సంపాదకీయం

‘ఆమ్ ఆద్మీ’ ఆధిపత్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఢిల్లీ శాసనసభ ఎన్నికల ఫలితాలు ‘మత ప్రదాత’- వోటర్-ల ‘సమాఖ్య నిష్ఠ’కు నిదర్శనాలు! ముఖ్యమంత్రి అరవింద కేజరీవాల్ నాయకత్వంలోని ‘ఆమ్‌ఆద్మీ పార్టీ’కి మరోసారి ఘన విజయం సాధించి పెట్టడం ‘మత ప్రదాతలు’ ప్రదర్శించిన ఈ ‘సమాఖ్య నిష్ఠ’! కేంద్ర ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షానికీ ప్రాంతీయ ప్రభుత్వ నిర్వహణ బాధ్యతను కట్టపెట్టవలసిన అవసరం లేదన్నది ఈ ‘సమాఖ్య’- ఫెడరల్- స్ఫూర్తి! అందువల్లనే లోక్‌సభ ఎన్నికలలో- ఢిల్లీ ప్రాంతంలో- ఘన విజయం సాధించిన ‘్భరతీయ జనతాపార్టీ’ ఇప్పుడు- ఫిబ్రవరి ఎనిమిదవ తేదీన జరిగిన శాసనసభ ఎన్నికలలో ఘోర పరాజయం పాలైంది! 2019నాటి లోక్‌సభ ఎన్నికలలో ఘోర పరాజయగ్రస్తమైన ‘ఆమ్‌ఆద్మీ పార్టీ’ ఇప్పుడు, ఏడు నెలల తరువాత, జరిగిన శాసనసభ ఎన్నికలలో అఖండ విజయం సాధించింది! కేంద్ర ప్రభుత్వ, ఢిల్లీ ప్రాంతీయ ప్రభుత్వ నిర్వాహక రాజకీయ పక్షాల ఈ జయాపజయాలు, పతన ప్రాభవాలు ఐదేళ్లలో ఇలా పునరావృత్తం అయ్యాయి. ఢిల్లీ- జాతీయ రాజధాని ప్రాంతం- నేషనల్ కాపిటల్ టెర్రిటరీ ఆఫ్ ఢిల్లీ- పరిధిలో ఏడు లోక్‌సభ స్థానాలున్నాయి. ఢిల్లీ శాసనసభలో డెబ్బయి స్థానాలున్నాయి... 2014నాటి లోక్‌సభ ఎన్నికలలో ‘్భజపా’ విజయం సాధించింది. నలబయి ఏడు శాతం ‘మతాంకాల’- వోట్ల-ను పొందింది. ఏడు లోక్‌సభా స్థానాల పరిధిలో, అరవై శాసనసభ స్థానాలలో ‘్భజపా’కు ప్రత్యర్థుల కంటె ఎక్కువ వోట్లు లభించాయి. ఆ లోక్‌సభ ఎన్నికలలో ‘ఆమ్‌ఆద్మీ’కి ముప్పయిమూడు శాతం వోట్లు మాత్రం దక్కాయి. ఏడు లోక్‌సభా స్థానాల పరిధిలోని కేవలం పది శాసనసభ స్థానాలలో మాత్రమే ‘ఆమ్‌ఆద్మీ’కి ప్రత్యర్థుల కంటె ఎక్కువ ‘మతాంకాలు’దక్కాయి. అందువల్ల ఏడు నెలల తరువాత 2015లో జరిగిన ఢిల్లీ ‘శాసన’సమరంలో తమదే విజయమని ‘్భజపా’వారు విశ్వసించారు. కానీ 2015నాటి శాసనసభ ఎన్నికలలో ‘్భజపా’కు ముప్పయి మూడు శాతం ‘మతాంకాలు’మాత్రమే దక్కాయి. శాసనసభలో కేవలం మూడు స్థానాలు దక్కిన ‘్భజపా’కు ‘ప్రతిపక్ష నాయక’ అధికార హోదా కూడ దక్కలేదు. ఆ శాసనసభ ఎన్నికలో ‘ఆమ్‌ఆద్మీ’ యాబయి ఐదు శాతం ‘వోట్ల’ను అరవై ఏడు స్థానాలను కైవసం చేసుకొని సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టింది. ఆ చరిత్రకు ఈ ఎన్నికలు పునరావృత్తి! 2019నాటి లోక్‌సభ ఎన్నికలలో గెలిచిన ‘్భజపా’ ఈ శాసనసభ ఎన్నికలలో పరాజయ పరాభావానికి గురికావడం ఆ లోక్‌సభ ఎన్నికలలో పాతాళ పతనమైన ‘ఆమ్‌ఆద్మీ’ ఘన విజయకేతనం ఈ శాసనసభ ఎన్నికలలో అంబరాన్ని చుంబించడం ‘పునరావృత్తి’ తీరు...
