సంపాదకీయం

కశ్మీర్ మీమాంస..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విభిన్న స్వరాలు వైరుధ్య భావాలను వినిపిస్తుండడం దేశ వ్యవహారాల మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ జమ్మూకశ్మీర్‌లో జరిపిన రెండు రోజుల పర్యటన నేపథ్యం. తథాకథిత-సోకాల్డ్- సమస్య గురించి సమస్యను పరిష్కరించడానికి వీలైన ఊహాత్మక ప్రత్యామ్నాయాల గురించి దేశ ప్రజలకు, దేశ వ్యతిరేకులకు మధ్య వైరుధ్యాలు నెలకొని ఉన్నాయి. ఈ దేశ వ్యతిరేకులు జిహాదీ బీభత్సకారులు, పాకిస్తాన్ ప్రభుత్వం ఉసిగొల్పుతున్న ఉగ్రమృగాలు. ఈ వైరుధ్యాలు సహజం. ఎందుకంటే జిహాదీ ఉగ్రవాదుల, పాకిస్తానీ తొత్తుల లక్ష్యం జమ్మూకశ్మీర్‌ను మనదేశం నుండి విడగొట్టడం...కానీ దేశ ప్రజలుగా చెలామణి అవుతున్న రాజకీయ పక్షాలమధ్య వైరుధ్యాలు నెలకొని ఉన్నాయి. జాతీయ రాజకీయ పక్షాల మధ్య, కశ్మీర్ ప్రాంతీయ పక్షాల మధ్య వైరుధ్య భావాలు ఆవిష్కృతవౌతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి జమ్మూ కశ్మీర్ ప్రభుత్వానికి మధ్య సమస్య గురించి, పరిష్కారం గురించి వైరుధ్యాలు కొనసాగుతూనే ఉండడం రాజ్‌నాథ్ సింగ్ పర్యటన సందర్భంగా మరోసారి ధ్రువపడింది. జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి, పీపుల్స్ డెమొక్రటిక్ పార్టీ అధినేత్రి ముఫ్తిమెహబూబాతో కలిసి రాజ్‌నాథ్ సింగ్ శుక్రవారం శ్రీనగర్‌లో ప్రచారమాధ్యమప్రతినిధులను ఉద్దేశించి ప్రసంగించిన సందర్భంగా ఈ వైరుధ్యాలు మరోసారి ప్రస్ఫుటించాయి. రాజ్‌నాథ్ సింగ్ కూర్చుని ఉండగానే ముఫ్తిమెహబూబా ప్రతినిధుల ప్రశ్నలకు సరైన సమాధానాలు చెప్పలేక అసహనాన్ని ప్రదర్శించింది. అర్థాంతరంగా లేచి వెళ్లిపోయింది. సమస్య ఏమిటన్నది స్పష్టమైనప్పుడు కదా పరిష్కారం గురించి అనే్వషణ జరగాలి. జమ్మూకశ్మీర్‌లో కలిసికట్టుగా పరిపాలన సాగిస్తున్న పిడిపి, భాజపాల మధ్య సమ స్య గురించి, పరిష్కారం గురిం చి కొనసాగుతున్న వైరుధ్యాల గురించి పెద్దగా ప్రచారం కావడంలేదు. ఎందుకంటె స్థానిక భాజపా నాయకులు వౌనముద్రను వహించి ఉన్నారు. జమ్మూకశ్మీర్ భవిష్యత్తు మొత్తం భారత భవిష్యత్తుతో ముడివడి ఉన్నదన్న తరతరాల వాస్తవాన్ని రాజ్‌నాథ్ సింగ్ శ్రీనగర్‌లో మరోసారి గుర్తుచేశారు. ఈ వాస్తవాన్ని ప్రతిపక్షంలో ఉండినప్పుడు పిడిపి నిర్నిబంధంగా అంగీకరించలేదు. అంగీకరించి ఉండినట్లయితే జమ్మూకశ్మీర్‌కు ‘‘స్వయం పాలన’’ గురించి 2005-06లో మొదట అప్పటి పాకిస్తాన్ నియంత పర్‌వేజ్ ముషారఫ్ ప్రస్తావించాడు. పిడిపి దానిపై సిద్ధాంత పత్రాన్ని రూపొందించి విడుదల చేసింది. ఈ స్వయంపాలన సిద్ధాంతాన్ని పిడిపి విడనాడిన జాడ ఇప్పటికీ కనిపించడంలేదు. కేవలం ఐదుశాతం హింసాకాండను జరుపుతున్నారని తొంబయి ఐదుశాతం ప్రజలు ‘‘చర్చలను కోరుతున్నారని’’ మెహబూబా చెప్పింది. ఈ తొంబయి ఐదుశాతం ప్రజలు జమ్మూ-కశ్మీర్‌ను భారత్‌లో అవిభాజ్యప్రాంతమన్న వాస్తవాన్ని అంగీకరిస్తున్నారని మాత్రం ఆమె చెప్పలేదు.
