సంపాదకీయం

గంజాయి ‘సేద్యం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గంజాయి మొక్కలను సాగు చేయడం నేరమని తెలియని రైతులు కూడా దేశంలో ఉన్నారన్నది దిగ్భ్రాంతిని కలిగిస్తున్న సమాచారం. ‘మా ఊళ్లో అందరూ ఈ మొక్కలను పెంచుతున్నారు. కిలో గంజాయి ఆకులకు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల రూపాయల వరకు గిట్టుబాటు అవుతోంది! అందరూ ఇలా పెంచి లాభాలు ఆర్జిస్తున్నారు. మేమెందుకు సాగు చేయరాదు?’ అన్న ధ్యాస మాత్రం గ్రామీణ ప్రాంతాల్లో పెరుగుతోంది! గంజాయి మాదక పదార్ధం అన్న ధ్యాస మాత్రం లేదు! పెంచడం తప్పని తెలిసినప్పటికీ పత్తి పొలాలలోను, ఇతర పొలాలలోను ‘మిశ్రమం’ పంటగా గంజాయిని పెంచుతున్న రైతులు ఉన్నారు. ఎటొచ్చి నేరం అని తెలిసి గంజాయిని సాగు చేస్తున్నవారు చట్టాల నుంచి, అధికారుల దాడుల నుంచి తప్పించుకుంటున్నారు. అందరితోపాటు మనం కూడ సాగు చేద్దామని అమాయకంగా పూనుకున్న వారు మాత్రం పట్టుబడిపోతున్నారట! ఎందుకంటే ఏళ్ల తరబడి గంజాయిని పండించి అమ్ముకుంటున్న వారికి దళారీల అండదండలున్నాయి. ‘అనుసంధానం’ ద్వారా ఇలాంటి రాటుదేలిన రైతులకు అధికారులు దా డులు చేస్తారని ముందుగానే తెలిసిపోతోంది. అందువల్ల దా డులు జరుగనున్నాయన్న ‘ఉప్పు’ అందగానే ఈ రాటుదేలిన రైతులు తమ గంజాయిని రహస్య స్థలాలకు తరలించి వేస్తున్నారట! ‘ఉప్పు’ అందిస్తున్న ది గంజాయిని తెలుగు ప్రాంతాల నుంచి ముంబయి సహా ఇతర నగరాలకు, విదేశాలకు సరఫరా చేస్తున్న నేరస్థుల ముఠాలు! రంగారెడ్డి జిల్లాలోని ఒక గంజాయి గ్రామంలో ఇటీవల అధికారులు దాడి చేసినప్పుడు కేవలం ఇరవై కిలోల గంజాయి ఆకులు పట్టుబడ్డాయట! పది పదిహేను ఎకరాలలో పత్తి మొక్కల మాటున గంజాయిని పెంచిన వారు తప్పించుకున్నారు. ఈ ఏడాది మాత్రమే దళారుల మాట విని రెండెకరాలలో గంజాయిని పెంచిన ఒక రైతు దొరికిపోయాడట! విత్తనాలు సరఫరా చేసిన ‘దళారీ’ ఒకడు ‘పంట’ రాగానే మొత్తం గంజాయిని కొనుగోలు చేస్తానని వాగ్దానం చేసి పోయాడట! దళారీ వచ్చి కొనుగోలు చేస్తాడన్న నమ్మకంతో గంజాయిని తన వద్ద ఉంచుకున్న ఆ రైతు అధికారులకు దొరికిపోయాడు. తెలియక చేసినప్పటికీ, తెలిసి చేసినప్పటికీ అవగాహన లేమితో ఆర్థిక వ్యామోహంతో చేసినప్పటికీ గంజాయి పెంపకం నేరమన్నది ఆ పట్టుబడిన రైతులకు తెలిసి వచ్చింది. పట్టుబడని ‘ఘరానా’లకు నిరంతరం ‘ఉప్పు’ ఎలా అందుతోంది? అధికారులు దాడులు చేయనున్నారన్న సమాచారం దళారీలకు, వారి నుండి ‘రైతుల’కు ఎలా పొక్కుతోంది? అరవై ఐదు క్వింటాళ్ల గంజాయి వికారాబాద్ రైల్వే కూడలి నుంచి ముంబయికి వెడుతూ అధికారులకు పట్టుబడిందట! పట్టుబడని గంజాయి ఎన్ని టన్నులన్నది ఎప్పటికీ తేలదు!
