సంపాదకీయం

నల్లడబ్బుపై బ్రహ్మాస్త్రం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు బ్రహ్మాస్త్రం ప్రయోగం జరిగింది. అన్ని అస్తశ్రస్త్రాలు ప్రయోగించిన తరువాత మాత్రమే బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించాలన్నది సంప్రదాయం! కేంద్ర ప్రభుత్వం పెద్ద కరెన్సీ నోట్లను రద్దు చేయడం ద్వారా ఇప్పుడీ సంప్రదాయాన్ని మరోసారి పాటించింది. దీపావళికి ముందు రోజున సామాజిక బీభత్సకారుడైన నరకాసురుడు కూలిపోవడం చరిత్ర.. ద్వాపర యుగంలో యదుకుల కృష్ణుడు కూల్చివేయడం చరిత్ర! దీపావళి తర్వాత ఇప్పుడు నల్లడబ్బు నరకాసురుడిని కూల్చివేయడానికి కేంద్ర ప్రభుత్వం ఉద్యమించింది. ఈ నరకాసురుడు ఆర్థిక బీభత్సకారుడు, దేశ ఆర్థిక వ్యవస్థ మూలాలకు చెదలు వంటివాడు! ప్రభుత్వం అనేక చికిత్సలను చేసింది. 2014 మే నెల 26న పరిపాలన బాధ్యతలను స్వీకరించిన తరువాత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ప్రభుత్వం తలపెట్టిన మొదటి కార్యక్రమం దేశ విదేశాలలోని నల్లడబ్బును పసికట్టడం కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించడం. అది ఆరంభం.. ఈ రెండేళ్లలో నల్లడబ్బును సంపూర్ణంగా నిర్మూలించడానికి, వెలికితీసి ప్రజాధనంగా మార్చడానికి కేం ద్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. ఈ చర్యల వల్ల పాక్షికంగా మాత్రమే నల్లడబ్బు బ యటపడడం కొంత నిరాశను కలిగించిన పరిణామం. అందువల్లనే మంగళవారం రాత్రి నల్లడబ్బు నరకాసురుడిపై కేంద్ర ప్రభుత్వం బ్రహ్మాస్త్రం ప్రయోగించింది! ఐదు వందల రూపాయలు, వెయ్యి రూపాయల కరెన్సీ నోట్లను రద్దు చేయడం ఈ బ్రహ్మాస్త్రం! అక్రమార్జన పరుల రహస్య స్థావరాలలో నిశ్చింతగా నక్కి ఉన్న నల్లడబ్బు కట్టలు బయటికి రాక తప్పదు, బ్యాంకులలో జమకాక తప్పదు! సక్రమంగా ఆర్జించిన వారికి ఈ నోట్ల రద్దువల్ల తాత్కాలికంగా అసౌకర్యం కలిగినప్పటికీ దీర్ఘకాల నష్టం లేదు... అక్రమంగా నల్లడబ్బును దాచినవారు దాన్ని బయటపెట్టక తప్పదు! గత మార్చినాటికి రిజర్వు బ్యాంకు వారు విడుదల చేసిన మొత్తం కరెన్సీ నోట్ల విలువలో ఐదు వందల, వెయ్యిరూపాయల నోట్ల విలువ ఎనబయి ఆరు శాతమట! మొత్తం పదహారు లక్షల కోట్ల రూపాయల విలువైన నోట్లు విడుదల కాగా, పదనాలుగు లక్షల కోట్ల రూపాయలు ఐదు వందల, వెయ్యి రూపాయల నోట్ల రూపంలోనే ఉన్నాయట! నల్లడబ్బు ప్రధానంగా ఐదు వందలు, వెయ్యి రూపాయల నోట్ల కట్టల రూపంలో నక్కి ఉంది కాబట్టి అవి బయటపడి బ్యాంకులలో జమ అయినట్టయితే ప్రభుత్వానికి జరిమానా రూపంలోను, పన్ను రూపంలోను మరింత ఆదాయం సమకూడుతుంది! నల్లడబ్బు నిర్మూలన వల్ల భౌతిక బీభత్సకాండను సాగిస్తున్న జిహాదీలకు తదితర ఉగ్రవాదులకు నిధులు అందడం కూడా ఆగిపోతుంది!
