సంపాదకీయం

సమాన న్యాయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ముమ్మారు ‘తలాక్’ చెప్పడం ద్వారా ఇస్లాం మతానికి చెందిన పురుషుడు భార్యకు విడాకులివ్వడానికి వీలు కల్పిస్తున్న మత నిబంధన గురించి చర్చలు ముమ్మరవౌతున్నాయి! ఈ నిబంధనను మత వ్ఢ్యౌవాదులు సమర్ధించడం వెనుక పురుషాధిక్య భావ దురహంకారం తొంగిచూస్తోంది! ఈ నిబంధన కారణంగా అమాయకులైన వివాహిత మహిళలు బలవంతపు విడాకులకు గురై నిరాశ్రయులైపోతున్నారు. అలాంటి బాధిత మహిళలు కొందరు ఈ మత నిబంధనను తొలగించాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో ఈ సమస్యకు విపులమైన, విస్తృతమైన ప్రచారం లభిస్తోంది! ఈ నిబంధన వౌలిక మానవీయతకు, సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉందన్నది ఇస్లాం మతానికి చెందిన బాధిత మహిళలు సర్వోన్నత న్యాయస్థానానికి చేసిన నివేదన! ఈ నిబంధన సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది కనుక తుది తీర్పును అందరూ అంగీకరించవలసి ఉంది. ఈ త్రిపర్యాయంత తలాక్-ట్రిపుల్ తలాక్-నిబంధనపై దేశవ్యాప్తంగా మొదలైన చర్చ ఉమ్మడి పౌరస్మృతిపై మరోసారి మీమాంస మొదలు కావడానికి దోహదం చేయడం నడుస్తున్న ప్రక్రియ.. ‘తలాక్ తలాక్ తలాక్’ అని మూడుసార్లు ఉచ్చరించడం ద్వారా భర్త తన భార్యకు విడాకులు ఇవ్వడానికి వీలు కల్పిస్తున్న మత నిబంధన భారత రాజ్యాంగ వౌలిక స్ఫూ ర్తికి విరుద్ధమన్న వాదాన్ని ఇస్లాం మతానికి చెందిన మేధావులు, మత నిష్ఠాపరులు కూడ అంగీకరిస్తున్నారు. కానీ ఇస్లాం మతానికి ప్రాతినిధ్యం వహిస్తున్నట్టు చెప్పుకుంటున్న అనేకమంది మతగురువులు, సంస్థలు ఈ నిబంధన కొనసాగితీరాలని వాదిస్తుండడం విభేదాలకు ప్రాతిపదిక! బాధిత మహిళలు దాఖలు చేసిన న్యాయయాచికను విచారణకే స్వీకరించరాదని ఈ ప్రాతినిధ్య సంస్థలు మొదట వాదించాయి. కానీ సర్వోన్నత న్యాయస్థానం బాధిత మహిళల విజ్ఞాపనలను విచారణకు స్వీకరించడం సమాన న్యాయసాధనకు తొలి విజయం.. ఈ ట్రిపుల్ తలాక్ నిబంధన, బహు భార్యాత్వం-పాలిగమీ-రాజ్యాంగ స్ఫూర్తికి భంగకరమని కేంద్ర ప్రభుత్వం సుప్రీం కోర్టుకు నివేదించడం మరో విజయం...