గంజాయి, నల్లమందు వంటివి మాత్రమే మన దేశంలో ఉత్పత్తి అవుతున్న మాదకాలు! కానీ మన దేశం అంతర్జాతీయ ‘మాదక’ విపణిగా మారిపోయి ఉండడం వాణిజ్య ప్రపంచీకరణ వ్యవస్థీకృతం అయినందువల్ల జరిగిన సమాంతర పరిణామం! అంతర్జాతీయ విమానాశ్రయాలు పెరుగుతున్న కొద్దీ ‘మాదకం’ ముఠాల సంఖ్య పెరుగుతోంది. మన దేశంలో నిరంతరం పట్టుబడుతున్న మాదక పదార్ధాల విలువ వేల కోట్ల రూపాయలు. ఈ ‘మాదకాలు’ విదేశాల నుంచి వస్తున్నాయి. మళ్లీ విదేశాలకు తరలిపోతున్నాయి. మనదేశం ఇలా మాదక పదార్ధాల సరఫరాకు కూడలిగా మారిపోయి ఉండడం అంతర్జాతీయ వాణిజ్య అనుసంధానం వల్ల సంభవించిన వైపరీత్యాలలో ఒకటి మాత్రమే! రకరకాల విదేశీయమైన పేర్లతో ఈ మాదక పదార్ధాలు ఉత్పత్తి అవుతున్నాయి. కొన్ని పారిశ్రామిక ఉత్పత్తులు మరికొన్ని వ్యవసాయ ఉత్పత్తులు. నవంబర్ నెలలో రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఇరవై మూడున్నర టన్నుల ‘మాండ్రక్స్’ మాదక మాత్రలు పట్టుబడ్డాయి. ఈ పట్టుబడిన ‘మాండ్రక్స్’ విలువ దాదాపు మూడువేల కోట్ల రూపాయలని అధికారికంగా ధ్రువపడింది! ఈ ‘మాండ్రక్స్’ను ధూమపానం రూపంలో సేవించిన వారు మత్తెక్కిపోతారట! మోతాదు మించి తాగినట్టయితే స్పృహ తప్పిపోవడం, మరణించడం వంటి వైపరీత్యాలు సంభవిస్తాయట! ఈ ‘మాదకం’ వ్యాపారంలో ముంబయి చలనచిత్ర పరిశ్రమకు చెందిన ‘ఘరానా’లకు భాగస్వామ్యం ఉండడం ప్రమాదకరమైన పరిణామం. ఒక చలనచిత్ర నిర్మాతను కేంద్ర ప్రభుత్వపు వాణిజ్య సుంకాల, ఎగుమతి దిగుమతుల సుంకాల విభాగం వారు నిర్బంధించారట కూడా!