నల్లడబ్బు ఆర్థిక వ్యవస్థలో అనేక వికృతులను నిహితం చేసింది. స్థిరాస్తుల ధరలు భయంకరంగా పెరగడం, నగరాలలో పట్టణాలలో మధ్యతరగతి వారికి, నిరుపేదలకు గృహవసతి గగన కుసుమం కావడం వంటి వికృత పరిణామాలకు కారణం నల్లడబ్బు.. ద్రవ్యోల్బణాన్ని, ధరలను పెంచడానికి సైతం నల్లడబ్బు దోహదం చేసింది. అయితే వీటన్నింటికంటే మించిన వైపరీత్యం దేశ భద్రతకు నిరంతరం భంగపరుస్తున్న వారికి నల్లడబ్బు, నకిలీ డబ్బు సమకూడుతుండడం. ఐదువందల, వెయ్యి రూపాయల నోట్ల రూపంలో నకిలీ డబ్బు భారీగా చెలామణిలో ఉంది. ప్రభుత్వం ఈ పెద్దనోట్లను రద్దు చేయడం వల్ల నకిలీ డబ్బు మూలాలు తెగిపోయాయి! దేశమంతటా నకిలీ డబ్బు ముఠాలు పట్టుబడడం ఇటీవలి చరిత్ర. ఈ నకిలీ డబ్బు ప్రధానంగా పాకిస్తాన్‌లో ముద్రిస్తున్నారు. మనదేశంలోని జిహాదీ ఉగ్రవాదులను ఉసిగొల్పుతున్న పాకిస్తాన్ ప్రభుత్వం, వారికి అందచేయడానికై భారీగా భారతీయ కరెన్సీని తమ దేశంలో ముద్రిస్తోంది! సరిహద్దులు దాటి వస్తున్న ఈ నకిలీ కరెన్సీ నోట్లను బ్యాంకులు సైతం పసికట్టలేకపోవడం నడచిన కథ. బ్యాంకుల ఏటిఎమ్‌లలో నకిలీలు కనిపించడం అంతుపట్టని వ్యవహారం! నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న ముఠాలు వివిధ నగరాలలో పట్టుబడినప్పటికీ రహస్యంగా ఇప్పటికీ నకిలీ నోట్లను ముద్రించి చెలామణి చేస్తున్న ముఠాలు గ్రామీణ ప్రాంతాలకు సైతం విస్తరిస్తున్నాయి. మంగళవారం నాటి ప్రభుత్వ నిర్ణయం అందువల్ల నకిలీ నోట్ల ముఠాలపై పిడుగుపాటు...
