సంపాదకీయం

రట్టయిన సిగ్‌నోరా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజ్యసభ సభ్యుడుగా నియుక్తుడైన మాజీ రాజ్యసభ సభ్యుడు డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి మళ్లీ రాజ్యసభలో అడుగుపెట్టడం, మరో అవినీతి వ్యతిరేక రాజకీయ ప్రభంజనం మొదలు కావడం సమాంతర పరిణామాలు. అగస్టావెస్ట్‌లాండ్ గగన శకటాల కొనుగోలు వ్యవహారంలో జరిగిన అవినీతిలో అక్రమాలలో కాంగ్రెస్ అధ్యక్షురాలికి గతంలో కాంగ్రెస్ నాయకత్వంలోని ప్రభుత్వంలో మంత్రులుగా పనిచేసిన కొందరికి సంబంధం ఉందని ఇటలీలోని ఒక కోర్టు నిర్ధారించడం ఈ రాజకీయ దుమారం. భారత వైమానిక దళం మాజీ అధిపతి ఎస్‌పి త్యాగికి ఈ గగన శకటాల కొనుగోళ్లలో లంచాలు ముట్టాయని నిర్ధారించిన ఇటలీ న్యాయస్థానం తన తీర్పులో ప్రస్తావించిన సిగ్‌నోరా గాంధీ కాంగ్రెస్ అధ్యక్షురాలేనన్నది జరుగుతున్న ప్రచారం. రాజ్యసభలో బుధవారం అగ్‌స్టా వెస్ట్‌లాండ్ గగన శకటాల-హెలికాప్టర్ల అవినీతిని ప్రస్తావించిన డాక్టర్ స్వామి సోనియాగాంధీ...అని ప్రస్తావించగానే కాంగ్రెస్ సభ్యులు గొప్ప గొడవ చేసారు! డాక్టర్ స్వామి సోనియాగాంధీ గురించి చేసిన ప్రస్తావనను ఆధికారిక ప్రసంగాలనుంచి తొలగించినట్టు రాజ్యసభ ఉపాధ్యక్షుడు ప్రకటించారు! అయినప్పటికీ కాంగ్రెస్ అధ్యక్షురాలు కేంద్ర బిందువుగా కాంగ్రెస్‌కు, భారతీయ జనతాపార్టీకి మధ్య మాటల యుద్ధం పార్లమెంటు సభలలోను బయట కూడ మొదలైపోయింది. అగస్టా వెస్ట్‌లాండ్ అన్న దుర్మార్గపు వాణిజ్య సంస్థ బ్రిటన్ కేంద్రంగా పనిచేస్తోంది. ఇది ఇటలీలోని బృహత్ అంతర్జాతీయ వాణిజ్య సంస్థ. ఫిన్ మీ యక్కానికాకు అనుబంధ సంస్థ! మనకు బ్రిటిష్ దోపిడీదారులలనుంచి రాజకీయ స్వాతం త్య్రం సిద్ధించిన తరువాత దశాబ్దులు గడిచినప్పటికీ బ్రిటిష్, ఐరోపా దోపిడీ సంస్థలనుంచి వాణిజ్య స్వాతంత్య్రం లభించలేదనడానికి వెస్ట్‌లాండ్ ఉదంతం మరో ఉదాహరణ మాత్రమే, అసంఖ్యాక ఉదాహరణలు ఉన్నాయి. మన అత్యంత ప్రముఖులు-వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్స్-వివిఐపీస్-సుఖంగా వేగంగా పయనించడానికి వీలైన గగన శకటాలను సైతం మనం తయారుచేసుకోలేకపోతున్నాము. అందువల్ల ఈ వెస్ట్‌లాండ్ కంపెనీనుంచి అత్యంత ప్రముఖులు పయనించడానికి వీలైన పనె్నండు గగన శకటాలను కొనడానికి 2010లో మన ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ పనె్నండు శకటాల-హెలికాప్టర్ల విలువ మూడువేల ఐదు వందల నలబయి ఆరు కోట్ల రూపాయలు. మూడు హెలికాప్టర్లను మాత్రమే అగస్టా సంస్థ సరఫరా చేసింది. ఈ కొనుగోళ్లలో భారీ లంచాలు చేతులు మారినట్టు 2013లో బయటపడింది. 2014 జనవరిలో మన ప్రభుత్వం ఒప్పందాన్ని రద్దు చేసింది....
