సంపాదకీయం

‘నిష్క్రమణ’ నిజాలు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్థిక స్వాతంత్య్రాన్ని మళ్లీ సాధించుకున్నట్టు బ్రిటన్ ప్రధానమంత్రి బోరిస్ జాన్సన్ ప్రకటించడం ఐరోపా జాతుల ‘పరస్పర విరోధ చరిత్ర’లో సరికొత్త అధ్యాయం. ఐరోపా సమాఖ్య- యూరోపియన్ యూనియన్- ఇయు-నుంచి ‘బ్రిటన్ నిష్క్రమణ’- బ్రిటన్స్ ఎగ్జిట్- బ్రెగ్జిట్- ప్రక్రియ పూర్తయిన సందర్భంగా బోరిస్ జాన్సన్ ఇలా ‘ఆర్థిక స్వాతంత్య్ర పునరుద్ధరణ’ గురించి వాక్రుచ్చాడు. ఐరోపా సమాఖ్యలో దశాబ్దులపాటు భాగస్వామ్యం వహించిన సమయంలో తమ దేశం ఆర్థిక సార్వభౌమత్వాన్ని కోల్పోయిందన్నది బోరిస్ జాన్సన్ ఆవిష్కరించిన వాస్తవం! క్రీస్తుశకం పదహైదవ శతాబ్దినుంచి వివిధ ప్రపంచ దేశాల ‘ఆర్థిక స్వాతంత్య్రాన్ని’, ‘ఆర్థిక సార్వభౌమత్వాన్ని’ హరించివేయడానికి బ్రిటన్ తదితర ఐరోపా జాతులు పరస్పరం పోటీపడడం చరిత్ర! ఈ ఐరోపా ఆధిపత్య ‘చరిత్ర’నే బ్రిటన్ తదితర ఐరోపా జాతులవారు ప్రపంచ ‘చరిత్ర’గా చిత్రీకరించడం ఇరవయ్యవ శతాబ్ది మధ్యభాగం వరకు నడచిన ‘చరిత్ర’... 1939వ 1945వ సంవత్సరాల మధ్య నడచిన రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఐరోపా జాతులు ఇతర దేశాల ఆర్థిక సార్వభౌమత్వాన్ని హరించిన చరిత్ర ముగిసిపోయింది! ఇలా వివిధ దేశాల ఆర్థిక స్వాతంత్య్రాన్ని శతాబ్దులపాటు హరించిన బ్రిటన్ ‘‘స్వయంగా ఆర్థిక స్వాతంత్య్రాన్ని కోల్పోవడం’’ ‘ఐరోపా సమాఖ్య’ చరిత్ర రెండవ ప్రపంచ యుద్ధంవరకు ఆధిపత్యంకోసం పరస్పరం కలహించిన ఐరోపా దేశాలు ఆ తరువాత కలసికట్టుగా వ్యవహరించడం ‘ఐరోపా సమాఖ్య’ అవతరణకు దోహదం చేసింది. ఐరోపా దేశాల ఆధిపత్యం అంతమైపోయి అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ప్రపంచ ఆధిపత్యంకోసం పోరాటం ఆరంభంకావడం ఈ ‘‘కలసికట్టు తనానికి’’ ప్రాతిపదిక. 1991 వరకు అమెరికా, సోవియట్ రష్యాల మధ్య ‘ప్రచ్ఛన్నయుద్ధం’- కోల్డ్‌వార్- నడచిన కాలంలో ఐరోపా దేశాల మధ్య ఆర్థిక వాణిజ్య సమైక్య వ్యవస్థ ఏర్పడింది. ‘ఐరోపా ఆర్థిక సహకార సమాఖ్య’ ఏర్పడింది. ఇలా ఏర్పడినందువల్ల తమ దేశ ‘ఆర్థిక సార్వభౌమత్వం’- ఎకనామిక్ సావరైనిటీ- అంతమై పోయిందన్నది బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇప్పుడు చెపుతున్న మాట! ఐరోపా ఆర్థిక సమాఖ్యనుంచి బయటికి వచ్చిన తరువాత చెబుతున్న మాట...
