సంపాదకీయం

అలగ్జాండర్ ‘‘ఘనత’’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గ్రీసు దేశానికి చెందిన బీభత్సకారుడు అలగ్జాండర్ ‘విశ్వ విజేత’ అన్నది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ- తెదేపా- అధినేత నారా చంద్రబాబు నాయుడు పునరావిష్కరించిన మహా విషయం. ‘పునరావిష్కరణం’ ఎందుకంటే మన దేశాన్ని గతంలో దురాక్రమించిన బ్రిటన్ రాజకీయ బౌద్ధిక ఆర్థిక బీభత్సకారులు ఈ ‘సంగతి’ని మొదట ఆవిష్కరించారు. బ్రిటన్ దొరలు రాక పూర్వం, బ్రిటన్ జాతి పుట్టక పూర్వం యుగయుగాలుగా మన చరిత్రను మనం వ్రాసుకున్నాము. మనం వ్రాసుకున్న మన చరిత్ర ప్రకారం ఈ గ్రీసు దేశపు అలగ్జాండర్ ప్రపంచాన్ని జయించలేదు. అతగాడికి ప్రపంచం ఎంత ఉందో కూడ తెలీదు. కానీ బ్రిటన్ దురాక్రమణదారులు మనం వ్రాసుకున్న మన చరిత్రను చింపేసిపోయారు. మన దేశానికి కొత్త చరిత్ర వ్రాసిపోయారు. ఈ కొత్త భారత చరిత్ర రావణాసురుడు వ్రాసిన రామాయణం వంటిది. పాశ్చాత్యులు వ్రాసిన భారత చరిత్ర ప్రకారం పాశ్చాత్య బీభత్సకారుడైన అలగ్జాండర్ ‘‘విశ్వవిజేత’’ అయ్యాడు! మన విద్యాలయాలలో ఇప్పటికీ ఈ ‘బ్రిటన్ లిఖిత చరిత్ర’ను బోధిస్తుండడం చంద్రబాబు అలగ్జాండర్ పట్ల వ్యక్తం చేసిన ప్రశంసాభావానికి నేపథ్యం. అలగ్జాండర్ ‘విజేత’ కాబట్టి తాను కూడ ఈ ‘చట్టసభల’ ఎన్నికలలో ‘విజేత’కాగలనన్నది చంద్రబాబు ప్రచార ప్రసంగంలో ధ్వని. చంద్రబాబు గొప్ప ప్రచారవేత్త, ప్రచార వ్యూహకర్త. అందువల్ల గత ఐదేళ్ల తమ పరిపాలన విజయాలను ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. కానీ విజయానికి ప్రతీకగా తెలుగు ప్రాంతంలోని మహాపురుషులు కాని, భారతదేశపు వీరులు కాని చంద్రబాబుకు గుర్తుకు రాకపోవడం విచిత్రమైన వ్యవహారం. ఆంధ్రభోజుడైన శ్రీకృష్ణదేవరాయలను చంద్రబాబు ‘విజేత’కు ప్రతీకగా ప్రస్తావించవచ్చు. ‘సమరాంగణ సూత్రధారుడు’ అయిన అసలు భోజరాజునే ప్రస్తావించి చంద్రబాబు తన ‘ఎన్నికల సమర’ విజయాన్ని ఆకాంక్షించి ఉండవచ్చు! కృష్ణదేవరాయలు, అంతకుపూర్వం కాకతీయ రుద్రమదేవి తెలుగునేలను దక్షిణ భారతాన్ని పాలించారు. అందువల్ల చంద్రబాబు వీరు జయించిన దానిలో పాతిక శాతం జయిస్తే చాలు.. మళ్లీ ఆంధ్రప్రదేశ్‌కు ముఖ్యమంత్రి కాగలడు. ఇదంతా వదలిపెట్టి మన దేశానికి శత్రువైన, మన దేశంలోకి చొరబడడానికి యత్నించి, ఓడిపోయి, పారిపోయిన ‘అలగ్జాండర్’ అనే విదేశీయ బీభత్సకారుడిని భారతీయ ప్రముఖులలో ఒకడైన చంద్రబాబు ప్రశంసించడం స్థాయికి తగని చేష్ట.. క్రీస్తునకు పూర్వం నాలుగవ శతాబ్ది చివరిలో ఈ ‘మాసిడోనియాకు చెందిన’ అలగ్జాండర్ మన దేశంలోకి చొరబడి వాయువ్య సీమలలోకి చొరబడి ధ్వంసకాండ, దగ్ధకాండ, దోపిడీకాండ సాగించాడు. ఆ ‘సమయంలో మన దేశంలో ‘గిరివ్రజం’ రాజధానిగా ఆంధ్ర శాతవాహన సమ్రాట్టుల పాలన ముగిసింది. గుప్తవంశపు చంద్రగుప్తుడు ‘సమ్రాట్’ అయ్యాడు. చంద్రగుప్తుని కుమారుడైన సముద్రగుప్తుడు యువరాజు. ఈ గుప్త సమ్రాట్టుల సైనిక బలం గురించి సరిహద్దులలోనే గ్రహించిన ‘అలగ్జాండర్’ తోకముడిచి వెనుదిరిగి పోవడం వాస్తవ చరిత్ర...
