సంపాదకీయం

జనాదేశ శుభవేళ..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఈ ఎన్నికలలో ఎవరు విజేతలన్న మహా విషయం తెలుసుకోవాలన్న తపన నాకు లేదు.. విజేతలెవ్వరో తెలియకపోయినందువల్ల నాకేమీ అసౌకర్యం కలుగదు- అని ప్రకటించింది ఆ విద్యార్థిని. ‘‘వోటు వేశావా?’’ అన్న ప్రశ్నకు ఆమె చెప్పిన వివరణ ఇది! ఇది ఇప్పటి సంగతి కాదు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికల ‘పోలింగ్’ ముగిసిన తరువాత దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండేళ్ల ఓ యువతి చేసిన ‘‘చారిత్రక ప్రకటన’’ ఇది. ఆమె ‘పోలింగ్’ కేంద్రానికి పోలేదు, తన నెచ్చెలి అయిన మరో యువతితో కలసి ‘పిక్నిక్’కు వెళ్లింది. ‘పోలింగ్’ ముగిసే సమయానికి ఆ ఇద్దరి వనవిహారం కూడ ముగిసింది. ఈ ప్రకటన చేసిన యువతి ఒక ‘హరిత ప్రాంగణం’- పార్క్-లో గోడ మెట్లమీద ఆసీనురాలయి ‘ఐస్‌క్రీమ్’ తింటున్న దృశ్యం ‘అక్షర మాధ్యమాల’- ప్రింట్ మీడియా-లో ఆవిష్కృతమైంది. ‘‘వోటు వేశావా?’’ అన్న ప్రశ్నకు ఆ యువతీమణి చెప్పిన సమాధానం ఇది! ఆమె పక్కన కూర్చుని ఉండిన స్నేహితురాలు ఈ ‘సంభాషణ’లో సైతం పాల్గొనలేదు. తనకేమీ సంబంధం లేదన్నట్టు ‘సంచార వాణి’- మొబైల్ ఫోన్-లోకి చూస్తూ ఆమె ‘మీటలు’ నొక్కుతూ ఉండిన దృశ్యం ఆవిష్కృతమైంది. ‘ఐస్‌క్రీమ్’లు తినడం, సినిమాలకు వెళ్లడం ఆధునిక జీవన విలాసం- మోడరన్ లైఫ్ స్టయిల్-! వోటు వేయడం కూడ యువజనులకు ‘విలాసం’- ఫ్యాషన్- అయినప్పుడు మాత్రమే ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియలో వారు భాగస్వాములు కాగలరు. ‘‘వోటు వేయడం మీ బాధ్యత..’’ అన్న ఉప దేశ పాండిత్య ప్రదర్శనల యువజనులు ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగస్వాములు కావచ్చు. కానీ అలా భాగస్వాములు అవుతున్న వారి సంఖ్య చాలా తక్కువ! వోటు వేయడం పట్ల వారికి ఆసక్తి కలగాలి, రుచి కలగాలి, సహజమైన అభిలాష కలగాలి! ఇలా కలిగించగల సామాజిక ప్రక్రియ విస్తరించాలి! తెలంగాణ శాసనసభ ఎన్నికలలో వోటు వేయడానికి ఉత్సాహం చూపుతున్న యువజనులు లక్షల సంఖ్యలో ఉన్నారు. శుక్రవారం జరుగుతున్న ‘పోలింగ్’లో వీరు తమ వోట్లను వేయనున్నారట! మొదటిసారి వోటు వేస్తున్న వీరందరికీ ఇది కుతూహల కారకం! వీరందరూ తండోపతండాలుగా పోలింగ్ కేంద్రాలకు తరలిరానున్నారని విశే్లషకులు, అధ్యయన వేత్తలు చెప్పుకొచ్చారు. కానీ ఎన్నికల ధ్యాస, పోలింగ్ స్పృహ, వోటు వేయాలన్న తహతహ లేని యువజనుల సంఖ్య తహతహలాడుతున్న వారి సంఖ్య కంటె రెట్టింపు ఉందని కూడ ‘అధ్యయన’ నిర్వాహకులు వెల్లడించారు. మొత్తం మీద మొదటిసారి ‘వోటు హక్కు’ లభించిన అందరూ ఒకే విధంగా ‘తహతహ’కు, ‘కుతూహలాని’కి గురి కావడం లేదు. ‘‘ఎవరు గెలిస్తే ఏమి? అందరూ అందరే...’’అన్న వ్యాఖ్యలు కూడ ‘‘మొదటిసారి హక్కు లభించిన’’ వోటర్ల నోట వెలువడుతున్నాయట! అందువల్ల వోటు వేయాలన్న ధ్యాస ఉన్న, తపన ఉన్న యువజనులు తమతోపాటు మరో ఇద్దరు యువజనులను ‘పోలింగ్’ కేంద్రాలకు తరలించుకొనిపోవాలి! ‘‘అభ్యర్థులు అందరూ అందరే కావచ్చు, కానీ వోటువేయడం వారికోసం కాదు... వోటు వేయడం మనకోసం....’’ - ఇదీ వాస్తవం, ప్రజాస్వామ్య వౌలిక సూత్రం....