మొదట కేవలం ‘వాణిజ్య సమాఖ్య’గా అవతరించిన పశ్చిమ ఐరోపా దేశాలు ‘రాజకీయ దౌత్య సమైక్య వ్యవస్థ’గా పరిణతి చెందడం దాదాపు డెబ్బయి ఏళ్ల చరిత్ర. 1950 దశకంలో ఈ ‘సమీకృతి’ ప్రస్ఫుటించిన నాటికి తూర్పు ఐరోపా దేశాలలో ‘ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థలు’ ఏర్పడి ఉన్నాయి. అందువల్ల ‘బహుళపక్ష ప్రజాస్వామ్య’ వ్యవస్థలున్న పశ్చిమ ఐరోపా దేశాలకు మాత్రమే ‘ఐరోపా ఆర్థిక కూటమి’- యూరోపియన్ ఎకనామిక్ కోఆపరేషన్- ఇఇసి- పరిమితమై ఉండేది. ‘ఇఇసి’ ఆర్థిక వాణిజ్యాలకు పరిమితంకాక ‘రాజకీయ దౌత్యకూటమి’గా ‘ఐరోపా సమాఖ్య’గా ఏర్పడింది. ‘ఐరోపా సమాఖ్య’కు పార్లమెంటు, ఐరోపా పతాకం, ఐరోపా గీతం, సచివాలయం, రాజధాని, సమీకృత ‘ద్రవ్య రూపం’- యూనిఫార్మ్ కరెన్సీ- యూరో- ఏర్పడడం తరువాతి చరిత్ర... ఐరోపా దేశాల మధ్య రాజకీయ సార్వభౌమపు సరిహద్దులు చెఱగిపోయాయన్నది జరిగిన ప్రచారం. 1989వ, 1991వ సంవత్సరాల మధ్య తూర్పు ఐరోపా దేశాలలోను, సోవియట్ రష్యాలోను ‘ఏకపక్ష కమ్యూనిస్టు నియంతృత్వ’ వ్యవస్థలు కుప్పకూలిపోయాయి. ఆయా దేశాలలో ‘బహుళపక్ష ప్రజాస్వామ్య రాజ్యాంగ వ్యవస్థ’లు వికసించాయి. ఫలితంగా తూర్పు ఐరోపా దేశాలు కూడ ‘ఐరోపా సమాఖ్య’లో సభ్య దేశాలయ్యాయి! ఐరోపా దేశాల మధ్య భౌతికమైన సరిహద్దులు అంతరించిపోయాయి. ఒక దేశంనుంచి మరో దేశానికి ‘ప్రయాణ అనుమతి పత్రాలు’- ‘వీసా’లు- అవసరంలేని రాకపోకలు మొదలయ్యాయి!! ఇరవై తొమ్మిది ఐరోపా దేశాలు ‘సమాఖ్య’లో భాగస్వాములయ్యాయి. బ్రిటన్ నిష్క్రమణతో ఈ సంఖ్య ఇరవై ఎనిమిదికి దిగజారింది. మరికొన్ని ఐరోపా దేశాలు ‘సమాఖ్య’లో భాగస్వాములు కాలేదు...
ఇలా ‘ఐరోపా సమాఖ్య’లో భాగస్వామ్యం ఏర్పడిన తమ దేశపు ‘సరిహద్దుల’ ప్రాధాన్యం చెఱగిపోయిందని బ్రిటన్ ప్రధానమంత్రి ఇప్పుడు వాపోతున్నాడు. ‘ఐరోపా సమాఖ్య’లో భాగస్వామ్యంవల్ల తమ రాజకీయ సార్వభౌమ అధికారం కూడ నశించిపోయినట్టు ‘బోరిస్ జాన్సన్’ ఇప్పుడు కనిపెట్టాడు, ‘సమాఖ్య’నుంచి నిష్క్రమించిన తరువాత కనిపెట్టాడు. ‘నిష్క్రమణ’తరువాత తమ దేశపు సరిహద్దులను భద్రపరచుకొంటామని, అక్రమ ప్రవేశకుల- ఇల్లీగల్ ఇమ్మిగ్రెంట్స్-ను నిరోధిస్తామని బోరిస్ జాన్సన్ కఠోరప్రతిజ్ఞలు చేస్తున్నాడు! శతాబ్దులపాటు వివిధ దేశాల ఆర్థిక, వాణిజ్య, రాజకీయ, సాంస్కృతిక, జాతీయ సార్వభౌమ అధికారాలను భగ్నంచేసి