సంపాదకీయం

విభవ సంకల్పం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం’ సర్ సంఘ చాలక్- అధ్యక్షుడు- మోహన్ భాగవత్ బుధవారంనాడు ఒక సనాతన సత్యాన్ని పునరావిష్కరించాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ- ఆర్‌ఎస్‌ఎస్- తెలంగాణ ప్రాంత స్థాయి మూడురోజుల ‘విజయ సంకల్ప శిబిరం’ జరుగుతున్న సందర్భంగా, రెండవ రోజున భాగ్యనగరంలో జరిగిన సార్వజనికోత్సవ వేదికపై నుంచి మోహన్ భాగవత్ ఈ పునరావిష్కరణ చేశాడు! దేశం పట్ల భక్తికలిగిన ఈ దేశ ప్రజలందరూ హిందువులే, హైందవ జాతీయులే నన్నది ఈ పునరావిష్కరణ! ‘హిందుత్వం’ కేవలం ఒక ‘మతం’కాదన్న, ‘హిందుత్వం’ ఈ దేశపు వౌలిక జాతీయ తత్త్వమన్న యుగయుగాల వాస్తవాన్ని ‘సంఘ’ సర్ సంఘ చాలక్ తన ప్రసంగంలో మరోసారి ప్రస్ఫుటింపచేశాడు. ‘హిందుత్వం’ ఈ దేశపు జాతీయ తత్త్వం, వౌలిక అస్తిత్వం! విదేశీయ దురాక్రమణ సమయంలో గ్రహణగ్రస్తమైన ఈ సనాతన వాస్తవాన్ని గ్రహణముక్తం చేయడానికి జరుగుతున్న ప్రయత్నంలో భాగం మోహన్ భాగవత్ ప్రసంగం... ‘జాతీయత’ కేవలం ఒక ‘మత’మని ప్రచారం జరగడం మన దేశ చరిత్రలో జరిగిన ఘోరమైన వక్రీకరణ. బ్రిటన్ దురాక్రమణ కొనసాగిన సమయంలో ఈ ‘వక్రీకరణ’ అంకురించింది... విషవృక్షంగా మారి దేశ ప్రజలను ఆవహించింది! జాతీయ తత్త్వం కేవలం ఒక మతం కాదన్న వాస్తవాన్ని, యుగయుగాల సత్యాన్ని పునరుద్ధరించడానికి పునఃప్రచారం చేయడానికి ‘బ్రిటన్ దురాక్రమణ కాలం’నుంచి నేటివరకు సమాంతర ప్రయత్నం కొనసాగుతూనే ఉంది. మతాలకు, భాషలకు, సంప్రదాయాలకు, ఆలోచన రీతులకు అతీతం గాను, సర్వమత సర్వభాషా సర్వసంప్రదాయ, సర్వ ఆలోచనా ఆచార వైవిధ్యాల సంపుటంగాను మన దేశంలో అనాదిగా జాతీయత వికసించింది! దేశంలో అనేక మతాలు పుట్టాయి, గిట్టాయి. విదేశాలనుంచి మరికొన్ని మతాలు వ్యాపించాయి. అనేక భాషలు అంకురించాయి, పాత భాషలు రూపాంతరం చెందాయి. కొత్త భాషలుగా ప్రస్ఫుటించాయి. దేశంలో పరిఢవిల్లిన, పరిఢవిల్లుతున్న అనేకానేక వైవిధ్యాలలో ‘్భషా’, ‘మత’వైవిధ్యాలు రెండు మాత్రమే! దేశంలో వికసిస్తున్న అసంఖ్యాక వైవిధ్యాల మధ్య వైరుధ్యం లేదు, సమన్వయం ఉంది. ఈ ‘సమన్వయం’ సంస్కృతి! మతాలు భాషలు ఎన్ని ఉన్నప్పటికీ ఈ దేశపు ‘సంస్కృతి’ఒక్కటే! అది హిందుత్వం... అనేక వైవిధ్యాల సమాహారమైన వైవిధ్య సంపుటమైన అద్వితీయ జాతీయత హిందుత్వం! యుగయుగాల ఈ వాస్తవం- ఎవరు అంగీకరించినప్పటికీ ఎవరు అంగీకరించనప్పటికీ - ఇప్పటికీ ఎప్పటికీ వాస్తవమే! దేశ ప్రజలందరూ హిందువులేనని మోహన్ భాగవత్ చెప్పిన మాట ఈ సనాతన వాస్తవ పునఃఆవిష్కృత సనాతన వాస్తవం! ఈ వాస్తవాన్ని గతంలో ఎందరో జాతీయ పురుషులు చెప్పి ఉన్నారు, మోహన్ భాగవత్ కూడా చెప్పి ఉన్నాడు, ఇప్పుడు మరోమారు చెప్పాడు! మతాలు అనేకం ఉన్నా ఈ దేశపు జాతీయత ఒక్కటే- అది హిందుత్వం! వైవిధ్యరీతులు అసంఖ్యాకం అయినప్పటికీ ఈ దేశపు సంస్కృతి ఒక్కటే- అది హిందుత్వం! దేశంలోని అన్ని మతాల ప్రాంతాల భాషల వైవిధ్యాల నూట ముప్పయి కోట్ల మంది ప్రజలు హైందవ జాతీయులే! ఒకే జాతి, ఒకే ప్రజ...!!
