సంపాదకీయం

మృతులపై పగ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాకిస్తాన్ సైనికదళాలు పురికొల్పిన జిహాదీ ఉగ్రవాదులు జమ్మూ కాశ్మీర్‌లో మన సైనికుడి మృతదేహాన్ని చిత్రవధ చేయడం విచిత్రం కాదు.. మానవులపై నిష్కారణంగా, నిష్కరుణగా కసి తీర్చుకోవడం జిహాదీల స్వభావం. ఈ పైశాచిక వికృతి శతాబ్దులుగా ఇస్లామేతర మతాల వారిని హత్య చేస్తోంది. అబలలపై అత్యాచారాలను జరుపుతోంది! సైనికుడు శత్రు సైనికులను వధించడం సహజం. కానీ, మృతుడైన శత్రువు భౌతికకాయంపై సైతం కసి తీర్చుకోవడం మానవత్వం కాదు! ఈ మానవత్వపు విలువలు ‘జిహాదీ’లకు తెలియవు. ఇస్లాం మతం పుట్టిన నాటి నుండి ‘జిహాదీ’లు పుట్టుకొచ్చారు. అనేక శతాబ్దులుగా ‘జిహాదీ’లు మానవాళిపై కసి తీర్చుకుంటున్నారు. జిహాదీలు కూడా మానవులే కదా. అందువల్ల మానవులపై కసి తీర్చుకోవడం ఎందుకు అన్నది ప్రశ్న. ఈ ప్రశ్నకు శతాబ్దులుగా ‘జిహాదీ’ల సమాధానం చెబుతున్నారు. తాము మానవులు కాదన్నది, మానవరూపంలోని మతోన్మాదులం మాత్రమేనన్నది ఈ సమాధానం! ఈ మతోన్మాదం ఇస్లాం మతేతరుల పట్ల రాక్షస విద్వేషంగా మారింది, జిహాదీలలో పైశాచిక ప్రవృత్తిని పెంచింది.. ఇస్లాం మతం తప్ప అవనీతలంలో మరో మతం ఉండకూడదన్నది ‘జిహాదీ’ల విశ్వాసం, సిద్ధాంతం, లక్ష్యం! ఈ లక్ష్యసాధన కోసం జిహాదీలు క్రీస్తుశకం 712వ సంవత్సరం నుంచి దాడులు చేస్తూనే ఉన్నారు. వివిధ మతాల సమాహారమైన, సర్వమత సమభావ స్వరూపమైన, సర్వ వైవిధ్య పరిరక్షక ప్రవృత్తి చిత్తవృత్తి అయిన ఈ దేశపు అనాది జాతీయతను ‘జిహాదీ’లు అప్పటి నుంచి ఇప్పటి వరకు అతి తీవ్ర శత్రువుగా భావిస్తున్నారు. ఈ దేశపు అనాది జాతీయత సనాతన సం స్కృతి, హిందుత్వం, భారతీయత.. అందువల్ల వైవిధ్య విధ్వంసకులైన ‘జిహాదీ’ మూకలకు- వైవిధ్యవంతమైన, వైవిధ్య మతాలను పరిరక్షించి పరిపోషిస్తున్న హిందుత్వం లేదా భారతీయత ఇలా శత్రువైంది. శతాబ్దుల చరిత్ర ఇది. మహమ్మద్ బిన్ వాసిమ్ 712 సంవత్సరంలో మొదలెట్టిన ఈ ‘జిహాదీ’ ద్వారా 1947లో మహమ్మద్ అలీ జిన్నా అఖండ భారతదేశాన్ని ముక్కలు చేశాడు! అప్పటి నుంచి ఇప్పటి వరకు పాకిస్తాన్ మన దేశానికి వ్యతిరేకంగా ‘జిహాదీ’ సాగిస్తోంది, ఏకమత రాజ్యాంగ వ్యవస్థగా మారిన పాకిస్తాన్ బహుళ మత సంపుటమైన భారత్‌పై కసి తీర్చుకొంటోంది, పగ తీర్చుకొంటోంది. పగ తీర్చుకోడానికి ప్రాతిపదిక ప్రతీకారం కాదు, ప్రతిచర్య కాదు, ప్రతిస్పందన కాదు, ప్రతిక్రియ కాదు.. ఈ పగ కేవలం స్వాభావికం, ‘వెలుగు’పై పగ తీర్చుకొనడానికి ‘చీకటి’ నిరంతరం దాడి చేస్తోంది. చీకటి గెలవదు, కానీ పగ తీర్చుకొనడానికి ప్రయత్నం మానదు! పాకిస్తాన్ చీకటి.. మన దేశం, అవశేష భారత దేశం వెలుగు...
