సంపాదకీయం

విప్లవ సరళీకరణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విదేశీయ ప్రత్యక్ష ఆర్థిక భాగస్వామ్య ప్రాంగణం ద్వారాలను మన ప్రభుత్వం సోమవారం బార్లా తెరచింది. సరిహద్దులను చెరపివేస్తున్న వాణిజ్య ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్- వ్యవస్థీకృతమైపోయిన తరువాత తలుపులు, ద్వారాలు, తాళాల వంటి ముడుచుకునే విధానం విడనాడాలన్నది బహుశా కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల అంతరంగం. కేంద్ర ప్రభుత్వ రాజకీయ నిర్వాహకులు మారిప్పటికీ ఈ అంతరంగం స్వభావం మారకపోవడం ఆర్థిక విధానాల నిరంతర ఏకరూపతకు రాజ్యాంగ సాక్ష్యం. విదేశీయ ప్రత్యక్ష వాణిజ్య నిధుల-్ఫరిన్ డైరెక్ట్ ఇనె్వస్ట్‌మెంట్-ఎఫ్‌డిఐ- వ్యవస్థను కేంద్ర ప్రభుత్వం సోమవారం విప్లవాత్మంగా సరళీకరించడానికి ఈ ఏకరూపత ప్రాతిపదిక. ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షాలు మారినప్పటికీ విధానాలు మాత్రం యథాతథంగా కొనసాగడం, ఏకరూపతకు చిహ్నం. మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలోని కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం ఆరంభించిన సరళీకరణపై స్థాన పథంలోనే నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని భారతీయ జనతాపార్టీప్రభుత్వం ముందుకు సాగుతోంది. సోమవారం నాటి ‘విప్లవాత్మక సరళీకరణ’ మరో ముందడుగు. రక్షణ రంగంలో విదేశీయ సంస్థల పెట్టుబడులకు మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ సంకల్పాన్ని సమగ్రంగా సాకారం చేయడం సోమవారం మోదీ ప్రభుత్వం సాధించిన విజయం. రక్షణ రంగంలో విదేశీయ సంస్థలు వందశాతం పెట్టుబడులను పెట్టడానికి ఇప్పుడు ప్రభుత్వం అనుమతించింది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. తాము ఆరంభించిన విదేశీయ సంస్థల పెట్టుబడుల కార్యక్రమాన్ని భాజపా ప్రభుత్వం ముందుకు తీసుకొని వెడుతోంది కాబట్టి గతంలో ప్రభుత్వాన్ని నడిపిన కాంగ్రెస్ వారు సైతం సోమవారం నాటి విప్లవ సరళీకరణను వ్యతిరేకించజాలరు. ఇన్ని ఏళ్లుగా మన రక్షణ రంగానికి అవరమైన పదార్థ, పరిజ్ఞాన పరికరాలను భారీగా విదేశాలనుంచి దిగుమతి చేసుకునేవారం. ఇందుకోసం మన ప్రభుత్వం ప్రతి ఏటా వేలకోట్ల రూపాయలను ఖర్చు చేసింది. ఇప్పుడు విదేశీయ శ్రామిక వాణిజ్య సంస్థలు మనదేశంలోనే కర్మాగారాలను స్థాపించి ఈ రక్షణ పదార్థ పరిజ్ఞాన పరికరాలను తయారు చేస్తారు. మనకు విక్రయిస్తారు. ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించిన భారత్‌లో నిర్మించండి-మేక్ ఇన్ ఇండియా-ప్రణాళికా స్ఫూర్తి ఇలా సాకారమవుతోంది..
ఈ విదేశీయ సంస్థలు భారీగా లాభాలను తమ దేశానకి తరలించుకొని పోవడమేకాక, మేక్ ఇన్ ఇండియా ప్రణాళిక మాత్రం విజయవంతవౌతుంది. దేశం బయట తయారైన ఆయుధాలను కొనుగోలు చేయడం మాని దేశంలోపల విదేశీయ సంస్థలు తయారు చేసే ఆయుధాలను వాహనాలకు మన ప్రభుత్వం కొనుగోలు చ్తేంది. ఇదీ తేడా. మన రక్షణ అవసరాల జుట్టు విదేశీ సంస్థల యజమానుల చేతులలో శాశ్వతంగా ఇరుక్కొనిపోదా? అన్నది ప్రశ్న... ఈ ప్రశ్నకు సమాధానం ప్రపంచీకరణలో భాగంగా కొనసాగుతున్న పెట్టుబడుల ప్రక్రియ. సంస్థాగతమైన పెట్టుబడులు, ప్రత్యక్షమైన పెట్టుబడులు అన్నవి విదేశీయుల చొరబాటునకు రెండు రూపాలు. విదేశీయ సంస్థాగత వాణిజ్య భాగస్వామ్యం-ఎఫ్‌డిఐ- ద్వారా విదేవీయులు, విదేశీ సంస్థలు మన సంస్థలలోని వాటాలను కొనవచ్చు. ఇలా కొన్నవారికి మన సంస్థలు లాభాలలో వాటా -డివిడెండ్- చెల్లిస్తాయి. మన ప్రభుత్వం ఈ పద్ధతిని దశాబ్దులుగా ప్రోత్సహించింది. దీనివల్ల సంస్థల యజమాన్యం స్వదేశీయుల చేతుల్లో ఉంటుంది. మన జుట్టు విదేశీయుల చేతులలో ఇరుక్కోదు. విదేశీయ ప్రత్యక్ష వాణిజ్య భాగస్వామ్యం-ఎఫ్‌డిఐ- వల్ల మనదేశపు సంస్థల యాజమాన్యం కూడ విదేశీయులకు దక్కుతుంది. అందువల్లనే ఈ ఎఫ్‌డిఐ పరిమాణాన్ని 49 శాతానికి పరిమితం చేయడం మేలు.
