సంపాదకీయం

పట్టించుకోని ప్రభుత్వం...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను హిందువులపై భయంకరమైన దాడులు జరుగుతుండడం ఆశ్చర్యకరం కాదు. ఈ రెండు దేశాలలోని అవశేష హిందువులను నిశే్శషంగా నిర్మూలించడం జిహాదీల లక్ష్యం. బంగ్లాదేశ్‌లో శనివారం ఒక వృద్ధ బౌద్ధ సన్యాసిని జిహాదీలు హత్య చేయడం ఆగని హిందూ వ్యతిరేక బీభత్సకాండకు మరో నిదర్శనం. ఒక హిందు దర్జీని దారుణంగా హత్య చేసిన తరువాత రెండు వారాలు గడవక ముందే జిహాదీలు ఈ డెబ్బయి ఐదేళ్ల బౌద్ధ ధర్మాచార్యుడైన మువాంగ్ చూయూచాక్‌ను పొట్టనపెట్టుకున్నారు! ఇలాంటి దాడులు, చిత్రహింసలు, హత్యలు, ఆలయ విధ్వంసాలు, యువతుల అపహరణలు, ధర్మాచార్యుల అపహరణలు, తరిమివేతలు, మతం మార్పిడులు, బలవంతపు పెళ్లిళ్లు, అత్యాచారాలు ఈ ఉభయ దేశాలలోను 1947నుంచి కొనసాగుతున్న హిందూ వ్యతిరేక దమనకాండలో భాగం...కానీ ఈ దమనకాండ గురించి మన ప్రభుత్వాలు దశాబ్దుల తరబడి పట్టించుకొనకపోవడమే జాతీయ వైపరీత్యం. ప్రతిపక్షంలో ఉన్న సమయంలో ఈ సంగతిని పట్టించుకున్న భారతీయ జనతాపార్టీ వారు అధికార పార్టీగా మారిన తరువాత మరిచిపోవడం మరింత విస్మయకరం! పాకిస్తాన్‌లోను బంగ్లాదేశ్‌లోను హిందువులు నిరంతరం నిర్మూలనకు గురి అవుతుండడం దేశ విభజనతో ముడివడిన విషాద గాధ. 1947 ఆగస్టు 14వ తేదీ వరకు అఖండ భారత్‌లో అనాదిగా సర్వమత సమభావ వ్యవస్థ పరిఢవిల్లింది. విభజన తరువాత కూడ హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉన్న అవశేష భారత్‌లో యుగాలనాటి సర్వమత సమభావ జీవన విధానానికి అనుగుణమైన ప్రజాస్వామ్య రాజ్యాంగం వ్యవస్థీకృతమైంది. కానీ 1947 ఆగస్టు 14వ తేదీ తరువాత హిందువులు అల్పసంఖ్యాకులుగా మారిన పశ్చిమ పాకిస్తాన్‌లోను, తూర్పు పాకిస్తాన్-బంగ్లాదేశ్‌లోను తరతరాల సర్వమత సమభావ వ్యవస్థ అంతరించిపోయింది. ఇస్లామిక్ మత రాజ్యాలుగా ఈ రెండు దేశాలు అవతరించడం హిందూ నిర్మూలనకు ఆరంభం! అందువల్ల బంగ్లాదేశ్ పాకిస్తాన్‌లలోని హిందువుల ప్రాణాలను మానాలను పరిరక్షించవలసిన నైతిక బాధ్యత మాత్రమే కాదు, ఆధికారిక దౌత్య విధి కూడ భారత ప్రభుత్వానికి ఉంది, 1947 నుంచీ కొనసాగుతోంది! మన ప్రభుత్వం బంగ్లాదేశ్ పాకిస్తాన్ ప్రభుత్వాలపై ఒత్తడి పెంచడం ద్వారా ఆ దేశాలలోని హిందువులకు రక్షణ కల్పించాలి...కల్పించలేకపోతోంది!!
బంగ్లాదేశ్ రాజధాని ఢాకాకు దాదాపు మూడు వందల యాబయి కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్ ఆగ్నేయ ప్రాంతంలో చిట్టగాంగ్ జిల్లా ఉంది. దేశ విభజన సమయంలో జిల్లా మొత్తం జనాభాలో తొంబయి శాతం బౌద్ధులు, హిందువులు. అయినప్పటికీ బ్రిటిష్ సామ్రాజ్య వాదులు ఆ జిల్లాను పాకిస్తాన్‌లో కలిపి వెళ్లారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ జిల్లాలోని అధిక సంఖ్యాక హిందువులను అల్ప సంఖ్యాకులుగా మార్చడానికై జిహాదీలు దాడులు చేస్తూనే ఉన్నారు. లక్షలమంది చక్మా బౌద్ధులు ఈ జిల్లానుండి పారిపోయి మన దేశానికి వచ్చి తలదాచుకున్నారు. వీరిలో అత్యధికులను మన ప్రభుత్వం మళ్లీ బంగ్లాదేశ్‌లోకి తరలించింది. ఫలితంగా చిట్టగాంగ్ బౌద్ధులు, హిందువులు నిరంతరం దాడులకు గురి అవుతునే ఉన్నారు. ఈ జిల్లాలో క్రమంగా బౌద్ధ, హిందువుల జనాభా అరవై శాతానికంటె తక్కువకు దిగజారింది. వీరి భూములను ఆక్రమించుకున్న జిహాదీలు ఈ జిల్లా అంతటా బలపడిపోయారు. అఫ్ఘానిస్తాన్‌లో తరిమివేతకు గురయిన తాలిబన్లు, ఇటీవల ఇరాక్ సిరియా ఇస్లాం మత రాజ్యం-ఐఎస్‌ఐఎస్-జిహాదీలు బంగ్లాదేశ్‌లోకి భారీగా చొరబడ్డారు. హిందువులపై దాడులు తీవ్రతరం కావడానికి ఇది సమీప నేపథ్యం.
