సంపాదకీయం

‘జనగణమన’ములు వెలిగేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జనగణమన గీతం ఏదో ఒక చలనచిత్ర గీతమని తమిళనాడులోని ప్రభుత్వేతర విద్యాలయాలలోని బాల బాలికలు భావిస్తున్నారట! జనగణమన గీతం జాతీయ గీతం అన్న వాస్తవాన్ని మదరాసు ఉన్నత న్యాయస్థానం ఇప్పుడు గుర్తు చేయవలసి వచ్చింది! ఒకప్పుడు పాఠశాలల్లో మాత్రమే కాదు సార్వజనిక స్థలాలలో సమావేశాలలో జాతీయ గీతం ప్రతిరోజు వినబడేది. చివరికి సినిమా థియేటర్లలో ఆటలు ముగిసిన తరువాత జాతీయ గీతాన్ని తెరవెనుకనుండి వినిపించేవారు, జాతీయ పతాకాన్ని తెరపై ప్రదర్శించేవారు! క్రమంగా జాతీయ పతాకం గురించి, జాతీయ గీతం గురించి వందేమాతరం గురించి ధ్యాస తగ్గిపోవడం విద్యారంగం పాతాళ పతనమైపోతుండడానికి నిదర్శనం! విశ్వవిద్యాలయ ప్రాంగణాలు జాతి వ్యతిరేకుల కార్యకలాపాలకు ఆలవాలం కావడంలో ఆశ్చర్యం ఏముంది? ఇలా జాతీయ గీతాన్ని ప్రతిరోజు విధిగా ఆలపించాలని తమిళనాడులోని ప్రభుత్వేతర పాఠశాలల యాజమాన్యాలను మదరాసు హైకోర్టు ఆదేశించవలసిన అనివార్యం ఏర్పడడం విచిత్రమైన పరిణామం! ఇప్పుడు ఉన్నత న్యాయాదేశం వెలువడింది కాబట్టి ప్రభుత్వేతర పాఠశాలల యాజమాన్యాలవారు విద్యార్థినీ విద్యార్థులకు జాతీయ గీతం మప్పక తప్పదు. కానీ దశాబ్దుల తరబడి బడిపిల్లలకు జాతీయ గీతం గురించి జాతీయ పతాకం గురించి అవగాహనను పెంపొందించడంలో యాజమాన్యాలు మాత్రమే కాక ప్రభుత్వాల రాజకీయ నిర్వాహకులు కూడ విఫలమైనట్టు హైకోర్టు ఆదేశంవల్ల స్పష్టమైపోయింది! కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్వాహకులు సిగ్గుతో తలవంచుకోవాల్సిన సమయమిది. యాజమాన్యాలు, ప్రభుత్వాలు తమ శాసకీయ, రాజ్యాంగ విధులను నిర్వర్తించి ఉండినట్టయితే మదరాసు ఉన్నత న్యాయస్థానం వారు ఇప్పుడీ ఉత్తర్వును జారీ చేయవలసిన అవసరం ఉండేది కాదు. పతాకం దేశ సార్వభౌమ ప్రతిపత్తికి భౌగోళిక సమగ్రతకు, చారిత్రక విజయాలకు, యుగాలనాటి సాంస్కృతిక వారసత్వానికి చిహ్నం, జాతీయతకు సనాతన-శాశ్వతమైన-విగ్రహరూపం! జాతీయ గీతం భరత మాత వరాల బిడ్డల గుండెలలో నిరంతరం ధ్వనించే భక్త్భివం! మాతృదేవత పట్ల సహజంగా వికసించే మమకారం దేశభక్తి! ఈ మమకార భావాన్ని నిరంతరం సజీవంగా ఉంచగలిగిన మాధ్యమాలు జాతీయ పతాకం, జనగణమన గీతం, వందేమాతరం... రాజ్యాంగంలోని యాబయి ఒకటవ అధికరణంలోని ‘ఏ’ నిబంధన ఇందుకు ధ్రువీకరణ మాత్రమే! రాజ్యాంగంపట్ల నిబద్ధతను కలిగి వుండాలని, రాజ్యాంగ ఆదర్శాలను, రాజ్యాంగ సంస్థలను జాతీయ గీతాన్ని, జాతీయ పతాకాన్ని గౌరవించాలని 51-ఏ-వ అధికరణంలో నిర్దేశించి ఉన్నారు! ఇది వౌలిక విధుల-్ఫండమెంటల్ డ్యూటీస్-లలో మొదటిది! దీన్ని నిర్వర్తించడానికి సైతం మళ్లీ న్యాయస్థానాలు ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయవలసి రావడం దశాబ్దుల సమష్టి వైఫల్యానికి నిదర్శనం...
