సంపాదకీయం
పదే పదే.. అదే వ్యథ!
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
పాకిస్తాన్‌లో హిందువులకు వ్యతిరేకంగా జరిగిపోతున్న ప్రభుత్వ బీభత్సకాండ ఆగడం లేదన్న కఠోర వాస్తవానికి ఇది మరో నిదర్శనం. సింధు ప్రాంతంలోని ‘హాలా’ పట్టణంలో పెళ్లిపీటల మీద కూర్చుని ఉండిన ‘్భరతీబాయి’ అన్న హిందూ వధువును జిహాదీ దుండగులు అపహరించుకొనిపోయారు! ఇరవై నాలుగేళ్ల ఈ యువతిని ఆదివారం బలవంతంగా ఇస్లాం మతంలోకి మార్చి ఓ ‘జిహాదీ’ హంతకునితో ఆమెకు బలవంతపు పెళ్లి చేశారు. గత రెండు వారాలలో హిందూ వధువులను, బాలికలను జిహాదీలు అపహరించడం ఇది మూడవసారి, గత రెండు నెలలలో ఇది ఆరవసారి! ఈ అత్యాచారాలను నిర్వహిస్తున్నవారిని, హిందువులను హత్యచేస్తున్న వారిని పాకిస్తాన్ న్యాయస్థానాలు శిక్షించడం లేదు. ఇలాంటి మతం మార్పిడులు, బలవంతపు పెళ్లిళ్లు, అపహరణలు, అత్యాచారాలు దశాబ్దుల తరబడి కొనసాగిపోతుండడానికి ఇదీ కారణం! హిందువులను చంపమని, హిందూ బాలికలను, యువతులను అపహరించమని పాకిస్తాన్ ‘‘రాజ్యాంగ వ్యవస్థ’’ జిహాదీలను ఉసిగొలుపుతోంది! అనేక సందర్భాలలో బలవంతపు మతం మార్పిడులకు, బలవంతపు పెళ్లిళ్లకు గురిఅయిన హిందూ యువతులు ‘జిహాదీ’ హంతకుల వద్దనే ఉండిపోతున్నారు. అదివరకే ఒకరు, ఇద్దరు ఇంకా ఎక్కువ భార్యలున్న ‘జిహాదీ’ దుండగునితో అపహరణకు గురిఅయిన హిందూ యువతి ఆ జీవనం గడుపవలసి వస్తోంది! కొన్నాళ్లు తరువాత ఇలా ‘‘పెళ్లి’’చేసుకున్న దుండగులు ఆయా హిందూ యువతులను ఇంటినుండి తరిమివేస్తున్నారు! అలాంటి సందర్భాలలో ఈ హిందూ మహిళలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు లేదా జీవచ్ఛవాలుగా మనుగడ సాగిస్తున్నారు. కొన్ని సందర్భాలలో న్యాయస్థానాలు విచిత్రమైన తీర్పులను ప్రకటిస్తున్నాయి. ఇలా మతం మార్పిడికి బలవంతపు పెళ్లిళ్లకు గురైన హిందూ యువతులు, బాలికలు ‘‘తమ ‘జిహాదీ’్భర్తల వద్దనే నివసించవచ్చు, లేదా తమ తల్లిదండ్రులవద్దకు తిరిగి వెళ్లవచ్చు...’’అన్నది ఈ పాకిస్తానీ బీభత్స న్యాయస్థానాలు చెబుతున్న తీర్పుల సారాంశం! పాకిస్తాన్ సర్వోన్నత న్యాయస్థానం సైతం కింది న్యాయస్థానాలు ఇచ్చిన ఇలాంటి తీర్పులను సమర్ధించింది, స్వయంగా ఇలాంటి తీర్పులనిస్తోంది! 2012లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు అక్కచెల్లెళ్లను ‘జిహాదీ’లు ఇలా అపహరించుకొని వెళ్లి, పెళ్లిచేసుకున్నప్పుడు పాకిస్తాన్ సుప్రీంకోర్టు ఇదే తీర్పును చెప్పింది. కానీ తిరిగి తల్లిదండ్రులవద్దకు వెళ్లినట్టయితే- తల్లిదండ్రులను, కుటుంబ సభ్యులను చంపేస్తామని ‘జిహాదీ’లు బెదిరించారు. ఫలితంగా ఆ ముగ్గురు హిందూ యువతులు తమ ‘‘జిహాదీ భర్తల’’తో బలవంతపు సహజీవనానికి అంగీకరించారు. నిజానికి ఇవి పెళ్లిళ్లుకావు... హిందూ యువతులను ప్రతిరోజు లైంగిక అత్యాచారానికి గురిచేయడం మాత్రమే! 2012లో ఈ జిహాదీ పైశాచికకాండ గురించి భారతీయ జనతాపార్టీ నాయకుడు మురళీమనోహర్ జోషి లోక్‌సభలో ప్రస్తావించాడు! ఇప్పుడు కూడ మన ప్రభుత్వం ‘్భరతీబాయ్’ని అపహరించిన వారిపై చర్య తీసుకోవాలని పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కోరింది!!
