సంపాదకీయం

మళ్లీ దూకిన ‘తోడేలు..’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పొంచి ఉన్న ‘తోడేలు’కు గోడ దూకడం స్వభావం, ఆవుల మందలోకి చొరబడడం స్వభావం, గొంతులను కొరకడం స్వభావం, ఒక ఆవును కానీ దూడను కానీ హత్య చేయడంతో తోడేలు ఆగదు, వీలైనంత మేర ఎక్కువ ఆవులను చంపడమే తోడేలు స్వభావం! ఒక ఆవును తినడం వల్ల ఆకలి తీరుతుంది, కానీ క్రౌర్యం చల్లారదు. అందువల్ల తోడేలు ఒక ఆవును తింటుంది, పది పదిహేను ఆవుల మెడలను కొరికి హత్య చేస్తుంది. ఇది దాని స్వభావం. అందువల్ల ఏ ఆవును చంపాలి? ఎందుకు చంపాలి? అన్న ‘విచక్షణ’ తోడేళ్లకు లేదు. అందిన ప్రతి ఆవు మెడ కొరికి పోవడమే ఈ క్రూర జంతువు స్వభావం.. మన దేశంలోని ‘మావోయిస్టులు’ ‘నక్సలైట్లు’ ‘వామపక్ష సాయుధులు’ ‘వర్గ విద్వేష బీభత్సకారులు’, తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికార కైవసానికి యత్నిస్తున్న ‘వర్గకలహ’ సిద్ధాంతవేత్తలు చేస్తున్న పని కూడ ఇదే.. సందు దొరికితే గోడ దూకడం, నిరాయుధులను హత్య చేయడం, గొంతులను కొరకడం, అవయవాలను ఖండించడం, సాయుధ భద్రతాదళాలపై పొంచి ఉండి దూకడం, బాంబులను పేల్చడం, మందు పాతరలను దట్టించడం.. ఆంధ్రప్రదేశ్‌లోని అరకు నియోజకవర్గం శాసనసభ్యుడు కిడారి సర్వేశ్వరరావును, మాజీ శాసనసభ్యుడు సివేరి సోమను ఆదివారం మావోయిస్టులు హత్యచేయడం దశాబ్దుల ఈ బీభత్సకాండకు మరో ఆవృత్తి. ‘్భరత మావోయిస్టు కమ్యూనిస్టు పార్టీ’ సంస్థాపక వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 21న వారోత్సవం మొదలైందట. ఈ వారోత్సవాల సందర్భంగా అదను దొరికినచోట హత్యలను చేయడానికి మావోయిస్టులు పూనుకున్నారు. ఈ హత్యాకాండ మావోయిస్టులు తమ క్రౌర్యాన్ని చల్లార్చుకోవడానికి కొనసాగిస్తున్నారన్నది బహిరంగ వాస్తవం. ఈ క్రౌర్యం భారత రాజ్యాంగ వ్యవస్థపట్ల.. ఈ విద్వేషం ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల..! ప్రజాస్వామ్యానికి చట్టసభలు ప్రతీకలు, రాజ్యాంగ వ్యవస్థ ప్రస్ఫుటించే మాధ్యమాలు చట్టసభలు! అందువల్ల చట్టసభలలోని ప్రతినిధులను చంపడం ద్వారా మావోయిస్టులు తమ క్రౌర్యాన్ని చల్లార్చుకుంటున్నారు, ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకంగా తమ పగను చల్లార్చుకుంటున్నారు. ఇలా చల్లార్చుకోవడం తాత్కాలికం.. ‘రాబోయే 2050వ సంవత్సరం నాటికి భారత రాజ్యాంగ వ్యవస్థను కూల్చివేయడం..’ తమ లక్ష్యమన్నది మావోయిస్టులు పదే పదే ప్రకటిస్తున్న బీభత్స ప్రతిజ్ఞ! ఈ ‘లక్ష్యం’ 2050 నాటికి మాత్రమే కాదు, ఎప్పటికీ నెరవేరదు. అందువల్ల ‘ఎండమావి నీటి’ వంటి ఈ ‘లక్ష్య’సాధనలో భాగంగా మావోయిస్టులు హత్యాకాండను కొనసాగించడం ఆగదు! ఇద్దరు ప్రజాప్రతినిధులను ఇలా హత్య చేయగలిగిన మావోయిస్టులను ‘నిఘా’ నిరోధించలేక పోవడం మన ప్రభుత్వాల వైఫల్యానికి పునరావృత్తి! నిరోధించగలిగి ఉండి ఉంటే ప్రజాస్వామ్య వ్యవస్థకు ప్రతీకల వంటి ఈ శాసనసభ సభ్యుడు, మాజీ శాసనసభ్యుడు వర్గకలహ విషజ్వాలకు ఇలా ఆహుతి అయి ఉండేవారు కాదు!