ఎన్.సెల్వితిరుమాల్ అనే మాజీ సైనికుడు దాఖలు చేసిన ప్రజాప్రయోజన వివాదం-పిల్-ప్రాతిపదికగా మదరాసు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్.కె.కౌల్, న్యాయమూర్తి ఎమ్‌ఎమ్ సుందరేశ్ తీర్పు ప్రకారం తమిళనాడులోని ప్రభుత్వేతర పాఠశాలల్లో జాతీయ పతాకావిష్కరణ, జాతీయ గీతాలాపన పాఠ్యక్రమంలో భాగమయ్యాయి! ఇంతవరకు వందలాది ప్రభుత్వేతర పాఠశాలలలో జాతీయ గీతాన్ని ఆలపించడంలేదన్నది ఎన్.సెల్వితిరుమాల్ కనుగొన్న వాస్తవం! ఇలా జాతీయ గీతాన్ని పిల్లలచేత పాడించని పాఠశాలల జాబితాను ఆయన హైకోర్టుకు సమర్పించాడట! 2014 డిసెంబర్ దేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వారు దేశంలోని పాఠశాలల నిర్వాహకులకు ఒక సూచన పత్రం పంపించారట! జాతీయ గీతం పట్ల అవగాహనను పెంపొందించడానికి వీలుగా పిల్లల చేత రోజూ ఈ గీతాన్ని పాడించాలన్నది ఆ సూచన పత్రంలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సలహా! ఇది ఉత్తరువు కానందున అనేక పాఠశాలల యాజమాన్యాలు ఈ సలహాను పాటించడం లేదని కూడ సెల్వితిరుమాల్ మదరాసు ఉన్నత న్యాయస్థానానికి నివేదించాడట! దేశ వ్యవహారాల మంత్రిత్వ శాఖవారు ఉత్తరువును కాక సలహాను మాత్రమే ఎందుకు జారీ చేశారో మరి! అన్ని పాఠశాలలలోను విధిగా ప్రతిరోజు జాతీయ గీతాన్ని ఆలపించాలన్న రాజ్యాంగ నిబంధనను పాటించాలని కోరుతూ గత ఏడాది నవంబర్ నెలలో కేంద్ర మాధ్యమిక విద్యామండలి-సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్-సిబిఎస్‌ఇ-వారు ఆదేశించారట! ఈ ఆదేశం మేరకు దేశంలోని సిబిఎస్‌ఇ అనుబంధ పాఠశాలల్లో జాతీయ గీతం విధిగా పాడుతున్నారట! అయితే ఈ నవంబర్ ఉత్తరువునకు పూర్వం సంగతి మాత్రం వెల్లడి కాలేదు! సిబిఎస్‌ఇ ఉత్తరువు కేవలం ఈ కేంద్ర సంస్థకు అనుబంధమై ఉన్న ప్రభుత్వేతర పాఠశాలలకు మాత్రమే వర్తించింది!