గత లోక్‌సభ ఎన్నికలలో ఒక్క శాసనసభ పరిధిలో కూడ ‘ఆమ్ ఆద్మీ’కి విజయం లభించలేదు. ఒక్కొక్క లోక్‌సభ నియోజకవర్గం పరిధిలో పది శాసనసభ నియోజకవర్గాలు ఉన్నాయి. ఆ ఎన్నికలలో ‘ఆమ్‌ఆద్మీ’కి కేవలం పద్దెనిమిది శాతం ‘వోట్లు’వచ్చాయి, యాబయి ఏడు శాతం ‘మతాంకాలు’గెలిచిన ‘్భజపా’కు అరవై ఐదు శాసనసభా నియోజకవర్గాల పరిధిలో ప్రత్యర్థులపై ఆధిక్యం లభించింది! ఏడు నెలల తరువాత మళ్లీ ఇప్పుడు ఘోర పరాజయం, ఘన విజయం స్థానాలు మారిపోయాయి. ‘ఆమ్‌ఆద్మీ’కి యాబయి రెండు శాతానికి పైగా వోట్లు అరవై రెండు శాసనసభ స్థానాలు లభిస్తున్నాయి, ‘్భజపా’వోట్ల శాతం నలబయి కంటె తక్కువకు దిగజారిపోయాయి. ఎనిమిది స్థానాలు మాత్రమే ‘్భజపా’కు శాసనసభలో దక్కడం చారిత్రక పునరావృత్తి... మత ప్రదాతల విచక్షణ దీప్తి... ‘సమాఖ్య’స్ఫూర్తి! కేంద్ర ప్రభుత్వ పక్షమే ప్రతి రాష్ట్రంలోను, కేంద్ర పాలిత ప్రాంతంలోను ప్రభుత్వ పక్షం కాజాలదన్నది ఈ ‘సమాఖ్య’స్ఫూర్తి! మత ప్రదాతల మనోభీష్టంమేరకు ఒకే ‘పార్టీ’కేంద్రంలోను, రాష్ట్రంలోను ‘అధికార పక్షం’కావచ్చు... కాకపోవచ్చు!! ఢిల్లీ మతప్రదాతలు జాతీయస్థాయిలో ‘్భజపా’ ప్రభుత్వాన్ని, ప్రాంత స్థాయిలో ‘ఆమ్‌ఆద్మీ’ ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారన్నది మాత్రమే ఏడు ఏళ్లుగా ధ్రువపడిన వాస్తవం! ఈ మత ప్రదాతల అంతరంగం గురించి చిత్రవిచిత్ర వ్యాఖ్యలు, విశే్లషణలు చేయడం రాజకీయ అనభిజ్ఞత- పొలిటికల్ ఇగ్నోరెన్స్-కు మాత్రమే చిహ్నం... ప్రజాభీష్టం ఈ ‘అనభిజ్ఞత’కు అందనిది...!! అంతర్గత భద్రతను, సరిహద్దుల సంరక్షణను ‘్భజపా’నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వం గత ఐదేళ్లుగా పెంపొందించింది. అందువల్ల లోక్‌సభ ఎన్నికలలో ‘ఇంద్రప్రస్థ’- ఢిల్లీ- ప్రజలు ‘్భజపా’ను వరించి ఉండవచ్చు! నిత్య జీవన వ్యవహార సౌలభ్యాన్ని పెంపొందించడంలో ‘ఆమ్‌ఆద్మీ’ కృతకృత్య అయిందన్న భావంతో శాసనసభ ఎన్నికలలో ఆ పార్టీకి ఢిల్లీ ప్రజలు పట్టం కట్టారు!!