అందరికీ సమానమైన న్యాయం-అన్న సూత్రాన్ని అందరూ వల్లెవేస్తున్నారు. ఈ సార్వజనిక సామాజిక న్యాయ సూత్రాన్ని ఎందరు చిత్తశుద్ధితో పాటిస్తున్నారు? అన్నది వేరే వ్యవహారం! కానీ అందరికీ ప్రాతినిధ్యం వహిస్తున్న, ప్రజలందరి సమష్టి స్వభావానికి రూపమైన రాజ్యాంగ వ్యవస్థ అయినా అందరికీ సమాన న్యాయం ప్రసాదించడానికి అనుగుణంగా ఉండాలి! మనదేశంలో ఈ సమాన న్యాయ వ్యవస్థ అనాదిగా ఉంది! కొందరు వ్యక్తులు, కొన్ని జన సముదాయాలు ఈ సమాన న్యాయ సూత్రానికి తప్పి ప్రవర్తించిన సందర్భాలు, ఘటనలు ఏర్పడి ఉండవచ్చు. కానీ వైవిధ్యాల సమన్వయ రూపమైన అద్వితీయ భారత జాతీయత ఈ దేశంలో అనాదిగా సమాన న్యాయసూత్రాన్ని ఆమోదించింది, అమలు జరిపింది. చరిత్ర నిరూపించిన సత్యమిది.. ఈ సమాన న్యాయ సూత్రాన్ని ఉల్లంఘించిన వ్యక్తులను, జన సముదాయాలను ఈ జాతి అపరాధులుగా మాత్రమే గుర్తించింది, అంతేకాని అలాంటి అపవాదులను, అపరాధులను ఆదర్శంగా స్వీకరించలేదు, వారిని ప్రోత్సహించలేదు.. సమాన న్యాయం అందరికీ జరగాలన్న సూత్రాన్ని సంప్రదాయాన్ని అంగీకరించని జాతులు-నేషన్స్, దేశాలు కూడా ప్రపంచంలో ఉన్నాయి. అసమానతలు నిహితమై ఉన్న రాజ్యాంగ వ్యవస్థలు కూడా పుట్టుకొచ్చాయి. ఇలాంటి జాతుల వల్ల, రాజ్యాంగ వ్యవస్థల వల్ల ఒక వర్గం మరొక వర్గాన్ని, ఒకదేశం మరో దేశాన్ని, ఒక జాతి ఇతర జాతులను అణగదొక్కిన,దోచుకున్న, దురాక్రమించిన విపరిణామ క్రమం ప్రపంచ చరిత్ర. కానీ క్రమంగా సమాన న్యాయం జరగాలన్న సూత్రాన్ని వివిధ దేశాలు అంగీకరించడం నడుస్తున్న చరిత్ర. ప్రజాస్వామ్యం పరిణతి చెందిన దేశాలలో సమాన న్యాయం రాజ్యాంగ వ్యవస్థలలో నిహితమై ఉంది. వివిధ రూపాలలో నియంతృత్వ వ్యవస్థలు కొనసాగుతున్న దేశాలలో ఈ సమాన న్యాయం ఇప్పటికీ లేదు. మత నియంతృత్వం, సైనిక నియంతృత్వం, వైయక్తిక నియంతృత్వం వంటివి కొన్ని ఉదాహరణలు! అందువల్ల మానవీయ సంస్కారాలకు అనాదిగా ఆలవాలమైన మన దేశపు జాతీయ స్వభావం సమాన న్యాయం! యుగయుగాల ఈ జాతీయ సమష్టి స్వభావానికి మరో ధ్రువీకరణ మన ప్రజాస్వామ్య రాజ్యాంగం! అందువల్ల సమాన న్యాయం ఈ దేశపు సమష్టి జాతీయ స్వభావం! అందరికీ సమాన న్యాయం సంతరించిపెట్టే వ్యవస్థను పరిరక్షించడానికి, పెంపొందించడానికి సమాన విధానాలు, చట్టాలు, ప్రక్రియలు అనివార్యం! వీటి సంఘటిత రూపమే ఉమ్మడి పౌర స్మృతి! కానీ సమాన న్యాయం పట్ల లేని అభ్యంతరం సమానమైన సాధక ప్రక్రియ పట్ల కొందరు ఎందుకని వ్యక్తం చే స్తున్నారు??
