సంపాదకీయం

ఆవాలకు ‘బిటి’ పోపు..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జీవ జన్యు పరివర్తక ప్రకియ ద్వారా రూపొందుతున్న మహా సంకరజాతి విత్తనాలను వంగడాలను మన రైతులకు అంటగట్టడానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు కొనసాగిస్తున్న కుట్రకు మన ప్రభుత్వాలు సహకరిస్తుండడం నడిచిపోతున్న వైపరీత్యం. ఒకవైపున ప్రాకృతికమైన, సహజమైన తరతరాల సంప్రదాయ సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వాలు మరోవైపు జీవ జన్యువుల మార్పిడి ద్వారా తయారవుతున్న కృత్రిమమైన పంటలను ప్రోత్సహిస్తుండడం విధాన నిహిత వైరుధ్యాలకు నిదర్శనం. బిటి పత్తి సాగు మొదలైన తరువాత దశాబ్దానికి పైగా వివిధ రాష్ట్రాలలో అనేక అనర్థాలు జరిగి పోతున్నాయి. ఇప్పుడు జిఎమ్ ఆవాలు కూడ వ్యవసాయ రంగాన్ని ముంచెత్తడానికి రంగం సిద్ధవౌతోంది. జిఎమ్ పంటలు వద్దంటూ ఇటీవల న్యూఢిల్లీలో సంప్రదాయ వ్యవసాయ పునరుద్ధరణ ఉద్యమకారులు పెద్ద ఎత్తున ప్రదర్శనలు చేయడంతో ఈ వివాదం మరోసారి ప్రచారమైంది. జిఎమ్ ఆవాల పంటను ప్రయోగాత్మకంగా క్షేత్రస్థాయిలో పరీక్షించడానికి బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్షేత్రస్థాయి ప్రమాణాలలో ఘోరమైన అక్రమాలు, అవినీతి పద్ధతులు నెలకొంటున్నాయి. ఈ ఆరోపణల ప్రాతిపదికగానే గతంలో బిటి వంకాయలను క్షేత్రస్థాయిలో పరీక్షించే ప్రక్రియ ఆగిపోయింది. ఇప్పుడు బిటి ఆవాలను మన నెత్తికెత్తే దుస్తంత్రం గుట్టు చప్పుడు కాకుండా మొదలైంది. దేశవ్యాప్తంగా నిరసనలు మొదలు కావడంతో బిటి ఆవాలను అనుమతించే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం గత ఫిబ్రవరిలో వాయిదా వేసింది. జిఎమ్ ఆవాలకు సంబంధించిన అన్ని వివరాలను బహిర్గతం చేయాలని ఏప్రిల్ ఏడున కేంద్ర ప్రభుత్వాన్ని కేంద్ర సమాచార సాధికార సంస్థ-సిఐసి- ఆదేశించడం సరికొత్త పరిణామం.
జన్యు జీవకణాలను సంకరం చేయడం-జఎమ్-వల్ల రూపొందిన పత్తి విత్తనాలు వ్యవసాయ భూమిని పాడుచేస్తున్నాయి. నిస్సారం చేస్తున్నాయి. జిఎమ్ ప్రక్రియ ద్వారా రూపొందే విత్తనాలలో బాసిలస్ తురింజెన్సిస్ -బిటి- అనే జీవ రసాయనం నిక్షిప్తమై ఉండడం ఇందుకు కారణం. ఈ రసాయనం ఆరోగ్యానికి హానికరం. అయితే జనం పత్తిని భోంచేయడం లేదు, కేవలం ధరిస్తున్నారు. బిటి పత్తి ద్వారా తయారవుతున్న వస్త్రాలను ఉపయోగిస్తున్నారు. అందువల్ల బిటి పత్తి ప్రభావం వల్ల ప్రజల ఆరోగ్యం తొందరగా పాడుకాదు. ఆరోగ్యం తొందరగా పాడు కావాలన్నది ప్రపంచీకరణ-ను నడిపిస్తున్న వారి లక్ష్యం. ఇలా నడిపిస్తున్నది ప్రధానంగా సంపన్న దేశాలకు చెందిన బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు. అందువల్ల సంపన్న దేశాల ప్రజలకు మాత్రం బిటి జీవ రసాయనం వల్ల హాని జరగరాదన్నది ఈ సంస్థల వ్యూహం. వర్థమాన దేశాలలోని ప్రజలు మాత్రం బిటి జీవ రసాయనం ప్రభావంతో చిత్ర విచిత్రమైన వ్యాధులకు గురికావాలన్నది బహుళ జాతీయ వాణిజ్య సంస్థల లక్ష్యం. ఇలా వర్థమాన దేశాలలో వ్యాధిగ్రస్తులయ్యే వారికి చికిత్స చేయడానికి అవసరమైన లేదా అనవసరమైన మందులను సంపన్న దేశాలలో ఉత్పత్తి చేస్తారు. వర్థమాన దేశాలకు ఎగుమతి చేస్తారు. ఇలా వర్థమాన దేశాల ప్రజల ఆరోగ్యం హననం కావడం వల్ల వాణిజ్య వైద్యశాలల-కార్పొరేట్ హాస్పిటల్స్-కు గిరాకీ పెరుగుతుంది. అందువల్ల కార్పొరేట్ హాస్పిటల్స్ వ్యవస్థకు ఇబ్బడి ముబ్బడిగా లాభాలు సమకూడుతాయి. అందువల్ల నిరంతరం కొత్తకొత్త వ్యాధులు పుట్టుకు రావాలన్నది ప్రపంచీకరణ సారథుల వ్యూహం. బిటి జీవరసాయనం నిండిన పంటలు ఇందుకు దోహదం చేయగలవు. బిటి రసాయనం మొక్కలలో విస్తరించి వాటి ఎదుగుదలకు, పంట దిగుబడి పెరగడానికి దోహదం చేస్తుందని జరుగుతున్న ప్రచారం. కానీ ఈ బిటి రసాయనం పంట భూమిని, పరిసరాలను ప్రకృతిని, ప్రకృతిలోని జీవజాలాన్ని క్రమంగా రుగ్మతలకు గురిచేస్తుంది. బిటి పత్తివల్ల ఇవన్నీ జరుగుతున్నాయి. కానీ మానవులు తినరు కనుక ప్రభావం తక్కువ. తినడానికి పనికివచ్చే బిటి పంటల వల్ల మానవుల ఆరోగ్యం తొందరగా క్షీణించి పోతుంది. అందుకే బిటి పత్తి సాధించలేని వైపరీత్యాలను బిటి ఆవాలు సాధించగలవు. ఆవాలు నోటి ద్వారా పొట్టలలో ప్రవేశిస్తాయి మరి...
