సంపాదకీయం

మరో వంచన..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వంచనకు ‘సజీవ దౌత్య రూపం’గా చైనా కమ్యూనిస్టు ప్రభుత్వం పరిణతి చెంది ఉండడం అంతర్జాతీయ సమాజం గుర్తించిన నిజం.. చైనా ప్రభుత్వం మన దేశాన్ని వంచిస్తోంది, ఆగ్నేయ ఈశాన్య ఆసియా దేశాలను వంచిస్తోంది, అంతర్జాతీయ సమాజాన్ని వంచిస్తోంది. మన దేశంలోని అధికార, ప్రభుత్వ నిర్వాహక, విపక్ష రాజకీయవేత్తలు ఈ సంగతిని పెద్దగా పట్టించుకోకపోవడం మన ప్రజలకు ఆందోళన కలిగించవలసిన ప్రమాదం! చైనా కొనసాగిస్తున్న ఈ వంచన దౌత్యక్రీడకు కారణం భయం.. టిబెట్‌లో స్వాతంత్య్ర ఉద్యమం రాజుకుంటోందన్నది చైనా ప్రభుత్వం వారి భయం. ఈ ఉద్యమాన్ని ఎప్పుడో అప్పుడు మన ప్రభుత్వం సమర్ధించగలదన్నది చైనా భయం. స్వతంత్ర దేశమైన టిబెట్‌ను- మనకూ చైనాకు మధ్య విస్తరించి ఉన్న టిబెట్‌ను, దాదాపు ఐదు లక్షల చదరపు మైళ్ల వైశాల్యంకల టిబెట్‌ను- 1950వ, 1959వ సంవత్సరాల మధ్య చైనా ఆక్రమించుకొంది. కానీ ఎప్పటికైనా టిబెట్ ప్రజలు తమ దేశాన్ని మళ్లీ స్వతంత్ర దేశంగా నిలబెట్టుకోగలరన్నది చైనా భయం. చైనా వంచన క్రీడకు ఈ భయం ప్రాతిపదిక! చైనా ప్రభుత్వం అత్యంత ఆర్భాటంగా రూపొందించి అమలు జరుపుతున్న ‘ప్రాంగణ పథ పథకం’’- బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్- బిఆర్‌ఐ- వంచన క్రీడలో సరికొత్త పరిణామం! ప్రపంచ దేశాలను ప్రధానంగా ఆసియా, ఆఫ్రికా, ఐరోపా దేశాలను ఆర్థిక వాణిజ్య ప్రగతి కేంద్రాలుగా మార్చడం ఈ ‘బిఆర్‌ఐ’ లక్ష్యమని చైనా ప్రకటించి ఉంది. కానీ, రహస్యంగా వివిధ దేశాలలో ఆయుధాలను ఇతరేతర యుద్ధ పరికరాలను సైనిక శకటాలను క్షిపణులను తయారుచేయడానికి ఈ ‘బిఆర్‌ఐ’ను చైనా ఉపయోగించుకోనున్నదని ఇప్పుడు బయటపడింది. పాకిస్తాన్‌లోను ప్రత్యేకించి ‘పాకిస్తాన్ దురాక్రమిత కశ్మీర్’- పిఓకె-లోను ఇలాంటి యుద్ధ సామగ్రి బట్టీలను చైనా నిర్మిస్తున్నట్టు గురువారం ప్రచారమైన సమాచారం వల్ల ధ్రువపడింది. పాకిస్తాన్‌లోని బలూచీస్థాన్‌లోని గ్వాడార్ ఓడరేవునుంచి సింకియాంగ్‌లోని కష్‌గఢ్ వరకు చైనా నిర్మిస్తున్న ‘ఆర్థిక ప్రాంగణం’- ఎకనమిక్ కారిడార్- గుండా ఈ ‘బిఆర్‌ఐ’ నిర్మాణం కొనసాగుతోంది. ప్రాచీన కాలంలో ఆసియా-ఐరోపాల మధ్య వాణిజ్యం సాగిన ‘పట్టుబాట’ -సిల్క్ రోడ్- పునరుద్ధరణ పేరుతో చైనా ఈ ‘బిఆర్‌ఐ’ని అమలు జరుపుతోంది. ‘బెల్ట్’-ఆర్థిక వాణిజ్య ప్రాంగణాల నిర్మాణం-, రోడ్,- రహదారి నిర్మాణం-ద్వారా వివిధ దేశాల మధ్య ‘అనుసంధానం’- కనెక్టివిటీ- పెంపొందించడం ‘బిఆర్‌ఐ’ లక్ష్యమని చైనా అబద్ధపు ప్రచారం చేస్తోంది. ఈ పట్టుబాటను మన దేశానికి ఉత్తరంగా భూమి ఉపరితలంపై నిర్మించడమేకాక, సముద్ర మార్గం ద్వారా కూడ వివిధ దేశాలను అనుసంధానం చేస్తున్నట్టు చైనా ప్రకటిస్తోంది! కానీ నాలుగు వైపుల నుంచి మన దేశాన్ని వ్యూహాత్మకంగా చుట్టుముట్టడం ఈ ‘బిఆర్‌ఐ’ లక్ష్యం. అందువల్లనే మన ప్రభుత్వం ఈ ‘బిఆర్‌ఐ’లో చేరడానికి నిరాకరించింది!!
