సంపాదకీయం

విలంబన వివాదం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అయోధ్య రామజన్మభూమి ప్రాంగణంలోని ‘బా బరీ కట్టడం’ కూల్చివేతకు సంబంధించిన అభియోగాలను ‘కలసికట్టు’గా ఒకే న్యాయస్థానంలో విచారించాలని సర్వోన్నత న్యాయస్థానం వారు ప్రతిపాదించడం విచిత్రమైన పరిణామం! ఈ ప్రతిపాదన త్వ రలో తీర్పు రూపంలో వెలువడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. క్రీస్తుశకం 1528లో విదేశాల నుంచి మనదేశంలోకి చొరబడిన మొఘలాయి బాబర్ అనే జిహాదీ బీభత్సకారుడు అయోధ్య రామజన్మభూమి మందిరాన్ని కూల్చివేశాడన్నది నిర్థారిత చారిత్రక సత్యం. ఈ సత్యాన్ని కొందరు అంగీకరించకపోవడం వివాదానికి మూలం. అంగీకరించని వారి వాదన ప్రకారం అయోధ్య రామజన్మభూమి ప్రాంగణంలో 1992 డిసెంబర్ ఆరవ తేదీన కూలిపోయిన కట్టడం పేరు ‘బాబరీ మసీదు’. లక్షలాది కరసేవకులు 1992 డిసెంబర్ 6వ తేదీన ఈ కట్టడాన్ని కూల్చివేయడం నేర విచారణకు సంబంధించిన మొదటి అభియోగం. ఈ అభియోగ పత్రంలో పేర్లు తెలియని కరసేవకులను నిందితులుగా పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలోని ప్రత్యేక న్యాయస్థానం ఈ అభియోగంపై విచారణ జరుపుతోంది. ఇంతవరకూ నూట తొంబయి ఐదుమంది సాక్షులను ఈ ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. ఇంకా ఎనిమిది వందల మంది సాక్షులను విచారించవలసి ఉన్నట్టు ‘కేంద్ర నేర విచారణ మండలి’- సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇనె్వస్టిగేషన్- సిబిఐ- వారు చెప్పిన మాట! ఇరవై ఐదు ఏళ్లుగా ఈ అభియోగం విచారణ కొనసాగుతూనే ఉండడం న్యాయ విలంబనకు వి చిత్రమైన సాక్ష్యం. బా బరీ కట్టడాన్ని కూల్చడానికి కరసేవకులను పురికొల్పిన ఆరోపణలపై భారతీయ జనతాపార్టీ వరిష్ఠ నేతలు లాల్‌కృష్ణ ఆడ్వాణీ, మురళీమనోహర్ జోషి, విశ్వహిం దూ పరిషత్ వరిష్ఠులు అశోక్ సింహల్, ఆచార్య గిరిరాజ కిశోర్ వంటి వారికి వ్యతిరేకంగా మరో అభియోగం ఉత్తరప్రదేశ్‌లోని రాయబరేలీలోని ప్ర త్యేక న్యాయస్థానంలో విచారణలో ఉంది. ఈ రెండవ అభియోగానికి చెందిన నిందితులలో కొందరు మరణించారు. ఈ నాయకులకు వ్యతిరేకంగా దాఖలైన అభియోగంలో ఇంతవరకూ యాబయి ఏడుగురు సాక్షులను విచారించారట! ఇంకా నూట ఐదుగురు సాక్షులను విచారించవలసి ఉందన్నది సిబిఐ కథనం. ఈ అభియోగాలు విడివిడిగా ఎందుకని దాఖలయ్యాయి? అన్న ప్రశ్నకు సమాధానం లభించవలసి ఉంది. దాఖలైన వెంటనేనైనా సర్వోన్నత న్యాయస్థానం జోక్యం కల్పించుకొని రెండు అభియోగాలను కలిపి విచారించాలని ఆదేశించి ఉండవచ్చు. అది జరగలేదు.