నరేంద్ర మోదీ ప్రధానమంత్రిత్వంలోని ప్రభుత్వం గత రెండున్నర సంవత్సరాలుగా ఉగ్రవాదాన్ని తుదముట్టించడానికి చేపట్టిన చర్యలు విజయవంతవౌతున్నాయి. ఉగ్రవాదానికి ఒక రూపం భౌతిక బీభత్సకాండ. పాకిస్తాన్ ప్రేరిత జిహాదీలు, చైనా ఉసిగొల్పుతున్న మావోయిస్టులు ఈ భౌతిక బీభత్సకాండను కొనసాగిస్తున్నారు. ఉగ్రవాదానికి మరో రూపం ఆర్థిక బీభత్సకాండ. నోట్లను కల్తీ చేస్తున్న వారు ఈ ఆర్థిక ఉగ్రవాదులు. ఈ ఆర్థిక ఉగ్రవాదుల ఆట కట్టించడానికి వీలుగా 2015 మే నెలలో ప్ర భుత్వం నల్లడబ్బు నిరోధక చట్టాన్ని సరికొత్తగా రూపొందించింది. అప్రకటిత విదేశీయ ఆ దాయం, ఆస్తులు-పన్నుల విధింపు-చట్టం ప్రకారం చేపట్టిన చర్యలు విజయవంతవౌతున్నాయి. గత ఏప్రిల్‌లో ప్రత్యేక పరిశోధక ఒప్పందాన్ని-స్పెషల్ ఇనె్సస్టిగేషన్ ఏజెన్సీ-ని కూడా ప్రభుత్వం నియమించింది! నల్లడబ్బు నిల్వలకు సురక్షిత కేంద్రాలుగా మారిన దేశాలకు అక్రమార్జనను తరలించినవారి ఆచూకీ కనుగొనడానికి ఈ ఏజెన్సీ ఏర్పడి ఉంది! గత సెప్టెంబర్‌లో ముగిసిన నల్లడబ్బు వెల్లడి పథకం కింద అరవై ఐదు వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం రాబట్టగలిగింది. ఈ నల్లడబ్బుపై ముప్పయి వేల కోట్ల రూపాయలు పన్ను రూపంలో వసూలు చేయగలిగింది! కానీ ఈ చర్యలన్నీ పాక్షికంగా మాత్రమే విజయవంతమయ్యాయి! లక్షల కోట్ల రూపాయల నల్లడబ్బు దేశ విదేశాలలో నిక్షిప్తమై ఉన్నట్టు జరిగిన ప్రచారానికి బయటపడుతున్న వేలకోట్ల రూపాయలకు మధ్య పొంతన కుదరడం లేదు! అందువల్ల మంగళవారం రాత్రి ఈ విప్లవాత్మక నిర్ణయాన్ని బహుశా ప్రకటించింది! దేశ ప్రజలలో అత్యధికులు హర్షం ప్రకటిస్తున్నారు... ఈ నిర్ణయం వల్ల నల్లడబ్బు దాచిన వారు మాత్రమే విస్మయానికి గురి అవుతున్నారు. పాతనోట్లు రద్దు చేసిన వెంటనే ప్రభుత్వం కొత్త నోట్లను ప్రవేశపెట్టడం ఎందుకన్నదే సమాధానం లేని ప్రశ్న! కొన్నాళ్లు ఆగిన తరువాత ఈ కొత్తనోట్లను ప్రవేశపెట్టవచ్చు! ఏమయినప్పటికీ ప్రజలలో ప్రధానంగా అధికాదాయ వర్గాలలో నైతికత పెరగకపోయినట్టయితే నల్లడబ్బు మహిషాసురుడు విజృంభిస్తునే ఉంటాడు.గతంలో 1978లో మొరార్జీదేశాయ్ ప్రధానిగా ఉన్నప్పుడు ప్రభుత్వం వెయ్యి రూపాయల నోట్లను, ఐదువేల రూపాయల నోట్లను, పదివేల రూపాయల నోట్లను రద్దు చేసింది! నల్లడబ్బు పుట్టలు పెరగడం ఆగలేదు..
అందువల్ల నల్లడబ్బుపై నిరంతర సమరం అనివార్యం అవుతోంది! 2014లో ఆస్ట్రేలియాలో జరిగిన ప్రముఖ దేశాల సమావేశం-జి20 సదస్సులో నరేంద్ర మోదీ నల్లడబ్బును వెలికి తీయడానికి అంతర్జాతీయ సహకారం గురించి ప్రస్తావించారు. అప్పటినుంచి అనేక అంతర్జాతీయ సమావేశాలలో నల్లడబ్బు ప్రమాదాలను మోదీ వివరించారు. అక్రమధనం, ఉగ్రవాదం ఒకే ప్రమాదానికి రెండు ముఖాలు...