సంపాదకీయం

చౌకగా భూసేకరణ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రపంచీకరణ వల్ల ఏర్పడిన ప్రధాన వైపరీత్యం భూ మిని వాణిజ్య ‘హిరణ్యాక్షులు’ కాజేస్తుండడం. ఇలా కాజేయడం తెలుగు రాష్ట్రాల్లో గత రెండేళ్లుగా మరీ మితిమీరిపోయింది. ఉన్నత న్యాయస్థానం వారు భూమి సేకరణను నియంత్రించడానికి, అక్రమంగా సేకరించే ప్రక్రియను నిరోధించడానికి పదే పదే జోక్యం చేసుకోవలసి వస్తుండడం ఇందుకు నిదర్శనం. న్యాయ నియంత్రణ పెరుగుతున్న కొద్దీ అతిక్రమిస్తున్న ‘హిరణ్యాక్ష స్ఫూర్తి’ కూడా విస్తరించిపోతోంది. ‘సేకరణ’ ప్రహసనంలో భాగంగా భూమిని కోల్పోతున్న వ్యవసాయ జీవనులకు ప్రభుత్వం, పారిశ్రామికవేత్తలు ఇస్తున్న పరిహారం ఎంత? అన్నది సోమ,మంగళ వారాల్లో హైదరాబాద్ ఉన్నత న్యా యస్థానం తెలంగాణ ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్న! పాలమూరు జిల్లాలో సేకరిస్తున్న భూములకు తగినంత పరిహారం చెల్లించడం లేదని ఆరోపిస్తూ మాజీ ఎమ్మెల్యే ఎం.కోదండరెడ్డి దాఖలు చేసిన ప్రజాప్రయోజన న్యాయయాచిక- పబ్లిక్ ఇంటరెస్ట్ లిటిగేషన్- పి ల్‌ను విచారిస్తున్న ఉ న్నత న్యాయస్థాన ధర్మాసనం వారు ఈ ప్రశ్నను సంధించారట. తెలంగా ణ ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంది! ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మా త్రమే కాదు, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ భూ మి సేకరణ వివాదాగ్రస్తమైపోయింది. వివాదాలు మరింత ఉద్ధృతమయ్యే సూచనలు స్పష్టమవుతున్నాయి. ప్రధానంగా హె దరాబాద్ శివారు ప్రాం తాల్లోని ప్రభుత్వ భూ మి, ప్రజల భూమి ‘బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు’- మల్టీ నేషనల్ కంపెనీస్‌కు దత్తమైపోతుండడం ప్రచారం కాని మహా విషయం. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణం కోసం సేకరించిన దాదాపు ముప్ఫయి మూడు వేల ఎకరాలలో అధిక భాగం ‘బహుళ జాతీయ వాణిజ్య’ సంస్థలకు ‘అభివృద్ధి’ పేర కట్టబెట్టడం ఖాయమన్నది బహిరంగ రహస్యం. వ్యవసాయ భూములను పారిశ్రామిక వాటికలుగా మార్చుతున్న ప్రభుత్వాల విధానాల పట్ల హరిత నియమ పరిరక్షణ న్యాయమండలి- గ్రీన్ ట్రిబ్యునల్ కూడా పదే పదే అభ్యంతరాలను తెలియచేస్తోంది! అధికాధిక ప్రజలు ఈ ‘్భమి సేకరణ’లను, ‘్భమి సమీకరణ’లను వ్యతిరేస్తున్నప్పటికీ జనం ఎన్నుకున్న ప్రభుత్వాలు మాత్రం పట్టించుకోవడం లేదు! ఈ ‘వ్యతిరేకత’ను ఉపయోగించుకుంటున్న ప్రతిపక్షాల వారు వ్యవసాయ ప్రగతికి దోహదం చేయగల జలాశయాల నిర్మాణం కోసం భూమిని సేకరించడాన్ని సైతం వ్యతిరేకిస్తున్నారు. ఇది మరో వైపరీత్యం. ఇందుకు ప్రధాన కారణం విచరక్షణారహితంగా వివిధ రాష్ట్రాల ప్రభుత్వాలు ‘బహుళ జాతీయ’ భూమి దొంగలకు కొమ్ముకాస్తుండడమే! అపుడెప్పుడో త్రేతాయుగంలో హిరణ్యాక్షుడన్న రాక్షసుడు మొత్తం భూమిని కాజేశాడట! మహావిష్ణువు ఆ దానవుని ‘కబ్జా’నుండి భూమాతను విడిపించాడట! ప్రభుత్వం విష్ణు స్వరూపమన్నది భారతీయుల విశ్వాసం! ప్రస్తుతం ప్రభుత్వాలు భూమిని ‘బహుళ జాతీయ సంస్థలు’ కాజేయడానికి దోహదం చేస్తున్నాయి. ఇదీ అంతరంగం..