భరతమాత బిడ్డలైన వారందరూ హిందువులేనని ‘రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘం’వారు పదే పదే చెప్పవలసిన అవసరం ఏమిటన్న ప్రశ్నకు సమాధానం జాతీయ చరిత్ర. జాతీయతకు ప్రధాన ప్రాతిపదిక దేశ ప్రజలకూ మాతృభూమికీ మధ్యగల మాతాపుత్ర సంబంధం! భరతమాతను తమ తల్లిగా అంగీకరించేవారు ఏ మతంవారైనా, ఏ ఆరాధన పద్ధతిని అవలంబించే వారైనా, అసలు ఏ ఆరాధ్య పద్ధతినీ అంగీకరించని వారైనా హిందువులేనన్న వాస్తవాన్ని మోహన్ భాగవత్ పునరుద్ఘాటించాడు. ‘‘మాతాభూమిః పుత్రోహం పృథివ్యాః’’- ‘‘్భమి తల్లి, నేను ఆమె బిడ్డడను- సహజ ప్రాకృతిక వాస్తవం జాతీయతకు ప్రాతిపదిక. ఒక జన సముదాయం కానీ భిన్న భాషలు మాట్లాడే అనేక జన సముదాయాలు కానీ భిన్న మతాలను, ఆరాధన పద్ధతులను పాటించే వివిధ జన సముదాయాలు కాని ‘ఒక జాతి’గా ‘ఒకే జాతి’గా వికసించడానికి వౌలిక సాంస్కృతిక భూమిక మాతృభూమితో ఆయా జన సముదాయాలకున్న మాతాపుత్ర సంబంధం! ఏ మతం వారైనా ఏ భాషవారైనా మాతృభూమిపై పుడుతున్నారు పెరుగుతున్నారు. మనుగడకు అవసరమైన సమస్తం మాతృభూమి నుంచి పొందుతున్నారు. అందు ఒకే మాతృభూమి సంతానం మొత్తం ఒకే జాతి! ఈ దేశంలో ఇదీ అనాది వాస్తవం!! ఇలా మాతృభూమి మాథ్యమంగా ప్రస్ఫుటిస్తున్న ఈ ‘జాతి’సనాతన జాతి! అంటే శాశ్వతమైన జాతి!! మనువు మొదటి పాలకుడు! పాలకుడు ప్రజలను భరించేవాడు! భరించేవాడు భరతుడు. అలా మనువు మొదటి భరతుడు. ‘‘్భరణాత్ చ ప్రజానాం వై మనుః భరత ఉచ్యతే’’. అందు సృష్ట్యాదిగా మొదటి భరతుడైన మనువు పేరుతో మన దేశం భరత ఖండమైంది! మన జాతి భరతజాతి అయింది... కలియుగం ముప్పయి రెండవ శతాబ్ది- క్రీస్తుశకం ఒకటవ శతాబ్ది- నాటి భరత సమ్రాట్ శాలివాహనుడు దురాక్రమించిన విదేశీయులను ప్రతిఘటించి వెనక్కి తరిమాడు. ఈ విజయానికి చిహ్నంగా శాలివాహనుడు ఈ మన భరత ఖండానికి ‘‘హిందూస్థానం’’అని పెట్టాడు- హిందూస్థానం ఇతి జ్లేయం- అని జాతీయ చరిత్ర చెబుతోంది. అందువల్ల ‘్భరత ఖండం’, ‘హిందూస్థానం’ పర్యాయ పదాలు. ‘్భరత జాతి’అన్నా ‘హిందూ జాతి’అన్నా ఒకటే! దేశంలోని నూట ముప్పయి కోట్ల మంది ప్రజలు- అన్ని మతాలవారు-హిందువులే అని ‘సంఘ’ అధినేత చేసిన పునరుద్ఘాటన ఈ చారిత్రక వాస్తవానికి అనుగుణం...
