సంపాదకీయం

మతం.. మానవత్వం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మానవీయ స్వభావాన్ని ‘మత వివక్ష’గా చిత్రీకరించడానికి జరుగుతున్న ప్రయత్నం ‘పౌరసత్వ సవరణ ప్రతిపాదన’-సిటిజన్‌షిప్ అమెండ్‌మెంట్ బిల్- సీఏబీ-ను వ్యతిరేకిస్తున్నవారు చెబుతున్న వికృత భాష్యం! ఈ వ్యితిరేకులు దేశంలో ఉన్నారు, విదేశాలలో ఉన్నారు. ఈ ‘బిల్లు’ను వ్యతిరేకిస్తున్న అంతర్గత విరోధులు ప్రభుత్వాన్ని, దేశాన్ని అంతర్జాతీయ సమాజంలో అప్రతిష్ఠపాలు చేస్తున్నారు. ఈ ‘వ్యతిరేకుల’ ఆర్భాటాన్ని అందిపుచ్చుకున్న విదేశాల ప్రభుత్వాలు కొన్ని మన దేశంలో ‘మతపరమైన వివక్ష’కు ‘పౌరసత్వ సవరణ ప్రతిపాదన’ దోహదం చేస్తోందన్న వక్రభాష్యాలు పలుకుతున్నారు. పాకిస్తాన్‌లోను, అఫ్ఘానిస్థాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను అత్యధిక శాతం ప్రజలు ఇస్లాం మతస్థులు. ఇస్లాం మతస్థులు అధికాధికంగా ఉండే దాదాపు ప్రతి దేశంలోను ‘జిహాదీ’లు చెలరేగడం, ఈ ‘జిహాదీ’లు ఇస్లామేతర మతాల వారిని నిర్మూలిస్తుండడం నడుస్తున్న చరిత్ర! ఈ మూడు దేశాలలో కూడ ఇస్లాం మతస్థులు అత్యధికంగా ఉన్నారు. అందువల్ల దశాబ్దులపాటు ఇస్లామేతర మతస్థులను జిహాదీలు హత్యచేశారు, మతం మార్చారు, లైంగిక బీభత్సకాండకు గురిచేశారు, తరిమివేశారు. ఇలా తరిమివేతకు గురి అయిన ఇస్లామేతర మతాలవారు మన దేశంలో తలదాచుకుంటున్నారు. ఏళ్లతరబడి ‘శరణార్థులు’గా పడిఉన్న ఈ ఇస్లామేతర మతాల వారికి భారతీయ పౌరసత్వం ప్రసాదించడానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం ‘పౌరసత్వ సవరణ ప్రతిపాదన’ను రూపొందించింది. ఈ ‘బిల్లు’ను పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించడం అందువల్ల చారిత్రక మానవీయ పరిణామం. ఇలా ‘బిల్లు’కు ఆమోదం లభించడం పట్ల హృదయం ఉన్న, మానవీయ స్వభావం ఉన్న ప్రతి ఒక్కరు హర్షం ప్రకటిస్తున్నారు. ‘జిహాదీ’ల భయంకర బీభత్సకాండ నుంచి తప్పించుకొని పారిపోయి వచ్చిన నిస్సహాయులకు భారతీయ పౌరసత్వం ఇవ్వరాదనడం రాక్షసత్వం! ‘బిల్లు’ను వ్యతిరేకించిన వారిని బహుశా ఈ రాక్షసత్వం ఆవహించింది! ఈ మూడు దేశాలలోను ముస్లింలు ‘జిహాదీ’ల బీభత్సకాండకు బలి కాలేదు. ‘ఇస్లాం’ను తప్ప మిగిలిన మతాలను నిర్మూలించడం లక్ష్యమైన ‘జిహాదీ’లు సహజంగానే ఇస్లాం మతస్థులను వేధించరు, వేధించలేదు. అందువల్ల ఈ మూడు దేశాలలో ఇస్లాం మతస్థులు హింసకు గురికాలేదు, అందువల్ల ఇస్లాం మతస్థులు శరణార్థులై ఈ మూడు దేశాల నుంచి పారిపోలేదు, మన దేశంలో తలదాచుకోలేదు. అందువల్ల ‘మత హింస’కు, మతోన్మాద బీభత్సకాండకు బలైన శరణార్థులలో ఇస్లాం మతస్థులు లేరు. అందువల్ల శరణార్థులకు ‘పౌరసత్వం’ కల్పించే ఈ ‘బిల్లు’ పరిధిలో ఇస్లాం మతస్థులు లేకపోవడం సహజమైన పరిణామం! అందువల్ల ‘బిల్లు’ పరిధిలో ‘ఇస్లాం’ మతాన్ని ఎందుకు చేర్చలేదని అడుగుతున్నవారు ‘వాస్తవ సూర్యకాంతి’ని చూడనంటున్న ‘గుడ్లగూబలు’! శరణార్థులలో ఇస్లాం మతస్థులు లేనప్పుడు, ‘‘లేనివారికి’’ ఈ ‘బిల్లు’వల్ల భారతీయ పౌరసత్వాన్ని ఎలా కల్పిస్తారు?
