సంపాదకీయం

డొనాల్డు కంపు...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

డొనాల్డ్ ట్రంప్ అనేవాడు అమెరికాలో పుట్టి పెరిగిన అభినవ మహిషాసురుడు...కాబట్టి అమెరికా అధ్యక్ష పదవికి డెమొక్రాటిక్ పార్టీ ‘నామాంకిత’-నామినీ-హిల్లరీ క్లింటన్ ఎన్నిక కావడం ఇప్పుడు కేవలం లాంఛనమన్న ప్రచారం జరుగుతోంది. నవంబర్ ఎనిమిదవ తేదీన జరగనున్న ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీకి చెందిన ప్రత్యర్థి డొనాల్డ్ ట్రంప్‌ను ఆమె మట్టి కరిపించడం ఖాయమన్న విశే్లషణలు అమెరికాలోను విదేశాలలోను కొనసాగుతున్నాయి. డొనాల్డ్ ట్రంప్ కాని హిల్లరీ క్లింటన్ కాని అమెరికా రాజకీయాలలో విలక్షుణులు కాదు, మేధావులుగానో రాజ్యాంగ నిపుణులుగానో ప్రతిష్టను పొందిన వారు కారు- డెబ్బయి ఏళ్లు పైబడిన డొనాల్డ్ ట్రంప్ కాని అరవై ఎనిమిది వసంతాల హిల్లరీ కాని అమెరికా అధ్యక్ష ఎన్నికల సంప్రదాయానికి అపవాదాలు. ఎందుకంటే గత అరవై ఏళ్లుగా అమెరికా అధ్యక్ష పదవికి అరవై ఐదు ఏళ్లలోపు వారు ఎన్నికవుతున్నారు. 1980లో ఎన్నికయిన రొనాల్డ్ రీగన్ మాత్రమే 72వ ఏట పదవిని స్వీకరించాడు! ఉభయ పార్టీల నామాంకితులలో వయసులో చిన్న వారిని పదవి వరించడం కూడ అధ్యక్షుని ఎన్నికలో ఆనవాయితీ అయిపోయింది. 1960లో జాన్ పిట్జరాల్డ్ కెనడీ 43వ ఏట, 1992 బిల్లు క్లింటను 46వ ఏట, 2008లో బరాక్ హుస్సేన్ ఒబామా 43వ ఏట అధ్యక్షులుగా ఎన్నిక కావడం అమెరికా వోటర్లకు చిన్న వయసు అభ్యర్థుల పట్ల కల మక్కువకు నిదర్శనం. ఈ ఎన్నికలలో మాత్రం ఈ మక్కువను ప్రదర్శించడానికి వోటర్లకు అవకాశం లేదు. ప్రధాన ప్రత్యర్థులిద్దరు వయోవృద్ధ నేతలే! మొదటిసారిగా ఒక మహిళ అధ్యక్ష పదవికి ఒక ప్రధాన పక్షం ‘నామాంకిత’గా పోటీ చేయడం హిల్లరీ ప్రత్యేకత! మాజీ అధ్యక్షుడు బిల్లు క్లింటన్ భార్య కావడం ఆమె ప్రత్యేకతలలో మరొకటి! న్యూయార్క్ రాష్ట్రంనుండి ఎన్నికయిన తొలి మహిళా ‘సెనేటర్‌‘ కూడ హిల్లరీ క్లింటన్. ఈ ప్రత్యేకతలు ఏవీ ఆమెను అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలన్న భావాన్ని వోటర్లకు కలిగించవు; పురుషాధిక్యం పొగలు కక్కుతున్న అమెరికా రాజకీయాలలో మహిళను అధ్యక్ష పదవికి ఎన్నుకోవాలన్న ధ్యాస వోటర్లకు కలగకపోవడం ఆశ్చర్యం కాదు! అమెరికాలోని మహిళ సాధికారత విచ్చలవిడిగా విడాకులివ్వడానికి విశృంఖల శృంగారానికి పరిమితమై పోవడం చారిత్రక దురదృష్టం! అందువల్ల హిల్లరీ క్లింటన్ ఇప్పుడు అధ్యక్షురాలు అయితే అమెరికా మహిళలకు నిజమైన మర్యాద, నిజమైన మన్నన...