సిఐసి వారు కోరడంతో కేంద్ర పర్యావరణ పరిరక్షణ శాఖ వారు జిఎమ్ ఆవాలకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని వెల్లడించవలసి ఉంది. జిఎమ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరింపచేసే విషయంలో గతంలో మన్‌మోహన్ సింగ్ ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వ విధానాలకు, ప్రస్తుతం నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని విధానాలకు పెద్ద తేడా లేదు. జాతీయ సమస్యల విషయంలో ప్రస్తుత ప్రభుత్వం, మన్‌మోహనీయ విధానాలతో విభేదిస్తోంది. కానీ అంతర్జాతీయ వ్యవహారాలో మాత్రం మన్‌మోహనీయ ఆర్థిక నీతిని అనుసరిస్తోంది. ఈ ఆర్థిక నీతి పేరు ప్రపంచీకరణ. 2014 ఫిబ్రవరి మూడవ తేదీన జమ్మూకశ్మీర్‌లో జరిగిన నూట ఒకటవ భారతీయ శాస్త్ర మం డలి- ఇండియన్ సైన్స్ కాంగ్రెస్- మహాసభలో ప్రసంగించిన అప్పటి ప్రధాని మన్‌మోహన్ సింగ్ జిఎమ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని నెత్తికెత్తుకోవలసిన అనివార్యం గురించి విశే్లషించారు. న్యాయ ప్రక్రియ అడ్డుపడి ఉండకపోతే మన్‌మోహన్ సింగ్ ప్రభుత్వం బిటి వంకాయలను, బిటి టమోటాలను, బిటి వరిని దేశ ప్రజల నెత్తికెత్తిపోయి ఉండేది. అలా రేకెత్తే గురుతర బాధ్యను నరేంద్ర మోదీ ప్రభుత్వం తల కెత్తుకొని ఉండడం నడుస్తున్న చరిత్ర. జన్యు జీవకణ పరివర్తన ద్వారా రూపొందిన పంటలు ‘‘్భసారాన్ని గాని, పరిసరాలను కాని, ప్రకృతిని కాని, మానవ ఆరోగ్యానికి గాని, నష్టపరుస్తాయన్న దానికి శాస్ర్తియమైన సాక్ష్యాలు లేవు..’’అని 2014 డిసెంబర్ 4వ తేదీన పర్యావరణ మంత్రి ప్రకాశ్ జవదేకర్ రాజ్యసభలో ప్రకటించి ఉండడం ఇందుకు నిదర్శనం. వ్యతిరేకత పెరుగుతున్నందున కొత్తగా జిఎమ్ పంటలను ప్రస్తుత ప్రభుత్వం అనుమతించడం లేదు. కానీ ‘శాస్త్ర విజ్ఞాన పరిశోధక ప్రక్రియకు అంతరాయం కలిగించరాదన్నదే..’’ ప్రస్తుత ప్రభుత్వ విధానం. వినాశకరమైన సస్యాంకురాలను-బిటి విత్తనాలను-సృష్టించడం కూడ పరిశోధన అవుతుందా?
ఈ పరిశోధక ప్రక్రియలో భాగంగానే ఢిల్లీ విశ్వవిద్యాలయానికి చెందిన ఒక జీవ జన్యు శాస్తవ్రేత్త ఈ మహా సంకర రకం ఆవాలను సృష్టించాడట. సంప్రదాయ వ్యవసాయ పద్ధతులలో రైతులు తమతమ వరిపంటకు కావలసిన విత్తనాలను తామే తయారు చేసుకుంటారు. కానీ బిటి విత్తనాలను మాత్రం రైతులు భారీ ధరలను చెల్లించి బహుళ జాతీయ వాణిజ్య సంస్థల వద్ద కొనుగోలు చేయాలి. ఫలితంగా మొన్‌సాంటో వంటి విదేశీయ సంస్థలు బిటి పత్తి విత్తనాలను అమ్మి వందల వేల కోట్ల రూపాయలను తమ దేశాలకు తరిలించుకొని పోయాయి. ఇప్పుడు బిటి ఆవాలతో మన వంట ఇళ్లలో తిరగమోత-పోపు-పెట్టుకోవాలని సంపన్న దేశాల వాణిజ్య వ్యూహం నిర్దేశిస్తోంది. సేంద్రియ వ్యవసాయానికి మొదటి శత్రువు జిఎమ్ సాంకేతిక పరిజ్ఞానం...