సంపాదకీయం

సౌదీ దౌత్య దౌష్ట్యం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సౌదీ అరేబియాలో ఒక యజమాని ముగ్గురు భారతీయులను కర్కశంగా కొట్టడం ఇటీవల దృశ్య మాధ్యమాలలో ఆవిష్కృతమైన భయానక దృశ్యం! ఇలా కొట్టి బాధించడానికి కారణం కేవలం కరడుకట్టిన క్రౌర్యం! కేరళ ప్రాంతానికి చెందిన ఈ ముగ్గురు భారతీయులు విద్యుత్ సాంకేతిక శిక్షణ పొందినవారు. ఈ ఎలక్ట్రీషియన్లను ఇటుకల బట్టీలో మట్టిమోసే పని చేయమని యజమాని ఆదేశించాడట! వారు నిరాకరించడంతో నిర్బంధించి పెద్ద చెక్కతో వారిని ఆ యజమాని కొట్టాడు. ఇలా కొట్టడం అనేక రోజులపాటు కొనసాగడం యజమాని పైశాచిక స్వభావానికి నిదర్శనం! ఇలా సౌదీ అరేబియాలో భారతీయులను చిత్రహింసకు గురి చేయడం ఇది మొదటిసారి కాదు. ఆవేశంలో ఎవరో ఒకరు చేస్తున్న దుర్మార్గం కాదు, సౌదీ అరేబియాలో భారతీయులను హింసించడం వ్యవస్థీకృతమై ఉన్న దౌష్ట్యం! ఇస్లాం మత రాజ్యాంగ వ్యవస్థలున్న దేశాలలో కొట్టి చంపడం సర్వసాధారణమైన సామాజిక ప్రక్రియ..మత వ్ఢ్యౌం ఆవహించిన మనస్సులు కరుడుకట్టిన బండలుగా మారి ఉండడం ఇలా కొట్టి చంపడానికి కారణం! కొట్టి చంపడం నేరం కాదన్న పాపం కాదన్న జిహాదీ ప్రవృత్తి విదేశీయులపై క్రౌర్యాన్ని క్రక్కుతుండడం ఇస్లాం మత రాజ్యాంగ దేశాలలో నడిచిపోతున్న చరిత్ర! కేరళకు చెందిన ఈ ముగ్గురూ దెబ్బలకు తట్టుకుని జీవించగలగడం వారి అదృష్టం! మిగిలిన ఇద్దరినీ ఇలా చావబాదుతున్న దృశ్యాలను మూడవ వ్యక్తి రహస్యంగా చిత్రీకరించడం తో ఈ హింసాకాండ గురించి బయటకి పొక్కిం ది! బయటికి రాని ఉదంతాలు వందల కొలదీ జరిగిపోతున్నాయి! భారతీయ కార్మికులను ఇలా చిత్రహింసలకు గురి చేయడం గురించి మన ప్రభుత్వం సౌదీ అరేబియా పోలీసులకు ఫిర్యాదులు చేసిందట! ఈ ముగ్గురు భారతీయులు వారం రోజులలో స్వదేశానికి తిరిగి రానున్నట్టు విదేశీ వ్యవహారాల మంత్రి సుషమా స్వరాజ్ ప్రకటించింది కూడ...కానీ కొట్టిన దుర్మార్గుడిని సౌదీ అరేబియా పోలీసులు శిక్షించబోరన్నది జగమెరిగిన వాస్తవం! గత చరిత్ర, ఇటీవల జరిగిన ఘటనలు ఇందుకు సాక్ష్యం! తమ దేశస్థులు ఇతర దేశాలలో జరిపే రాక్షస చర్యలను సౌదీ అరేబియా ప్రభుత్వం సమర్ధించింది. ఇతర దేశాల వారికి తమ దేశంలో జరిగిన ఘోరమైన అన్యాయాలను సౌదీఅరేబియా ప్రభుత్వం పట్టించుకోదు! రాజరికం పేరుతో అరాజక వ్యవస్థ నెలకొని ఉన్న సౌదీ అరేబియాలో విదేశీయుల బతుకునకు విలువ లేదు...మర్యాద లేదు! అందువల్ల తప్పు అనాగరిక సౌదీ అరేబియా సమాజానిది కాదు, అక్కడ వెళ్లి ఉద్యోగాలు చేయాలని ఉవ్విళ్లూరుతున్న విదేశాల వారిది! అందువల్లనే కేరళకు చెందిన ఈ ముగ్గురు సాంకేతిక విద్యావంతులు సౌదీ అరేబియాకు వెళ్లాలని భావించలేదు. చిత్రహింసల తీవ్రత తక్కువగా ఉన్న యెమెన్ దేశానికి వెళ్లాని భావించారు! కానీ కేరళ ప్రాంతీయుల వద్ద డబ్బు తీసుకుని యెమెన్‌లో ఉద్యోగాలను ఇప్పిస్తానని చెప్పిన దళారీ వారిని మోసం చేశాడు, సౌదీ అరేబియాకు చేర్చాడు!