మావోయిస్టులను సమూలంగా నిర్మూలించలేకపోవడం మన ప్రభుత్వాల దీర్ఘకాల వైఫల్యం. జిహాదీ బీభత్సకారులను పాకిస్తాన్ ప్రభుత్వం మన దేశంలోనికి ఉసిగొల్పుతున్న వాస్తవాన్ని మన ప్రభుత్వం నిరంతరం నిరసిస్తోంది, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని అభిశంసిస్తోంది. కానీ మావోయిస్టులకు చైనా ప్రభుత్వం సమకూర్చుతున్న ఆయుధ సహాయం గురించి కాని, ఆర్థిక సహాయం గురించి కాని మన ప్రభుత్వం నోరు మెదపడం లేదు. నేపాల్ మావోయిస్టులు దశాబ్దులపాటు సాయుధ బీభత్సకాండను సాగించారు. 1994 నుంచి 2004 వరకు జరిగిన ఈ బీభత్సకాండకు పదమూడు వేల మంది పోలీసులు, సైనికులు,ప్రజలు బలైపోయారు. నేపాల్ మావోయిస్టులకు ఆయుధాలు చైనా నుండి లభించాయి. 2004 తరువాత నేపాల్ మావోయిస్టులు ఆయుధ విసర్జన చేశారు. అంతవరకూ మన ఈశాన్య ప్రాంతం గుండా నేపాల్ మావోయిస్టులకు చైనా ఆయుధాలను చేరవేసింది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్ ఓడరేవుకు చైనా నుండి సముద్రం మీద తరలివస్తున్న ఆయుధాలు అక్కడి నుండి మన ఈశాన్యంలోకి, అక్కడి నుండి మన దేశంలోని వివిధ ప్రాంతాలకు నేపాల్‌కు ఈ ఆయుధాలు రవాణా అవుతున్నాయన్నది బహిరంగ రహస్యం! 2004 తరువాత నేపాల్ మావోయిస్టులు బీభత్సకాండకు స్వస్తిచెప్పారు. వారికి అందవలసిన ఆయుధాలు సైతం మన దేశంలోనే పంపిణీ అవుతున్నాయి. 2004-2009 సంవత్సరాల మధ్య మావోయిస్టు బీభత్సకాండ మరింత పెరగడానికి ఇదొక కారణం. 2009 జూన్‌లో కేంద్ర ప్రభుత్వం ‘్భరత మావోయిస్ట్ కమ్యూనిస్టు పార్టీ’- సిపిఐ మావోయిస్టు-ని నిషేధించడానికి ఇదీ నేపథ్యం!!
