సంపాదకీయం
సంస్థాగత ప్రజాస్వామ్యం..
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
మన దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలలో ‘సంస్థాగత ప్రజాస్వామ్యం’ వ్యవస్థీకృతం కాకపోవడం మన ‘‘పరిణత’’ రాజ్యాంగ ప్రక్రియలో నిహితమై ఉన్న ప్రధాన లోపం. లోక్‌సభకు, రాజ్యసభకు రాష్ట్రాల శాసనసభలకు, శాసన మండలులకు జరుగుతున్న ఎన్నికలలో వివిధ పక్షాల తరఫున అభ్యర్థులు పోటీ చేస్తున్నారు. ఈ ‘అభ్యర్థుల’ను ఆయా రాజకీయ పక్షాల ‘అధిష్ఠాన వర్గాలు’ నిర్ణయిస్తున్నాయి. అధిష్ఠానవర్గ మంటే నిజానికి ఆయా పక్షాలలోని సర్వోన్నత నాయకుడు! దాదాపు అన్ని రాజకీయ పక్షాలలోను ఈ సర్వోన్నత నాయకుడు లేదా నాయకురాలు సర్వాధికారాలతో అధిష్ఠానంగా చెలామణి అవుతుండడం నడుస్తున్న చరిత్ర. ప్రాంతీయ రాజకీయ పక్షాల ఈ అధినేతల ‘‘ఏకఛత్రాధిపత్యం’’ మరింతగా ప్రస్ఫుటిస్తోంది! ఇలా ‘చట్టసభల’ ఎన్నికలలో పోటీచేసే అభ్యర్థులను ఆయా పక్షాల ‘అధిష్ఠానం’ నిర్ధారించడం ప్రజాస్వామ్య అధికార కేంద్రీకరణకు తిరుగులేని నిదర్శనం! ఇలా అభ్యర్థులను ఎంపిక చేసే ప్రక్రియకు ‘‘టిక్కెట్టు ఇవ్వడం’’ అన్నది వ్యవహార నామం! ‘‘్ఫలానా వ్యక్తికి పార్టీ అభ్యర్థిత్వం లభించిందా??’’-అని అడగడానికి ‘‘ఆయనకు టిక్కెట్టు వచ్చిందా?’’అని ప్రశ్నించడం వ్యవహార పర్యాయం! ఇలా ఆయా పక్షాల అభ్యర్థులను ‘టిక్కెట్టు’ ఇవ్వడం ద్వారా అగ్రనేత లేదా ఇద్దరు ముగ్గురు అగ్రనేతలు మాత్రమే నిర్ధారిస్తున్నారు. లోక్‌సభలోని ఐదువందల నలబయిమూడు స్థానాలకు, వివిధ రాష్ట్రాలలోని అన్ని శాసనసభ స్థానాలకు ఇలా ‘అధిష్ఠానం’ అభ్యర్థులను ఎంపిక చేయడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి, ప్రధానంగా, సంస్థాంతర్గత ప్రజాస్వామ్య స్ఫూర్తికి భంగకరమన్న ‘‘్ధ్యస’’ మన దేశంలో ఇప్పటికీ ఏర్పడలేదు. దీనికి- ఈ టిక్కెట్లను ఇచ్చే పద్ధతికి ప్రత్యామ్నాయం ఉంది! ప్రతి నియోజకవర్గంలోను వివిధ రాజకీయ పక్షాల అభ్యర్థులను ఆయా పక్షాలకు చెందిన సభ్యులు ఎన్నుకోవడం ఈ ప్రత్యామ్నాయం...
