సంపాదకీయం

గుర్తించిన అమెరికా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మన దేశానికి అమెరికాకు మధ్య రక్షణ రంగంలో సహకారం పెరుగుతుండడం అనివార్యమైన ద్వైపాక్షిక పరిణామం! ఉభయ దేశాల మధ్య మంగళవారం ఢిల్లీలో కుదిరిన ఒప్పందం ఈ అనివార్య పరిణామ క్రమానికి మరో ధ్రువీకరణ మాత్రమే. సైనిక సిబ్బంది ఉపకరణాల తరలింపు సదుపాయాల పరస్పర వినిమయ అంగీకార పత్రం-ఎల్‌ఇఎమ్‌ఓఏ-పేరుతో కుదిరిన ఈ ఒప్పందం ఉభయ దేశాలనూ వ్యూహాత్మకంగా మరింత సన్నిహితం చేసింది. ఈ ఒప్పందంలో భాగంగా అమెరికా యుద్ధ వాహనాలు మన సైనిక వాహన ఆశ్రయాలలోకి ప్రవేశించడానికి వీలు కలుగుతుంది, మన సమర శకటాలు సైతం అమెరికా వారి యుద్ధ విమానాశ్రయాలలో ఓడరేవులలో ప్రవేశించడానికి వీలు కలుగుతుందట! అయితే ఇలా ఒక దేశం వాహనాలు మరో దేశంలో ప్రవేశించే ప్రక్రియను ఈ ఒప్పందం శాశ్వతంగా వ్వవస్థీకరించడం లేదు. అమెరికా సమర నౌకలు మన దేశంలో శాశ్వతంగా తిష్ట వేయడానికి వీలు లేదట, అమెరికా యుద్ధ విమానాలు మన వైమానిక దేశ స్థావరాల్లో శాశ్వతంగా నెలకొనడానికి వీలు లేదు. మన వాహనాలుసైతం అమెరికా ఓడరేవులలోను, అమెరికా వైమానిక దళాల స్థావరాలలోను శాశ్వతంగా తిష్ఠ వేయడానికి వీలు లేదు. మన వాహనాలు అమెరికా స్థావరాలలో ప్రవేశించే అవసరం ఏర్పడినప్పుడల్లా అమెరికా ప్రభుత్వం అనుమతిని పొందవలసిందే, అమెరికా కూడ ప్రతి వాహనం మన స్థావరాలలో ప్రవేశించడానికి విడివిడిగా ప్రతిసారీ అనుమతి తీసుకోవలసిందేనట! అందువల్ల ఇది సిబ్బంది, సదుపాయాల తరలింపునకు సంబంధించిన అంగీకారం మా త్రమేనన్నది ఉభయ దేశాల ప్ర భుత్వాలు చెబుతున్న మాట! ఇ ది సైనిక ఒప్పందం కాదు, ఉభ య దేశాల సైనికులు ఉమ్మడిగా ఇతర దేశాలకు వ్యతిరేకంగా పోరాడడానికి ఈ ఒప్పం దం ప్రకారం వీలు కాదు. మన రక్షణ మంత్రి మనోహర్ పారికర్ ఢిల్లీలోను, అమెరికా రక్షణ మంత్రి అస్టన్ కార్టర్ వాషింగ్టన్‌లోను ఈ స్పష్టీకరణ ఇచ్చారు. ఉభయ దేశాల రక్షణ మంత్రుల సమావేశంలోకాక ఉభయ దేశాల విదేశ వ్యవహారాల మంత్రుల చర్చల ఫలితంగా ఈ ఒప్పందం కుదిరింది. ఇది కేవలం వ్యూహాత్మక సహకారం అంగీకారం మాత్రమేనని, సైనిక ఒప్పందం కాదని చెప్పడానికి ఇది కూడ ప్రాతిపదిక! అమెరికా విదేశాంగ మంత్రి జాన్ కెర్రీ, మన విదేశాంగ మంత్రి సుషమా స్వరాజ్ ఢిల్లీలో జరిపిన చర్చల ఫలి తం ఈ ఒప్పందం.