ఈ నిషేధం తరువాత మావోయిస్టులు మరింతగా విస్తరించిపోయారు. దేశంలోని అనేక రాష్ట్రాలలో మావోయిస్టులు బీభత్సకాండను సాగిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఝార్‌ఖండ్ ప్రాంతాలకు విస్తరించిన భూభాగం మరింతగా రక్తసిక్తం అయిపోతోంది. వివిధ రాష్ట్రాల పోలీసు విభాగాలకు నక్సలైట్లను ఎదుర్కోగల సత్తాలేదన్నది ధ్రువపడిన వాస్తవం. అందువల్ల కేంద్ర ప్రభుత్వం వారి అనుబంధ సైనిక దళాలు మావోయిస్టు పీడిత ప్రాంతాలలో భద్రతను రక్షించవలసిన పరిస్థితి ఏర్పడి ఉంది. చైనా ప్రభుత్వం అండదండలతో బీభత్సకాండను సాగిస్తున్న మావోయిస్టులను ఎదుర్కొనడం రాష్ట్ర ప్రభుత్వాలకు సాధ్యం కాదని కేంద్ర ప్రభుత్వం మాత్రమే మావోయిస్టులను ఎదుర్కోగలదని దశాబ్దుల తరబడి నిగ్గుతేలిన నిజం. జమ్మూ కశ్మీర్‌లో జిహాదీ బీభత్సకారులను ఎదుర్కొనడానికి వీలుగా మాజీ సైనికులతోను, స్థానిక యువజనులతోను స్థానిక రక్షణ సమితులు ఏర్పడినట్టు ఏళ్లక్రితం ప్రచారమైంది. ఈ ప్రభుత్వేతర సంఘాలకు ప్రభుత్వం ఆయుధాలను సైతం సమకూర్చనున్నట్టు ప్రచారమైంది. ఇప్పుడు ఈ రక్షణ సమితులు పనిచేస్తున్నట్టు సమాచారం లేదు. కానీ ప్రభుత్వాల ప్రమేయం లేకుండానే ఛత్తీస్‌గఢ్ ప్రాంతంలో ఇలాంటి స్థానిక ప్రజారక్షణ సంఘాల ఏర్పడినాయి. ‘సాల్వాజుడుమ్’ అన్న అనుసంధాన వ్యవస్థ ఏర్పడింది. మావోయిస్టుల బీభత్సకాండను ప్రతిఘటించడానికి ఏర్పడిన ఈ సంస్థకు చెందిన వనవాసీ యువజనులకు సాయుధ శిక్షణను ఇవ్వడానికి వీలుగా ఆ తరువాత ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం పథకాన్ని కూడ రూపొందించాయి.. కానీ ‘సాల్వాజుడుమ్’ను ఏర్పాటు చేయడం చట్టవ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం 2011వ సంవత్సరంలో నిర్ధారించింది. సర్వోన్నత న్యాయస్థానం తీర్పునకు అనుగుణంగా ‘సాల్వాజుడుమ్’ రద్దయిపోవడం విస్మయకరమైన విపరిణామం. ఇలా మావోయిస్టులను ప్రతిఘటించగల ప్రజల సంస్థను సుప్రీం కోర్టు రద్దుచేయడం అంతుపట్టని వ్యవహారం. అలా రద్దయిన ‘సాల్వాజుడుమ్’ అధ్యక్షుడు, వనవాసీ జన నాయకుడు మహేంద్రకర్మను 2013 మేలో మావోయిస్టులు హత్యచేశారు. మహేంద్రకర్మ తదితర కాంగ్రెస్ నాయకులు ప్రయాణిస్తుండిన వాహన శ్రేణిపై దాడి చేసిన మావోయిస్టులు అనేక మంది ప్రజాప్రతినిధులను హత్యచేశారు. ‘సాల్వాజుడుమ్’ రద్దుకాక ఉండినట్టయితే..??
ప్రధానమంత్రిని హత్య చేయడానికి కుట్ర పన్నిన ఆరోపణపై, మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణపై ఐదుగురు ప్రముఖులను గత నెల చివరిలో పోలీసులు నిర్బంధించారు. ఈ ప్రముఖులను గృహనిర్బంధంలోనే ఉంచాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించడం మరో విచిత్రం. వివిధ రాష్ట్రాలకు చెందిన ఈ ప్రముఖ నిందితులను న్యాయ నిర్బంధంలో ఎందుకని ఉంచరాదు? మావోయిస్టులు 2050 నాటికి ప్రజాస్వామ్య వ్యవస్థను కూల్చివేయడానికై కృషిచేస్తున్న అంతర్గత శత్రువులు, చైనా ప్రాబల్య విస్తరణకు ‘పతాకాలు..!’. సైనిక దళాలను రంగంలోకి దింపి తెలుగు రాష్ట్రాల్లో, ఛత్తీస్‌గఢ్, ఒరిస్సా ప్రాంతాలలో గాలింపు చర్యలు జరపడం మినహా చైనా వారి ప్రచ్ఛన్న సేనను ఎదుర్కొనడానికి మరో ప్రత్యామ్నాయం లేదు.. సైనిక దళాలను రంగంలోకి దింపడానికి కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందా? ఇప్పుడైనా..