చంద్రబాబు తనను గుప్తవంశపు చంద్రగుప్తునితోను, తన కుమారుడు లోకేశ్‌ను సముద్ర గుప్తునితోను పోల్చుకుని ప్రచార విజయ విశ్వాసాన్ని వ్యక్తం చేసి ఉంటే ‘తెలుగు తమ్ముళ్లు’ సంతోషించి ఉండేవారు! తిరిగి పోతూపోతూ ఆ ‘అలగ్జాండర్’ దారిపొడవునా భయంకరమైన బీభత్సకాండ జరుపడం కూడ భారతీయ చరిత్రకారులు చెప్పిన వాస్తవం! ఈ చరిత్రను బ్రిటన్ ముష్కరులు నిరాకరించి ఉండవచ్చు. భారతీయులు కూడ నిరాకరించాలా? అలగ్జాండర్‌ను, గ్రీసు బీభత్సకారుడిని ‘గ్రీసువీరుడు’ అని పొగడాలా? అలగ్జాండర్ మన దేశంలోకి చొరబడడానికి యత్నించిన సమయంలో మన దేశాన్ని వౌర్యచంద్రగుప్తుడు పాలించేవాడని బ్రిటన్ మేధావులు చెప్పడం మరో చారిత్రక అబద్ధం.. వౌర్యచంద్రగుప్తుడు అలగ్జాండర్ కంటె దాదాపు పదమూడు వందల సంవత్సరాలకు పూర్వం మన దేశంలో పుట్టిపెరిగిన జాతీయవీరుడు! కానీ మన ముఖ్యమంత్రులకు రాజకీయవేత్తలకు విదేశీయులను ప్రత్యేకించి మన దేశపు శత్రువులను ప్రశంసించడం జీవన ‘విలాసం’- ఫాషన్ కావడం గొప్ప భావదాస్యం.. అనభిజ్ఞులు, సామాన్యులు ఈ 'భావదాస్యాని’కి గురి అయి ఉండడం సహజం. ‘గ్రీకువీరుడు’ అని సినిమాలలో వేషాలు వేసేవారు, సినిమాలలో వ్రాసేవారు, సినిమాలు తీసేవారు, అలాంటి చెత్త సినిమాలను అమాయకంగా చూసి ఆనందించేవారు ‘అలగ్జాండర్’ను సంభావిస్తూ ఉండవచ్చు. ఇలాంటి అనభిజ్ఞ- ఇగ్నోరెంట్-, అమాయక - ఇన్నోసెంట్- భారతీయులకు వాస్తవ చరిత్రను చెప్పడం పాలకుల విధి. పాలకులు కూడ ‘అలగ్జాండర్’ను పొగడడం ‘కంచెలు చేను మేయడం..’