డాక్టర్ సుబ్రహ్మణ్యం స్వామికి భారత రాజకీయాలలో విశిష్టమైన స్థానం ఉంది, ఆయన కేవలం రాజకీయ వేత్త కాకపోవడం ఆ వైశిష్ట్యం...అన్యాయానికి వ్యతిరేకంగా, అవినీతికి వ్యతిరేకంగా అప్రజాస్వామ్య పద్ధతులకు వ్యతిరేకంగా ప్రముఖులకు వ్యతిరేకంగా దశాబ్దుల తరబడి పోరాడుతున్న సామాజిక ఉద్యమకారుడు డాక్టర్ స్వామి. పండితులు, మేధావులు, కవులు, రచయితలు అయినవారు కదన వదనులుగా కావడం చాలా అరుదు. గొప్ప ఆర్థిక శాస్తవ్రేత్త, దేశ విదేశాలలో పేరుగాంచిన ఆచార్యుడు అయిన స్వామి ఈ అరుదు తనానికి ప్రతీక. అడుగుపెడుతూనే ఆయన అవినీతిపై మరో అస్త్రాన్ని సంధించాడు. సుబ్రహ్మణ్యం స్వామి భారతీయ జనతాపార్టీ రాజకీయ ఆత్మాహుతి వీరుడు...అని మాజీ రక్షణ మంత్రి కాంగ్రెస్ నాయకుడు ఎ.కె.ఆంటోనీ వ్యాఖ్యానించడం స్వామిపట్ల వారికి గల ప్రమాద భావానికి నిదర్శనం. స్వామిని సోనియా బృందం వారు మాత్రమే కాదు అవినీతి అభియోగ గ్రస్తులైన దేశంలోని రాజకీయ జీవులెందరో ద్వేషించడానికి కారణం ఆయన వారిని నిద్రపోనివ్వకపోవడం. తమిళనాడు ముఖ్యమంత్రి జె.జయలలిత రెండుసార్లు పదవికి రాజీనామా చేయడానికి కారణం ఆమెపై కొనసాగుతున్న అవినీతి అభియోగాలు. ఈ అభియోగాలను సంధించగలిగిన వాడు డాక్టర్ స్వామి! 1975 నాటి అత్యవసర పరిస్థితి-ఎమర్జెన్సీ సమయంలో రాజ్యసభ సభ్యుడిగా ఉండిన స్వామి నాటి ప్రధాని ఇందిరాగాంధీకి దేశ విదేశాలలో కొరకరాని కొయ్య. సుభాస్‌చంద్రబోస్ తరహాలో స్వామి ఆ ఎమర్జెన్సీ కాలంలో దేశంనుండి అంతర్థానమయ్యాడు, మళ్లీ రాజ్యసభలో అవతరించాడు, మళ్లీ అదృశ్యమయ్యాడు. నిరంకుశ ప్రభుత్వం ఆయనను పట్టలేకపోవడం చరిత్ర. లోక్‌సభలో ఉన్నప్పుడు, రాజ్యసభలో ఉన్నప్పుడు సభ్యత్వం లేనప్పుడు కూడ డాక్టర్ స్వామి అవినీతి వ్యతిరేక అవిశ్రాంత యోధుడు! ఈ పోరాటం ఆయనకు ఆహారం...సమాంతర పరిణామాల మధ్య సంబంధం ఇదీ!