టిబెట్, సింకియాంగ్ దేశాలు స్వతంత్రంగా ఉండినంత కాలం ఈ ‘పట్టుబాట’- సిల్క్ రోడ్-పై చైనాకు పట్టులేదు. చైనానుంచి టిబెట్ గుండా మన కశ్మీర్‌కూ ప్రాచీన ‘హూణ’ దేశానికీ మధ్య ఉండిన సరిహద్దు గుండా, అఖండ భారత్‌లో భాగంగా ఉండి ఇప్పటి పాకిస్తాన్, అఫ్ఘానిస్థాన్‌ల గుండా ఇరాన్ వరకు సిరియా వరకూ ఈ ‘పట్టుబాట’ కొనసాగింది. ఈ పట్టుబాట టిబెట్ పొడవునా కొనసాగింది. అందువల్ల చైనాలో ఈ రహదారికి ప్రాధాన్యం లేదు. టిబెట్ నేపాల్ కశ్మీర్ గంగాధర తదితర ఉత్తర, వాయువ్య భారతదేశానికి చెందిన ‘బేహారులు’ ప్రధాన ఈ మార్గం గుండా పయనించారు. పడమటి దేశాలవారు ప్రధానంగా మన దేశంతో వ్యాపారం చేశారు.. చైనాతో కాదు. టిబెట్ క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్దివరకూ మన దేశంలో- అఖండ భారత్‌లో- భాగం! త్రివిష్టపంగా వినుతికెక్కిన ఈ ప్రాంతంలోనే బ్రహ్మపుత్ర వంటి నదులు ప్రవహిస్తున్నాయి, కైలాస పర్వతం, గౌరీశంకర శిఖరం, సాగర్ మాత- హిమాలయ- పర్వతశ్రేణులు త్రివిష్టపంలో విస్తరించాయి. సాగరాల వరకు సాగుతున్న అనేక జీవ నదులకు జన్మస్థానమైన ‘మానస సరోవరం’ భారతీయులకు తరతరాల వారసత్వం.. ఈ త్రివిష్టపం క్రీస్తునకు పూర్వం ఆరవ శతాబ్ది నుంచి ‘అఖండ భారత్’కు ‘‘దూరంగా జరిగి’’ స్వతంత్ర దేశంగా అవతరించడం చారిత్రక విపరిణామం. అయినప్పటికీ టిబెట్ సాంస్కృతికంగా అఖండ భారత జాతీయతత్త్వలో భాగం కావడం చరిత్ర!
