సంపాదకీయం

అపరాజిత పటిమ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సనాతన జాతి మళ్లీ గర్జిస్తోంది, భద్రతా ధ్యాసకు దూరమై ఏళ్ల తరబడి నిద్రఒడిలో పడివుండిన భరత భూమి ‘‘స్వయమేవ మృగేంద్ర’’ స్వభావంతో సమర స్వరాన్ని సంధిస్తోంది. నిరంతరం దూకుతున్న ఉగ్రవాదపుతోడేళ్ల మందల గుండెలలో భయప్రకంపనాలను సృష్టిస్తున్న సమర స్వరం ఇది, భరత మాత వరాల బిడ్డలు నిశ్చింతగా నిదురించడానికి దోహదం చేస్తున్న నిర్భయ భావగీతం ఇది. ఈ జాతీయతా గర్జన నేటి విజయదశమి ఉత్సవానికి నేపథ్యం, శక్తి మళ్లీ స్ఫురిస్తోంది, పటిమ మళ్లీ ప్రస్ఫుటిస్తోంది, మన అస్తిత్వపు అజరామరత్వం పట్ల విశ్వాసం మళ్లీ వికసిస్తోంది! ఈ విశ్వాసం చారిత్రక పునరావృత్తి... అనాది శక్తి అపరాజిత.. ఆద్యంత రహితమైన విశ్వ వ్యవస్థను నిరంతరం సంచలితం చేస్తున్న స్వయం కృత! ఈ శక్తి పరిపోషకమైనది, విధ్వంసకరమైనది కాదు! నిరంతర పరిపోషణ విశ్వ నిహిత స్వభావం, విధ్వంసం అపవాదం... వెలుగు సృష్టిగత విభవం, చీకటి తాత్కాలిక పతనం... ప్రభా మండలం సహజమైన ప్రకృతి, గ్రహణం పొంచి ఉన్న వికృతి! విధ్వంసం వెక్కిరించినప్పుడల్లా పరిపోషక శక్తి విజృంభిస్తోంది. ఇదీ సృష్టిగత పునారవృత్తి... సృష్టిగత స్వభావాన్ని సమాజ స్వరూపంగా అనువదించుకోవడం సనాతన ప్రవృత్తి! ఈ సనాతన ప్రవృత్తికి భరత భూమి సజీవ విగ్రహం! అందువల్లనే అనాదిగా భరత జాతి దురాక్రమించడంలేదు, దాడి చేయడంలేదు... దురాక్రమణను నిరోధించింది, దాడిని తిప్పికొట్టింది! ఇదీ పునరావృత్తి! ‘మధుకైటభ’ రూపంలోని విధ్వంసం విరుచుకొని పడింది, సృష్టిని సృష్టికర్తను సైతం సంక్షుభితం చేసింది. అనంతంగా వ్యాపించిన పరిపోషక శక్తి విధ్వంసాన్ని నిర్మూలించడం సమాంతర పరిణామం. ఈ వ్యాపించిన శక్తి విష్ణువు, అనాది శక్తి విష్ణువుగా ప్రస్ఫుటించింది! ‘మహిష’ రాక్షసుడు మహీతలాన్ని హత్య చేయడానికి దురాక్రమించినప్పుడు అనంత శక్తి దుర్గ రూపంలో దూకింది, అసంఖ్యాక మహిష దనుజులను అసంఖ్యాక రూపాల దుర్గ దునుమాడింది! శక్తి స్వభావం, శక్తి సంస్కారం, శక్తి సంస్కారాల సమాహారం! విశ్వ వ్యవస్థలోని కణం కణం ఒక శక్తిరూపం. ఒక సంస్కార కిరణం... ఇదీ విశ్వరూపం, దుర్గారూపం...విష్ణు రూపం! ఇదంతా పునరావృత్తం అవుతోంది, పునవృత్తి ‘ఋతం’, విశ్వ ప్రక్రియ ‘ఋతం’! ‘ఋతంబర’ దుర్గ, అపరాజిత... ఈ అపరాజితకు కనిపించే రూపం భూమాత! ఈ జాతికి ఆధారమైన, సర్వస్వమైన భూమాత భరతమాత... అపరాజిత అయిన భరత మాత సనాతన దేవత! ఈ దేవత సాధించిన సనాతన విజయాలకు ప్రతీక విజయదశమి, మహిష దనుజుని దుర్గా మాత దునుమాడడం నిరంతరం పునరావృత్తవౌతున్న పరిపోషక చరిత్ర ఒక శుభ ఘట్టం...
స్వభావం ‘గర్జించడం’తో గుండెలు అదరిన దురాక్రమణ బెదిరిపారిపోవడం తప్పదు... కానీ గర్జించడం వల్ల బెదరని దురాక్రమణను నిర్జించక తప్పదు. రఘురాముడు గర్జించాడు, మారీచుడు పారిపోయాడు... మహర్షుల యజ్ఞ వాటిక నుంచి పారిపోయాడు! రఘురాముడు గర్జించాడు... రావణుడు దురాక్రమించిన దానవుడు బెదిరిపోలేదు! అందుకే దశకంఠుని రాముడు నిర్జించాడు, దశవికృతులను హరించాడు! ఇది పునరావృత్తి.. మహిషాసురుని మహాశక్తి వధించిన ఘటనకు పునరావృత్తి! పునరావృత్తి అంతటితో ఆగలేదు, ద్వాపర యుగంలో అర్జునుడు గర్జించాడు, ఆవులను దొంగిలించడానికి వచ్చిన దుర్జనులు హడలిపోయి పారిపోయారు... ‘గర్జన’తో దుర్జనులు తొలగినప్పుడు నిర్జించకపోవడం అనాదిగా భారతీయుల శక్తి స్వభావం! ఈ శక్తి అనాదిగా విజయాలను సాధించడం పునరావృత్తి. అనంతంగా విజయాలను సాధించనుండడం కూడ జరుగనున్న పునరావృత్తి.. ప్రతి శరదృతువులోను మొదటి శుక్లపక్షంలో విజయదశమి ఏర్పడడం పునరావృత్తి! ఇలా యదుకుల కృష్ణుడు, శుంగ వంశపు పుష్యమిత్రుడు, గుప్త సముద్రగుప్తుడు, ప్రమర వంశపు విక్రమ శాలివాహనులు, రుద్రమదేవి, విద్యారణ్యుడు, ఛత్రపతి శివాజీ వంటి వారు ఈ విజయాల పునరావృత్తికి చారిత్రక ప్రతీకలు.
