సంపాదకీయం

ప్రగతి ప్రతీక..?!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ క్రమంగా పెరుగుతుండడం హర్షణీయం. గత ఏడాది ముగిసే నాటికి మన దేశం ప్రపంచంలోని ఆరవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందన్నది ‘ప్రపంచ బ్యాంకు’ వారు బుధవారం వెల్లడించిన నిర్థారణ. 2016లో ఫ్రాన్స్ ‘స్థూల జాతీయ ఉత్పత్తి’లో ఆరవ స్థానంలో ఉండేది. మన దేశానిది ఏడవ స్థానం. సంవత్సరం తర్వాత మన దేశం ఫ్రాన్స్‌ను అతిగమించి ఆరవ స్థానాన్ని దక్కించుకొంది. ఫ్రాన్స్ ఏడవ స్థానానికి దిగజారిందన్నది ప్రపంచ బ్యాంకు చేసిన నిర్థారణ. 2017లో మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ విలువ దాదాపు కోటి డెబ్బయి తొమ్మిది లక్షల కోట్ల రూపాయలట! అరవై ఎనిమిదిన్నర రూపాయల విలువ ఒక అమెరికా డాలర్‌తో సమానం కనుక మన ‘స్థూల జాతీయ ఉత్పత్తి’ విలువ రెండు లక్షల అరవై వేల కోట్ల డాలర్లకు సమానం. ఫ్రాన్స్ స్థూల జాతీయ ఉత్పత్తి విలువ రెండు లక్షల యాబయి ఎనిమిదివేల డాలర్లు అని ప్రపంచ బ్యాంకు నిర్థారించింది. ప్రస్తుతం ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన బ్రిటన్ వారి ‘ఉత్పత్తి’ విలువ రెండు లక్షల అరవై రెండువేల కోట్ల అమెరికా డాలర్లన్నది నిర్థారణ. వచ్చే ఏడాది ఆరంభం నాటికి మన దేశం బ్రిటన్‌ను కూడ అతిగమించి ఐదవ పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఏర్పడనున్నదట. పదేళ్లకు పూర్వం ఫ్రాన్స్ స్థూల జాతీయ ఉత్పత్తిలో సగం మాత్రమే ఉండిన మన ‘ఉత్పత్తి’ పరిమాణం ఫ్రాన్స్ ఉత్పత్తి కంటె అధికం కావడం మన ‘ప్రగతి’కి నిదర్శనం. కాని ఫ్రాన్స్ మనకంటె చిన్న దేశం, విస్తీర్ణం ఐదు లక్షల యాబయి వేల చదరపుకిలో మీటర్లు. జనాభా ఏడు కోట్ల కంటె తక్కువ. బ్రిటన్ విస్తీర్ణం ఫ్రాన్స్‌లో సగం కంటె తక్కువ, జనాభా రీత్యా కూడ బ్రిటన్ ఫ్రాన్స్ కంటె చిన్నది. అందువల్ల ఈ దేశాలతో మన ఆర్థికను సరిపోల్చడం విచిత్రమైన వ్యవహారం. కాని ఈ వైచిత్రికి ఏకైక కారణం ఐరోపా దేశాల వారు శతాబ్దుల పాటు మన దేశాన్ని కొల్లగొట్టి వెళ్లడం. నాలుగైదు శతాబ్దుల క్రితం వరకూ ప్రపంచంలో అతి పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉండిన ‘అఖండ భారత్’ ఈ పాశ్చాత్యుల దోపిడీతో 1947 నాటికి దివాలా తీసింది. ఈ ‘దివాలా’ తీయడం కేవలం ఆర్థిక వ్యవహారానికి సంబంధించినది కాదు. రాజకీయంగా, సాంస్కృతికంగా,్భతికంగా, బౌద్ధికంగా కూడ మన దేశం ఐరోపా జాతుల దమనకాండకు గురైంది. డెబ్బయి లక్షల చదరపు కిలోమీటర్ల అఖండ భారత్ ముప్పయి మూడు లక్షల చదరపు కిలోమీటర్ల ‘అవశేష భారత్’గా మారడానికి కారణం విదేశీయులు సాగించిన దోపిడీ. ‘జిహాదీ’లు శతాబ్దుల పాటు దేశాన్ని కొల్లగొట్టుకొని వెళ్లారు. ఈ ‘దోపిడీ’కి ‘పరిపాలన’ అనే ముసుగును తొడిగినవారు ఐరోపా జాతులవారు.. ఫ్రాన్స్ వారు, బ్రిటన్ వారు!
