సంపాదకీయం

రిజర్వేషన్ల రాజకీయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇస్లాం మతస్థులకు విద్యా సంస్థలలో, ఉద్యోగాలలో ఆరక్షణల-రిజర్వేషన్స్-ను కల్పించి తీరనున్నట్టు తెలంగాణ ప్రభుత్వం భీషణ ప్రతిజ్ఞను పునరుద్ఘాటిస్తుండడం ప్రజాస్వామ్య రాజ్యాంగ ప్రక్రియపై జరుగుతున్న దౌర్జన్యం. మత ప్రాతిపదికపై ఆరక్షణలు కల్పించడం చెల్లదని ఉన్నత న్యాయస్థానం ఇదివరకే అనేకసార్లు స్పష్టం చేసింది. మతం పేరుతో ఆరక్షణలను కల్పించడం రాజ్యాంగ వ్యతిరేకమని తీర్పులు చెప్పింది. ఇప్పుడు ఈ వివాదం సర్వోన్నత న్యాయస్థానం పరిశీలనలో ఉంది. సర్వోన్నత న్యాయ నిర్ణయం కోసం వేచి ఉండవలసిన తెలంగాణ ప్రభుత్వం దానితో నిమిత్తం లేదన్నట్టు మళ్లీ మతపరమైన ఆరక్షణలకు పూనుకోవడం న్యాయధిక్కార నేరం.. ఈ ధిక్కార నేరం నుండి తప్పించుకొనడానికి వీలుగా అధికార పక్షం ఎత్తిన కొత్త పన్నాగం ఈ మొత్తం వ్యవహారాన్ని వెనుకబడిన కులాల అధికార సంఘం- బి.సి కమిషన్-పరిధిలోకి ఇరికించడం! తద్వారా సర్వోన్నత న్యాయస్థానంలో అపరిష్కృతంగా ఉన్న వ్యవహారాన్ని వమ్ము చేయవచ్చునన్నది తెలంగాణ ప్రభుత్వ రాజకీయ నిర్వాహకుల వ్యూహం.. అందువల్లనే ఇస్లాంలోని వెనుకబడిన తరగతులకు నాలుగు శాతం నుంచి పనె్నండు శాతానికి రిజర్వేషన్లను పెంచాలన్న ఆర్భాటం కొనసాగుతోంది. ఇలా చేయడం ద్వారా రాజ్యాంగంలోని పదిహేనవ, పదహారవ అధికరణాల స్ఫూ ర్తిని వ మ్ము చేయవచ్చునన్నది తెలంగాణ ప్రభుత్వ ధీ మా! మతం పే రుతో ఎలాంటి ఆ రక్షణలు కల్పించరాదని, మతం పే రుతో ఏ విధమైన వివక్ష చూపరాదని ఈ అధికరణాలు నిర్దేశిస్తున్నాయి. అనుసూచిత కులాల-షెడ్యూల్డ్ కాస్ట్స్-కు, అనుసూచిత సముదాయాల- షెడ్యూల్డ్ ట్రయిబ్స్-కు తదితర వెనుకబడిన తరగతులకు మాత్రమే ప్రత్యేక సదుపాయాలను కల్పించడానికి ఈ అధికరణాలు వీలు కల్పిస్తున్నాయి. మతాలకు ఇలాంటి ఆరక్షణలు కల్పించడానికి ఎంత మాత్రం వీలు లేదు. వీలు లేదని గతంలో తెలంగాణ ప్రభుత్వం అంగీకరించింది. అందువల్లనే రాజ్యాంగాన్ని సవరించాలన్న కోర్కెను కూడ వెల్లడించి ఉంది. ఈ సవరణతో నిమిత్తం లేని సంక్షేమ పథకాలను-కల్యాణ లక్ష్మి వంటి పథకాలను-ముస్లింలకు కూడ వర్తింపచేస్తూ ఉత్తరువులను జారీ చేసింది.. కానీ సమాంతరంగా ఈ వ్యవహారాన్ని బి.సి కమిషన్ పరిధిలో ఇరికించి, ముస్లింలకు ‘రిజర్వేషన్ల’ను కూడ కల్పించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ఆర్భాటం బహుశా ‘వోట్లు సీట్లు’ రాజకీయంలో భాగం కావచ్చు!
