సంపాదకీయం

మైత్రికి ‘మారాకు’..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బర్మా అధ్యక్షుడు యూవిన్ మియాంట్ మన దేశంలో జరుపుతున్న నాలుగురోజుల పర్యటనకు మాధ్యమాలలో ప్రాధాన్యం లభించక పోవడం ఆశ్చర్యకరం కాదు. ఇరుగు పొరుగున ఉన్న మన దేశం, బర్మా- మ్యాన్‌మార్- దేశం పరస్పరం అంటీముట్టనట్టు వ్యవహరిస్తుండడం క్రీస్తుశకం 1948నుంచి నడుస్తున్న కథ... ఇటీవలి కాలంలో మన ప్రభుత్వం అమలుజరుపుతున్న ‘‘పొరుగు ప్రాథమ్యం’’- నైబర్‌హుడ్ ఫస్ట్- విధానంవల్ల మన దేశానికీ బర్మాకు మధ్య సంబంధాలు మెరుగుపడుతున్నాయి. దాదాపు యాబయి ఏళ్లు నియంతృత్వ రాజ్యాంగ వ్యవస్థ కొనసాగిన తరువాత 2016లో బర్మాలో నిజమైన ప్రజాస్వామ్య వ్యవస్థ ఏర్పడింది, ఇరుగు పొరుగున ఉన్న రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య మైత్రి వికసించడం ద్వైపాక్షిక ప్రయోజనాలు పెంపొందడానికి మాత్రమేకాక తూర్పు ఆసియా, ప్రశాంత మహాసాగర ప్రాంత శాంతి భద్రతలకు దోహదం చేయగలదు. ఈ ప్రశాంత మహాసాగర ప్రాంతంతో చైనా వ్యూహాత్మక దురాక్రమణ నిరంతరం తీవ్రతరం అవుతుండడం శాంతిభద్రతలకు భంగం కలిగిస్తున్న విపరిణామం. అందువల్ల యూవిన్ మియాంట్ మన దేశంలో పర్యటిస్తున్న సందర్భంగా బర్మాతో మనకు ఎన్ని ఒప్పందాలు కుదిరాయన్నది ప్రధానం కాదు.- పది ఒప్పందాలు కుదిరాయట! వీటిలో ప్రధానమైనది అక్రమ ప్రవేశకుల రాకపోకలను నిరోధించడానికి సంబంధించినది-!! ఒక దేశానికి చెందిన ప్రభుత్వ ప్రతినిధులు తరచు రెండవ దేశంలో పర్యటించడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంటున్న వ్యవహారం! ఇలాంటి అధికార పర్యటనలవల్ల ఉభయ దేశాల మధ్య విస్తృత అవగాహన పెరగడం ఇరుగుపొరుగు దేశాలకు ప్రయోజనకరం! అందువల్ల ఒప్పందాలు కుదరడం కంటె బర్మా అధ్యక్షుడు యూవిన్ మియాంట్ మన దేశంలో పర్యటించడమే ప్రాధాన్యం లభించవలసిన అంశం! ఎందుకంటె చైనా ఆధిపత్య ప్రభావంనుంచి బర్మా ఇప్పుడిప్పుడే కొంత విముక్తిని పొందుతోంది. బర్మాలోని అరకాన్- రఖైన్- ప్రాంతాన్ని బర్మానుంచి విడగొట్టి స్వతంత్ర ఇస్లాం మత రాజ్యంగా ఏర్పాటుచేయడానికి 1948 నుంచి కూడ రోహింగియా జిహాదీ తీవ్రవాదులు యత్నిస్తున్నారు. మన దేశంలోని జమ్మూకశ్మీర్‌ను మన దేశంనుంచి విడగొట్టడానికి జిహాదీ బీభత్సకారులు యత్నించినట్టుగానే అరకాన్‌లో బర్మాకు వ్యతిరేకంగా కుట్ర కొనసాగింది. మన ఈశాన్య ప్రాంతంలో విచ్ఛిన్న కలాపాలు సాగిస్తున్న చైనా అనుకూల బీభత్సకారులు, చైనా ఉసిగొల్పిన బీభత్సకారులు మన సరిహద్దునకు సమీపంలోని బర్మా ప్రాంతాలలో స్థావరాలను ఏర్పాటుచేసుకున్నారు. ఈ బీభత్స స్థావరాలను మన సైనిక దళాలవారు 2015 జూన్‌లో బద్దలుకొట్టారు. ఈ ‘సాయుధ చికిత్స’ తరువాత ఈ బీభత్సకారులతో తమ సంబంధం లేదని చైనా ప్రభుత్వం ప్రకటించింది...