ఇలా ‘పార్టీ’ అభ్యర్థులను ప్రతి నియోజకవర్గంలోను ఆయా పార్టీల ప్రాథమిక సభ్యులు లేదా క్రియశీల సభ్యులు ఎన్నుకోవడంవల్ల ప్రజాస్వామ్య పద్ధతులు ప్రతి రాజకీయ సంస్థలోను అట్టడుగు స్థాయివరకు వికేంద్రీకృతం అవుతాయి. ఇలా వికేంద్రీకృతం కావడం నిజమైన సంస్థాగత ప్రజాస్వామ్యం! దీనివల్ల ప్రతి నియోజకవర్గం స్థాయిలోను సంస్థ సభ్యులకు ప్రాధాన్యం ఏర్పడుతుంది, వారికి ప్రజాస్వామ్య అవగాహన పెరుగుతుంది, సంస్థా సంబంధిత సైద్ధాంతిక నిబద్ధత దృఢతరమవుతుంది. దీనివల్ల అట్టడుగు స్థాయిలోని కార్యకర్తలకు మత ప్రదాతల- వోటర్‌లు-కు నైతిక నిష్ఠ బలపడి సాధారణ ఎన్నికలలో ‘అక్రమాలు’ క్రమంగా అంతరించిపోతాయి. రాజకీయ పక్షాలు ‘నాయకుని’- లీడర్ -పై ఆధారపడి కాక కార్యకర్తల- కాడర్- ప్రాతిపదికగా ఎదగాలని అందరూ ప్రవచిస్తున్నారు. కానీ ‘కార్యకర్తల’ ప్రాధాన్యం, భాగస్వామ్యం విస్తరించే విధంగా, ‘‘అభ్యర్థులను ప్రతి నియోజకవర్గంలోను కార్యకర్తలు ఎన్నిక చేసుకునే’’ సంస్థాగతమైన ఎన్నికలను నిర్వహించడానికి ఇంతవరకు ఏ పార్టీ అధిష్టానం కూడ ప్రయత్నించడం లేదు. నాయకుని ప్రాతిపదికగా ఏర్పడే రాజకీయ పక్షం ఒక ‘కొక్కీ’-మేకు- సహాయంతో ఇంటి కప్పునకు వేలాడే ‘నిచ్చెన’వంటిది! కార్యకర్తల ప్రాతిపదికగా ఎదిగే రాజకీయ పక్షం కిందినుంచి పైకి నిర్మాణమయ్యే ‘మెట్ల’వంటిది! ‘కొక్కీ’ ఊడిపోతే నిచ్చెన మొత్తం కూలిపోతుంది. కానీ కిందినుంచి పైకి ఏర్పడే ‘మెట్లవరుస’లో పై భాగంలోని వరుసలు కూలిపోయినప్పటికీ మొత్తం ‘మెట్లు’కూలిపోవు, నాయకులు పతనమైనప్పటికీ కార్యకర్తలు- కిందిస్థాయి కార్యకర్తలు- పదిలంగా ఉంటారు, పార్టీని మళ్లీ నిలబెట్టుకోగలరు... అందువల్ల ప్రతి లోక్‌సభ, శాసనసభ నియోజకవర్గంలోను సాధారణ ఎన్నికలకు ముందుగా, వివిధ పక్షాల అభ్యర్థులను ఎన్నుకొనడానికి ప్రతి రాజకీయ పక్షం అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించాలి! ఉదాహరణకు లోక్‌సభ ఎన్నికలలో ‘కొత్త ఢిల్లీ’ నియోజకవర్గంనుంచి పోటీ చేయదలచిన ‘్భరతీయ జనతాపార్టీ’ అభ్యర్థిని ‘అధిష్ఠానం’ నిర్ణయించరాదు. ఆ నియోజకవర్గంలోని ‘్భజపా’ సభ్యులు ఎన్నిక చేయాలి. ఒకరికంటె ఎక్కువ మంది ‘సభ్యత్వాన్ని’ కోరినప్పుడు పార్టీ సభ్యులు ‘మత ప్రదానం’చేయాలి. ఎక్కువ ‘వోట్లు’వచ్చిన ‘విజేత’ ఆ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా సాధారణ ఎన్నికలలో లోక్‌సభకు పోటీచేయాలి! ఇదే పద్ధతిని ‘కాంగ్రెస్’ తదితర పక్షాల అభ్యర్థుల ఎన్నికకు కూడ పాటించాలి! దేశమంతటా అన్ని నియోజకవర్గాలలోను ఇలా ‘సంస్థాగత వరణ ప్రక్రియ’- ఆర్గనైజేషనల్ పోల్స్- ద్వారా వివిధ రాజకీయ పక్షాల తరఫున లోక్‌సభకు, శాసనసభలకు పోటీచేసే అభ్యర్థుల ఎన్నిక జరగాలి. అంటే చట్టసభలకు జరిగే ప్రతి సాధారణమైన ఎన్నిక- జనరల్ ఎలక్షన్-కు ముందుగా వివిధ ప్రధాన రాజకీయ పక్షాల సంస్థాగతమైన ఎన్నికలు జరగాలి. ‘ఎన్నికల కమిషన్’ద్వారా ఈ ‘సంస్థాగత ప్రజాస్వామ్య ప్రక్రియ’ను నిర్వహించడానికి వీలుగా ‘ప్రజాప్రాతినిధ్యపు చట్టం’- రెప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్-లో తగిన నిబంధనలను చేర్చాలి! ఈ సంస్థాగత అభ్యర్థుల ఎన్నిక ప్రక్రియ మన దేశంలో ఎప్పుడో వ్యవస్థీకృతం అయి ఉండాలి, బ్రిటన్ విముక్త భారత్‌లో 1952నుంచి అమలుజరిగి ఉండాలి. జరగలేదు... ఇప్పుడైన ప్రయత్నం ప్రారంభం కావచ్చు కదా!! అతి ప్రాచీన కాలంలో మన దేశంలో అట్టడుగు స్థాయిలో ప్రజాస్వామ్య వ్యవస్థలు వర్ధిల్లడం చరిత్ర! ఈ చరిత్రను బ్రిటన్ రాజకీయ బీభత్సకారులు చెఱచిపోవడం ఇటీవలి చరిత్ర.