ఈ గ్రీసు అలగ్జాండర్‌కు పది లక్షల సైన్యం ఉండేదన్నది చంద్రబాబు నాయుడు ‘‘కనిపెట్టి’’ వెల్లడించిన మరో మహావిషయం. ఆంగ్లేయ మేధావులు సైతం ‘‘కనిపెట్టడం’’ మరచిపోయిన విచిత్రమిది. అలా ‘పది లక్షల సైన్యం’తో అలగ్జాండర్ ప్రపంచాన్ని జయించాడట! ఏ ప్రపంచాన్ని జయించాడో మరి?! అందువల్ల అరవై ఐదు లక్షల సైన్యం- తెలుగుదేశం పార్టీ సభ్యులు- ఉన్న తాము కూడ జయించి తీరుతామన్నది చంద్రబాబు ఆవిష్కరిస్తున్న విశ్వాసం. చంద్రబాబు ఇలా సంఖ్యాబలాన్ని పూర్వపు వీరులతో పోల్చదలిస్తే మన దేశంలోనే అనేకమంది చరిత్రలో శాశ్వతులైనవారు ఉన్నారు. అలగ్జాండర్ భారతీయుడు కాదు, వీరుడు కాదు, బీభత్సకారుడు. తమ మాసిడోనియా రాజ్యానికి సమీపంలోనే ఉన్న గ్రీసుదేశంలోనే ఉండిన 'ధబ్స్’ నగరాన్ని క్రీస్తునకు పూర్వం మూడు వందల ముప్పయి ఆరవ సంవత్సరంలో నేలమట్టం చేసిన విధ్వంసకారుడు అలగ్జాండర్. ఈ విధ్వంసకాండను ఈజిప్ట్, సిరియా, మెసపుటేమియా- ఇరాక్, పారశీక- ‘ఇరాన్’ల లో సాగించాడు. ఈ ప్రాంతాలే అతగాడికి తెలిసిన ‘ప్రపంచం’! మన యోన, గాంధార- అఫ్ఘానిస్థాన్- రాజ్యాలలో కూడ ఈ బీభత్సకాండను సాగించి పారిపోయాడు! ఈ పరిమిత ప్రాంతాన్ని జయించిన అలగ్జాండర్ ప్రపంచ విజేత ఎలా అయ్యాడు? భారతీయ వీరులు, సైనికులు దురాక్రమించిన శత్రు సైనికులతో మాత్రమే పోరాడారు.. గెలిచారు. గెలిచిన మనవీరులు నిరాయుధులైన ప్రజలను చంపలేదు, గ్రామాలను నగరాలను నేలమట్టం చేయలేదు. జాతీయ, సాంస్కృతిక కేంద్రాలను ధ్వంసం చేయలేదు. కానీ అలగ్జాండర్ దారిపొడుగునా హత్యాకాండ జరిపాడు! ఇది పాశ్చాత్యుల ‘‘విశ్వ విజేత" భావం! వారు గెలిచిన ప్రతిచోటా బీభత్సకాండను సృష్టించారు. భారతీయులకు అనాదిగా ప్రపంచమంతా తెలుసు, నవద్వీపాలు- తొమ్మిది ఖండాలు-గా ప్రపంచాన్ని భారతీయులు అనాదిగా గుర్తించారు. కానీ భారతీయ వీరులు ప్రపంచాన్ని జయించడానికి బయలుదేరలేదు. దురాక్రమణను ఢీకొని తిప్పికొట్టారు. భారతీయ సంస్కృతి పరిమళాలు, సంస్కారాల సుగంధాలు సహజంగా ప్రపంచమంతటా విస్తరించాయి. ఇదీ భారతమాత విశ్వగురుత్వం! అందువల్ల లక్షల కార్యకర్తలను లక్షల వీరులతో పోల్చుకొనదలచిన రాజకీయ పక్షాల అధినేతలకు భారతీయ ఉదాహరణలు స్ఫురించాలి. మహాభారత యుద్ధంలో ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో పాండవుల ఏడు ‘అక్షోహిణీల సైన్యం’ గురించి చంద్రబాబు వంటి రాజకీయ వేత్తలకు స్ఫురించాలి.. అలగ్జాండర్‌ది బీభత్సపు మూక, కొల్లగొట్టిన ముష్కర మూక!
అమెరికా వారి ‘ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరో’- ఎఫ్‌బిఐ- గొప్పతనం చంద్రబాబుకు స్ఫురించడం మరో వైచిత్రి.. ‘‘నేరం చేసిన వానికి మనసులో ఆ సంగతి మెదలుతూనే ఉంటుందట, పైకి మాత్రం వాడు గొప్పవానివలె అభినయిస్తున్నాడట’’- ఈ సంగతిని ‘ఎఫ్‌బిఐ’ నుండి అమెరికా నుండి చంద్రబాబు గ్రహించడం తప్పుకాదు. ‘‘ఆనోభద్రాః క్రతవోయన్తు విశ్వతః’’ -మంగళకర భావాలు ప్రపంచం నలుమూలల నుంచి మాకు చేరాలి’’-అన్నది మన జాతీయ స్వభావం. కానీ మొదట మనవద్దనే ఉన్న మంగళకర భావాలను మనం గుర్తించాలి కదా! ఈ ‘అమెరికా ఎఫ్‌బిఐ’ చెప్పిన మాటను వందల ఏళ్లకు పూర్వం వేమన యోగి ఇలా చెప్పాడు..
‘‘అంతరంగమందు అపరాధములు చేసి
మంచివాని వలెనె మనుజుడుండు’’