మన స్థూల జాతీయ ఉత్పత్తి- గ్రాస్ డొమస్టిక్ ప్రాడక్ట్- జీడీపీ- పరిమాణం క్రమంగా పెరుగుతుండడం, మన రూపాయి విలువ తగ్గుతుండడం సమాంతర పరిణామాలు. మొదటిది శుభ పరిణామం, రెండవది విపరిణామం. స్థూల జాతీయ ఉత్పత్తిని పంపిణీ ప్రాతిపదికగా నిర్ణయిస్తుండడం వ్యవసాయం కంటె వాణిజ్యానికి శతాబ్దుల తరబడి పెరిగిన ప్రాధాన్యానికి నిదర్శనం. అందువల్ల ‘స్థూల జాతీయ వ్యవసాయ ఉత్పత్తి’- గ్రాస్ అగ్రికల్చరల్ ప్రాడక్ట్- వాస్తవ పరిమాణం ‘జీడీపీ’ ద్వారా వెల్లడి కావడం లేదు. పారిశ్రామిక ఉత్పత్తులు, సేవలు, సేవారంగపు ఉత్పత్తుల ప్రాతిపదికగా ‘స్థూల జాతీయ ఆదాయం’ నిర్థారితవౌతోంది. అందువల్ల వ్యవసాయ ప్రాధాన్య ఆర్థిక వ్యవస్థలలో కంటె వాణిజ్య ప్రాధాన్య ఆర్థిక వ్యవస్థల్లోని ఉత్పత్తులు దాదాపు కచ్చితంగా నిర్థారితమవుతున్నాయి. ఒక గ్రామంలో ఉత్పత్తయిన వ్యవసాయ ఉత్పత్తులు ఆ గ్రామంలోనే వినియోగం అవుతున్నాయి, ఇతర ప్రాంతాలకు, విపణి వీధులకు తరలిపోతున్నాయి. విపణి వీధుల్లో విక్రయం అవుతున్న వ్యవసాయ ఉత్పత్తులను నిర్దిష్టంగా పరిగణిస్తున్నారు, గణిస్తున్నారు. కానీ గ్రామం ‘పొలిమేర’ను దాటని వ్యవసాయ ఉత్పత్తులను ఇలా నిర్దిష్టంగా పరిగణించకపోవడం ‘జీడీపీ’ నిర్థారణలో దశాబ్దుల తరబడి ఏర్పడి ఉన్న ప్రధాన లోపం. అందువల్ల ఆధికారిక నిర్ధారణ కంటె వ్యవసాయ ప్రధాన దేశాల్లో ‘జీడీపీ’ పరిమాణం సహజంగా ఎక్కువ ఉంటోంది. మన దేశం వ్యవసాయ ప్రధాన దేశం.