కానీ మన ప్రభుత్వాలు సరళీకరణ పేరుతో వివిధ రంగాలలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల-ఎఫ్‌డిఐ- శాతాన్ని ఇరవై ఆరుశాతం నుంచి నలబయి తొమ్మిది శాతానికి, డెబ్బయి నాలుగు శాతానికి పెంచుకుంటూ వస్తున్నాయి. డెబ్బయినాలుగు శాతానికి పెరగడంతోనే ఆయా సంస్థల యాజమాన్యం విదేశీయుల అదుపులోకి వచ్చేస్తోంది. అందువల్ల ఇదివరకే 74 శాతం ఎఫ్‌డిఐని అవకాశం ఉన్న మందుల తయారీ వంటి రంగాల్లో మన జుట్టు ఇదివరకే విదేశీయ సంస్థల చేతికి చిక్కి ఉంది. అందువల్ల వందశాతానికి పెంచడం వల్ల కొత్తగా ఇరుక్కునేది ఏమీ ఉండదు. కానీ రక్షణ రంగంలో 49 శాతం నుంచి వందశాతానికి ఎఫ్‌డిఐని పెంచడం వల్ల మనరక్షణ ఉత్పత్తుల సంస్థలపై విదేశీయుల పెత్తనం వ్యవస్థీకృతం అవుతుంది. వందశాతం పెట్టుబడులకు అవకాశం ఉన్న అన్ని పారిశ్రామిక రంగాలలోను విదేశీయ సంస్థలు గుత్త్ధాపత్యం వహించగలవు. పెట్టుబడులలోను సాంకేతిక పరిజ్ఞాన పాటవంలోను ఈవిదేశీయ సంస్థలు పోటీని తట్టుకొనలేని స్వదేశీయ సంస్థలు మూతపడడం ఖాయం. ఇప్పటికే మొదలయి ఉన్న ఈ మూతపడే ప్రక్రియ వందశాతం ఎఫ్‌డిఐ కారణంగానే వేగం పుంజుకుంటుంది. అందువల్లనే మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం నడచిన పథం లో ఇది మరో ముందడుగు.
ఆహార పదార్థాల చిల్లర వ్యాపారంలో ఇంతవరకు విదేశీయ సంస్థలకు ప్రవేశానుమతి లేదు. ఒకేసారి ఈ రంగంలో వందశాతం ఎఫ్‌డిఐకి ప్రభుత్వం అనుమతించింది. మనదేశంలో తయారు చేసిన తినుబండారాలను మాత్రమే విక్రయించాలన్నది నిబంధన. ఈ అనుమతి లేక పూర్వమే బోలెడన్ని విశీయ సంస్థల తినుబండారాలను మనదేశానికి ఎగుమతి చేస్తున్నాయి. ఇక్కడే ఉత్పత్తికూడ చేస్తున్నాయి. ఇపుడు ఈ సంస్థలు తినుబండారాల ‘్భండార్’లను, చిల్లర దుకాణాలను వీధి వీధినా తెరుస్తాయి. అందువల్ల ఇదివరకు చిల్లర దుకాణాలను నిర్వహించిన స్వదేశీయులు తమ దుకాణాలను మూసివేసి, విదేశీయుల దుకాణాలలో ఉద్యోగులుగా చేరుతారు. ఎందుకంటె మనకు ప్రధానంగా మధ్య తరగతి వారిని స్వదేశీయ తినుబండారాల కంటె విదేశీయ హస్త స్పర్శ కలిగిన తిండి రుచిగా ఉంటోంది. స్వదేశీయ అమూల్ పాలపొడిని తల్లులు తమ పిల్లలకు తినిపించడం లేదు. విదేశీయ నెజల్ పాలపొడిని రెట్టింపు ధరలకు కొంటున్నారు. ఇది కూడ ఒక ఉదాహరణ మాత్రమే. జనం కోరుతున్న దానికి ప్రభుత్వం మరింతగా సమకూర్చుతోంది..అంతే. దుకాణాలను మూసుకున్న, స్వదేశీయులు, విదేశీయుల దుకాణాలలో ఉద్యోగాలు పొందుతారు. ప్రభుత్వం పెంచదలచిన ఉద్యోగాలు ఇవే కాబోలు...
నిరుపేదలు సైతం యజమానులుగా ఉండటం అనాదిగా భారతదేశంలో కొనసాగుతున్న వికేంద్రీకృత పారిశ్రామిక, వాణిజ్య వ్యవస్థలో భాగం. యజమానులు సైతం కూలీలుగా మారిపోతుండడం కేంద్రీకృత అంతర్జాతీయ అనుసంధాన పారిశ్రామిక వాణిజ్య వ్యవస్థ సృష్టిస్తున్న వైపరీత్యం. అనివార్యమైపోయిన ఈ పరిణామ క్రమాన్ని వెనక్కి మళ్లించడం ఎవరితరం?