ఈ వివాదానికి ఇప్పుడప్పుడే న్యాయ పరిష్కారం లభించగల సూచనలు కన్పించడం లేదు. మందిర ప్రాంగణ స్థలం ఎవరిదన్న వివాదం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. ఆరేళ్లుగా అపరిష్కృతంగా ఉంది. ఇప్పుడు ‘బాబరీ కట్టడం’ కూల్చివేతకు సంబంధించిన అభియోగాల విచారణ వేగవంతం కావాలన్న ప్రచారం జరుగుతోంది. కట్టడం కూల్చివేతకు సంబంధించిన అభియోగాల విచారణలో తీవ్రమైన న్యాయ విలంబనం జరగడం పట్ల సర్వోన్నత న్యాయమూర్తులు పిసి ఘోష్, రోహింటన్ నారిమన్ విస్మయం వ్యక్తం చేయడం న్యాయ ప్రక్రియ వేగవంతం కావాలన్న వారి తపనకు నిదర్శనం. కానీ ‘వివాద స్థలం’ రఘురాముని మందిరానికి సంబంధించినదా? బాబర్‌కు సంబంధించినదా? అన్నవి వౌలిక ప్రశ్నలు. ఇందుకు సంబంధించిన ‘పౌర వివాదం’- సివిల్ సూట్- ఏడు దశాబ్దులుగా న్యాయ నిర్ణయానికి నోచుకోలేదు. ఈ వివాదం ఇన్ని దశాబ్దుల పాటు న్యాయ విలంబనకు గురైంది కనుకనే అది- 1992 నాటి ‘కట్టడం కూల్చివేత’కు దారితీసిందన్న అభిప్రాయం అతార్కికం కాదు. 1992 నాటికి నలబయి ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న ‘స్థల యాజమాన్య’ వివాదంపై న్యాయస్థానాల తీర్పులు వెలువడి ఉంటే ‘కూల్చివేత’ జరిగి ఉండేది కాదు. వివాద ప్రాంగణం రామజన్మభూమి మందిరానికి చెందినదన్న తీర్పు వెలువడి ఉంటే ఆ ప్రాంతంలో ఈపాటికి మందిర నిర్మాణం జరిగి ఉండేది. వివాద స్థలం 1526లో మన దేశానికి వచ్చిన మొఘలాయి బాబర్‌కు చెందినదని న్యాయ నిర్ణయం వెలువడి ఉంటే ‘రామజన్మభూమి మందిరం’ ఉద్యమకారులు తమ ప్రయత్నానికి స్వస్తి చెప్పి ఉండేవారు.
న్యాయస్థానాలు నలబయి ఏళ్లపాటు వివాద స్థల యాజమాన్యంపై తీర్పు చెప్పకపోవడం న్యాయ విలంబనం కాదా? కట్టడాన్ని కరసేవకులు కూల్చిన తర్వాత కూడ దాదాపు పద్దెనిమిది ఏళ్లపాటు ‘వివాద స్థలం’ ఎవరిదన్న వివాదాన్ని అలహాబాద్ హైకోర్టు పరిష్కరించలేక పోయింది. ఇంత దీర్ఘకాలం జరిగిన న్యాయ విలంబనను సర్వోన్నత న్యాయస్థానం ‘విలంబన’గా భావించడం లేదని ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం చేసిన స్పష్టీకరణ వల్ల ధ్రువపడింది. వివాద స్థల యాజమాన్యం ఎవరిదన్న విషయమై అలహాబాద్ హైకోర్టు స్పష్టమైన తీర్పు చెప్పలేదు. స్థ లాన్ని మూడు ము క్కలు చేసి, రెండు ముక్కలను రామమందిరానికి, మిగతా ము క్కను బాబరీ కట్టడానికి కేటాయించింది. ఈ తీర్పుపై దాఖలైన అప్పీలును ఆరేళ్లకు పైగా సర్వోన్నత న్యాయస్థానం పరిష్కరించ లేదు. ఇలా దాదాపు ఏడు దశాబ్దులు గా ‘స్థలం’పై అధికారం ఎవరిదన్న వి వాదం పరిష్కారం కాలేదు. ఇ దంతా న్యాయ ప్రక్రియలో జరిగిన ఆ లస్యం కాదా? అలసత్వ బా ధ్యులు ఎవరు? ఈ స్థల వివాదాన్ని వేగవంతంగా విచారించాలని భాజపా నాయకుడు సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన ‘న్యాయ యాచిక’ను సుప్రీం కోర్టు ఇటీవల తోసిపుచ్చింది కూడ. వేగవంతంగా విచారించడానికి తమకు సమయం లేదని సర్వోన్నత న్యాయస్థానం వారు స్పష్టం చేశారు. వౌలికమైన స్థల యాజమాన్య వివాదం పరిష్కారంలో జాప్యం జరుగవచ్చునా? కట్టడం కూల్చివేత నేర విచారణ మాత్రం త్వరగా జరిగిపోవాలా? రెండింటికీ ఒకే సూత్రం వర్తించడం న్యాయం కాదా?
స్థల వివాదం భావోద్వేగాలకు సంబంధించినదని అందువల్ల న్యాయస్థానం వెలుపల మధ్యవర్తుల సహాయంతో వివాదాన్ని పరిష్కరించుకోవాలని సుప్రీం ప్రధాన న్యాయమూర్తి జెఎస్ కేహర్ చెప్పిన మాటను ఇప్పుడైనా వివాదంలోని పరస్పర ప్రత్యర్థులందరూ పాటిస్తేనే ఈ సమస్యకు సత్వరమైన ముక్తాయింపు.. స్థల వివాదం కొలిక్కివచ్చినట్టయితే ‘కూల్చివేత’ నేరాభియోగం సహజంగానే పరిసమాప్తం కాగలదు. వివాద స్థలంలో జరిగిన తవ్వకాల్లో అతి పురాతన విష్ణుమందిర అవశేషాలు బయటపడినాయి. ఈ మందిరాన్ని మొఘలాయి బాబర్ పుట్టడానికి అనేక శతాబ్దుల ముందు నిర్మించారు.