ఈ చారిత్రక వాస్తవాన్ని బ్రిటన్ బౌద్ధిక బీభత్సకారులు చెఱచిపోయారు. ఈ దేశంలోని సర్వమత సంపుటమైన హిందుత్వం ‘‘కేవలం ఒక మతమని’’ బ్రిటన్ మేధావులు మనకు పాఠం చెప్పిపోయారు. ‘‘అనేక గదులున్న ఒక ఇంటిని కేవలం ఒక గది’’,అని చెప్పినట్టయింది... ‘‘అనేక ‘తెగ’ల వృక్షాల నిలయమైన మహావనాన్ని కేవలం ఒక ‘తెగ’కు చెందిన వృక్ష సమూహం’’అని చెప్పినట్టయింది. దేశంలో జాతీయతత్త్వానికి విరుద్ధంగా అనేకమంది ఆంగ్ల మానసపుత్రులు మతోన్మాదాన్ని రెచ్చగొడుతుండడానికి ఈ ‘వక్రీకరణ’కారణం... అందువల్లనే ‘హిందుత్వం’ ఈ దేశపు జాతీయత అన్న వాస్తవాన్ని మోహన్ భాగవత్ లాంటివారు పదే పదే చెప్పవలసి వస్తోంది. అద్వైతం, స్మార్తం, శైవం, వైష్ణవం, శాక్తం, గణాపత్యం, స్కాందం, సౌరం, బౌద్ధం, జైనం, సిక్కు సంప్రదాయం, ఆర్యసమాజం, ఇస్లాం, క్రైస్తవం వంటివి, ఇంకా ఇలాంటివి మతాలు! ‘హిందుత్వం’ ఈ మతాల సమాహారమైన, మతాలకు అతీతమైన స్వజాతీయ తత్త్వం! ‘‘నూటముప్పయి కోట్ల మంది హిందువులు..!’’ వీరందరూ మతాలకు భిన్నంగా భరతమాత సమారాధకులు కావాలి! జాతీయ సంస్కార సమాహారబద్ధులు కావాలి...
ఈ సంస్కార సమాహారం సంస్కృతి! విశ్వహితంకోసం నిరంతరం శ్రమించడం హైందవ జాతీయ వౌలిక సంస్కారం. హిందువుల ‘విజయ సంకల్పం’ విశ్వహిత సాధనకోసం మాత్రమేనన్న భాగవత్ మాట ఈ వౌలిక సంస్కారానికి అనుగుణం. ‘‘నత్వహం కామయే రాజ్యం, నస్వర్గం, న అపునర్భవం...కామయే దుఃఖతస్తానాం ప్రాణినాం ఆర్తినాశనమ్’’- ‘‘నేను రాజ్యాధికారాన్ని కానీ, స్వర్గాన్నికానీ, మోక్షాన్నికాని కోరను. దుఃఖ తప్తులైన మానవుల, ప్రాణులకు సుఖం కలిగించడమే నా కోరిక’’-అన్న హైందవ జీవన సంస్కార సూత్రాన్ని ‘సంఘం’సర్ సంఘచాలక్ ఉటంకించారు. ఇలా అంతర్జాతీయ హితాన్ని సాధించడంకోసమే హైందవ జాతి విజయ సంకల్ప వ్రతాన్ని స్వీకరించింది. ‘‘హిందు రాష్ట్రాంగ భూతులు’’-హైందవ జాతీయ స్వరూపానికి అవయవాలైన నూట ముప్పయి కోట్ల మంది- చేసిన చేస్తున్న విజయ సంకల్పం ఇదీ... వసుధైవ కుటుంబ- ప్రపంచం మొత్తం ఒకే కుటుంబం- అన్నది హైందవ జాతీయ వౌలిక సంస్కారం...