ప్రజాస్వామ్యం ప్రజల ఆధిపత్యం, ప్రజల ఆదేశం ప్రకారం సమష్టి హిత సాధనం! ‘‘జనవాక్యంతు కర్తవ్యం...’’ అన్నది భారతీయ సమాజాన్ని నడిపిందన్న ఈ సమష్టి జీవన రీతి, వ్యవస్థ స్వరూపం వివిధ సమయాలలో ఒకే విధంగా లేదు, కొన్ని సమయాలలో పాలకుడిని ప్రజలు ఎన్నుకున్నారు, కొన్ని సమయాలలో వారసత్వ పరంపర పాలకుడిని నిర్ధారించింది. కానీ ఉభయ రీతులలోనూ పాలకులైనవారు ప్రజల అభీష్టం ప్రకారం పాలించాలన్నది వౌలిక సూత్రం! అందువల్ల వ్యవస్థ స్వరూపం భిన్నభిన్నంగా రూపొందినప్పటికీ ‘‘ప్రజల మాట ప్రకారం పాలకులు ప్రవర్తించాలి’’- ‘‘జనవాక్యన్తు కర్తవ్యం’’-అన్న వౌలిక స్వభావం మారలేదు. ఈ స్వభావం యుగాలుగా భారతదేశంలో వికసించిన ప్రజాస్వామ్య వౌలిక సూత్రం. గ్రామస్థాయిలోను, పట్టణ స్థాయిలోను, నగర స్థాయిలోను, ప్రాంత స్థాయిలోను ఈ స్వభావం ప్రస్ఫుటించిన చరిత్ర మనకు ఉంది. జనాభిప్రాయం వ్యక్తం కాగల ‘మాధ్యమం’ మారి ఉండవచ్చు, పద్ధతులు కాలానుగుణంగా పరివర్తన చెంది ఉండవచ్చు. కానీ ‘‘పదుగురాడు మాట పాటియై ధర చెల్లు’’ అన్న ప్రజాస్వామ్య స్వభావం మాత్రం మన దేశంలో అనాదిగా ప్రస్ఫుటించింది. అందువల్లనే ‘‘రాజునకు ప్రజ శరీరము. రాజు ప్రజకు రక్షకానరాజున్ ప్రజయున్, అన్యోన్య విరాజితులై మెలగవలయు’’అన్నది మన జాతీయ స్వభావమైంది. పాలకులు ఎప్పటికప్పుడు జన మనోభీష్టాన్ని గ్రహించి దానికి అనుగుణంగా పాలన చేయడం ప్రజాస్వామ్య ప్రాతిపదిక! పాలకులు పాలితులు వేఱువేఱు కాదు, పాలకులు కూడ పాలితులలో భాగం, పాలితులు పాలకులకు మార్గదర్శకాలు! సమస్యలు పుట్టుకొని రావడం వల్ల పరిష్కరించదగిన వ్యవస్థ అవసరమైంది. ఇది భారతీయులుగా చరిత్ర. సమస్యలు ప్రజలవి, పరిష్కరించగల వ్యవస్థకూడ ప్రజలది...