ఇస్లాం మతస్థులకు కల్పిస్తున్న, ‘పెంచుతున్న’ రిజర్వేషన్‌లు మతపరమైనవి కావని నిరూపించడానికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నంలోని డొల్లతనం బుధవారం రాత్రి మరోసారి ధ్రువపడింది. మంత్రివర్గ సమావేశంలో జరిగిన నిర్ణయాలను గురించి వివరించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు విచిత్రమైన వాదం వినిపించాడు! రిజర్వేషన్ల శాతం యాబయికి మించరాదన్న సర్వోన్నత న్యాయస్థానం నిర్ణయాన్ని ఏయే రాష్ట్రాలు ఎలా అతిక్రమించాయన్నది వాదంలోని మొదటి అంశం! ఈశాన్య రాష్ట్రాలలో ఎనబయి శాతం వరకూ ‘రిజర్వేషన్లు’ అమలు జరుగుతుండడాన్ని ఆయన ప్రస్తావించడం ఈ వాదనా వైచిత్రికి పరాకాష్ఠ. ఈశాన్య రాష్ట్రాలలో వనవాసీ ప్రజల సంఖ్య అత్యధికంగా ఉంది. రాజ్యాంగంలోని మూడు వందల డెబ్బయి ఒకటవ అధికరణంలోని వివిధ ఉప అధికరణాల ప్రకారం ఆయా ఈశాన్య రాష్ట్రాలకు ప్రత్యేక నిబంధనలు అమలులో ఉన్నాయి. ఇలాంటి ప్రత్యేక నిబంధనలు తెలంగాణ రాష్ట్రాలకు వర్తించడం లేదు.. మత ప్రాతిపదికన కల్పించతలపెట్టిన రిజర్వేషన్లకు వర్తించవు!!
వనవాసీ ప్రజలు అనాదిగా స్వదేశీయ జనసముదాయాలవారు. విదేశీయ దురాక్రమణ కాలంలో ఇతర స్వదేశీయ జనసముదాయాలకంటె అధికంగా అణచివేతకు గురి అయినారు. అందువల్ల వనవాసీ ప్రజలు లేదా అనుసూచిత సముదాయాల-షెడ్యూల్డ్ ట్రయిబ్స్-వారు సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు. అందువల్ల వారికి లభిస్తున్న ఆరక్షణలను పెంచడానికి యత్నించడం సామాజిక న్యాయసాధనలో భాగం! కానీ షెడ్యూల్డ్ ట్రయిబ్స్‌కు ఆరక్షణలను పెంచాలన్న కార్యక్రమంతో ఇస్లాం మతస్థులకు కూడ రాజ్యాంగ విరుద్ధమైన రిజర్వేషన్‌లు కల్పించే అక్రమాన్ని జోడించడం తెలంగాణ ప్రభుత్వ ని ర్వాహకుల ‘అతితెలివి’కి నిదర్శనం! ఈ అతితెలివి వ్యూ హం బెడిసికొట్టక మా నదు! గిరిజనులకు రిజర్వేషన్లను పెంచడాన్ని కేంద్ర ప్రభుత్వం సమర్ధిస్తుంది కనుక ఆ ప్రతిపాదనకు ‘మ త రిజర్వేషన్’లను అంటగడితే మత రిజర్వేషన్లకు కూడ కేంద్రం నుంచి అనుమతి లభిస్తుందన్నది తెలంగాణ ప్రభుత్వం వారి వ్యూహం...
మత ‘రిజర్వేషన్ల’ను దశాబ్దుల తరబడి జాతీయ సమైక్య స్వభావులు, దేశ విభజన మరోసారి జరగరాదని భావిస్తున్నవారు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. భారతీయ జనతాపార్టీ కూడా వ్యతిరేకిస్తోంది. భారతీయ జనతాపార్టీ నిర్వహణలోని కేంద్ర ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం వారి మతపరమైన ‘రిజర్వేషన్’లను ఆమోదించడం అసంభవం. రాష్టప్రతి ఆమోదం కూడా అసంభవం! షెడ్యూల్డ్ ట్రయిబ్స్‌కు ‘రిజర్వేషన్’లు పెంచాలన్న ప్రతిపాదనను మాత్రమే కేంద్ర ప్రభుత్వం అంగీకరించవచ్చు! 1950వ సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన నియమావళి ప్రకారం ముస్లింలలోని వెనుకబడిన వారికి నాలుగు శాతం రిజర్వేషన్లు తెలుగు రాష్ట్రాలలో ఇదివరకే అమలు జరుగుతున్నాయి. ఈ ‘రిజర్వేషన్’ల శాతాన్ని పెంచడం మత పరమైనది కాదని చెప్పడం అతార్కికమైన, అన్యాయమైన వాదం.. 1950 నాటి కేంద్ర ప్రభుత్వ నియమావళి-ప్రెసిడెన్షియల్ ఆర్డర్-లో ఇలా ముస్లింలను వెనుకబడిన తరగతులలో చేర్చడమే వౌలికమైన వైపరీత్యం.. దాన్ని రద్దు చేయడానికి ఇప్పుడైనా కేంద్రం యత్నించాలి!