సంపాదకీయం

ఫలించిన ప్రార్థన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు రాష్ట్రాలకు చెందిన విశ్వవిద్యాలయ అధ్యాపకులు టి. బలరామ్ కిషన్, సి.గోపీకృష్ణలకు ఇరాక్ సిరియా మతరాజ్యం-ఐసిస్- ముఠా నిర్బంధం నుండి విముక్తి లభించడం గొప్పదైన సంఘటన. తమవారి విడుదల కోసం పదునాలుగు నెలలుగా ఎదురు చూస్తున్న కిషన్,కృష్ణల కుటుంబ సభ్యులు తమ ప్రార్థనలు ఫలించినట్టు ప్రకటించడం అందువల్ల అత్యంత సహజం. గత ఏడాది జూలై 29వ తేదీన లిబియాలో ఈ ఇద్దరు అధ్యాపకులను ఇస్లాం మతరాజ్యం జిహాదీలు అపహరించుకొని వెళ్లారు. 2013 నుంచి ఇరాక్‌లో చెలరేగిన ఈ మతరాజ్యం ముఠావారు ఆ తరవాత సిరియాకు విస్తరించారు. ఇరాక్‌లో అనేకమంది భారతీయులు అపహరణకు గురి అయిన తరువాత సింధు శాఖ దేశాలలోని భారతీయుల ఉనికికి భయంకరమైన ప్రమాదం ఏర్పడిపోయింది. సిరియాలో నియంతృత్వ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏళ్లతరబడి చెలరేగుతున్న ప్రజాసమరం కారణంగా దేశం రెండుగా విభక్తమైంది. ఇలా ప్రభుత్వ దళాలు ప్రభుత్వ వ్యతిరేక దళాలు కొట్టుకుంటుండటం అదనుగా ఐసిస్ దుండగులు ఆ దేశంలో చొరబడిపోయారు. ఫలితంగా ప్రస్తుతం సిరియాలో మూడు వర్గాలూ పరస్పరం తలపడుతున్నాయి. అరబ్ ఉప్పెన పేరుతో ప్రజా ఉద్యమాలు పశ్చిమాసియా దేశాలను ఉత్తర ఆఫ్రికా దేశాలను ముంచెత్తిన సమయంలో సిరియా నియంతృత్వ ప్రభు త్వం మాత్రం కూలిపోకుండా నిలదొక్కుకుంది. అయితే గత మూడేళ్లుగా ఐసిస్ హత్యాకాండ ఇరాక్‌ను, సిరియాను అల్లకల్లోలం చేస్తోంది. అందువల్ల ఈ రెండు దేశాలనుంచి విదేశాలవారు పలాయనం చిత్తగించడం సహజ పరిణామం. 2014లో ఇరాక్‌లో ఐసిస్ బీభత్సకారులు అపహరించిన ముప్పయితొమ్మిది మంది భారతీయులకు ఇప్పటికీ నిర్బంధ విముక్తి కలుగలేదు. ఈ నేపథ్యంలో లిబియా దేశపు రాజధాని ట్రిపోలీకి సమీపంలోని ఒక విశ్వవిద్యాలయంలో పనిచేసిన ఈ ఇద్దరు తెలుగువారిని ఐసిస్ వ్యతిరేక దళాలవారు నిర్బంధ విముక్తులను చేయగలగడం హర్షించదగిన శుభపరిణామం. వీరిద్దరితోపాటు మరో ముగ్గురు భారతీయులను కూడ మతరాజ్యం ముఠా జిహాదీలు గత ఏడాది జూలైలో అపహరించుకొని పోయారు. వారిలో కర్నాటకకు చెందిన లక్ష్మీకాంత్, విజయ్‌కుమార్ అనే విశ్వవిద్యాలయ అధ్యాపకులను అపహరణకర్తలు ఆ తరవాత వదలిపెట్టడం కూడ పరమేశ్వరుడి విధి విధానం. ఇప్పుడు స్థానిక ప్రభుత్వ దళాలు తెలుగు అధ్యాపకులనిద్దరినీ సురక్షితంగా తప్పించగలిగాయ. అయితే ఐసిస్ ఉగ్రవాదులు లిబియాలో అపహరించిన ఐదవ భారతీయుని జాడ ఇంకా తెలియవలసి ఉంది.
ఇస్లాం మతరాజ్యం ముష్కరులు చెలరేగుతున్న పశ్చిమాసియా దేశాలనుంచి భారతీయులను స్వదేశానికి తిరిగి వచ్చేయవలసిందిగా మన ప్రభుత్వం 2014 నుంచి అనేకసార్లు హెచ్చరికలు చేసింది. సౌదీ అరేబియాలోని సంపన్నులు పెడుతున్న చిత్రహింసల నుంచి, గృహ హింస నుంచి తప్పించుకొని అనేకమంది భారతీయులు స్వదేశానికి వచ్చేశారు, వచ్చేస్తున్నారు. కానీ లిబియా తదితర ఆఫ్రికా దేశాలనుంచి మాత్రం భారతీయులు గత రెండేళ్లుగా తిరిగి రావడంలేదు. ఎందుకంటె అంతర్యుద్ధంలో నియంతృత్వ ప్రభుత్వం కూలిపోయిన తరువాత లిబియాలో విదేశీయులకు రక్షణ ఏర్పడిందన్న భావన కలిగింది. అందువల్లనే బహుశా ఈ భారతీయులు స్వదేశానికి తిరిగి రాకుండా లిబియాలోనే కొనసాగారు. కానీ ఈ భద్రతా భావం ‘భ్రాంతి’ అని ధ్రువపడింది. సిరియా ఇరాక్ వంటి పశ్చిమదేశాలలో బహిరంగ బీభత్సకాండ జరిగిన ఇస్లాం మత రాజ్యం ఆతతాయిలు చాపకింద విషంలాగా లిబియా ఈజిప్టు వంటి ఆఫ్రికా దేశాలకు విస్తరించిపోయారు. ఈ విస్తరణ ఫలితమే గత ఏడాది జరిగిన భారతీయుల అపహరణం..అంతర్జాతీయ జిహాదీ బీభత్సకాండకు వర్తమాన వికృత భయంకర రూపం ఇస్లాం మతరాజ్యం ముఠా.