ఈ జీవన సౌలభ్యం దెబ్బతినడానికి ప్రాంత ప్రభుత్వంకాక, కేంద్ర ప్రభుత్వం కారణమన్న భావం కూడ ఢిల్లీ మత ప్రదాతలలో బలపడిందన్నది ఈ ఎన్నికల పాఠం! భయంకరమైన వాహనాల రద్దీ, ఈ రద్దీవల్ల పెరిగిన కాలుష్య విషం ఢిల్లీ ప్రాంగణంలో తరచు ఆవిష్కృతవౌతున్న దృశ్యాలు! ఈ కాలుష్యం ‘ఆమ్‌ఆద్మీ’ ఘన విజయాన్ని నిరోధించలేదు, ‘్భజపా’ను దెబ్బతీసింది! అందువల్ల జన మానస ప్రవర్తన గతిని తర్కించడం అవివేకం... జనాభీష్టాన్ని శిరసావహించడం మాత్రమే సఫల ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియ... ‘ఆమ్‌ఆద్మీ పార్టీ’, అవతరణ, ‘లోక్‌పాల్’వ్యవస్థ ఏర్పాటుకోసం అన్నాసాహెబ్ హజారే నాయకత్వంలో నడచిన ఉద్యమానికి పరాకాష్ఠ! ‘లోక్‌పాల్’ ఏర్పడడం, ‘ఆమ్‌ఆద్మీ’ అంకురించడం సమాంతర పరిణామాలు! తమ ఉద్యమాన్ని రాజకీయ పక్షంగా పరివర్తన చేయాలని అన్నా సాహెబ్ భావించలేదు, అరవింద కేజరీవాల్ భావించాడు. ‘లోక్‌పాల్’ను ఏర్పాటుచేయడానికి వీలైన చట్టాన్ని పార్లమెంటు 2013 డిసెంబర్‌లో ఆమోదించింది. ‘ఉన్నతోన్నత స్థాయి ప్రభుత్వ అవినీతి’ని నిరోధించడానికి దశాబ్దుల తరబడి జరిగిన సంఘర్షణ ఫలితం లోక్‌పాల్ వ్యవస్థ. కానీ ఐదున్నర ఏళ్ల తరువాత, గత ఏడాది మార్చిలో, లోక్‌పాల్ నియామకం జరిగింది. కానీ ‘అవినీతి వ్యతిరేక ఉద్యమం’ ‘ఆమ్‌ఆద్మీ పార్టీ’గా అవతరించడంలో ఇలా విలంబనం జరగలేదు. అన్నాసాహెబ్ హజారే వ్యతిరేకించినప్పటికీ, ఆయనకు కుడి భుజంగా పనిచేసిన అరవింద కేజరీవాల్ 2012వ సంవత్సరం గాంధీ జయన్తిరోజున రాజకీయ పార్టీని స్థాపించాడు. అవినీతి వ్యతిరేక ఉద్యమ కార్యకర్తలకు రాజకీయాలతో సంబంధం ఉండరాదన్నది అన్నాసాహెబ్ హజారే చెప్పిన మాట... కానీ కేజరీవాల్ బృందంవారు రాజకీయాలలో చేరి ‘అవినీతి’ని ఓడించాలని భావించారు!! ‘‘ఏకక్రియా ద్వర్తకరీ’’- ఒక చర్యకు రెండు ఫలితాలు- ఒక దెబ్బకు రెండు పిట్టలు-అని అన్నట్టు ‘లోక్‌పాల్’ వ్యవస్థ ఏర్పడింది, ‘ఆమ్‌ఆద్మీ పార్టీ’పుట్టింది!
ఢిల్లీలో ‘‘పదిహేను సంవత్సరాల కాంగ్రెస్ అవినీతి పాలన’’ను తొలగించడం తక్షణ లక్ష్యంగా ప్రకటించుకున్న ‘ఆమ్‌ఆద్మీ’ 2013నాటి శాసనసభ ఎన్నికలలో ఆ లక్ష్యాన్ని సాధించింది. కానీ ఆ ఎన్నికలలో ‘ఆమ్‌ఆద్మీ’గెలవలేదు. ‘కాంగ్రెస్’పార్టీ మద్దతుతో 2013 డిసెంబర్‌లో అరవింద్ కేజరీవాల్ ముఖ్యమంత్రి కావలసి వచ్చింది... వ్రత భంగమైంది. నెలలు గడవకముందే ఆ ప్రభుత్వం కూలిపోయింది! కేజరీవాల్ పట్ల ప్రజాదరణ మాత్రం పెరిగింది. 2015నాటి ఎన్నికలలోను, ఇప్పుడు జరిగిన ఎన్నికలలోను ఈ ప్రజాదరణ ప్రస్ఫుటించింది...