ప్రగతికి అనాదిగా ప్రాతిపదిక ప్రాకృతికంగా ఉత్పత్తవుతున్న సంపద. ఇది వ్యవసాయ సంపద, గో సంపద, పశు సంపద, అటవీ సంపద. ఈ సంపదలను నిలువ ఉంచడానికి పంపిణీ చేయడానికి అవసరమైన ఖనిజాలు, లోహాలు ఇతర ఉత్పత్తులు కూడ సహజ సంపదే. ఇలా సహజ సంపదకు ప్రాధాన్యం ఉండిన సమయంలో మన దేశం సహస్రాబ్దుల పాటు ప్రపంచంలో ఆర్థిక అగ్రరాజ్యంగా విరాజిల్లింది. నీరులేని ఎడారి దేశాల వారు, మంచుగడ్డల మయమైన ఐరోపాలోని వారు సహస్రాబ్దుల పాటు పొలాలను పండించలేదు. పండినచోట్ల ఆ తిండి స్థానిక ప్రజల ఆకలిని తీర్చడానికి సరిపోయేది కాదు. తిండి కోసం అఖండ భారత్‌పై ఈ జాతులవారు ఆధారపడిన రోజులు చరిత్రలో ఉన్నాయి. అతి శ్రేష్ఠమైన పారిశ్రామిక ఉత్పత్తులు కూడ భారత్ నుంచి మాత్రమే ఎగుమతి అయ్యేవి. మొత్తం ప్రపంచంలోని ఎగుమతుల్లో భారత్ వాటా నలబయి రెండు శాతమన్నది క్రీస్తుశకం పదహైదవ శతాబ్ది వరకు, పదహారవ శతాబ్ది ప్రారంభం వరకు నడచిన చరిత్ర. ఎనిమిదవ శతాబ్ది నుంచి జిహాదీలు, అరబ్బులు, తరుష్కులు, మంగోలియా వారు, మొఘలాయిలు వంటివారు దేశాన్ని దోచుకున్న తర్వాత కూడ భారత్ ఆర్థికంగా అగ్రగామిగానే నిలిచింది. ఎందుకంటె మహమ్మద్ బిన్ కాసిమ్, గజనీ, ఘోరీ వంటి వారు వందలాది ఒంటెల మీద, గుర్రాల మీద, బండ్లమీద బంగారాన్ని, వజ్ర వైడూర్యాది విలువైన సంపదను దోచుకొని పోయినప్పటికీ మన దేశపు సహజమైన వనరులను వారు దోచుకోలేదు. ఐరోపా వారు మన వనరులను కొల్లగొట్టారు, ధ్వంసం చేశారు. ఉత్పాదక వ్యవస్థలను, వికేంద్రీకృత పరిశ్రమలను ఛిన్నాభిన్నం చేశారు. మన లోహపరిశ్రమను, నేత పరిశ్రమను, నౌకా నిర్మాణ పరిశ్రమను, ఆయుధ నిర్మాణ వ్యవస్థను పాడుపెట్టారు. అడవులను ధ్వంసం చేసి కలపను తరలించుకొనిపోయారు. ఆవులను హత్యచేసి మాంసం ఎగుమతి చేశారు. ఈ ఆర్థిక బీభత్సకాండను బ్రిటన్ వ్యవస్థీకరించింది. అందువల్ల బ్రిటన్ విముక్త భారతదేశం ముడి వస్తువులను కారుచౌకగా అమ్మి, పారిశ్రామిక ఉత్పత్తులను భయంకరమైన ధరలకు దిగుమతి చేసుకొనే ఆర్థిక వ్యవస్థగా మారింది. మన ‘జీడీపీ’ మొదటి స్థానం నుంచి పడిపోవడానికి ఇదీ నేపథ్యం..
ఇప్పటికీ కూడ ప్రగతి ప్రాతిపదికలు, ప్రగతి పరిభాషలు, ప్రగతి సూచికలు కేవలం వాణిజ్యం ప్రాతిపదికగా నిర్థారితమవుతున్నాయి. కోట్లమంది సాగిస్తున్న వ్యవసాయం ఆధారంగా కాక లక్షలమంది ఘరానాలు నిర్దేశిస్తున్న ‘వాటాల విపణి’- స్టాక్ మార్కెట్- ప్రాతిపదికగా ‘ప్రగతి సూచికలు’ ప్రచారం అవుతున్నాయి. ఈ కృత్రిమ ప్రగతిని ‘డాలర్’ నిర్దేశిస్తోంది. ఐరోపా వారి ‘యూరో’ నిర్దేశిస్తోంది.. ‘రూపాయి’ నిర్దేశించ గలగాలి. అప్పుడు మాత్రమే నిజమైన ప్రగతి...