తమిళనాడునుండి బతుకుతెరువు కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన కస్తూరి మునిరత్నమ్మ అనే 58 ఏళ్ల మహిళ పాశవిక చిత్రహింసలకు గురై నవంబర్‌లో స్వదేశానికి తిరిగి వచ్చింది! సౌదీ అరేబియాలోని ఒక సంపన్నుని ఇంట్లో సహాయికగా పనిచేసిన మునిరత్నమ్మను యజమానులు ప్రతిరోజు చితకబాదేవారట! ఒకరోజున మేడమీదినుంచి తోసివేయడంతో ఆమెకు ఒక చేయి, కాలు దెబ్బతిన్నాయి. విరిగిన చేతిని కట్టు కట్టి సరి చేయలేదు, వైద్యశాలలోని సౌదీ డాక్టర్లు నిర్లక్ష్యంగా ఆమె కుడి చేతిని ఖండించారు! ఇలా భయంకర బీభత్సకాండకు బలైపోయి తిరిగి వచ్చిన ఆ మహిళకు తమిళనాడు ప్రభుత్వం చికిత్స చేయించింది, పది లక్షల రూపాయల సహాయం అందించింది. కానీ మునిరత్నమ్మను దాదాపు హత్య చేసిన యజమానులపై సౌదీ అరేబియా ప్రభుత్వం చర్య తీసుకోలేదు! మన కేంద్ర ప్రభుత్వ వైఫల్యం ఇది...2013లో సౌదీ అరేబియాలోని ఒక నిర్మాణ సంస్థలో పనిచేసిన ఒక విద్యుత్ ఉద్యోగి నిర్మాణ సమయంలో జరిగిన ప్రమాదంలో మరణించాడు, సంస్థవారు పరిహారం చెల్లించలేదు. న్యాయం కోరుతూ ప్రదర్శన జరిపిన ముప్పయి తొమ్మిది మందిని సౌదీ పోలీసులు కొరడాలతో చితకబాదారు, చాలదన్నట్టు వారందరినీ ఏడాదికి పైగా జైల్లో నిర్బంధించారు. ఆ తరువాత దయ తలచి గత జూలైలో వదలిపెట్టారు! సౌదీ అరేబియా ప్రభుత్వ బీభత్సకాండకు ఇవి కొన్ని ఉదాహరణలు మాత్రమే! గత సెప్టెంబర్‌లో బయటపడిన సౌదీ దౌత్యవేత్త పైశాచిక కాండ ఈ పరంపరలో పరాకాష్ఠ!
మజిద్ హసన్ అఘార్ అనే సౌదీ అరేబియా దౌత్యవేత్త గత సెప్టెంబర్ వరకు ఢిల్లీలోని సౌదీ రాయబారి కార్యాలయంలో పనిచేసాడు. సింధు శాఖలో ఉద్యోగాలు ఇప్పించే దళారీ ముఠా సహాయంతో ఇతగాడు ఇద్దరు నేపాలీ మహిళలకు ఎరవేసి తన ఇంటికి రప్పించుకున్నాడు. విదేశాలలో ఉద్యోగాలు లభించేలోగా తన ఇంటిలో వారిని సహాయికలుగా నియమించాడు! కానీ అనేక నెలలపాటు ఆ ఇద్దరు మహిళలను భయంకరమైన లైంగిక బీభత్సకాండకు బలి చేసినట్టు సెప్టెంబర్‌లో వెల్లడైంది! అనేక నెలలపాటు దాదాపు ఇరవై మంది దుర్మార్గులు తమపై పైశాచికమైన రీతిలో లైంగిక అత్యాచారాలు జరిపినట్టు నిర్బంధంనుండి బయటపడిన తరువాత ఆ మహిళలు వెల్లడించారు! ఆ మహిళల చేత ఆ దౌత్య బీభత్సకారుని ఇంటివారు పగలంతా వెట్టి చాకిరీ చేయించారు, వంట చేయడం మొదలు శౌచాలయాలను శుభ్రం చేయడం వరకు...కానీ వారిద్దరు తిండి దొరకక ఆకలితో విలవిలలాడవలసి వచ్చేది! దౌత్యవేత్త ముసుగులో పరమ కిరాతక కృత్యాలను నిర్వహించిన లైంగిక బీభత్సకారుడు మజద్ హసన్ అఘార్ అనేవాడు! ఢిల్లీ శివారులో ఉన్న గురుగావ్‌లో ఈ దౌత్యవేత్త నివాసంపై దాడి చేసిన పోలీసులు ఆ మహిళలను నిర్బంధంనుండి తప్పించారు! కానీ ఇలా తమదౌత్య బీభత్సకారుడి ఇంటిలోకి పోలీసులు ప్రవేశించడాన్ని సౌదీ అరేబియా ప్రభుత్వం నిరసించింది! అతగాడిని అరెస్టు చేయరాదని ఆంక్షలు విధించింది..
మజిద్ అనే వాడికి దౌత్యరక్షణ-డిప్లమాటిక్ ఇమ్యూనిటీ-నిబంధన వర్తించదు. అతడు స్వయంగా జరిపిన లైంగిక బీభత్సకాండ, జరిపించిన అత్యాచారాలు అతగాడి విధి నిర్వహణలో భాగం కాదు! అందువల్ల కార్యాలయ పరిధి వెలుపల అతడు చేసిన నేరాలకు దౌత్య రక్షణ లేదు. కానీ దౌత్య రక్షణ ఉందని సౌదీ అరేబియా ప్రభుత్వం దబాయించింది! దబాయింపులకు మన ప్రభుత్వం లొంగిపోవడం దేశానికి జరిగిన అవమానం..మజిద్ హసన్‌ను మన ప్రభుత్వం నిర్బంధించలేదు! అతగాడు విమానమెక్కి దర్జాగా సౌదీ అరేబియాకు వెళ్లిపోయాడు!ఇలాంటి విదేశాంగ విధాన వైపరీత్యంవల్ల మన ప్రభుత్వం సౌదీ అరేబియా వంటి అనాగరిక మతోన్మాద ప్రభుత్వాలకు లోకువ అయిపోతోంది! పరిషియా సింధుశాఖ దేశాలలోని భారతీయులపై కొనసాగుతున్న ప్రత్యక్ష, ప్రచ్ఛన్న దమనకాండకు ఈ మన మెతక విధానం కూడ కారణం...