హిల్లరీ క్లింటన్ గెలుస్తుందన్న వాదానికి ప్రాతిపదిక ఆమె వైశిష్ట్యం కాదు, ప్రత్యర్థి డొనాల్డు ట్రంప్ దుర్మార్గం! అతగాడి వాదన పటిమ అమెరికాలోని శే్వతేతర జాతులను దిగ్భ్రాంతికి భయాందోళనలకు గురి చేస్తోంది. ‘‘ఇతగాడు అధ్యక్షుడయితే మేము అమెరికాను వదిలి పారిపోవాల్సి వస్తుందేమో’’ అని నల్ల జాతులవారు ఆఫ్రికా సంతతివారు ఆందోళన చెందుతున్నారట! స్పానిష్ భాషా జన సముదాయానికి చెందిన దాదాపుకోటి మంది ఐరోపా సంతతి వారు కూడ ఈ డొనాల్డ్ దౌర్జన్యకాండను నిరసిస్తున్నారు. అమెరికాలోని దాదాపు ఎనబయి ఐదుశాతం ప్రజలు ఐరోపా సంతతివారే! క్రీస్తుశకం పదహారవ శతాబ్ది చివరినుంచి అమెరికాకు వలసవచ్చిన ఐరోపా వారి వారసులే! పదిహేడవ శతాబ్దిలో అమెరికాలోని అనాది జాతి అయిన ‘ఎఱ్ఱవారి’ని-రెడ్ ఇండియన్లను-వేటాడి చంపిన పైశాచిక ప్రవృత్తి నిండిన ఐరోపా సంతతి వారే! అయినప్పటికీ మెజారిటీ ఇంగ్లీషు వారిని చూసి మైనారిటీ ‘ఇస్పానిక్’-స్పానిష్ సంతతివారు హడలెత్తిపోవడానికి కారణం డొనాల్డ్ ట్రంప్ సాగిస్తున్న దుర్మార్గ ప్రచారం.
ఇతగాడికి భారతీయులంటే గిట్టదు, నిరుపేదలంటే గిట్టదు, మహిళలను కేవలం భోగవస్తువుల రూపాలుగా ఇతడు భావిస్తుండడం బహిరంగ రహస్యం! కానీ ఇతగాడు వావివరసలు లెక్కచేయని అభినవ సైంధవుడని ఇప్పుడు మరింత స్పష్టమైపోయింది! ద్వాపర యుగంనాటి మన దేశపు సైంధవుడు కూడ చెల్లెలిని కాని కుమార్తెను కాని కామించలేదు. వరసకు చెల్లెలయిన ద్రౌపదిని, పాండవ పత్నిని బలాత్కరించబోయాడు!కాని డొనాల్డ్ ట్రంప్ కన్న కూతురినే అక్రమ శృంగార దృష్టితో వీక్షించిన మానవ మృగం, మహిషాసురుని రూపం! ఇతగాడిని అమెరికా మహిళలు అసహ్యించుకుంటున్నారు! విచక్షణ కల పురుషులు అభిశంసిస్తున్నారు! హిల్లరీ క్లింటన్ తొలి అధ్యక్షురాలు కానుండడానికి ఇదీ ప్రాతిపదిక! డొనాల్డ్ ట్రంప్ బౌద్ధిక పైశాచిక విన్యాసం హిల్లర్మమ్మకు పరోక్షంగా మేలు చేస్తోంది...