ఈ మూడు దేశాలలోను భయంకర హింసలకు గురై మన దేశానికి వచ్చిన శరణార్థులందరూ ఇస్లాం మతేతరులు! అందువల్ల ఇస్లాం మతేతర శరణార్థులకు పౌరసత్వం కల్పించడం ఇస్లాం మతం పట్ల వివక్ష కాజాలదన్నది విచక్షణ జ్ఞానం ఉన్నవారు గ్రహించిన వాస్తవం! ‘‘క్షతగాత్రులకు చికిత్స చేయడం మానవీయ దృక్పథం’’, కేంద్ర ప్రభుత్వం ఇలా క్షతగాత్రులకు చికిత్స చేసింది. ‘కాబ్’ద్వారా ఈ చారిత్రక క్షతగాత్రులకు శరణార్థులకు మన దేశపు పౌరసత్వం ‘‘మళ్లీ’’ కల్పించింది! అందువల్ల ‘‘క్షతగాత్రులు కానివారికి కూడా ఎందుకు చికిత్స చేయరు..? ఇది వివక్ష కాదా??’’ అని ప్రశ్నిస్తున్న వారి ‘‘బుద్ధి’’ని ఏమని పిలవాలి?? గాయపడని- పాకిస్తాన్‌లోను, అఫ్ఘానిస్థాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను అసలు గాయపడని- వారికి చికిత్స ఎందుకు?? చికిత్స జరిగి తీరాలని- గాయపడని వారికి సైతం గాయపడిన వారితో సమానంగా ‘చికిత్స’ జరిగి తీరాలని- ‘బిల్లు’పై జరిగిన చర్చ సందర్భంగా పార్లమెంటు సభలలోను, బయట కూడ వాదించిన వారిని ఏమనాలి?? అనభిజ్ఞులని అనాలా? దుర్బుద్ధితో భారతీయుల మధ్య, ఒకే జాతీయుల మధ్య మతం పేరుతో విభజన కల్పించిన బ్రిటన్‌వారి వారసులనాలా?? సర్వ మత సమానభావ, సర్వమత సమ్మాన సామాజిక వ్యవస్థ అనాదిగా ‘అఖండ భారత్’లో కొనసాగింది, యుగాలుగా వికసించింది. ఈ ‘అఖండ భారత్’ వివిధ సమయాలలో విభజనకు గురి అయింది. కలియుగం 5049-క్రీస్తుశకం 1947-లో జరిగిన చివరి విభజన తరువాత ‘అవశేష భారత్’లో ఈ ‘సర్వమత సమభావ, సర్వమత సమ్మాన వ్యవస్థ’ యథాపూర్వంగా కొనసాగుతోంది. అందువల్ల ‘అవశేష భారత్’ అయిన మన దేశంలో అల్పసంఖ్య మతస్థులు ‘వివక్ష’కు గురికావడం లేదు, బీభత్సకాండకు బలికావడం లేదు, దేశం వదలి పారిపోవడం లేదు!!