హింసాకాండను నిర్వహిస్తున్నవారు లోయ ప్రాంతం జనాభాలో నిజానికి ఒకశాతం కూడ ఉండరు. హింసాకాండ జరుపుతున్నవారి శాతం ఎంత ఉన్నప్పటికీ వారు దేశద్రోహు లు, పాకిస్తాన్ సమర్థకులు. వారిని అణచివేయడం ఒక్కటే పరిష్కారం. ఎందుకంటె వారు చర్చలు జరుపరు, వారిని సమర్ధిస్తున్న హురియత్ ముఠాల వారు చర్చలకు రారు. ఎం దుకంటె హురియత్‌లోని ‘మెతక వర్గానికి’ గాని, ‘ముదురు వర్గానికి’ గాని భారత రాజ్యాంగం పట్ల నిబద్ధత లేదు. దేశంలో జమ్మూకశ్మీర్ భాగమని గుర్తించడానికి వారు నిరాకరిస్తున్నారు. దేశ సార్వభౌమ అధికారం గురించి గాని, జమ్మూ-కశ్మీర్ భారత్‌లో భాగమన్న వాస్తవం గురించి భిన్నాభిప్రాయాలు ఉండడానికి వీలులేదు. అందువల్ల చర్చకు అవకాశం లేదు. హురియత్ ముఠాలు దేశ సార్వభౌమాధికారాన్ని అంగీకరించి, భారత రాజ్యాంగం పట్ల నిబద్ధతను ప్రకటించే వరకు వారితో చర్చలు జరుపరాదన్నది దశాబ్దులుగా భారత ప్రభుత్వ విధానం. భారత రాజ్యాంగ నిబద్ధత పరిధికి లోబడి మాత్రమే చర్చలు జరగాలన్నది విధానం. కానీ మన్‌మోహన్ సింగ్ ప్రధానిగా కాంగ్రెస్ పాలన సాగిన సమయంలో ఈ నిబంధనను నీరుకార్చారు. విచ్ఛిన్నవాదులతో సైతం చర్చలు జరపగలమని పళనియప్పన్ చిదంబరం దేశ వ్యవహారాలశాఖ మంత్రిగా ఉండిన సమయంలో ప్రభుత్వం ప్రకటించింది. కానీ ప్రభుత్వం వ్రతం చెడినప్పటికీ ఫలితం దక్కలేదు. హురియత్ ముఠాలు చర్చలకు రాలేదు. ఇప్పుడదే కథ పునరావృత్తం అవుతోంది. జాతీయ అధికారపక్షం వారు, ప్రతిపక్షాలవారు చర్చలు జరగవలసిందేనంటున్నారు. అందరితోను చర్చలు జరుపనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించడం రాజ్‌నాథ్ సింగ్ కశ్మీర్ పర్యటనకు నేపథ్యం. చర్చల ద్వారా కశ్మీర్-అంతర్గత-సమస్యకు రాజకీయ పరిష్కారం సాధించాలని సర్వోన్నత న్యాయస్థానం సైతం ఆగ స్టు 22న సలహా ఇవ్వడం చర్చల విధానానికి అత్యంత ప్రాధా న్యం సంతరించి పెట్టింది..