బర్మా చైనా ఆధిపత్య ప్రభావం నుంచి విముక్తం అవుతున్నందువల్లనే చైనా సమర్ధక బీభత్సకారుల స్థావరాలను మన సైనిక దళాలు ధ్వంసం చేయడానికి బర్మా ప్రభుత్వం 2015లో సహకరించింది. 2015 నవంబర్‌లో జరిగిన ఎన్నికలలో ప్రజాస్వామ్య ఉద్యమ నేత ఆంగ్‌సాన్ సూచీ నాయకత్వంలోని ‘జాతీయ ప్రజాస్వామ్య సమాఖ్య’- నేషనల్ లీగ్ ఆఫ్ డెమోక్రసీ- ఎన్‌ఎల్‌డి- ఘన విజయం సాధించడంతో యాబయి ఏళ్ల తరువాత బర్మాలో ‘ప్రజాస్వామ్య వ్యవస్థ’ మళ్లీ ఏర్పడింది. బర్మా అనాదిగా అఖండ భారతదేశంలో భాగం. విదేశీయ జిహాదీలు, ఆ తరువాత ఐరోపా బీభత్సకారులు అఖండ భారతదేశాన్ని దురాక్రమించిన సమయంలో అఖండ భారత్‌లోని కొన్ని ప్రాంతాలు ఈ దురాక్రమణను ప్రతిఘటించగలిగాయి. నేపాల్ భూటాన్ విదేశీయ దురాక్రమణగ్రస్తం కాలేదు. బర్మా క్రీస్తుశకం 1885వరకు బ్రిటన్ దురాక్రమణను ప్రతిఘటించింది. 1886లో బర్మా సైతం బ్రిటన్ దురాక్రమణకు గురిఅయింది. 1937లో బ్రిటన్ బీభత్స పాలకులు బర్మాను మన దేశంనుంచి విడగొట్టి ప్రత్యేక ‘దేశం’గా ఏర్పాటుచేశారు! 1948లో బర్మా స్వతంత్ర దేశమైంది. బ్రిటన్‌వారి ఈ చర్యను 1937వ 1948వ సంవత్సరాల మధ్య బర్మా ప్రజలు నిరసించారు, తమను భారత్‌లోనే కొనసాగించాలని ఉద్యమాలు చేశారు. బర్మా 1937 తరువాత కూడ మన దేశంలోనే కొనసాగి ఉంటే బర్మాపై దశాబ్దులపాటు చైనావారి వ్యూహాత్మక ఆధిపత్యం ఏర్పడి ఉండేది కాదు. బర్మాలో చైనాకు స్థావరాలు ఏర్పడి ఉండేవి కాదు. 1962లో చైనా అనుకూల సైనిక దళాలు బర్మాలో ప్రజాస్వామ్య వ్యవస్థను కూలదోశాయి. అప్పటినుంచి యాబయి ఏళ్లపాటు సైనిక పాలన సాగిన సమయంలో బర్మాను చైనా నిర్దేశించగలిగింది. ఇదంతా మన దేశానికి వ్యతిరేకంగా జరిగిన విపరిణామక్రమం!