తమిళనాడులోను ఇతర రాష్ట్రాలలోను ఉన్న ప్రభుత్వేతర పాఠశాలలలో దశాబ్దులపాటు జాతీయ గీతం పాడని వైపరీత్యానికి ఫలితం విశ్వవిద్యాలయాలలో ప్రస్ఫుటిస్తోంది! విష బీజానికి అంకురాలు ఈ పాడని పాఠశాలలు! హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం, కొత్త ఢిల్లీ జవహర్‌లాల్ నెహ్రు విశ్వవిద్యాలయం వంటి చోట్ల అ ప్రస్ఫుటించిన జాతి వ్యతిరేక దృశ్యాలు, వినబడిన దేశ వ్యతిరేక నినాదాలు ఈ అంకురాలు విష వృక్షాలుగా ఎదిగిపోయాయనడానికి ప్రత్యక్ష సాక్ష్యాలు! 2013లో లోక్‌సభలో జాతీయ గీతం ఆలపిస్తుండిన సమయంలో ఒక సభ్యుడు వెనుతిరిగి నడుచుకుంటూ నిర్భయంగా నిర్లజ్జగా బయటకు వెళ్లిన దృశ్యం మాధ్యమాలలో ఆవిష్కృతమైంది! జమ్ము కశ్మీర్‌లో జాతీయ పతాకాన్ని ధ్వంసం చేసా రు, దగ్ధం చేసారు.. పాకిస్తాన్ జెండాను ఎగురవేసి మాతృభూమిని అవమానించారు! దీన్ని ప్రభుత్వాలు దశాబ్దుల పాటు సహించాయి! ఆస్ట్రేలియా మన దేశపు క్రికెట్ జట్టును ఓడించిననప్పుడు హర్షం ప్రకటించేవారు, పాకిస్తాన్ గెలిచినప్పుడు మిఠాయిలు పంచుకునేవారు తయారు కావడానికి నేపథ్యం జనగణమన, వందేమాతరం స్ఫూర్తికి బడిపిల్లలు దూరం కావడం! కార్గిల్‌లో పనికిరాని మంచుభూమి కోసం యుద్ధం చేయడం ఎందుకని ప్రశ్నించిన మేధావులు, పార్లమెంటు భవనంపై దాడి చేసిన జిహాదీ ఉగ్రవాదులను సమర్ధించడం కొనసాగుతున్న విద్రోహ చరిత్ర! భారతదేశంలో పుట్టినందుకు సిగ్గుపడుతున్నానని కులవివక్షలేని మరో దేశానికి తరలిపోవడానికి వెనుకాడబోనని మదరాసు హైకోర్టుకు చెందిన న్యాయమూర్తి సిఎస్ కర్ణన్ ఫిబ్రవరిలో బహిరంగంగా ప్రకటించడం రాజ్యాంగ స్ఫూర్తికి విఘాతకరమైన భయంకరమైన పరిణామం! పరిణతి చెందినట్టు ప్రపంచంలో ప్రఖ్యాతిగాంచిన మన దేశంలో దేశభక్తి గురించి ఉన్నత న్యాయస్థానం ఆదేశిస్తే కాని స్పృహ కలగని దుస్థితి దేనికి నిదర్శనం?
గతంలో అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రధానిగా ఉండినప్పుడు పాఠశాలలలో ప్రతిరోజు వందేమాతరం ఆలపించాలని కొన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదేశించాయి! ఈ ఉత్తరువును కొన్ని మత వర్గాల పెద్దలు, రాజకీయ నేతలు తీవ్రంగా వ్యతిరేకించడం దేశ విదేశాల ప్రజలను విస్మయానికి గురి చేసింది! కేంద్ర రాష్ట్రాల ప్రభుత్వాలు వందేమాతరం వ్యతిరేకుల ఒత్తడికి లొంగి ఆ ఆదేశాన్ని ఉపసంహరించుకున్నాయి! జనగణమన, వందేమాతరం గీతాలను బడులలో మాత్రమే కాక అన్ని సార్వజనిక కార్యాలయాలలోను, సమావేశాలలోను విధిగా పాడాలని నిర్దేశిస్తూ పార్లమెంటు ఇప్పుడైనా చట్టం చేయగలదా?