అమెరికాలో ఈ సంస్థాగత ప్రజాస్వామ్యం పరిఢవిల్లుతోంది! అందువల్ల అమెరికా కాంగ్రెస్- పార్లమెంట్- ఉభయ సభల ఎన్నికలలో పోటీచేస్తున్న ‘నామాంకితుల’- నామినీల-ను ప్రధాన పక్షాలు సంస్థాగత ప్రజాస్వామ్య ప్రక్రియ ద్వారా ఎన్నుకుంటున్నాయి. ఈ ప్రధాన పక్షాలు డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీ... అలాగే యాబయి రాష్ట్ర శాసనసభలకు జరిగే సాధారణ ఎన్నికలకు ముందుగా ‘సంస్థాగతమైన ఎన్నికల’- ప్రైమరీ ఎలక్షన్స్-ద్వారా ఈ ‘పార్టీ’లవారు అభ్యర్థులను ఎన్నుకుంటున్నారు. ఒక నియోజకవర్గం- డిస్ట్రిక్ట్-లో ఒక పార్టీ తరఫున పోటీ చేయడానికి ఒకరికంటె ఎక్కువమంది అభ్యర్థులు- కాండిడేట్స్- పోటీ పడినప్పుడు ఆ నియోజకవర్గంలోని ఆ పార్టీ సభ్యులు ‘రహస్య మత ప్రదాన’- సీక్రెట్ బ్యాలెట్- ప్రక్రియ ద్వారా అభ్యర్థులలో ఒకరిని ‘నామాంకితుని’- నామినీ-గా నిర్ధారిస్తున్నారు. ప్రతి రెండేళ్లకోసారి అమెరికా కాంగ్రెస్‌లోని ‘ప్రతినిధుల సభ’కు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం నాలుగు వందల ముప్పయి ఐదు నియోజకవర్గాలలోను రెండేళ్లకు ఒకసారి సాధారణ ఎన్నికలకు ముందు ఈ ‘ప్రైమరీ’లు- సంస్థాగతమైన అంతర్గతమైన ఎన్నికలు- కూడ జరుగుతున్నాయి. కేవలం ప్రతినిధుల సభకు, రాష్ట్రాల ప్రతినిధుల సభలకు మాత్రమే కాదు ‘కాంగ్రెస్’లోని ఎగువ సభ- సెనెట్-కు, రాష్ట్రాల ‘సెనెట్’లకు, గవర్నర్- రాజ్యపాల్- పదవులకు, చివరికి దేశాధ్యక్ష పదవికి పోటీచేసే నామాంకితుల- నామినీలు-ను కూడ అమెరికా రాజకీయ పక్షాలవారు ప్రతిస్థాయిలోను సంస్థాగతమైన ఎన్నికల ద్వారా నిర్ధారిస్తున్నారు! పార్టీ ‘నామాంకితం’-నామినేషన్-కోసం పార్టీలోని వివిధ అభ్యర్థులు- కాండిడేట్లు- పోటీపడడం, వారిలో ఒకరిని సభ్యులు పార్టీ ‘నామినీ’- నామాంకితుడు-గా ఎన్నుకోవడం ‘ప్రైమరీ’ల స్వభావం, కార్యక్రమం!! నవంబర్‌లో జరుగనున్న అధ్యక్షుని ఎన్నికలో డెమొక్రాటిక్ పార్టీ, రిపబ్లికన్ పార్టీల తరఫున పోటీచేసే ‘నామినీ’ల వరణ ప్రక్రియ ఫిబ్రవరిలో మొదలైంది. ఈ ప్రక్రియ జూన్ వరకు కొనసాగుతుంది. ఒక్కొక్క మంగళవారంనాడు కొన్ని రాష్ట్రాలలో ఈ ‘ప్రైమరీ’లు జరుగుతున్నాయి. సంస్థాగత స్పర్థలో రిపబ్లికన్ పార్టీ తరఫున ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ ‘నామినీ’ ఎన్నిక కావడం ఖాయం. డెమొక్రాటిక్ పార్టీ ‘నామాంకితుడు’- నామినీ- కావడంకోసం ఇద్దరు అభ్యర్థులు- కాండిడేట్ల- మధ్య తీవ్రమైన పోటీ జరుగుతోంది- ఒకరు మాజీ ఉపాధ్యక్షుడు జోసెఫ్.ఆర్.బైడన్, మరొకరు సెనెటర్ బెర్నీ శాండర్స్...