మనదేశంలో ఈ ‘మాండ్రక్స్’ను పీల్చి ఆనందం పొందేవారు చాలా తక్కువ మంది! ఆఫ్రికాలోను, మన దేశం వెలుపలి ఆసియాలోను దీన్ని మానసిక ఆనంద ప్రవర్ధకంగా తాగుతున్నారట! మన దేశంలో పెద్దగా ఉపయోగం లేని ఈ మాదకాన్ని మనదేశం గుండా వివిధ దేశాలకు తరలిస్తున్నారు. మ న దేశం ఇలా మాదక వ్యాపారానికి కూడలి కా వడం మన భద్రతా కుడ్యంలోని భయంకరమైన రంధ్రం. మన ‘నిఘా’ వ్యవస్థ ఇలాంటి మాదకాలను ఎప్పటికప్పుడు పసికడుతూ ఉం డవచ్చు! కానీ ‘నిఘా‘ కన్నుకప్పి మాదక పదార్థాలను మన దేశంలోకి, మన దేశం నుండి బయటికి సులభంగా తరలించవచ్చునన్న ధీమా అంతర్జాతీయ అక్రమ వాణిజ్య బృందాలకు ఏర్పడి ఉండడం ప్రపంచీకరణ విష ఫలితం, ‘స్వేచ్ఛా వాణిజ్య’ వ్యవస్థ-మార్కెట్ ఎకానమీ-వల్ల విదేశీయ నేరస్థులకు లభిస్తున్న అవకాశం. ఈ ఆర్థిక బీభత్సం భౌతిక ఉగ్రవాదంతో అనుసంధానమై ఉండడం అంతర్జాతీయ వాస్తవం! ఈ అనుసంధానాన్ని పాకిస్తాన్ ప్రభుత్వ విభాగమైన ఇంటర్ సర్వీసెస్ ఇంటిలిజెన్స్-ఐఎస్‌ఐ-వారు ఏర్పాటుచేశారు. సోమాలియా దేశం సముద్రతీరంలో స్థావరాలు ఏర్పరుచుకున్న ఓడ దొంగలకూ, యెమెన్ దేశంలో స్థిరపడి ఉన్న అఫ్ఘానిస్తాన్ అల్ ఖాయిదా, తాలిబన్ జిహాదీ ఉగ్రవాదులకు మధ్య అనుసంధానం ఏర్పడడం ఒక ఉదాహరణ మాత్రమే! ఈ అనుసంధానాన్ని ఐఎస్‌ఐ ఏర్పాటు చేసింది. ఓడ దొంగలు మన దేశానికి శత్రువులు కాదు, కేవలం దోపిడీలే వారి లక్ష్యం! కాని తాలిబన్ తదితర జిహాదీలు మన దేశానికి శత్రువులు. ‘మాదకం’ ముఠాలు కూడా మన దేశపుసరిహద్దుల భద్రతకు మన ప్రాదేశిక సమగ్రతకు తక్షణ ప్రమాదం కలిగించకపోవచ్చు! కానీ ఈ ముఠాలలో చొరబడిపోతున్న వివిధ ముఠాలు, ఉగ్రవాదుల లక్ష్యం మన దేశాన్ని బద్దలు కొట్టడం. మాదకాలను భౌతికంగా మోసుకుని వస్తున్న దళారీలు కరుడుకట్టిన హంతకులు, వీరిని నడిపిస్తున్న ఐఎస్‌ఐ వంటి ‘అనుసంధానకర్త’లు మరింత భయంకరులు! దేశాన్ని హత్య చేయడం లక్ష్యమైన వారు!
అందువల్ల ‘గంజాయి’ తోటలలో కేవలం ఆర్థిక నేరాలు పండుతున్నాయా? దేశ విద్రోహ ఉగ్రవాదపువిషపుమొక్కలు వృద్ధి పొందుతున్నాయా? అన్నది ప్రధాన సమస్య! మాదకంతో, ఎఱ్ఱ చందనం అక్రమాలతో, నల్లడబ్బుతో, నకిలీ డబ్బుతో సినిమా పరిశ్రమలోని ప లువురు ఘరానాలకు సంబంధం ఉందన్నది ధ్రువపడింది! కానీ ఇతరేతర రంగాలకు చెందిన ఘరానాలకు సైతం ఈ నేరాలతో సంబంధాలున్నాయా? అన్నది ధ్రువపడలేదు! ఈ దిశగానూ ‘నిఘా’ నయనాల దృష్టి ప్రసరించవలసి ఉంది! దేవుడి గుడిలో సైతం దొంగలు చేరిపోతున్నారు.. గంజాయి తోటలలో జిహాదీలు, తదితర ఉగ్రవాదులు నక్కి ఉండవచ్చు!