చిట్టగాంగ్ జిల్లాను విడగొట్టి బందర్‌వన్ జిల్లాను ఏర్పాటుచేసారు. ఈ జిల్లాలోని వైరారి అనే చోట ఒక కొండ సమీపంలోని బౌద్ధ ఆలయంలో ఈ బౌద్ధ సన్యాసి చూయూ చాక్ నివసించేవాడట! వ్యవసాయదారుడైన చాక్ గత ఏడాది గ్రామాన్ని వదిలిపెట్టి ఈ బౌద్ధ ఆలయంలో ప్రశాంతంగా జీవించడానికి వచ్చేశాడు. ఈ దేవాలయాన్ని ధ్వంసం చేయాలని కుట్రపన్నిన జిహాదీలకు ఆయన రాక ఇబ్బందికరమైంది. ఆయన వెళ్లిపోయినట్టయితే బౌద్ధమందిరం నిర్మానుష్యం అయిపోతుంది, ధ్వంసం చేయడం సులభం. అందువల్ల ఆరామాన్ని వదిలి పారిపోవాలని లేనట్టయితే చంపేస్తామని బీభత్సకారులు ఆయనను అనేకసార్లు హెచ్చరించారట! కానీ ఆయన పారిపోలేదు. స్థానిక పోలీసులు యధావిధిగా ఆయనకు రక్షణ కల్పించలేదు. అందువల్ల జిహాదీలు ఆయనను హతమార్చారు. ఆ వృద్ధునిపై నలుగురు కత్తులతో దాడి చేయడం పైశాచిక ప్రవృత్తికి పరాకాష్ఠ. రెండు వారాల క్రితం గోపాల్‌పురా జిల్లాలో నిఖిల చంద్ర జోవర్దార్ అనే యాబయి ఏళ్ల దర్జీని జిహాదీలు హతమార్చారు. బంగ్లాదేశ్‌లోని ప్రతిపక్షమైన బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ భారత వ్యతిరేకతను, హిందూ విద్వేషాన్ని బాహాటంగానే వెళ్లగక్కుతోంది. కానీ షేక్ హసీనా నాయకత్వం అధికార అవామీలీగ్ మత సహిష్ణుతకు కట్టుబడి ఉందన్న ప్రచారం జరుగుతోంది. ఇందుకు కారణం షేక్ హసీనా బంగ్లాదేశ్ తొలిప్రధాని, తొలి అధ్యక్షుడు ముజబుర్ రెహమాన్ కుమార్తె కావడమే. 1970వ, 1971వ సంవత్సరాలలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా జరిగిన బంగ్లాదేశ్ విమోచన ఉద్యమానికి నాయకుడు ముజబుర్ రెహమాన్! మన దేశం సహకారంతోనే బంగ్లాదేశ్ స్వతంత్ర దేశమైంది. అందువల్ల ముజిబుర్ రహిమాన్ నాయకత్వంలోని అవామీలీగ్‌వారు సర్వమత సమభావం కోరుతున్నట్టు ప్రచారమైంది. అవామీ లీగ్ నాయకురాలు షేక్ హసీనా ప్రస్తుతం బంగ్లాదేశ్ ప్రధాని. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగం సైతం హిందువులకు వ్యతిరేకంగా చర్యలు తీసుకుంటోంది. ఇటీవలే ఇద్దరు హిందు ఉపాధ్యాయులకు వ్యతిరేకంగా అబద్ధపు అభియోగాలను మోపిన జిహాదీ సమర్ధకులు వారిని రోజంతా నిర్బంధించారు. సబ్ కలెక్టర్ ఆ ఉపాధ్యాయులకు ఆరు నెలలపాటు జైలుశిక్షను విధించాడు. జిహాదీలు హిందువుల పాలిట పెనంగా మారిన దేశంలో ప్రభుత్వ యంత్రాంగం పొయ్యిగా మారింది...
పాకిస్తాన్‌లోని హిందువులు అనుభవిస్తున్న చిత్రహింసల గురించి భాజపా వరిష్ట నేత మురళీ మనోహర్ జోషి 2012 మేనెల 10వ తేదీన లోక్‌సభలో ప్రస్తావించారు! అప్పటి ప్రతిపక్షమైన భాజపా ఇప్పుడు ప్రభుత్వాన్ని నిర్వహిస్తోంది! కానీ ఈ నాలుగేళ్లలో మళ్లీ పార్లమెంటులో ఆందోళన వ్యక్తమైన దాఖలాలేదు! సౌదీ అరేబియాలో హిందువులను ప్రవాస భారతీయులను హతమార్చుతునే ఉన్నారు. మన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇటీవల సౌదీ అరేబియాకు వెళ్లివచ్చాడు! సౌదీ అరేబియా మనకు గొప్ప మిత్రదేశం! మన ప్రభుత్వం ఎందుకని దాడులను ఆపించడం లేదు? ఇరాక్‌లో ముప్పయి తొమ్మిది మంది భారతీయులను 2014లో ఐఎస్‌ఐఎస్ అపహరించుకొని పోయింది. ఇప్పటికీ ఈ భారతీయ కార్మికులకు విముక్తి లభించలేదు...