తరబడి ఇలాంటి బౌద్ధిక బీభత్సకారుల- ఇంటలెక్చువల్ టెర్రరిస్టుల దుశ్చర్యలను సహించి వౌనంగా విలపించారు. భౌతిక బీభత్సకారులను, ప్రజలను హత్యచేస్తున్న వారిని, శిక్షించడానికి దేశంలో చట్టాలున్నాయి, అవి అమలు జరుగుతున్నాయి. బౌద్ధిక బీభత్సకాండ- ఇంటలెక్చువల్ ఫార్మ్ ఆఫ్ టెర్రరిజమ్‌ను శిక్షించడానికి కూడ చట్టాలున్నాయి. అవి అమలు జరుగడంలేదు- అదీ తేడా.... అందువల్ల కత్తి మహేశ్ వంటి బౌద్ధిక బీభత్సకారులకు తగిన దండన లభించడం లేదు. తెలంగాణ ప్రభుత్వం అతగాడిని నిర్బంధించి న్యాయస్థానంలో నిలబెట్టి ఉండాలి! అది జరగలేదు, ఆంధ్రప్రదేశ్‌కు తరలించడం పోలీసులు పాల్పడిన అర్థంలేని చర్య.
ఈ పోలీసుల అతార్కిక ప్రవర్తన అంతుపట్టని వ్యవహారం. నేరం జరిగిన తరువాత ప్రభుత్వ యంత్రాంగం అనేక రోజులపాటు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరించింది. ఇప్పుడు ఆరునెలలపాటు ఈ కత్తి మహేశ్‌ను భాగ్యనగరంనుంచి బహిష్కరించింది. ఈ ఆరు నెలల లోగా అతగాడు హైదరాబాద్‌లో కనిపిస్తే నిర్బంధిస్తారట! ఇప్పుడే ఎందుకని నిర్బంధించడం లేదు?- అన్న ప్రశ్నకు పోలీసులు విచిత్రమైన సమాధానం చెప్పినట్టు ప్రచారమైంది. అతడిని ఇప్పుడు ‘అరెస్టు’ చేసినట్టయితే న్యాయస్థానాలకు వెళ్లి ‘బెయిల్’ తెచ్చుకొని బయటికి వస్తాడట! ఈ తర్కాన్ని ప్రతి నిందితునికీ అన్వయించినట్టయితే పోలీసులు ఎవ్వరినీ ‘అరెస్టు’ చేయలేరు! ఒక నిందితునికి ‘బెయిల్’ ఇవ్వాలా వద్దా అని నిర్ధారించవలసింది న్యాయస్థానాలు! కానీ కత్తి మహేశ్‌కు ‘బెయిల్’ లభించి తీరుతుందని పోలీసులు నిర్ధారించడం తామే న్యాయస్థానాల విధులను అధికారాలను నిర్వర్తించినట్టు అయింది. ఈ నిందితుడు ‘బయటికి వస్తే ప్రమాదమని అందువల్ల ‘బెయిల్’ మంజూరు చేయరాదని ‘జెయిల్’లో ఉంచాలని న్యాయస్థానాలను ప్రభుత్వ న్యాయవాదులు ఒప్పించగలగాలి... కానీ న్యాయస్థానాలు ‘బెయిల్’ మంజూరుచేస్తాయి కనుక నిందితులను ‘అరెస్టు’ చేయకుండా నగర బహిష్కారం చేస్తారా? ఈ ‘బహిష్కరణ’ ఆదేశాన్ని ధిక్కరించి ఈ కత్తి మహేశ్ ఆరునెలల్లోగా హైదరాబాద్‌కు తిరిగి వస్తే ‘అరెస్టు’ చేస్తారట... మరి అప్పుడైన అతగాడు ‘బెయిల్’ తీసుకొని బయటికి రాడా? ఆరునెలల తరువాత మాటేమిటి? హత్యా ప్రయత్నం చేసిన ‘నిందితుల’ను పోలీసులు ఇలా నగర బహిష్కారం చేయరు, నిర్బంధించి న్యాయస్థానంలో నిలబెడతారు. ఈ ‘‘తేనె పూసిన’’ కత్తి మహేశ్ జాతీయ సంస్కృతిని హత్యచేయడానికి యత్నించాడు! ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడ కత్తి మహేశ్ తమ ప్రాంతంలో ఉండరాదని అంటోందట, ఇతగాడిని కర్నాటకకు తరలిస్తారట... కర్నాటక ప్రభుత్వం కూడ బహిష్కరిస్తే ఎక్కడికి తరలిస్తారు?
