సంపాదకీయం

పెట్టుబడుల భ్రాంతి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రభుత్వేతర రంగానికి చెందిన ‘ఐసిఐసిఐ’ బ్యాంకు ‘మేనేజింగ్ డైరెక్టర్’ పదవి నుంచి, ఆ సంస్థ నుంచి చందాకొచ్చర్‌ను తొలగించడం ప్రతీక మాత్రమే! ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాల్లోని ఆర్థిక వాణిజ్య సంస్థలలో అవినీతి, అక్రమాలు నిహితమై ఉండడం అసలు కథ. ‘ప్రపంచీకరణ’, ‘స్వేచ్ఛా వాణిజ్య వ్యవస్థ’- మార్కట్ ఎకానమీ- ఫలితంగా విస్తరించిపోయిన, విస్తరించిపోతున్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థల మధ్య మన దేశంలో ఏళ్లతరబడి యుద్ధం జరుగుతోంది. ఈ వాణిజ్య యుద్ధం- కార్పొరేట్ వార్- గురించి ఇటీవల మన రక్షణమంత్రి నిర్మలా సీతారామన్ కూడ ప్రస్తావించారు. చిన్న చిన్న వాణిజ్య సంస్థలను పెద్ద వాణిజ్య సంస్థలు దిగమింగుతుండడం ఈ ‘యుద్ధం’లో భాగం! ఒక పెద్ద వాణిజ్య సంస్థను మరో పెద్ద వాణిజ్య సంస్థ కొనుగోలు చేయడం కూడ ఈ వాణిజ్య యుద్ధం విస్తరిస్తున్న తీరునకు నిదర్శనం. ‘వాల్‌మార్ట్’అన్న అమెరికా ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’ ఇటీవల ‘ ఫ్లిప్‌కార్ట్’ అన్న భారతీయ సంస్థను స్వాధీనం చేసుకోవడం ఈ ‘దిగమింగడం’లో భాగం. ‘వాల్‌మార్ట్’, ‘అమెజాన్’ సంస్థల మధ్య అంతర్జాతీయంగా పోటీ నడుస్తోంది. ఈ అమెరికా సంస్థలను మాత్రమే మరిన్ని అమెరికా సంస్థలను, ఐరోపా సంస్థలను ఇతర దేశాల సంస్థలను చైనావారి ‘బహుళ జాతీయ సంస్థలు’ కబళించడానికి సిద్ధంగా ఉండడం ‘ప్రపంచీకరణ’ వాణిజ్య చరిత్రలో వర్తమాన ఘట్టం. ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’- మల్టీ నేషనల్ కంపెనీ- ఆర్థిక పరిమాణం, వాణిజ్య విస్తృతి అధికవౌతున్నకొద్దీ అంతర్నిహిత ‘అవినీతి అక్రమ’ స్వభావం కూడ విస్తరిస్తోంది. అందువల్ల అమెరికా, ఐరోపాకు చెందిన ‘బహుళ జాతీయ సంస్థ’ల అవినీతి పరిధి కంటె చైనా సంస్థల అవినీతి, అక్రమాల పరిధి మరింత విస్తరించిపోయింది! చైనా సంస్థల అవినీతి అక్రమ కలాపాలను అమెరికా, ఐరోపా ప్రభుత్వాలు ఇప్పుడిప్పుడే పట్టించుకుంటున్నాయి. వాల్‌మార్ట్, అమెజాన్, మొన్‌సాంట్ వంటి అమెరికా వాణిజ్య సంస్థలకు, నెజల్- నెస్లే- వంటి ఐరోపా సంస్థలకు వ్యతిరేకంగా అంతర్జాతీయంగా ప్రజా ఉద్యమాలు ఏళ్లతరబడి జరుగుతూనే ఉన్నాయి. తమ దేశాలకు చెందిన సంస్థలు ఇతర దేశాలలో వాణిజ్య రంగాలలో చొరబడి దోపిడీ చేసినంత కాలం అమెరికా, ఐరోపా దేశాల ప్రభుత్వాలకు అవినీతి, అక్రమాల ధ్యాస కలుగలేదు. చైనా సంస్థలు తమ దేశాలలో చొరబడి పోవడంతో అమెరికా, ఐరోపా దేశాలు ఉలిక్కిపడుతున్నాయి. చైనా సంస్థలను నిరోధించడానికి అమెరికా, ఐరోపా సమాఖ్య దేశాల ప్రభుత్వాలు, ఈ దేశాల వాణిజ్య సంస్థలను నిరోధించడానికి చైనా ప్రభుత్వం యత్నిస్తుండడం నడుస్తున్న చరిత్ర. ‘హువావేరుూ’అన్న చైనా సంస్థకు వ్యతిరేకంగా అమెరికా ప్రభుత్వం రెండు నేరాభియోగాలను దాఖలు చేయడం అంతర్జాతీయ వాణిజ్య యుద్ధంలో భాగం. ఈ వాణిజ్య యుద్ధం మన దేశంలో కూడ కొనసాగుతోంది. కానీ ఈ యుద్ధం ఏకపక్షంగా మారి ఉంది. భారతీయ వాణిజ్య సంస్థలను అమెరికా, ఐరోపా, చైనా, దక్షిణ కొరియా వంటి సంస్థలు దిగమింగడం ఈ ఏకపక్ష దురాక్రమణ, ప్రతిఘటన లేదు. భారతీయ వాణిజ్య సంస్థలు క్రమంగా అంతరించిపోతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థ వాణిజ్య వ్యవస్థ విదేశీయ వాణిజ్య సంస్థల ‘కబంధ బంధ’గ్రస్తవౌతున్నాయి. మన ప్రభుత్వం ఈ వాణిజ్య దురాక్రమణను అరికట్టడం లేదు.. ఇదీ తేడా- మన ప్రభుత్వానికీ, పాశ్చాత్య ప్రభుత్వాలకు మధ్య!!