ఈ చరిత్రను బ్రిటన్ దురాక్రమణకారులు చెఱచారు, చైనావారు చెఱచారు! చైనా దురాక్రమణ నుంచి తమ దేశాన్ని కాపాడవలసిందిగా టిబెట్ ప్రభుత్వం చేసిన విజ్ఞప్తులను 1950వ 1949వ సంవత్సరాల మధ్య మన ప్రభుత్వం పట్టించుకోలేదు. టిబెట్ స్వాతంత్య్రాన్ని పరిరక్షించవలసిన బాధ్యత మన ప్రభుత్వానికి ఉందని అప్పటి ఉప ప్రధానమంత్రి సర్దార్ వల్లభ భాయిపటేల్ ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూకు పదే పదే నివేదించాడు. కానీ, ‘‘టిబెట్ స్వాతంత్య్రం చచ్చిపోయింది..’’ అని జవహర్‌లాల్ నెహ్రూ ప్రకటించాడు. సర్దార్ పటేల్ మరణం తరువాత జవహర్‌లాల్ అడ్డులేకుండా పోయింది. అందువల్ల ఆయన టిబెట్‌ను చైనా దురాక్రమించడానికి అడ్డుచెప్పలేదు. పైపెచ్చు ప్రోత్సహించాడు. 1914లో కుదిరిన ఒప్పందంమేరకు బ్రిటన్ ఆక్రమిత భారత ప్రభుత్వం టిబెట్‌లో మన సైనిక దళాలను నెలకొల్పింది. చైనా దురాక్రమణ నుంచి తమకు రక్షణ కల్పించాలన్న టిబెట్ పాలకుల అభ్యర్థన మేరకు భారత సైనికులు టిబెట్‌కు వెళ్లి రక్షణ విధులను నిర్వహించారు. కానీ భారతీయ సైనిక దళాలను టిబెట్ నుంచి- 1950వ దశకం ఆరంభంలోనే- మన ప్రభుత్వం ఉపసంహరించింది. ఈ ‘ఉపసంహరణ’ కారణంగా చైనా ప్రభుత్వం టిబెట్‌ను దురాక్రమించగలిగింది. 1959లో హత్యకు గురికాకుండా తప్పించుకొని వచ్చి మన దేశంలోని హిమాచల్‌ప్రదేశ్‌లోని ధర్మశాలలో స్థిరపడిన టిబెట్ అధినేత దలైలామా ప్రవాస ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశాడు!
ఈ ప్రవాస ప్రభుత్వాన్ని ఇంతవరకు ప్రపంచంలోని ఏ ప్రభుత్వం కూడ గుర్తించలేదు. అయినప్పటికీ టిబెట్‌లోని స్వాతంత్య్ర వీరులకు మన దేశం, ఇతర దేశాలు మద్దతును ఇస్తున్నాయన్న భయం చైనాను ఆవహించి ఉంది. ఈ భయం కారణంగా టిబెట్‌లో స్థానిక టిబెట్ ప్రజలకంటే ‘హాణ’- చైనా- జాతీయుల సంఖ్యను అధికం చేయడానికి చైనా యత్నిస్తోంది. ఈ ప్రయత్నంలో భాగం ‘బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్!’ భయం పెరిగినకొద్దీ చైనా టిబెట్‌లో దమనకాండను పెంచుతోంది. 2008లో ‘ఒలింపిక్స్’ క్రీడల సందర్భంగా టిబెట్ స్వాతంత్య్ర ఉద్యమకారులు ప్రపంచవ్యాప్తంగా నిరసనలు తెలిపినప్పటినుంచి ఈ దమనకాండ మరింత పెరిగింది. టిబెటన్లకు నైతిక సమర్థనను సమకూర్చడానికి దోహదం చేసే చట్టాన్ని అమెరికా ప్రభుత్వం ఆమోదించింది. టిబెట్‌లోప్రవేశించి సమాచారాన్ని సేకరించడానికి తమ దేశీయులకు అనుమతినివ్వాలని, నిరోధించినట్టయితే ‘‘ఇందుకు బాధ్యులైన చైనా అధికారులను అమెరికాలో ప్రవేశించకుండా నిరోధించాలని’’ ఈ చట్టం నిర్దేశిస్తోంది. ఢిల్లీలో శుక్రవారం జరిగిన భారత, చైనా చర్చలకు ఇదంతా విచిత్రమైన నేపథ్యం.. గూఢచర్యం నిర్వహిస్తున్న అభియోగంపై అరవై మంది చైనీయ నిపుణులను దేశం నుండి వెళ్లగొట్టడానికి గురువారం మన ప్రభుత్వం నిర్ణయించడం ‘‘ఉభయ దేశాల ప్రజల సంబంధాల ప్రహసనం’’లోని వర్తమాన ఘట్టం..