ఘరానా నేరస్థునిపై ఫిర్యాదుచేస్తే సామాన్యంగా పోలీసుస్టేషన్లలో పట్టించుకోరు. ఆన్‌లైన్‌లో ‘ఎఫ్‌ఐఆర్’- ప్రథమ నేర సమాచార పత్రం- ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్‌ను నమోదుచేసే పద్ధతి అమలులోకి వచ్చిన తరువాత కూడ ఘరానా నేరస్థులకు వ్యతిరేకంగా పోలీసులు తక్షణం స్పందించక పోవడం నడుస్తున్న వైపరీత్యం. ‘ప్రజాహిత’- పీపుల్స్ ఫ్రెండ్లీ- పోలీసు వ్యవస్థ ఏర్పడినట్టు ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు, ఉన్నతోన్నత పోలీసు అధికారులు చేస్తున్న ఆర్భాటం వేదికలకు మాత్రమే పరిమితం కావడం అనేక సందర్భాలలో ధ్రువపడిన వాస్తవం. దాదాపు వారం రోజులపాటు కత్తి మహేశ్‌పై పోలీసులు చర్య తీసుకొనకపోవడం వల్ల ఇతగాడు ఘరానా నేరస్థుడని ధ్రువపడింది. బహుశా ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల అనుమతికోసం పోలీసులు ఇన్ని రోజులు వేచి ఉన్నారన్న సందేహం అతార్కికం కాదు. నేరస్థులను శిక్షించని ప్రభుత్వ యంత్రాంగం ఫిర్యాదుదారులను దబాయిస్తోంది. హైందవ ధర్మాచార్యుడు కాకినాడ శ్రీపీఠం అధిపతి పరిపూర్ణానందస్వామిని హైదరాబాద్‌లో గృహనిర్బంధంలో ఉంచడం ఈ దబాయింపులో భాగం. నేరం చేసినవారిని శిక్షించడం మాని నేరాన్ని నిరసించిన ఈ ధర్మాచార్యుడిని ఆయన అనుచరులను శిష్యులను దమనకాండకు గురిచేసిన పోలీసుల చర్యలను జనం అభిశంసిస్తున్నారు. యాదాద్రివరకూ ప్రశాంతంగా ధార్మిక చైతన్యయాత్రను జరుపతలపెట్టిన స్వామివారిని, విశ్వహిందూ పరిషత్, బజ్‌రంగ్‌దళ్ తదితర జాతీయ సాంస్కృతిక సంస్థల కార్యకర్తలను నిరోధించడం ప్రభుత్వ దమనకాండకు ప్రత్యక్ష సాక్ష్యం. ఇలా ధర్మాచార్యులను నిర్బంధించడం హైందవ జాతీయ సమాజంపై జరుగుతున్న దమనకాండలో భాగం, ప్రజాస్వామ్య వ్యతిరేకం, రాజ్యాంగ వ్యతిరేకం! జాతీయతపై, జాతీయ వారసత్వంపై విషం కక్కుతున్న వారిని, జాతీయతా పరిరక్షణకోసం తపిస్తున్న పరిపూర్ణానందస్వామి బృందాన్ని ఒకే గాట కట్టడం అక్రమం.
దశాబ్దల తరబడి భారతీయతపై హైందవ జాతీయతా సంప్రదాయాలపై, జాతీయ మహాపురుషులపై, సాంస్కృతిక వారసత్వంపై, భరతమాతపై విబుధదైత్యులైన బౌద్ధిక బీభత్సకారులు జరుపుతున్న దాడులలో కత్తి మహేశ్ ప్రదర్శించిన నీచమైన వాచాలత భాగం. సీతారాములను ఇలాంటి నీచులు అవమానించడం ఇది మొదటిసారి కాదు. ‘పఠాభి’ అనేవాడు 1960వ దశకంలోనే ‘రావణుని పది మూతులతో ముద్దుపెట్టించుకోవాలని సీతమ్మ వాంఛించినట్టు బీభత్స ‘కవిత’ను వ్రాసాడు. ఆ ‘పఠాభి’ వ్రాసిన ‘్ఫడేల్ రాగాల్ డజన్’ను ప్రభుత్వాలు నిషేధించలేదు. అందువల్లనే ఈ వికృత రాగాలు రోగాలవలె విస్తరించాయి. కత్తి మహేశ్ వంటివారు కొత్తకొత్త రోగాలు. యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ అనే మరో బౌద్ధిక బీభత్సకారుడు అన్నాచెల్లెళ్లైన యదుకుల కృష్ణునికీ, పాండవ పత్ని ద్రౌపదీ దేవికి మధ్య అక్రమ శృంగారాన్ని కల్పించి అభినవ సైంధవుడయ్యాడు. ఎమ్.ఎఫ్.హుస్సేన్ అనేవాడు భరతమాతను నగ్నంగా చిత్రీకరించడం బౌద్ధిక బీభత్సానికి పరాకాష్ఠ. భౌతిక బీభత్సం రక్తసిక్తమైన కత్తి... బౌద్ధిక బీభత్సం తేనె పూసిన కత్తి!!