అధిక సంఖ్యాకుల కంటె అధికంగా అల్పసంఖ్య మతాలవారికి మన దేశంలో ఆదరణ లభిస్తోంది! ఇది సూర్యుని వెలుగు వంటి వాస్తవం. ‘‘లభించడం లేదని’’ చిత్రింప యత్నిస్తున్నవారు మతాల మధ్య చిచ్చుపెడుతున్నారు. ఇలాంటివారే ‘పౌరసత్వ సవరణ’ బిల్లును వ్యతిరేకించారు! ‘సమస్య’ మన దేశంలో లేదు. ‘సమస్య’ పాకిస్తాన్ అఫ్ఘానిస్థాన్, బంగ్లాదేశ్‌లలో ఉత్పన్నమైంది. ఇందుకు కారణం ఈ మూడు దేశాలలో ‘అఖండ భారత్’ నాటి ‘‘సర్వమత సమభావ, సర్వమత సమ్మాన వ్యవస్థ’’ ధ్వంసమైంది, ‘ఇస్లాం’ ఏకమత రాజ్యాంగ వ్యవస్థలు ఈ దేశాలలో ఏర్పడినాయి, ఇస్లాం యేతర మతాలవారు ఊచకోతకు గురి అయ్యారు. తప్పించుకొని మన దేశానికి వచ్చిన నిస్సహాయుల శరణార్థుల సమస్య ఇది... అందువల్ల ఈ వాస్తవం ‘అవశేష భారత్’ అయిన మన దేశంలో నివసిస్తున్న ఇస్లాం మతం వారికి తెలుసు, అన్ని మతాలవారికీ తెలుసు. ఈ ‘బిల్లు’వల్ల తమకు ఎలాంటి హాని కాని, అసౌకర్యం కాని కలుగడం లేదని మన దేశ పౌరులైన ఇస్లాం మతస్థులకు తెలుసు, అన్ని మతాల వారికి తెలుసు! ‘బిల్లు’ను వ్యతిరేకించి లేని ప్రమాదాన్ని ‘‘ఉన్నట్టు’’గా ప్రచారం చేస్తున్న అవకాశపు రాజకీయవేత్తలను అన్ని మతాలవారు అసహ్యించుకొంటున్నారు. అందువల్లనే ‘‘కప్పలు ఏడుస్తున్నప్పటికీ పట్టించుకోని ఆవులు నీరు తాగినట్టు’’- పిబన్తి ఉదకం గావః మండూకేషు రుదష్వపి- వ్యతిరేకుల అబద్ధాల ప్రచారాన్ని ‘పార్లమెంటు’ అతిగమించింది... పౌరసత్వ సవరణ ‘బిల్లు’ను ఆమోదించింది!!
నిస్సహాయులైన శరణార్థులకు దేశంలో ఆశ్రయం కల్పించరాదని వాదించిన వికృత మనస్తత్వం కలవారు భారత జాతీయ స్వభావ పరంపరకు తప్పినవారు మాత్రమే! రెండువేల వంద సంవత్సరాల క్రితం ‘రోము’ ‘నాగరికుల’ బీభత్సకాండకు బలైపోయిన ‘యూదు’లకు మన దేశం ఆశ్రయం కల్పించింది, సహస్రాబ్దులపాటు ఆదరించింది. క్రీస్తుశకం ఏడవ శతాబ్దిలో అరబ్బీ జిహాదీ బీభత్సమూకలు పారశీక జాతి- నేటి ఇరాన్-ని మొత్తం నిర్మూలించారు. బతికి బయటపడిన పారశీకులకు ‘అఖండ భారత్’ ఆశ్రయం కల్పించింది! ఈ మానవీయ పరంపరకు మరో నిదర్శనం ఈ పౌరసత్వ సవరణ బిల్లు!! పాలస్తీనాలోని, ఇరాన్‌లోని శరణార్థులకు శతాబ్దుల క్రితం ఆశ్రయం కల్పించిన భారతదేశం ఒకప్పటి తమ పౌరులకు మళ్లీ పౌరసత్వం కల్పించడం హర్షణీయమైన చారిత్రక పునరావృత్తి!! ‘అఖండ భారత్’ విభజన జరుగకుండా ఉండి ఉంటే ‘అఖండ భారత్’ యథాతథంగా కొనసాగి ఉంటే ఇప్పుడు శరణార్థులైన వారు సహజంగానే భారత పౌరులు..!