త్రిపర్యాయం తలాక్ బాధితులైన మహిళలు కోరుతున్న సమాన న్యాయం ప్రతీక మాత్రమే! ఇస్లాం మతానికి చెందిన కోట్లాది మహిళలకు పురుషులతో సమాన ప్రతిపత్తి, గౌరవం, అస్తిత్వం, అధికారం లభించడం లక్ష్యం! ఈ లక్ష్యం భారత రాజ్యాంగానికి అనుగుణమైనది! త్రిపుల్ తలాక్ మాత్రమే కాదు, పురుషుడు ఒకరి కంటే ఎక్కువమంది మహిళలను వివాహం చేసుకొనడానికి వీలు కల్పిస్తున్న మతనిబంధన కూడ వౌలిక మానవీయ సూత్రాలకు వి రుద్ధం. అందువల్లనే ఈ రెండు నిబంధనలను తొలగించాలని సుప్రీంకోర్టులో ప్రమాణప త్రం- అఫిడవిట్-దాఖలు చేసినట్టు కేంద్ర ప్రభుత్వం చెబుతోంది! ఈ ప్రమాణ పత్రాన్ని కేంద్ర ప్రభుత్వం తనంత తానుగా దాఖలు చేయలేదు, సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన తరువాత మాత్రమే కేంద్రం ఈ ప్రమాణ పత్రాన్ని దాఖలు చేసింది! రాజ్యాంగం రూపొందిన తరువాత దాదాపు ఏడు దశాబ్దులుగా కేంద్ర ప్రభుత్వ నిర్వాహకులు ఉమ్మడి పౌరస్మృతిని పట్టించుకోలేదు. ప్రజలందరికీ సమానమైన నేర విచారణ, నేర నిరోధక శాసన వ్యవస్థ ఉంది. అలాంటప్పుడు సమానమైన పౌర వ్యవహారాల చట్టాలు కూడా ఉండాలనడం న్యాయం మాత్రమే కాదు, హేతుబద్ధమైన ఆలోచన కూడా! రాజ్యాంగం రూపొందిన వెంటనే క్రీస్తు శకం 1950వ దశకంలోనే ఇలాంటి ఉమ్మడి పౌరస్మృతి కూడా రూపొంది ఉండాలి! అలా జరిగి ఉండినట్టయితే స్ర్తి, పురుషుల మధ్య, వివిధ మతాల సంప్రదాయాల ప్రజల మధ్య సమాన న్యాయం, సమాన అధికారం సిద్ధించి ఉండేది! అలా జరగలేదు.. ఎందుకు జరగలేదన్న విచికిత్స గత జల సేతు బంధనం కావచ్చు! కానీ అన్యాయ జలప్రవాహానికి ఇప్పుడైనా అడ్డుకట్ట వేయవలసిన బాధ్యత సక్రమ ఆలోచన బద్ధులైన ప్రతి ఒక్కరికీ ఉంది, సమాజ సమష్టి బాధ్యత ఇది! అందువల్ల ప్రజల ప్రతినిధి అయిన ప్రభుత్వం ఈ బాధ్యత నిర్వహణకు పూనుకోవాలి! సర్వోన్నత న్యాయస్థానంలో కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన ప్రమాణ పత్రం ఈ బాధ్యత నిర్వహణ దిశలో తొలి అడుగు మాత్రమే! అన్ని మతాలకు వర్తింపగల సమానమైన చట్టం రూపొందడం లక్ష్యం కావాలి!
ఈ లక్ష్యం రాజ్యాంగానికి అనుగుణం.. రాజ్యాంగంలోని నలబయి నాలుగవ అధికరణం ప్రకారం దేశవ్యాప్తంగా ప్రజలకు ఉమ్మడి పౌరస్మృతిని ప్రసాదించవలసిన బాధ్యత ప్రభుత్వానిది.. ఉమ్మడి పౌరస్మృతి రూపొందడం వల్ల సామాజిక వైవిధ్యాలకు భంగం కలుగుతుందని వాదిస్తున్నవారు రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకులు! భారతదేశం అనాదిగా వైవిధ్యాలకు నిలయం! సృష్టిలోనే అసంఖ్యాక వైవిధ్యాలు నెలకొని ఉన్నాయి. కానీ ఈ వైవిధ్యాల మధ్య సమన్వయం ఉంది! ఇది సృష్టి స్వభావం! సృష్టిగత వాస్తవాలను సమాజ స్థితంగా మలచుకున్న భరత జాతి కూడా వైవిధ్యాల మధ్య సమన్వయాన్ని సాధించింది! మత వైవిధ్యాలు, భాషా వైవిధ్యాలు ఇంకా అసంఖ్యాక వైవిధ్యాలు ఉన్నప్పటికీ అందరిదీ ఒకే జాతి.. ఇదీ భారతీయుల సమన్వయం!