అగస్టావెస్ట్‌లాండ్ వారు దాదాపు మూడు కోట్ల యూరోల-దాదాపు రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయల మేరకు మన వారికి లంచాలు ఇచ్చినట్టు ఇటలీలోని ఈ న్యాయస్థానం ఇచ్చిన తీర్పువల్ల ధ్రువపడింది. ఇందులో దాదాపు సగం మంత్రులకు దక్కినట్టు కూడ ప్రచారం జరుగుతోంది. 2013లో అవినీతి బయటకి పొక్కిన తరువాత కూడ అభియోగాన్ని రద్దు చేయించడానికై అప్పటి ఇటలీ ప్రధాని మోంటీని, భారత ప్రధాని మన్‌మోహన్‌సింగ్‌ను సైతం ప్రభావితం చేయడానికి దళారీలు, అగస్టా సంస్థవారు యత్నించారన్న అనుమానాలు ధ్రువపడినాయి. దళారీల నాయకుడైన జేమ్స్ క్రిస్టియన్ మైకెల్ అనేవాడు పీటర్ హూలెట్ అనే అగస్టా అధికారికి వ్రాసిన ఉత్తరాలు, అగస్టా ప్రధాన నిర్వాహకుడు గియూ చెప్పీ ఓర్సీ అనేవాడు రూపొందించిన రహస్య నివేదికలు ఇటలీ న్యాయస్థానంలో బట్టబయలయ్యాయి. ఈ హెలికాప్టర్లు యుద్ధ క్షేత్రంలో వినియోగపడవు. కేవలం సైనిక, రాజకీయ పదవులలో ఉన్న అతి ప్రధాన వ్యక్తుల ప్రయాణాల కోసం రక్షణ శాఖ ఈ హెలికాప్టర్లను కొనుగోలు చేసింది. ఎస్‌పి త్యాగి మాత్రమే కాక మరో మాజీ వైమానిక దళ అధిపతి ఫలీహోమీ మేజర్ కూడ వెస్ట్‌లాండ్ సంస్థవారి ఆతిధ్యం స్వీకరించినట్టు ఆరోపణలు వచ్చాయి. అయితే ఇటలీ కోర్టు త్యాగి మాత్రమే లంచాలు తీసుకున్నట్టు నిర్ధారించింది. ఇటలీ కోర్టు తీర్పులు మనదేశంలో ప్రమాణం కావు. కానీ ఈ తీర్పును సాక్ష్యాధారంగా చేసుకుని మన దర్యాప్తు సంస్థలు విచారించగలగాలి. మన న్యాయస్థానాలలో ఋజువు చేయగలగాలి! ఈ మొత్తం డొంక కదిలింది నిజానికి ఇటలీ ప్రభుత్వం దర్యాప్తు సంస్థలు తీగెను లాగడం వల్ల మాత్రమే! ఈ ఫిన్‌మీయక్కానికా సంస్థ అవినీతి కలాపాలు అంతర్జాతీయంగా పేరుమోసిన తరువాత దీని అవినీతిని విచారించడానికై ఇటలీ ప్రభుత్వం ఈ చర్యలను చేపట్టింది!
రాజకీయవేత్తలమాట ఎలా ఉన్నప్పటికీ దేశభద్రత నిష్ఠా పరులైన త్రివిధ రక్షణ దళాలలో అవినీతి చెదలు వ్యాపించడమే ప్రధాన వైపరీత్యం. 1950వ దశకంనుంచి కూడ రక్షణోత్పత్తుల కొనుగోళ్లలో తరచు అవినీతి పుట్టలు పెరగడం నడచిపోతున్న చరిత్ర. జీపులు కొనుగోళ్లలో, ట్రక్కుల కొనుగోళ్లలో, శతఘు్నల కొనుగోళ్లలో అవినీతి విస్తరించిపోతుండడాన్ని ఎవరు నిరోధించాలి...?