పెట్టుబడులు తరలి వస్తున్నాయన్న భ్రమతో మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వారు విదేశీయ వాణిజ్య సంస్థల చొరబాటును ప్రోత్సహిస్తున్నారు. కానీ చొరబడుతున్న ‘బహుళ జాతీయ సంస్థలు’ మోసుకొని వస్తున్న పెట్టుబడుల కంటె- సాలీనా- ఆ సంస్థలు మోసుకొని వెడుతున్న లాభాల విలువ అధికంగా ఉంది! పెట్టుబడులు లభిస్తాయన్న ‘మోహం’తో విదేశీయ సంస్థలతో జట్టుకడుతున్న స్వదేశీయ సంస్థలకు పెట్టుబడులు లభించడం లేదు. క్రమంగా స్వదేశీయ సంస్థలు విదేశీయ సంస్థలలో విలీనమైపోతున్నాయి. ‘ ఫ్లిప్‌కార్ట్’ సంస్థ ‘వాల్‌మార్ట్’లో కలసిపోవడం ఇందుకు నిదర్శనం. ‘వీడియోకాన్’ అన్న సంస్థకు ‘ఐసిఐసిఐ’ బ్యాంక్ మంజూరు చేసిన ఋణం చందాకొచ్చెరమ్మ పదవీచ్యుతికి దారితీసింది. ఋణం మంజూరు చేసిన తీరులో అక్రమాలు జరిగాయన్నది ప్రధాన ఆరోపణ. మూడువేల రెండు వందల యాబయి కోట్ల రూపాయల ఋణాన్ని వీడియోకాన్ సంస్థకు మంజూరు చేసిన సమయంలో ‘ఐసిఐసిఐ’ బ్యాంక్ ప్రధాన నిర్వాహక అధికారిణిగా ఉండిన చందాకొచ్చర్ ‘అక్రమాలు బయట పడడం’తో గత ఏడాది సెలవు పెట్టింది, రాజీనామా చేసింది, ఇప్పుడు బ్యాంక్ యాజమాన్యం వారు ఆమెను పదవి నుంచి తొలగించారు. ఇదంతా ‘ఐసిఐసిఐ’ బ్యాంకుకు, చందాకొచ్చర్‌కు పరిమితమైన వాణిజ్య వివాదం కావచ్చు. కానీ ఈ ‘అక్రమం’ విస్తృత వాణిజ్య అవినీతి సామ్రాజ్యంలో ఒక చిన్న అంశం మాత్రమే! ప్రభుత్వరంగ, ప్రభుత్వేతర రంగ బ్యాంకులలోను, వాణిజ్య సంస్థలలోను, స్వచ్ఛంద సంస్థల పేరుతో చెలామణి అవుతున్న దళారీ ముఠాలలోను అవినీతి పుట్టలుగా గుట్టలుగా పెరిగిపోవడం అసలు కథ!