మృతదేహాలను చిత్రవధ చేయడం భారతీయులకు తెలియని విద్య. ‘జిహాదీ’లకు పెట్టిన వికృతి. సైనికులు శత్రుసైనికులను మాత్రమే యుద్ధంలో వధించడం భారతీయుల చరిత్ర. భారతీయ సైనికులు నిరాయుధులైన ప్రజలను హత్య చేయలేదు. శత్రు సైనికులను సైతం దొంగచాటుగా హత్య చేయకపోవడం భారతీయ సైనిక ప్రవృత్తి! అందువల్లనే జమ్మూ కాశ్మీర్‌లోని ‘అధీన రేఖ’- లైన్ ఆఫ్ కంట్రోల్-ఎల్‌ఓసి- వద్ద పాకిస్తాన్ సైనికులు మన జనావాసాలపై కాల్పులు జరుపుతున్నప్పటికీ, నిరాయుధ ప్రజలను వధిస్తున్నప్పటికీ మన సైనికులు మాత్రం నిరాయుధ ప్రజలపై కాల్పులు జరపడం లేదు. పాకిస్తాన్ సైనికులపై సైతం దొంగచాటు కాల్పులు జరపడం లేదు. కాల్పులకు పాల్పడిన పాకిస్తానీ సైనికుల- రేంజర్ల-పై మన సైనికులు బహిరంగంగా ఎదురుకాల్పులు జరుపుతున్నారు. మృతదేహాలు శత్రు సైనికులవి అయినప్పటికీ భారతీయ సైనికులు వాటిని ముక్కలుగా చెక్కలుగా నరకడం లేదు.. ‘మరణాంతాని వైరాణి’- మరణించే వరకు మాత్రమే వైరం- అన్నది మన సంస్కారం. మరణించిన వారిపై విరోధం సాధించడం మన నీతి కాదు. దుర్మార్గుడైన రావణుని వధించిన రఘురాముడు, దుర్మార్గుడైన నరక దానవుణ్ని వధించిన యదుకుల కృష్ణుడు వారి భౌతికదేహాలకు సగౌరవంగా తుది సంస్కారాన్ని జరిపించారు. అధునిక సమాజంలో కూడా యుద్ధమృతుల పార్ధివ దేహాలను బంధువులకు అప్పగించాలన్నది ‘ఐక్యరాజ్య సమితి’ నిర్దేశిస్తున్న నియమావళి. ఈ నియమావళిని ‘జిహాదీ’లు పాటించడం లేదు, పాకిస్తాన్ సైనికులు పాటించడం లేదు..
మన సైనికుల మృతదేహాలను ముక్కలు చేసి పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘జిహాదీ’లు పైశాచిక ఆనందం పొందుతున్నారు. ఈ నెల 22వ తేదీన ముగ్గురు మన సైనికులను దొంగచాటుగా చంపిన పాకిస్తాన్ ముష్కరులు ఒక సైనికుడి మృతదేహం నుంచి తలను ఖండించడం ఈ పైశాచిక ‘జిహాదీ’ కృత్యానికి సరికొత్త ఉదాహరణ. చరిత్రలో ఇలాంటి అసంఖ్యాక ఉదాహరణలను ‘జిహాదీ’లు నిలబెట్టగలిగారు! దేశ విభజన సమయంలో, 1947లో వేలాది హిందువులను పాకిస్తాన్‌లో ఊచకోత కోసిన ‘జిహాదీ’ దుండగులు వందలాది మృతదేహాలను ముక్కలుగా నరకడాన్ని చరిత్ర విస్మయ ధ్వనులతో వీక్షించింది! పిశాచాలకు చంపడం స్వ భావం, చిత్రవధ చే యడం వినోదం.. ఇ లాంటి చిత్రవధలకు పాల్పడుతున్న పాకిస్తాన్ ప్రభుత్వ నిర్వాహకులను యుద్ధ నేరస్థులుగా ప్రకటింప చేయడానికి ఐక్యరాజ్య సమితి వేదికపై ప్రయత్నించక పోవడం మన విదేశాంగ విధాన వైఫల్యం. దశాబ్దులుగా ఈ వైఫల్యం కొనసాగుతూనే ఉంది. ఇలా మన సైనికుడిని చిత్రవధ చేసినందుకు ప్రతిక్రియగా 23వ తేదీన మన భద్రతాదళాల వారు పాకిస్తానీ సైనిక స్థావరాలపై దాడులు చేయడం హర్షణీయ పరిణామం. కానీ, 2014 మే 26వ తేదీకి పూర్వం పాకిస్తానీలు జరిపిన ఇలాంటి చిత్రవధలకు మన ప్రభుత్వం కేవలం ‘నిరసనలు’ తెలిపింది. అందువల్ల పాకిస్తానీ సైనికులు, పాకిస్తాన్ ప్రభుత్వ ప్రేరిత ‘జిహాదీ’ బీభత్సకారులు మన సైనికులను చిత్రవధ చేయడం ఆపలేదు. ‘శామ్యేత్ ప్రతి అపకారేణ న ఉపకారేణ దుర్జనం’. దుర్జనుడు ఉపకారాల వల్ల అణగిపోడు, ప్రతిగా అపకారం పొందినపుడు మాత్రమే వాడు అణగిపోతాడు. తోక ముడుస్తాడు- అన్నది మహాకవి చెప్పినమాట! ఈ సూత్రాన్ని ఇప్పుడైనా మన ప్రభుత్వం పాటిస్తోంది!
అక్టోబర్ 29న పాకిస్తానీ ప్రచ్ఛన్న బీభత్సకారులైన ‘రేంజర్లు’ మన సైనికుణ్ని చంపి పార్ధివ దేహాన్ని చిత్రవధ చేశారు. 2013 జనవరిలో ఇద్దరు మన సైనికుల మృతదేహాలను ఖండఖండాలుగా నరికిన పాకిస్తానీ రేంజర్లు ఒక సైనికుడి తలను నరికి మోసుకొని పోయి ‘విజయచిహ్నం’గా వీధులలో ఊరేగించారు. 2011 జనవరిలో కూడా ఇద్దరు మన సైనికుల భౌతికకాయాలను ముక్కలు చేసి పోయారు! మన ప్రభుత్వం ఇప్పుడైనా పాకిస్తాన్ చేస్తున్న ఈ యుద్ధనేరాన్ని ఐక్యరాజ్య సమితికి నివేదించాలి. పాకిస్తాన్ ప్రభుత్వాన్ని బీభత్స వ్యవస్థ- టెర్రరిస్టరిజమ్-గా ప్రకటింపచేయడానికి ప్రయత్నించాలి.