అమెరికన్లు ఐరోపా సంతతివారు తమ దేశాలపట్ల గొప్ప భక్తులు, తమ జాతీయ హితం వారికి పరమ లక్ష్యం! కానీ ఇతర దేశాల ప్రజలను జాతులను వెక్కిరించడం, అవమానించడం, చులకన చేయడం ఈ ఐరోపావారి, ఐరోపా సంతతి అయిన అమెరికా వారి సమష్టి స్వభావం. వారికి శక్తి ఉన్నప్పుడల్లా ఇతర దేశాలను దురాక్రమించడం దోచుకొనడం ధ్వంసం చేయడం తమ విధానాలను వికృతులను ఇతర దేశాలపై రుద్దడం ఐరోపా అమెరికా జాతుల సహజ స్వభావం! ఇది రాక్షస ప్రవృత్తి...రాక్షసులు వేదాలను విజ్ఞానాలను సంపాదించారు, యజ్ఞాలను యాగాలను చేసారు, అస్త్ర శస్త్రాలను నాగరికతలను రూపొందించారు. కానీ ఇతరుల వేదాధ్యయనాన్ని, విజ్ఞానాన్ని రాక్షసులు సహించలేదు, నిరోధించ యత్నించారు. ఇతరుల యజ్ఞాలను అస్త్ర శస్త్రాలను నాగరికతను ధ్వంసం చేయడం రాక్షసుల చరిత్ర! ఈ స్వభావం ఐరోపా జాతుల అమెరికా జాతుల సమష్టి ప్రవృత్తి!మేక వనె్న మెకాల వలె ఈ పడమటి జాతులు ‘ప్రజాస్వామ్యం’ ముసుగు వేసుకుని నియంతృత్వాన్ని సాగించారు! డొనాల్డ్ ట్రంప్ ఈ ‘ముసుగు’ను తొలగించాడు, నిర్భయంగా నిర్లజ్జగా తన వికృత స్వభావాన్ని ఆవిష్కరించాడు! అమెరికా అధ్యక్షులు కొందరు, ఇతర రాజకీయ వేత్తలు ఇతర దేశాల మహిళలను నీచమైన పదజాలంతో దూషించిన సందర్భాలున్నాయి. 1968వ 1974వ సంవత్సరాల మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉండిన రిచర్డ్ మిల్ హవుస్ నిక్సన్ అనేవాడు అప్పటి మన ప్రధానమంత్రి ఇందిరాగాంధీని పరోక్షంగా ఇలా అసభ్య పదజాలంతో నిందించినట్టు ఆ తరువాత వెల్లడైంది! అవినీతి మార్గాలను అవలంబించిన నిక్సన్ తన పదవికి రాజీనామా చేయవలసి రావడం వేరే కథ! డొనాల్డ్ ట్రంప్ ఇప్పుడు విదేశీయ మహిళలను కాక స్వదేశీయ మహిళలనే కించపరిచాడు, అవమానించాడు...అభినవ కీచకుడు!
గత పదిహేడు ఏళ్లుగా దుర్మార్గపు వ్యాఖ్యలను చేయడం మాత్రమే కాక వావి వరసలు లేని ఉన్మాది వలె మహిళలను డొనాల్డ్ ట్రంప్ హేళన చేయడం గురించి, వారిగురించి నీచంగా మాట్లాడడం గురించి ఇప్పుడు బయటపడింది. ‘ఇవాంకా’ అనే డొనాల్డ్ ట్రంప్ కుమార్తె 2003 నాటికి ఇరవై ఒక్క ఏళ్ల యువతి! 2003లో ఒక మాధ్యమ ప్రతినిధులతో మాట్లాడిన ట్రంప్ ‘ఇవాంకా గొప్ప అందగత్తె...ఆమె నా కూతురు కాకపోయి వుంటే ఆమెతో నేను ‘ప్రణయ సమావేశం’-డేటింగ్-జరిపి ఉండేవాడిని...’’అని అన్నాడట! పశువులకు వావి వరసలు లేవు!! అధ్యక్ష పదవి పోటీనుంచి ట్రంప్ తప్పుకోవాలని అతగాడి పార్టీకి చెందిన ప్రముఖులు కోరుతున్నారు! అందుకే హిల్లరీ విజయ ప్రస్థానం ఇక నల్లేరుపై బండి నడక...