‘వీడియోకాన్’ సంస్థకు ప్రభుత్వ, ప్రభుత్వేతర రంగాలలోని బ్యాంకులు మంజూరు చేసిన నలబయి వేల కోట్ల రూపాయల ఋణంలో ‘ఐసిఐసిఐ’ బ్యాంకు వారు ఇచ్చిన అప్పుకూడ భాగమట! ఈ ‘వీడియోకాన్’ సంస్థ ‘నెట్ ఫ్లిక్స్’ అన్న అమెరికా ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థ’తో అనుసంధానమై ఉందట! కానీ ఈ సంస్థకు కావలసిన పెట్టుబడులను మాత్రం మన దేశంలోని బ్యాంకులు సమకూర్చవలసి వచ్చింది. విదేశాల నుంచి నిధులు తరలివస్తున్నాయన్న ప్రభుత్వ ప్రచార ఆర్భాటంలోని డొల్లతనానికి ఇది ఒక నిదర్శనం మాత్రమే! బ్యాంకులలో స్వదేశీయులైన ఖాతాదారులు జమచేసిన సొమ్మును బ్యాంకులవారు పెద్ద, చిన్న వాణిజ్య సంస్థలకు అప్పులు ఇస్తూ ఉన్నారు. ఇలా పెట్టుబడులలో అత్యధిక శాతం దేశంలోనే సమకూడుతున్నాయి. ఈ పెట్టుబడులను సమకూర్చుతున్న వారు ‘బ్యాంకుల’లో తమ డబ్బును జమచేస్తున్న ఖాతాదారులు! కానీ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం విదేశాలకు చెందిన ‘వాణిజ్య సంస్థల’ ముందు సాగిలపడి పెట్టుబడుల కోసం దేబిరిస్తున్నారు. సాలీనా దేశంలో పెట్టుబడుల విలువ ఎంత? అందులో విదేశాల నుంచి లభిస్తున్న ‘విదేశీయ సంస్థాగత నిధులు’- ఫారిన్ ఇన్‌స్టిట్యూషనల్ ఇనె్వస్టిమెంట్- ఎఫ్‌ఐఐ- విలువ ఎంత? విదేశీయ ప్రత్యక్ష భాగస్వామ్య నిధుల- ఫారిన్ డైరక్ట్ ఇనె్వస్టిమెంట్- ఎఫ్‌డిఐ- విలువ ఎంత? దేశ ప్రజలు సమకూర్చుతున్న నిధుల విలువ ఎంత? అన్న వివరాలను ప్రతి ‘బడ్జెట్’-వార్షిక ఆదాయ వ్యయ పత్రం- లోను ప్రభుత్వం వెల్లడించాలి. రాష్ట్ర ప్రభుత్వాలు తమ ప్రాంతానికి చెందిన ఈ వివరాలను వెల్లడించాలి! దీంతో విదేశాల నుంచి భారీగా పెట్టుబడులు లభిస్తున్నాయన్న ప్రభుత్వాల వాదంలోని డొల్లతనం తేటతెల్లం కాగలదు.
‘పనామా’ పేపర్ల పేరుతో 2016లో వెల్లడయిన ‘నల్లధనం’ వివరాలు దేశంలో ప్రకంపనాలు సృష్టించాయి. దోషులకు ఇంతవరకు దండన లభించకపోవడం వేరే కథ. కానీ దేశం నుంచి లక్షల కోట్ల నల్లధనం ప్రతి ఏటా విదేశాలకు తరలిపోతోంది. స్విట్జర్లాండ్ బ్యాంకులలోని నల్లధనం గుట్టు పూర్తిగా రట్టుకాక మునుపే నల్లధనాన్ని అక్కడి నుంచి తరలించేసినట్టు కూడ ధ్రువపడింది. చిన్న చిన్న దేశాలలోని, ద్వీపాలలోని బ్యాంకులకు ఈ నల్లధనం తరలిపోయిందట! ఏమయినప్పటికీ అమెరికా, ఐరోపా, చైనా, కొరియా వంటి సంపన్న దేశాలకు చెందిన వాణిజ్య సంస్థలకు మన దేశం నుంచి తరలివెళ్లిన నల్లడబ్బును ఆయా ‘బ్యాంకులు’వారు ఋణాలుగా చెల్లిస్తున్నారు. ఈ వాణిజ్య సంస్థలు ఈ డబ్బును మన దేశంలో పెట్టుబడుల పేరుతో ‘ప్రచారం’ చేస్తున్నారన్నది ‘పనామా’ పేపర్ల ద్వారా వెల్లడయిన రహస్యం. ఇలా మన దేశంలోని నల్లడబ్బు బయటికి వెళ్లి, మళ్లీ పెట్టుబడుల రూపంలో దేశంలోకి చొరబడిపోతోంది. ఇదీ ‘‘రహస్యం’’. అందువల్ల నల్లడబ్బు దేశం నుంచి తరలిపోకుండా ప్రభుత్వం నిఘా పెంచగలిగితే, నిరోధించ గలిగితే విదేశీయుల నిధులు మనకు అవసరం లేదు..