ఇలా దురాక్రమణను తిప్పికొట్టడం మాత్రమే యుగాలుగా తరాలుగా భారత జాతీయ శక్తికి తెలుసు. దురాక్రమణకు వ్యతిరేకంగా క్రీస్తుశకం 712 నుంచి 1947 వరకు సహస్రాబ్దుల పాటు ఈ సనాతన భూమిపై వికసించిన ‘శక్తి’ సంఘర్షణ సాగించింది! పరాజయం పాలైంది, పరాభవం పాలయింది, కానీ చివరకు ఈ సనాతన సజ్జనశక్తి విజయం సాధించింది, విభవం సాధిస్తోంది. పరిపోషక శక్తికి సృష్టి సంచాలక శక్తికి పరాజయాలు ఎదురు కావడం అపవాదం. వైవిధ్య రూపాల మధ్య, అసంఖ్యాక స్వరూపాల మధ్య వైరుధ్యం లేని స్వభావం విశ్వనిహిత పరిపోషకత్వం. ఈ సమన్వయం అనాదిగా సమాజ స్థితమైన భారత భూమిపై పరిపోషక శక్తి సహజంగా వికసించింది! ఈ ‘శక్తి’ వైవిధ్యాలను పరిరక్షించింది. అందుకే ఇచ్ఛాశక్తికి ప్రతీక అయిన మహాలక్ష్మీదేవి, జ్ఞానశక్తికి పతాక అయిన సరస్వతీమాత, క్రియాశక్తిగా ప్రస్ఫుటించిన మహాదుర్గ భరతమాతగా భావిస్తున్నారు. ఈ త్రివిధ శక్తులు మాత్రమే కాదు సృష్టిగత సమస్త వైవిధ్యాలు కోటి కోటి భుజాల కోటికోటి ముఖాల మాతృభూమిగా ఆకృతి దాల్చడం అనాదిగా ఈజాతీయ జీవన విధానం! వైవిధ్యాలను సహించలేని, వైవిధ్యాల మధ్యకల అద్వితీయ స్వభావాన్ని దర్శించలేని అజ్ఞానులు సృష్టిలో రాక్షసులు. వైవిధ్య పరిరక్షక దైవీశక్తికి, వైవిధ్య విధ్వంసక అసుర శక్తికి మధ్య సంఘర్షణ మహిష దనుజుని మాతృశక్తి మట్టుపెట్టిన నాటిది. అంతకు పూర్వం నాటిది. అనాదిగా కొనసాగుతున్నది! వర్తమాన సమాజంలో కూడ ఈ సంఘర్షణ సాగుతోంది! అన్ని మతాలను, అన్ని భాషలను, అన్ని వైవిధ్య రీతులను సమానంగా సంభావించి సమాదరిస్తున్న భారత జాతి ‘పరిపోషక శక్తి’గా పరిఢవిల్లుతుండడం ప్రపంచ చరిత్ర. ఇతర ‘అన్ని మతాల’ వారిని హత్య చేసి, వైవిధ్యాలను ధ్వంసం చేసి తమదైన ‘మతాన్ని’ మాత్రమే ప్రపంచమంతటా నిలబెట్టాలని భావిస్తున్న విదేశీయ జాతులది రాక్షస శక్తి, అధర్మ శక్తి, మ్లేచ్ఛ శక్తి! ఈ రెండు శక్తుల మధ్య సంఘర్ణణ ఇప్పటకీ కొనసాగుతోంది.
మన సరిహద్దుల చుట్టూ పొంచి ఉన్న ఈ వైవిధ్య విధ్వంసక శక్తులపై భరత జాతీయ శక్తి మరోసారి గర్జించవలసిన అనివార్యం ఏర్పడడానికి ఇదీ నేపథ్యం! భారతదేశం బీభత్స కాండను ప్రతిఘటిస్తోంది, ఈ ప్రతిఘటనకు ఘనవిజయం లభించడం నేటి ‘విజయదశమి’కి ప్రాధాన్యాన్ని ద్విగుణీకృతం త్రిగుణీకృతం చేసిన శుభ పరిణామం, అపరాజిత శక్తిగా మనజాతి జీవించాలన్నదే మన సమష్టి ఆకాంక్ష. అందువల్ల ప్రపంచంలోని అన్ని ఇతర జాతులు మనమీద దాడి చేసినప్పటికీ తిప్పికొట్టగల అజేయ అపరాజిత శక్తిగా మన జాతి పరిఢవిల్లాలని మాత్రమే తరతరాల యుగ యుగాల భరతజాతి ఆదిశక్తిని కోరింది, కోరుతోంది. దాడి చేసే శక్తి మనది కాలేదు, దాడిని తిప్పికొట్టే శక్తి దుర్గది, లక్ష్మిది, సరస్వతిది... ముగురమ్మల రూపమైన భరతమాతది..!!