తెలంగాణ ప్రభుత్వం ఆరంభించిన ‘హరితహారం’, ‘కాకతీయ మిషన్’ వంటి పథకాలు భూమి పరిరక్షణకు దోహదం చేస్తున్నాయి. చెట్లు పెరగడం వల్ల, చెఱువులు నిండడం వల్ల భూమికి బలం పెరుగుతుంది, వ్యవసాయం విస్తరిస్తుంది. భారతదేశపు విత్తనాల భాండాగారంగా తెలంగాణను తీర్చిదిద్దనున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించి రెండేళ్లు దాటిపోయింది. విత్తనాలను విదేశీయ బహుళ జాతీయ వాణిజ్య సంస్థల నుండి కొంటున్న రైతులు సంతోషించారు. విత్తనాల భాండాగారంగా తెలంగాణ రూపొందినట్టయితే ఇక్కడి రైతులు విదేశాలకు సైతం విత్తనాలను ఎగుమతి చేయవచ్చు. మన దేశపు ఎగుమతులు పెరిగి విదేశీయ వాణిజ్యంలో ఏర్పడిన ‘లోటు’ తగ్గడానికి వీలు కలుగుతుంది! ఇన్ని అదర్శాలను వల్లెవేసిన తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ చుట్టు పక్కల గల భూములను బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు కట్టబెట్టే కార్యక్రమాన్ని ఆపడం లేదు. హైదరాబాద్ శివారుల్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ హయాంలో ‘ప్రత్యేక ఆర్థిక మండలి’- స్పెషల్ ఎకనామిక్ జోన్- సెజ్- వ్యవస్థ పేరుతో ప్రభుత్వేతర సంస్థలకు కేటాయిచిన పనె్నండు వేల ఎకరాల భూమి నిరుపయోగంగా పడి ఉందని గత ఏడాది ఆగస్టులో ప్రచారమైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటుందని కూడా ప్రచారమైంది! స్వాధీనం చేసుకుందా? చేసుకొని ఉంటే ఈ పనె్నండు వేల ఎకరాలను దేనికి వినియోగిస్తున్నారు? హరిత శాఖలు పెంచడానికా? కాలుష్య పరిశ్రమలను కేంద్రీకరించడానికా?
మహబూబ్‌నగర్ జి ల్లాలో రాష్ట్ర ప్రభుత్వం సేకరిస్తున్న భూమికి ప్రతిఫలంగా భూమిని కోల్పోతున్న వారికి లభిస్తున్న పరిహారం ఎం త అన్నది తేలలేదు. 1894లో బ్రి టన్ ప్రభు త్వం రూపొందించిన భూమి సేకరణ చట్టం కాలదోషం పట్టిందని, ఆ చట్టం ప్రజా వ్యతిరేకమని సర్వోన్నత న్యాయస్థానం పదే పదే స్పష్టం చేసిన తరువాత 2013లో పార్లమెంటు కొత్త భూసేకరణ చట్టాన్ని రూపొందించింది. ఈ కొత్త చట్టం ప్రకారం భూమి విలువను సమీక్షించి కొత్తవిలువను నిర్థారించవలసి ఉంది. ఈ సమీక్ష జరగకుండానే, భూమి విలువను పెంచకుండానే పాలమూరు జిల్లాలో ప్రభుత్వం చేపట్టిన భూసేకరణను హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి ఎ.శంకర నారాయణ తప్పుపట్టారు. చట్ట ప్రకారం సమీక్షా ప్రక్రియను చేపట్టకుండానే భూమిని సేకరించడానికి పూనుకొనడం పట్ల ఉన్నత న్యాయస్థానం అభ్యంతరం వ్యక్తం చేసింది! 1899లో బ్రిటన్‌వారు రూపొందించిన ‘్భరతీయ భూమి విలువ చట్టం’ ఇండియన్ స్టాంప్ యాక్ట్- ప్రకారం భూమి విలువను ప్రతి రెండేళ్లకొకసారి సమీక్షించాలన్నది నిబంధన. వ్యవసాయ భూమికి వర్తించే నిబంధన ఇది. పట్టణ, నగర ప్రాంతాలలోని ‘స్థిరాస్తి’ భూమి విలువను ప్రతి సంవత్సరం సమీక్షించాలన్నది నిబంధన. దేశంలోని ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ నిబంధనలను పాటిస్తున్న దాఖలా లేదు. 2013లో రూపొందిన భూసేకరణ చట్టం ప్రకారం ఒక గ్రామంలో భూమి సేకరణ చేయడానికి ముందుగా ఆ సేకరణను ఆమోదిస్తూ గ్రామసభ తీర్మానించాలి! గ్రామసభలు అసలు జరుగుతున్నాయా? ప్రభుత్వేతర వాణిజ్య సంస్థల కోసం వ్యవసాయ భూమిని సేకరించినట్టయితే కనీసం ఎనభై శాతం భూమి యజమానులు అందుకు అంగీకరించాలి! ప్రభుత్వ కార్యకలాపాల కోసం సేకరణ జరిగితే కనీసం డెబ్భైశాతం యజమానులు అంగీకరించాలి! దేశంలోని ఇతర రాష్ట్రాల వలెనే తెలుగు రాష్ట్రాల్లో సైతం ఈ నిబంధనలు నీరుకారిపోతున్నాయి..
రహదారుల విస్తరణ కార్యక్రమం కోసం భూమిని సేకరించడంలో తెలంగాణ ప్రభుత్వం వెనుకబడి ఉందని కేంద్ర ప్రభుత్వం నిర్థారించడం సమాంతర పరిణామం. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావుతో కేంద్ర ఉపరితల రవాణా మంత్రి నితిన్ గడ్కారీ ఈ సంగతి చెప్పాడట! కేంద్ర ప్రభుత్వం హరిత పథాలను-గ్రీన్ హైవేస్‌ను కూడా నిర్మిస్తోంది! కానీ వీటివల్ల జనాలకు కలుగుతున్న ‘లాభం’ ప్రభుత్వేతర సంస్థలకు భారీగా ‘ప్రయాణ సుంకం’- ‘టోల్‌టాక్స్’ చెల్లించడం!