కానీ పాకిస్తాన్ న్యాయస్థానాలు మాత్రం ఇలా హిందూ బాలికలను అపహరించిన వారిపై, అత్యాచారాలు జరిపిన వారిపై చర్యలు తీసుకోవడం లేదు! ఎందుకంటె ఇస్లామేతర మతాలవారిని ఇలా బీభత్సకాండకు బలిచేయాలన్నది పాకిస్తాన్ జిహాదీ రాజ్యాంగ వ్యవస్థలో నిహితమై ఉన్న స్వభావం! అందువల్ల బీభత్సకాండను నడిపిస్తున్న పాకిస్తాన్ ప్రభుత్వాన్ని ప్రభుత్వ నిర్వాహకులను ఐక్యరాజ్యసమితి నిరసించాలి! ‘అంతర్జాతీయ నేర నిరోధక న్యాయస్థానం’వారు శిక్షించాలి! ‘ఐరోపా సమాఖ్య’, అమెరికా ప్రభుత్వం పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా తీర్మానాలు చేయాలి. కానీ పాకిస్తాన్‌లోని అల్పసంఖ్య అవశేష హిందువులను నిశే్శషం చేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వమే జిహాదీలను ఉసిగొల్పుతుండడాన్ని ఈ అంతర్జాతీయ సంస్థలు కాని, ప్రముఖ దేశాల ప్రభుత్వాలు కాని నిరసించిన దాఖలాలేదు! మన దేశం ‘్ఫర్యాదు’చేయకపోవడం, ఇందుకు ఒక ప్రధాన కారణం! ‘సూడాన్’లో దశాబ్దులపాటు అధ్యక్షుడు అల్ బషీర్ హత్యాకాండ జరిపించాడు. ఇస్లామేతర మతాలకు చెందిన ఇరవై లక్షల మందిని ఏళ్లతరబడి ఊచకోత కోయించాడు. అల్ బషీర్‌ను అంతర్జాతీయ న్యాయస్థానం బీభత్సకారుడిగా ప్రకటించింది. కానీ అతగాడిని నిర్బంధించడం ‘ఇంటర్ పోల్’- అంతర్జాతీయ నిఘా సాధికార సంస్థ-కు సాధ్యంకాలేదు, శిక్షించడం అంతర్జాతీయ న్యాయస్థానానికి సాధ్యం కాలేదు. ఎందుకంటె చైనా ప్రభుత్వం తన పలుకుబడిని ఉపయోగించి అడ్డుకుంది! ఎందుకంటె చైనా ప్రభుత్వ, ప్రభుత్వేతర సంస్థలు సూడాన్‌లో వాణిజ్య సామ్రాజ్యాలు ఏర్పాటుచేసుకొని ఉన్నాయి... అల్ బషీర్ బీభత్సకాండ ఫలితంగా సూడాన్ రెండుగా విడిపోయింది. 2019లో ముప్పయి ఏళ్లు నియంతృత్వం వహించిన అల్ బషీర్‌ను సైనిక దళాలవారు గద్దెదించారు...