అందువల్ల బర్మాతో ఐదారెళ్లుగా మన సంబంధాలు మెరుగుపడుతుండడం, బర్మాపై చైనా ప్రభావం కొంత తగ్గుతుండడం హర్షణీయ పరిణామాలు! కానీ బర్మాలో చైనా పెద్దఎత్తున పెట్టుబడులను పెడుతోంది. వౌలిక సదుపాయాల వ్యవస్థలను మెరుగుపరచడానికి ఈ పెట్టుబడులను వినియోగించనున్నట్టు ప్రచారవౌతోంది. గత నెలలో చైనా అధ్యక్షుడు ఛీజింగ్‌పింగ్ బర్మాలో పర్యటించిన సందర్భంగా పెట్టుబడులకు సంబంధించిన దాదాపు ముప్పయిమూడు ఒప్పందాలు కుదిరినట్టు ప్రచారమైంది. ఆంగ్‌సాన్ సూచీని అనేక ఏళ్లపాటు నిర్బంధించిన ‘సైనిక కూటమి’ పాలనను చైనా సమర్ధించింది. కానీ ప్రజాస్వామ్య పునరుద్ధరణ తరువాత కూడ చైనా ప్రభుత్వం ‘పెట్టుబడుల’ద్వారా బర్మా రాజ్యాంగ వ్యవస్థను నియంత్రించడానికి యత్నిస్తోంది. బర్మాలోని కుయాకూప్యూ ఓడరేవును పదివేల కోట్ల రూపాయల ఖర్చుతో ఆధునీకరించడానికి జింగ్‌పింగ్ పర్యటన సందర్భంగా చైనా అంగీకరించింది. ఇలా ఓడరేవులను అభివృద్ధిచేయడం పేరుతో బర్మాలో తన నౌకాదళాలను నెలకొల్పడానికి చైనా యత్నిస్తోంది. బర్మా, బంగ్లాదేశ్, శ్రీలంక, మాల్‌దీవులు, పాకిస్తాన్‌లలో నౌకాదళ స్థావరాలను ఏర్పాటుచేయడం ద్వారా మన దేశాన్ని మూడు సముద్రాల వైపునుంచి చుట్టుముట్టడం చైనా లక్ష్యం. పాకిస్తాన్‌లో ఆర్థిక ప్రాంగణాన్ని ఏర్పాటుచేసిన రీతిలోనే బర్మాలో కూడ బృహత్ ఆర్థిక ప్రాంగణాన్ని- ఎకనమిక్ కారిడార్‌ను ఏర్పాటుచేయడానికి చైనా అంగీకరించినట్టు ప్రచారమైంది. ఈ ‘ఆర్థిక ప్రాంగణం’లో కొంత భాగం ‘అరకాన్’-రఖైన్- ప్రాంతంలో ఏర్పడుతుందట...
బౌద్ధమతంవారు అత్యధిక సంఖ్యలో ఉన్న బర్మాలోని ‘అరకాన్’ ప్రాంతంలో మాత్రం ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్నారు. 1947లో, ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న భారత భూభాగం ‘పాకిస్తాన్’గా ఏర్పడింది. అదే రీతిలో ఇస్లాం మతస్థులు అధిక సంఖ్యలో ఉన్న ‘అరకాన్’ను బర్మానుంచి విడగొట్టడానికి 1948నుంచి ‘జిహాదీ’లు యత్నిస్తున్నారు. ‘జిహాదీ’ బీభత్సకారులు ‘అరకాన్’లో బౌద్ధులను ఇతర హిందువులను సామూహికంగా హత్యచేయడం చరిత్ర. కానీ బర్మా ప్రభుత్వం జిహాదీ బీభత్సకారులను కఠినంగా అణచివేసింది. ఈ అణచివేత సందర్భంగా మూడు లక్షల ‘రోహింగియా’ ముస్లింలు ఇతర దేశాలకు వలసపోయారు, అక్రమంగా పొరుగు దేశాలలోకి చొఱబడినారు. ‘జిహాదీ’లు కూడ సాధారణ ముస్లింల ముసుగులో ఇతర దేశాలలో చొఱబడి ఉన్నారు. మన దేశంలో కూడ దాదాపు డెబ్బయివేల ‘రోహింగియా’లు అక్రమంగా తిష్ఠవేసి ఉన్నారు! బర్మా ప్రభుత్వాన్ని ఒప్పించి ఈ రోహింగియాలను మళ్లీ బర్మాకు పంపించడానికి మన ప్రభుత్వం యత్నిస్తోంది. ‘అరకాన్’లో రోహింగియాలకోసం ఇళ్లను కూడ మన ప్రభుత్వం నిర్మించింది! యూవిన్ మియాంట్ పర్యటనకు ఇదంతా నేపథ్యం...