ఇది సైనిక ఒప్పందమేనని పాకిస్తాన్‌లోను, చైనాలోను అప్పు డే ప్రచారం మొదలైపోయింది. మనదేశం, అమెరికా ఇలా పరస్ప రం సన్నిహితం కావడం ఈ ఉభయ దేశాలకు నచ్చని అంశమన్నది బహిరంగ రహస్యం. పాకిస్తాన్ ప్రభుత్వం చైనాలో రక్షణ వ్యూహాత్మక బంధాన్ని బిగించుకోవడమే మన దేశంతో అమెరికా కు వ్యూహాత్మక సహకారాన్ని అనివార్యం చేసిన పరిణామం. ఏ ఇతర దేశంతోను సైనిక ఒప్పందం కుదుర్చుకోరాదన్న మన విధా నం జగమెరిగిన సత్యం. 1947 నుంచి ఇప్పటివరకు మనం ఏ సైనిక కూటమిలోను చేరలేదు. సోవియట్ యూనియన్ కమ్యూనిస్టు విస్తరణ వాదానికి, అమెరికా సామ్రాజ్యవాదానికి మధ్య ప్రచ్ఛన్న యుద్ధం-కోల్డ్‌వార్-నాలుగు దశాబ్దులపాటు 1990 వరకు నడిచింది. ఆసమయంలో కూడా మనం ఏ సైనిక కూటమిలోను చేరలేదు. పాకిస్తాన్ అమెరికా నాయకత్వంలోని సైనిక కూటమిలో చేరింది. 1990 తరువాత సోవియట్ యూనియన్‌లో కమ్యూనిస్టు నియంతృత్వ వ్యవస్థ కూలిపోయింది. తూర్పు ఐరోపా దేశాలు కమ్యూనిస్టు ఏకపక్ష నియంతృత్వాన్ని విడనాడి ప్రజాస్వామ్య బహుళ పక్ష రాజ్యాంగ వ్యవస్థలను స్వీకరించా యి. సోవియట్ యూనియన్ విచ్ఛిన్నమైపోయి పదిహేను దేశా లు ఏర్పడ్డాయి. అమెరికా ఏకైక అగ్రరాజ్యంగా అవతరించింది, ఇది వాణిజ్య ప్రపంచీకరణకు, స్వేచ్ఛావాణిజ్యం పేరుతో బహుళజాతి వాణిజ్య సంస్థల విచ్చలవిడి విస్తరణకు దోహదం చేసింది. ఆయుధాలను అమ్మడం ద్వారా సొమ్ము చేసుకోవడం లక్ష్యమైన అమెరికా అన్ని దేశాలతో మైత్రిని పాటించాయి. ఈ విధానానికి కొనసాగింపు ఇటీవల పాకిస్తాన్‌కు అమెరికా ఎఫ్16 విమానాలను అమ్మజూపడం..ఈ విక్రయం బెడిసికొట్టడం వేరే కథ!
అందువల్ల పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగా జిహాదీ ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న సంగతిని అమెరికా ఇటీవలి వరకు పట్టించుకోలేదు. 2001లో అమెరికాపై అల్‌ఖాయిదా ముఠా దాడి చేసే వరకు అమెరికా ప్రభుత్వానికి జిహాదీ బీభత్సకాండ సమస్య కాలేదు. ఆతరువాత కూడ పాకిస్తాన్ సాగిస్తున్న బీభత్సకాండను అమెరికా పట్టించుకోలేదు. అఫ్ఘానిస్తాన్‌లోని తాలిబన్లను అల్‌ఖాయిదా తండాలను మట్టుపెట్టడంలో అమెరికా సహకరిస్తున్నట్టు పాకిస్తాన్ అభినయించడం కారణం. అమెరికా యుద్ధ విమానాలు తమ దేశంలో దిగడానికి సైతం పాకిస్తాన్ అనుమతినిచ్చింది. ఈ దశలో మనదేశంతో అమెరికా మైత్రి నటించినప్పటికీ పాకిస్తాన్‌కు మాత్రమే ప్రాధాన్యం ఇచ్చింది! పాకిస్తాన్ తమకు సన్నిహిత మిత్ర దేశమని 2009నుంచి 2012 వరకు అమెరికా విదేశాంగ మంత్రిగా ఉండిన హిల్లరీ క్లింటన్ ప్రకటించడం ఇప్పుడు మరుగున పడిన స్మృతి! కానీ దక్షిణ చైనా సముద్ర ప్రాంతంలో గుత్త్ధాపత్యం తనదేనని గత రెండు సంవత్సరాలుగా ప్రకటిస్తుండడం అమెరికా వైఖరిలో విప్లవాత్మకమైన మార్పు తెచ్చిన పరిణామం! చైనాకు దీటుగా ఎదుగుతున్న మనదేశంతో అమెరికా ఇప్పుడీ వ్యూహాత్మకమైన ఒప్పందాన్ని కుదుర్చుకొనడానికి ఇదీ నేపధ్యం! పదేళ్ల క్రితంవరకు, 1990 నుంచి, అమెరికా ప్రపంచంలో ఏకైక అగ్రరాజ్యం! కానీ గత పదేళ్లలో మళ్లీ అంతర్జాతీయం గా అమెరికాకు ఆధిపత్య ప్రతిఘటన ఎదురవుతోంది. ఇప్పుడు ప్రతిఘటిస్తున్నది చైనా...ఒకప్పటి అమెరికా ప్రత్యర్థి రష్యా కూడ చైనా జట్టులో చేరి ఉండడం వర్తమాన వాస్తవం. మనదేశంతో జట్టుకట్టక తప్పని స్థితి అమెరికాకు ఏర్పడడానికి ఇదీ నేపథ్యం..చైనా మనదేశం చుట్టూ దశాబ్దికి పై వివిధ దేశాలలో స్థావరాలను ఏర్పరుచుకుని ఉంది. బంగ్లాదేశ్‌లోని చిట్టగాంగ్‌నుండి పాకిస్తాన్‌లో గ్వాడార్ వరకు చైనా నౌకాదళం విస్తరించి ఉంది. ఈ పదేళ్లపాటు కూడ చైనాకు వ్యతిరేకంగా మన వైపున నిలబడడానికి అమెరికా సన్నద్ధం కాలేదు. చైనాకు ఉన్నట్టే ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో మనదేశానికి శాశ్వత సభ్యత్వం ఇప్పించడానికి అమెరికా పూనుకోలేదు.
ఏ ఇతర దేశంతో నిమిత్తం లేకుండా చైనా దురాక్రమణ వ్యూ హాన్ని ఎదుర్కోవడానికి గత రెండేళ్లుగా మన ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం అంతర్జాతీయంగా మన ప్రతిష్ఠను పెంచింది. చైనా ఉ సిగొల్పుతున్న టెర్రరిస్టులను, బర్మాలో స్థావరాలను ఏర్పరుచుకు న్న వారిని మన సైనికులు పట్టి పరిమార్చడం శ్రీకారం. లడక్‌లో వాస్తవ అధీనరేఖను దాటి చొరబడుతున్న చైనా సైనికులను మన దళాలు ప్రతిఘటించడం మలి ఘట్టం. గ్వాడార్ ఓడరేవు సమీపంలో, ఇరాన్‌లోని చౌబహార్ ఓడరేవు అభివృద్ధికి మన ప్రభు త్వం పూనుకొనడం తదుపరి ఘట్టం! బలూచిస్తాన్‌లో పాకిస్తాన్ ప్రభుత్వం జరుపుతున్న దమనకాండను బహిరంగంగా నిరసించడం సరికొత్త పరిణామం. వీటివల్ల మన ప్రతిష్ట పెరిగింది. తూ ర్పు ఆసియా దేశాలు మనతో జట్టుకట్టి చైనాను ప్రతిఘటించడానికి సిద్ధంగా ఉన్నాయి. అందువల్ల తూర్పు, దక్షిణ చైనా సముద్రాలలో చైనా దురాక్రమణను నిరోధించడానికి మన సహకారం అనివార్యమని అమెరికా గుర్తించింది. ఈ గుర్తింపు మంగళవారంనాటి ఒప్పందానికి ప్రాతిపదిక. ఈ ఒప్పందవల్ల అమెరికాకే ఎక్కువ సదుపాయం. మన వాహనాలు అమెరికాకు వెళ్లవలసిన అవసరం లేదు..అందువల్ల!