సూడాన్ బీభత్స ప్రభుత్వాన్ని నియంతను శిక్షించడానికి కనీసం అంతర్జాతీయ స్థాయిలో ప్రయత్నం జరిగింది. అమెరికా ప్రభుత్వం, ఐరోపా ప్రభుత్వాలు ఇందుకు కృషిచేశాయి. కానీ డెబ్బయి మూడేళ్లుగా హిందువులను నిర్మూలిస్తున్న పాకిస్తాన్ బీభత్స పాలకులను ‘‘అంతర్జాతీయ నేర నిరోధక న్యాయస్థానం’’ శిక్షించలేక పోవడానికి కారణం అమెరికాకు, ‘ఐరోపా సమాఖ్య’కు ఈ విషయంలో ఆసక్తి లేకపోవడం!! మన ప్రభుత్వం ఇప్పుడైన పూనుకోవాలి! పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వాహక బీభత్సకారులకు వ్యతిరేకంగా అంతర్జాతీయ న్యాయస్థానంలో ఫిర్యాదుచేయాలి! ‘బర్మా’ను విభజించి ‘అరకాన్’ ప్రాంతాన్ని కొత్త ఇస్లామీ మత రాజ్యంగా, స్వతంత్ర దేశంగా ఏర్పాటుచేయడానికి ‘రోహింగియా’ జిహాదీ బీభత్సకారులు దశాబ్దులుగా యత్నిస్తున్నారు. ఈ జిహాదీ బీభత్సకారులను బర్మా-మ్యాన్‌మార్- ప్రభుత్వం కఠినంగా అణచివేసింది. ఈ అణచివేత ‘‘సామాన్య రోహింగియా ప్రజలపై దమనకాండ’’గా ప్రచారమైంది! అంతర్జాతీయ నేర నిరోధక న్యాయస్థానంలో అభియోగం దాఖలైంది!! కానీ దశాబ్దుల తరబడి హిందువులను నిర్మూలించిన, పాకిస్తాన్ బీభత్స ప్రభుత్వంపై అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎందుకని ఫిర్యాదు దాఖలు కాలేదు?? పాకిస్తాన్ ప్రభుత్వం నిర్వహిస్తున్న హిందూ వ్యతిరేక బీభత్సకాండ కారణంగానే పాకిస్తాన్‌లోని ‘అవశేష’ హిందువులు సైతం ప్రాణభయంతో పారిపోయి మన దేశానికి శరణార్థులుగా వస్తున్నారు. ఈ నిస్సహాయ నిర్భాగ్య శరణార్థులకు మన దేశపు పౌరసత్వం కల్పించడం మానవత్వం. కేంద్ర ప్రభుత్వం ఈ మానవీయ చర్యను చేపట్టింది. ఈ పాకిస్తాన్ నుంచి తరిమివేతకు గురిఅయిన శరణార్థులకు మన దేశం పౌరసత్వం కల్పించడంకోసం చట్టం చేసింది! ఈ చట్టాన్ని మానవీయ హృదయం ఉన్న వారందరూ సమర్ధిస్తున్నారు. శరణార్థులకు ‘నీడ’కల్పించరాదనడం రాక్షసత్వం... పైశాచిక ప్రవృత్తి!!
ఇలాంటి పైశాచిక ప్రవృత్తికల రాజకీయవేత్తలు, మేథావులు ఈ ‘చట్టాన్ని’వ్యతిరేకిస్తున్నారు! తద్వారా వారు పాకిస్తాన్ ప్రభుత్వ దుశ్చర్యను, బీభత్సకాండను నిరసించడం లేదు. సమర్ధిస్తున్నారు. ఈ ‘పౌరసత్వ సవరణ చట్టం’- సిటిజన్ షిప్ అమెండ్‌మెంట్ యాక్ట్- సిఏఏ- ద్వారా పాకిస్తాన్‌లోను, బంగ్లాదేశ్‌లోను, అఫ్ఘానిస్థాన్‌లోను తరిమివేతకు గురిఅయిన శరణార్థులకు మన దేశంలో శాశ్వతంగా ఆశ్రయం లభిస్తోంది! దీన్ని వ్యతిరేకిస్తున్నవారు పాకిస్తాన్‌లో జరిగిపోతున్న హిందూ బాలికల అపహరణ గురించి కాని, వారి బతుకులు మొగ్గ దశలోనే బుగ్గిపాలుకావడం గురించి కాని నోరు మెదపడం లేదు... ఈ మానవీయ కర్తవ్య నిర్వహణలో ఈ ‘సిఏఏ’ వ్యతిరేకులు బధిరులు, అంధులు.