ఇలా అధికారం, బాధ్యత, సమస్యలు, పరిష్కారాలు ప్రజలవి. ఈ ధ్యాస పెరిగినప్పుడు విస్తరించినప్పుడు ప్రజలు సహజంగానే రాజ్యాంగ ప్రక్రియలో భాగస్వాములు కాగలరు! వర్తమాన సమాజంలో ఇలా భాగస్వామ్యం వహించడానికి వౌలిక మాధ్యమం ‘వోటు’ వేయడం. వోటు వేయడం ద్వారా సమాజంలోని ప్రతి ఒక్కరు స్వీయ మత- అభిప్రాయ- ఆవిష్కరణ చేయగలుగుతున్నాడు. ఇది భావస్వేచ్ఛకు, భౌతిక స్వేచ్ఛకు ప్రాతిపదిక! విదేశీయ దురాక్రమణ సమయంలోను, విదేశీయుల బీభత్స పాలన సమయంలోను ఈ స్వేచ్ఛ భంగపడింది, ఈ ప్రజాస్వామ్య స్ఫూర్తి భగ్నమైంది. ఈ దేశం పట్ల మమకారం లేని ఈ దేశాన్ని మాతృభూమిగా భావించని విదేశీయులు పాలకులుగా చెలామణి అయ్యారు. అందువల్ల ‘‘జనవాక్యన్తు కర్తవ్యం’’ - ప్రజల మాట ప్రకారం పాలన నిర్వహించాలి- అన్న రాజ్యాంగ సూత్రం వమ్మయిపోయింది. ‘పాలకులు, పాలితులు వేఱువేఱు’ అన్న వికృతి వ్యవస్థీకృతం అయింది. ఈ వికృత వ్యవస్థ శతాబ్దులపాటు కొనసాగడం వల్ల మన దేశంలో, విదేశీయుల దురాక్రమణ పూర్వం నాటి రాజ్యాంగ స్వభావం ప్రజాస్వామ్య ధ్యాస సన్నగిల్లిపోయాయి. విదేశీయ విముక్తి జరిగిన తరువాత తొలి రోజులలో ప్రజలు ‘‘ఎవరు పాలిస్తేనేమి? పీడించడానికి... పరాయి అయితేనేమి? తల పగులకొట్టడానికి!’’ అన్న నిరాశాభావాలను ఆవిష్కరించడం చరిత్ర! కానీ క్రమంగా దశాబ్దులుగా ప్రజాస్వామ్య ధ్యాస పెరిగింది, స్వభావ పునరుద్ధరణ జరుగుతోంది! ‘‘ఇది మా ఇల్లు మేమే నిర్వహించుకుంటాము’’ అన్న స్వభావానికి విస్తృతి ‘‘ఇది మా గ్రామం దీన్ని మేమే నిర్వహించుకుంటాము...’’అన్న ప్రజాస్వామ్య స్ఫూర్తి. మన రాష్ట్రాన్ని, దేశాన్ని మనమే నిర్వహించుకోవాలన్న నిష్ఠకు ప్రతీక ‘వోటు’ వేయడం!
గతంలో ఈ ‘నిష్ఠ’ను విదేశీయ దురాక్రమణ దిగమింగింది. ఈ గ్రహణం వదలిపోయింది. ‘నిష్ఠ’ మళ్లీ వికసిస్తోంది. కానీ ‘ప్రపంచీకరణ’ ఫలితంగా విస్తరిస్తున్న వాణిజ్య నిష్ఠ జాతీయ స్వభావ నిష్ఠను దిగమింగుతుండడం నడుస్తున్న చరిత్ర! ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’ పెద్దపెద్ద వాణిజ్య సామ్రాజ్యాలను ఏర్పాటు చేస్తున్నాయి. ఫలితంగా దేశం పట్లకాక వాణిజ్య సంస్థల పట్ల విధేయతను, నిబద్ధతను ప్రదర్శిస్తున్న ఆర్థిక జీవులుగా యువజనులు తయారవుతున్నారు. ‘‘క్యాంపస్ సెలక్షన్లు, పెద్ద జీతాలు, పరమ సుఖాలు, విదేశాలలో ఉద్యోగాలు...’’వంటి ‘‘వాణిజ్య పదజాలం’’ యువజనులను, విద్యార్థులను ముంచెత్తుతోంది. స్వదేశ నిష్ఠకు మళ్లీ భంగం కలుగుతోందన్న అనుమానాలు అతార్కికం కాదు. అందువల్ల ప్రపంచీకరణ మాయాజాలంలో యువజనులు బందీలు కాకుండా ఉండగలగడం కూడ ప్రధానం! ఆర్థిక ప్రగతితోపాటు సాంస్కృతిక సుగతి పట్ల కూడ అవగాహన పెరగాలి! ఇలాంటి అవగాహన యువజనులలో ‘‘తప్పక వోటు వేయాల’’న్న ‘విలాసాన్ని’-్ఫ్యషన్‌ను- పెంపొందిస్తుంది! వోటు వేయడం జీవన రీతి కావాలి!! మొత్తం ప్రజలు భోజనం చేస్తున్నట్టుగా మొత్తం వయోజనులు వోట్లు వేయడం ప్రజాస్వామ్య పరిణతకు పరాకాష్ఠ. ఇలా వంద శాతం ‘పోలింగ్’ జరిగే ఆదర్శం శుక్రవారం ఎందుకు ఆకృతిని ధరించరాదు??