లిబియాలో పనిచేస్తుండిన దాదాపు పద్ధెనిమిదివేల మంది కార్మికులను, ఉద్యోగులను 2011 ఫిబ్రవరిలో మన ప్రభుత్వం స్వదేశానికి తరలించుకొని వచ్చింది. ‘ఆపరేషన్ సేఫ్ హోమ్ కమింగ్’- సురక్షితంగా స్వదేశానికి-అన్న పేరుతో అనేక విమానాల ద్వారా ఈ భారతీయులను మన ప్రభుత్వం అప్పుడు ఇంటికి తరలించుకొని వచ్చింది. మన నౌకాదళానికి చెందిన ఓడలు కూడా లిబియా నుంచి మనవారిని తరలించుకొని వచ్చాయి. ఇలా ఇన్నివేలమందిని స్వదేశానికి తిరిగి అప్పగించడం అప్పుడు లిబియాలో నెలకొని ఉండిన భయానక స్థితులకు నిదర్శనం. నియంత కల్నల్ మహమ్మద్ అల్ గడ్డ్ఫా అధ్యక్షతన 1960 దశకం నుంచి లిబియాలో కొనసాగిన సైనిక నియంతృత్వాన్ని 2011లో ప్రజలు తొలగించారు. ఈ అంతర్యుద్ధం తరవాత గడ్డ్ఫా నియంతృత్వం పతనమైన తరవాత లిబియాలో 2012లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగాయి. లిబియాలో ప్రశాంతి పునరుద్ధరణకు గురి అయిందన్న భావం ఏర్పడింది. కానీ మతరాజ్య వ్యవస్థలున్న దేశాలలో ప్రజాస్వా మ్యం విజయవంతం కాజాలదన్నది ఆతరువాత ధ్రువపడిన వాస్త వం. ‘అరబ్ ఉప్పెన’ -అరబ్ స్ప్రింగ్-లో ఈజి ప్టు, ట్యునీసియా వంటి దేశాలలో నియంతృత్వ వ్యవస్థలు కొట్టుకొనిపోయాయి. కానీ లిబియాలోను, ఈ దేశాలలోని వివిధ మతోన్మాద శక్తులు విజృంభిస్తున్నాయి. 2012 తరవాత ఈ దేశాలకు వెళ్లి స్థిరపడిన భారతీయుల భద్రత మాత్రమే కాక, ఇతర దేశాలవారి భద్రతకు కూడా విఘాతకరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. మన అధ్యాపకుల అపహరణ, విముక్తి ఈ విపరీత స్థితికి ఒక ఉదాహరణ మాత్రమే. లిబియా నుంచి తిరిగి రావలసిందిగా మన ప్రభుత్వం అక్కడి మనవారికి ఇచ్చిన సలహాలను కూడా అంతా పాటించలేదు. ఇప్పటికీ అనేక వందలమంది భారతీయులు లిబియాలో విద్యా, వైద్యరంగాల్లో పనిచేస్తున్నారు. ఈ ఇద్దరు తెలుగువారిని విడిపించడానికి మన ప్రభుత్వం చెప్పిన దౌత్యపరమైన వ్యూహాత్మకమైన కృషి ఫలించడం వల్లనే వీరికి విముక్తి లభించినట్టు విదేశ వ్యవహారాల మంత్రిత్వశాఖ వారు చెబుతున్నారు. లిబియా ప్రభుత్వంలోను, ఈజిప్టు తదితర పొరుగు దేశాల ప్రభుత్వాలలోను మన ప్రభుత్వం చర్చలు జరిపిందట. కానీ ఈ చర్చల వల్ల కాక భగవంతుని కృపవల్ల బలరామ్‌కిషన్‌కు, గోపీకృష్ణకు దుండగుల నుంచి విముక్తి లభించిందన్నది జనవాక్యం. ఎందుకంటె ఇరాక్‌లో ఐసిస్ అపహరించిన ముప్పయి తొమ్మిది మంది కార్మికుల విముక్తికి మన ప్రభుత్వం చేసిన వ్యూహాత్మక, దౌత్యచర్చలు ఫలితాలనివ్వలేదు. రెండేళ్లుగా ఈ 39 మంది టెర్రరిస్టుల నిర్బంధంలోనే ఉన్నారు. మన ప్రభుత్వం ఏ ఇతర దేశ ప్రభుత్వం కాని ఇలాంటి వైపరీత్యాలలో చేయగలిగింది చాలా స్వల్పం. తప్పు పట్టవలసిన పనిలేదు. ఎందుకంటె అపహరించుకొని వెళ్లిన వారిని ఎక్కడ ఉంచారో తెలుసుకోవడం దాదాపు అసాధ్యం. టెర్రరిస్టులపై దాడికి పూనుకుంటే వారు బాధితులకు అపాయం కలిగించవచ్చు...అందువల్ల ఈ 39 మందిని కూడ భగవంతుడే కాపాడాలి.