అంతర్జాతీయ దురాక్రమణ శక్తులలో అగ్రస్థానం వహించిన ‘బ్రిటన్’ఇలా తన సార్వభౌమ అధికారం దశాబ్దుల తరబడి భగ్నమైపోయిందని ఇలా బహిరంగ ‘రోదన’కు పాల్పడడం అభద్రతా భావానికి నిదర్శనం. ఇరవయ్యవ శతాబ్ది ఆరంభం నాటివరకు ‘అంతర్జాతీయ’ సామ్రాజ్యానికి ఆధిపత్యం వహించిన బ్రిటన్‌కు ఇలా తమ జాతీయ భౌగోళిక సమైక్యం పట్ల ‘అభద్రతాభావం’ ఏర్పడడం సహజ పరిణామక్రమం. ఇతర జాతులను దోచుకున్న జాతులు ఎప్పుడో అప్పుడు పతనం కావడం సంభవం... ‘‘విధాత అక్కటా! ఎవ్వరినెట్లు చేయడు?’’అన్న మహాకవి వాక్యం బ్రిటన్ పట్ల ఇలా నిజమైంది. ఈ అభద్రతాభావం బ్రిటన్‌కు ఇరవై ఏళ్లుగా ఏర్పడి ఉంది. అందువల్లనే బ్రిటన్ ఐరోపా ‘సమష్టి ద్రవ్య వినిమయ’- యూనిఫైడ్ మానిటరీ- వ్యవస్థలో చేరలేదు. వివిధ ఐరోపా దేశాలు తమ తరతరాల ‘వినిమయ మాధ్యమాల’- కరెన్సీ-ను విడనాడి ‘యూరో’ను ద్రవ్య వినిమయ మాధ్యమంగా స్వీకరించాయి. బ్రిటన్ ఇలా స్వీకరించలేదు, తమ ‘పౌండ్ స్టెర్లింగ్’ను వదలుకోలేదు. ‘స్కాట్‌లాండ్’ బ్రిటన్‌నుంచి దాదాపు విడిపోయే ప్రమాదం ఏర్పడడం ‘బ్రిగ్జిట్’కు సమాంతర విపరిణామం! బ్రిటన్‌లో జాతీయ అస్తిత్వ పరిరక్షణ పట్ల ధ్యాస పెరగడానికి ఇది కూడ ఒక ప్రధాన కారణం! ఫలితంగా తమ జాతీయ అస్తిత్వాన్ని ఐరోపా అస్తిత్వం దిగమింగివేస్తున్న భయం ప్రబలింది. 2016 జూన్ 23వ తేదీన ‘ఐరోపా సమాఖ్య’నుంచి వైదొలగాలని బ్రిటన్ మత ప్రదాతలు- వోటర్‌లు-నిర్ధారించారు. వెంటనే ప్రారంభమైన ‘నిష్క్రమణ ప్రక్రియ’ పూర్తికావడానికి మూడున్నర సంవత్సరాలు పట్టింది, గత జనవరి 31న ‘నిష్క్రమణ’ ప్రక్రియ పూర్తయింది!!
వాణిజ్య ప్రపంచీకరణ- గ్లోబలైజేషన్- పేరుతో ‘కృత్రిమ అంతర్జాతీయ ఏకత్వాన్ని’సాధించాలన్న యత్నానికి ఇలా ‘ఐరోపా సమాఖ్య’నుంచి బ్రిటన్ నిష్క్రమించడం ఎదురుదెబ్బ! ఐరోపా ‘వాణిజ్య సమీకృతి’కి విస్తృతి ‘ప్రపంచీకరణ’! నిజానికి అమెరికా, ఐరోపా ప్రభుత్వాలు ‘ప్రపంచీకరణ’కు ప్రధాన సూత్రధారులు. ‘ప్రపంచీకరణ’ పేరుతో వాణిజ్య సామ్రాజ్యాన్ని వివిధ దేశాలలో స్థాపించాలన్నది అమెరికా, ఐరోపాల ఉమ్మడి వ్యూహం! కానీ ఈ వాణిజ్య సామ్రాజ్య ఆధిపత్యాన్ని చైనా కాజేసింది! తమ వ్యూహం బెడిసికొట్టడంతో అమెరికా, బ్రిటన్ ప్రభుత్వాల అధినేతలు అంతర్జాతీయ శక్తుల-గ్లోబలిస్టులు-ను నిందిస్తున్నారు, జాతీయ తత్త్వాన్ని, దేశభక్తిని ప్రచారం చేస్తున్నారు!!