కానీ కేంద్ర ప్రభుత్వం కాని, కశ్మీర్ ప్రభుత్వం కాని చర్చలను ఎవరితో జరపాలి? బుర్హన్ వనీ అనే పాకిస్తాన్ ఉసిగొల్పిన హిజ్‌బుల్ ముజాహిద్దీన్ బీభత్స ముష్కరుడు సైనిక దళాలతో తలపడి హతుడయ్యా డు. ఈ ముష్కరుని మట్టుపెట్టిన సైనిక దళా లు భద్రతను పటిష్ఠం చేశాయి. కానీ వనీ వధ ను నిరసిస్తూ వీధులకెక్కి దాదాపు యాబయి రోజులుగా హింసాకాండకు పూనుకున్న వారు ఎవ రు? బీభత్సకారులు, వారి మద్దతుదారులు. ప్రజలతో ఈ దౌర్జన్యకారుల సంఖ్య ఐదుశాతమని మెహబూమా ముఫ్తి నిర్థారించింది. నిజానికి వీరి సంఖ్య ఇంకా తక్కువే. వీరిని ప్రజలుగా చిత్రీకరించడం జాతీయ వైపరీత్యం. ఈ హింసాకాండను జరుపుతున్న వారు చర్చలకు రానేరారు. మిగిలిన తొంబయి ఐదు శాతం ప్రజలలో కేంద్రం ప్రభుత్వం జరిపే చర్చలను వారు అంగీకరించరు. హింసాకాండను సమర్థిస్తున్న హురియత్ ముఠాలవారు భారత రాజ్యంగ వ్యవస్థ విఫలమైందని బహిరంగంగానే ప్రకటిస్తున్నారు. అందువల్ల భారత రాజ్యాంగానికి అతీతంగా, రాజ్యాంగపు పరిధికి ఆవల చర్చలు జరగాలని రాజ్‌నాథ్ సింగ్‌కు హురియత్‌లోని మెతక ముఠా నాయకుడు ఉమర్ ఫరూక్ 22వ తేదీన సలహా ఇచ్చాడు. ముదురు ముఠా నాయకుడు జిలానీ ఇంతకంటె తీవ్రమైన దేశవిద్రోహి..చర్చలు ఎలా జరుగుతాయి?
పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత జిహాదీలు లోయ ప్రాంతంలోని అల్పసంఖ్యాకులైన హిందువులను సంపూర్ణంగా నిర్మూలించినంత కాలం సమస్య ఉత్పన్నం కాలేదు. సైనికుల దళాలపై జిహాదీలు దాడులు చేసినన్నాళ్లు సమస్య కాని చర్చలు కాని ఈ ‘చర్చావాదుల’కు గుర్తుకు రాలేదు. బీభత్సకారులను సైనికులు కఠినంగా అణచివేయడం మొదలు కాగానే కశ్మీర్ ప్రజలకు అన్యాయం జరిగిపోతున్నదన్న ప్రచారం మొదలైంది. ఈ ప్రచారజాలం నుంచి కేంద్ర ప్రభుత్వం విముక్తం కావడమొక్కటే నిజమైన పరిష్కారం. రవ్వలు-పెల్లెట్స్- నిండిన తుపాకీలను ఉపయోగించాలా? లేక మిరప గోలీలు-్ఛల్లీ షెల్స్- నిండిన తుపాకులను సైనికులు ఉపయోగించాలా? అన్న మీమాంశ అర్థం లేనిది. పాకిస్తాన్ ఉసిగొల్పుతున్న ఉగ్రమూకలను తరిమివేయడం ప్రధానం.